ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ స్వారో కి జన్మదిన శుభాకాంక్షలు!

షేర్ చెయ్యండి
  • 37
    Shares
 
 ఆయన సాదా సీదా మనిషి కాదు. కాకి బట్టలు వేసుకున్న ఇండియన్ పోలీస్ ఆఫీసర్. కాకీ బట్టలు అంటేనే కఠినంగా ఉంటారు అంటారు. ఆయన కఠినమే. తాను నమ్మిన అంబేద్కరిజం కోసం కఠినంగా ఉంటారు. తాను సాధించాల్సిన గోల్స్ పట్ల కఠినంగా ఉంటారు. కాకి బట్టలు వేసుకున్నా ప్రేమను కురిపించవచ్చు అంటారు. ప్రభుత్వ ఉద్యోగి అయినా  పే బ్యాక్అ టు సొసైటీ కోసం ఆవకాశం ఉన్న ప్రతి చోటా నీ ధర్మం పాటించమంటారు ఆయనే సుప్రీం స్వారో ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్  స్వారో
 
rs_prveen_kumar_swaro
Image: ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ స్వారో
 
 
నాదగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరినీ నిటారుగా నిలబడమని చెబుతారు. మీ సమస్యలు  ఆత్మవిశ్వాసం తో చెప్పండి పొతే మీ సమస్యలు పోతాయి, ప్రాణాలు ఏమీ పోవుగా అంటారు. 
 
తనను కలవడానికి వచ్చేవారు గడప బయట చెప్పులు విడిచి రావద్దు, చెప్పులుతొ సహా వచ్చి తమ సమస్య విన్నవించుకోవచ్చు అంటారు. 
 
ఏ ఎస్సి / ఎస్టీ కలలు కననీ ఎవరెస్టు శిఖరానికి పూర్ణ – ఆనంద్ అనే విద్యార్థులను పంపి శిఖరం మీద బాబాసాహెబ్ జెండా ఆవిష్కరింపచేయించి ఒక్కసారిగా ప్రపంచం దృష్టి తనవైపుకు తిప్పుకున్నారు. 
 
గురుకుల పాఠశాల – తెలంగాణ ప్రభుత్వ సెక్రెటరీగా పనిచేస్తూ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నారు. ఎవరైనా  అధికారంలో ఉంటే రాజకీయ నాయకుల  ప్రాబల్యంతో ఉన్నత పదవులు కోసం పైరవీలు చేస్తారు. ఈ సర్ సోషల్ వెల్పేర్ డిపార్ట్మెంట్ వారు నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలల సెక్రటరీ పదవినే కోరుకుంటున్నారు. 
 
ఏడు దశాబ్దాల స్వాతంత్ర దేశంలో సాంఘిక సంక్షేమం అంటే  సబ్సిడీ రుణాలు, బర్రెలు , గొర్రెలు, ఆటోలు , రేషన్ కార్డులు, కిలో బియ్యం. కానీ  ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్  స్వారో సాంఘిక సంక్షేమం అంటే మానవ వనరుల అభివృద్ధి అనుకున్నారు. విద్య జాతిని మేల్కొల్పుతుంది , వెలది సంవత్సరాలుగా విద్యను దూరం చేసి, ఎలాంటి అవకాశాలు కల్పించుకుండా నిర్వేర్యం చేసిన సమాజాన్ని అదే విద్యతో నేడు చరిత్ర సృష్టిస్తున్నారు.
 
సోషల్ వెల్ఫర్ యొక్క నిజమైన అర్ధాన్ని పాలకులకు చెబుతున్నారు. ఒక చిన్న అవకాశం ఇస్తే చాలు నిప్పురవ్వలా దూసుకు పోయే సమాజాన్ని ఇన్ని రోజులు అణిచివేసిన ఈ సుమాజానికి  స్వారో ల ద్వారా  జవాబు చెబుతున్నారు. 
 
ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్  స్వారో చేతిలో మంత్ర దండం లేదు, లక్షల కోట్ల బడ్జెట్ లేదు. ఉన్న వనరులనే సద్వినియోగం చేసుకుంటూ ఎస్సి / ఎస్టీ విద్యార్థుల భవిషత్ ను తీర్చిదిద్దుతున్న శిల్పి. 
 
 నేడు శ్రీ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్  స్వారో జన్మదినం సందర్బంగా జై భీం లతో  శుభాకాంక్షలు . 
 
A great man is different from an eminent one in that he is ready to be the servant of the society. Babasaheb  B. R. Ambedkar.
 
బాబాసాహెబ్ డా. బి ర్ అంబేడ్కర్ మరియు మహనీయుల ఆశయాలలో ముందు ఉండి తాను జన్మించిన సమాజ అభివృద్ధి కోసం తనకు ఉన్న అవకాశాల పరిధిలో ఎంత గొప్పగా చెయ్యొచ్చో చేసి చూపిస్తున్నారు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ స్వారో. లీడర్ అంటే సిద్ధాంతం చెప్పేవారే కాదు, ఆచరణలో చేసి చూపేవారే నిజమైన లీడర్. 10 కమాండ్స్ తో సోషల్ వెల్ఫర్ హాస్టల్స్ లో చదివే ప్రతి విద్యార్థి కి దశ దిశ చూపిస్తున్న వ్యక్తి. 
 
ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ స్వారో లాంటి వ్యక్తులు నేడు చాలామంది కి ఆదర్శం. కులం ఎలా అభివృద్ధి చెందాలో , ఒక అధికారిగా తాను ఏమి చెయ్యగలడో అతి తక్కువ కాలంలోనే చేసి చూపారు. 
 
 
(Visited 78 times, 1 visits today)
Also read  గాడ్సే:గాంధిని చంపడానికి కారణాలు ఏమిటి!

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!