కులాధారిత రిజర్వేషన్లు ఇంకేనాళ్ళు?

షేర్ చెయ్యండి

2 1 వ శతాబ్దంలో ఇంకా కులాధారిత రిజర్వేషన్లు అవసరమా? కొందరు కావలి అంటే మరి కొందరు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు?కే కొందరు  ఈ రిజర్వేషన్లు వలన చదువులోను, ఉద్యోగాలలోనూ మాకు అవకాశాలు పోతున్నాయి అంటున్నారు.  చాలామంది అగ్రకుల యువత రిజర్వేషన్లు అంటేనే చికాకు పడుతున్నారు. సమానత్వం లేదు అంటున్నారు. శతాబ్దాలుగా ఎవరైతే కులం పేరుతొ వివక్ష చుపెరో వారే ఇప్పుడు సమానత్వం గురించి మాట్లాడుతుంటే కాస్త విద్దురంగా ఉంది.

రిజర్వేషన్లకి కారణం ఏంటి?

వేలాది సంవత్సరాలుగా కుల / వర్ణ వ్యవస్తను పెంచి పోషించి, కీర్తించుకున్న బారతీయ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ కొందరిని అంత్యంత ఉన్నతులుగా సకల సౌకర్యాలు పొందేవిధంగా కల్పిస్తే మరికొందరికి కనేస సదుపాయాలు, హక్కులు లేకుండా అత్యంత దయనీయమైన పరిస్తితికి నెట్టివేసిన కుల వ్యవస్త ను సోకాల్డ్ అగ్రవర్ణం అనుకునే ప్రజలు అర్ధం చేసుకోలేరు, వారిలో కనీశ మానవత్వం లేదు. కుల వ్యవస్త ద్వారా వారు చేసిన నష్టం వేల కట్టలేనిది. కాబట్టి కుల వ్యవస్తకు మూలం అయిన హిందూ మతం రిజర్వేషన్లకి కారణం. సమాజంలో కులం పేరుతొ అసమానతలు తొలగకుండా రిజర్వేషన్లు తొలగించటం అంటే శుద్రులను మళ్ళీ బ్రాహ్మనిజం తమ బానిసలుగా చేసుకునే ప్రయత్నం చేస్తుంది ఈ సత్యాన్ని ఎవరూ కాదనలేరు ఏ హిందువు వాస్తవాన్ని అంగీరించరు. వారికీ అసలు వినే అలవాటే లేదు అని రాసుకున్నారు అంటరానితనం పేరిట వేలాది సంవత్సరాలుగా ఎస్సి లను , ఎస్టీ లకు చేసిన అన్యాయం 71సంవత్సరాలలో నే అగ్రవర్ణ వారు అనుభంచలేక కష్టంగా బ్రతుకుతున్నాం అనుకుంటున్నారా ? మీ అవకాసాలను రిజర్వేషన్ల పేరిట అనుభవిస్తున్నాం అనుకుంటున్నారా?

సమానత్వం అంటే ఏమిటి?

రిజర్వేషన్లు అనేసరికి అందరూ సమానమే అనే వారు వేలాది సంవత్సరాలుగా ఒక్క బ్రాహ్మణులే గుడిలో పూజారులుగా అత్యంత ఉన్నత స్తానంలో ఉన్నారు. ఎస్సి లే మునిసిపాలిటీ ఉద్యోగాలు ఎందుకు చేస్తున్నారు. ఆదివాసీ పిల్లలే పౌష్టిక ఆహరలోపంతో చనిపోతున్నారు.? ఈ ప్రశ్నకు ఏ హిందువుకుడా సమాదానం చెప్పటానికి అంగీకరించడు. వీరి పరిస్తితికి కారణం కులం ఇలాంటి అసమానతలు మర్చిపోయి రిజర్వేషన్లు వద్దకు వచ్చేసరికి సమానత్వం గురించి మాట్లాడతారు. అసమానతలకు కారణం అయిన కులాన్ని మాత్రం వదులుకోవటానికి సిద్దంగా లేరు. ఒక్క గుడి కాదు ఎన్నో రంగాల్లో ఇప్పటికీ అణగారిన వర్గాలకు స్తానంలేదు. ఆ అవకాసం కుడా కల్పించేదుంకు ఫ్యూడల్ కుల ఆధిపత్యం ఒప్పుకోవడం లేదు . అవకాసాలను నిరాకరిస్తూ ప్రతిభ గురించి మాట్లాడుతూ ఉంటారు. రిజర్వేషన్లు అనేది రాజ్యాంగపరంగా ఇచ్చిన అవకాసం. ఎవరి ఆస్తి నుండో ఎవరి జేబులోనుండో అవకాసాలను తీసుకోవడంలేదు. న్యాయంగానే, చట్టబద్దంగా రిజర్వేషన్లు ద్వారా ప్రతిభ కనబరుస్తున్నారు దళితులు.

Also read  ఆధిపత్య సంక్షేమ సంఘమే ఆలిండియా  ఈక్వాలిటీ ఫోరం!

క్రిమీలేయర్ రిజర్వేషన్లు

అసమానతలను వెలుఎత్తి చూపిస్తున్న ప్రతిసారి దళితుల్లో క్రిమీలేయర్ గురించి మాట్లాడతారు, ఆర్ధికంగా అభివృద్ధి చెందిన లేదా సివిల్ సర్వీస్ , రాష్ట్ర , కేంద్రస్తాయి అధికారంలో ఉన్న పిల్లలకు రిజర్వేషన్లు అవసరమా అని ప్రశ్నిస్తారు. దళితులు అర్దికంగా ఎదిగినా, ఉన్నత ఉద్యోగంలో ఉన్నా , ముక్యమంత్రి అయినా వారి సామజిక స్తితి దళితుడే/అంటరాని వారే. బీహార్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ మాంఘీ నే మనకి ఉదాహరణ. కాబట్టి రిజర్వేషన్లు అనేవి ఆర్ధిక అభివృద్ధి కోసం కాదు అనేది గ్రహించాలి. రిజర్వేషన్లు కుల దురహంకారం నుండి కుల అనిచివేతనుండి రాజ్యాంగం కలిపిస్తున్నఅవకాసం. ఈ అవకాసాలను కుడా నేలరాయాలి అనే దుర్మార్గమైన ఆలోచన పాలకులే ప్రజలకు నూరిపోస్తున్నారు. ప్రస్తుతం బారత ప్రబుత్వ రంగం పెట్టుబడులు ఉపసంహరణ పేరుతొ నిర్వేర్యం చేస్తూ ప్రబుత్వ ఉద్యోగాలను గత దశాబ్దకాలం నుండి నిలుపదల చేసేరు. ప్రైవేట్ రంగంలో ప్రతిభ అనేది పెరుకేగానే ఎక్కడా పారదర్శకత లేదు. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాలలో పరిస్తితి పరిశీలన చేస్తే మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఏ కులం వ్యక్తీ పరిశ్రమ ను స్తాపిస్తే ఆ కుల వ్యక్తులకే సింహబాగం ఉద్యోగాలలో ఉన్నారు అనే నగ్న సత్యం తెలుస్తుంది. దళితులు, బి సి లు ప్రాదాన్యత లేని నాలుగోతరగత ఉద్యోగాలలోను లేదా రిస్క్ ఉన్న వద్ద నియమిస్తున్నారు. అలాగే అత్యంత ప్రాదాన్యత ఉన్న సాఫ్టవేర్ రంగంలో రిజర్వేషన్లు అనే మాటే ఉత్పన్నం కాదు.అక్కడ ప్రతిభ పేరుతొ జరిగే తంతు బ్యాక్ డోర్ వ్యవహారమే ఎస్సి లు / ఎస్టీలు అంటే నే ఆమడ దూరంలో పెడుతున్నారు. ఈ దేశంలో ప్రతిభకి కొలమానం “కులం”, కులమే “ప్రతిభ” ఇలాంటి వాస్తవ పరిస్తితులలో రిజర్వేషన్లు అనేవి అణగారిన వర్గాలకు ఊతకర్ర గానే తప్పా అవే వారి ఆర్ధిక స్వాలంభానకు మార్గం కాదు.

Also read  దేశ ప్రగతికి అడ్డు కుల రిజర్వేషన్ల లేకా స్కాంలా!..

ఎన్నాళ్ళీ రిజర్వేషన్లు

ఎన్ని రోజులు ఈ రిజర్వేషన్లు అని ప్రశ్నించే వారు ఎన్ని రోజులు ఈ కుల ప్రయరటీలు అని ప్రశ్నించటం లేదు. వారిని వారు ప్రస్నించుకోవటంలేదు. సమాజంలో 70 శాతానికి పైగా ఉన్నా దళితులు , ఆదివాసీలు , బిసి లు రిజర్వేషన్ల తో కేవలం 50శాతానికి మాత్రమె పరిమితమవుతున్నార్ అనేది వాస్తవం. అలాగే ఇక రాజకీయ రిజర్వేషన్ల గురించి అసలు మాట్లడుకోకూడదు. ఎస్సి లను , ఎస్టీ లను , బి సి లను రిజర్వ్డ్ స్తానాలకే పరిమితం చేసి ఎక్కువ శాతం సో కాల్డ్ అగ్రవర్ణం అని చెప్పుకునే వారి కే పదవులు ఇస్తున్నారు. పంచాయితీ నుండి పార్లమెంట్ వరకూ ఇదే పరిస్తితీ. బి సి లు ఎప్పటి నుండో వారి జనాబా ప్రాతిపదికగా పదవులు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడంలేదు.

జెనరల్ క్యాటగిరీ

బ్రాహ్మణ, క్షత్రియ , వైశ్య , కమ్మ, రెడ్డి , వేలమ, రాజు తదితరులు

జనాభా కేవలం 30 శాతం మాత్రమే , కానీ

50.5 % రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు.

రిజర్వడ్ కేటగిరీ

ఎస్సి , ఎస్టీ , బి సి తదితరుల జనాబా  70శాతం, కానీ

 49.5% రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు

అలాగే భూమిలేని దళితులు నూటికి 99 శాతం మంది ఉన్నారు. ప్రబుత్వం విధిగా చెయ్యాల్సిన అభివృద్ధి దళిత కాలనీలలో శూన్యం అని చెప్పాలి. సురక్షిత మంచినీరు, రోడ్లు మురికి కాలవలు విద్య , ఆరోగ్య సదుపాయాలు లేని వేల గ్రామాలు మన చుట్టుపక్కల ఉన్నాయి. ఆదివాసీల పరిస్తితి ఇంకా దారుణం. మలేరియా, డయేరియా తో ఏటా పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారు. పౌష్టిక ఆహరం లోపంతో ఎందరో చనిపోతున్నారు. ఇలాంటి పరిస్తితుల గురించి ఏ ఒక్క బూర్జువ కుల ప్రజలు కానీ , సంఘాలు కానీ ప్రబుత్వాన్ని ఎలాంటి డిమాండ్ చెయ్యరు. ఇలాంటి పరిస్తితుల సామజిక, ఆర్ధిక పరిస్తితుల నుండి దళితులు అభివృద్ధి జరిగితే రిజర్వేషన్లు అనేవి వదులుకోవటానికి సిద్దంగానే ఉన్నారు. ఒక ఉన్నత ఉద్యోగి అయిన దళితుడిని వేరే కులం అమ్మాయి ని ఇచ్చి పెళ్లి చెయ్యగలరా , ఆ పరిస్తితి ఉందా? కాబట్టి కులం ఉన్నంత కాలం రిజర్వేషన్లు అనేవి ఉంటాయి. అనే వాస్తవాన్ని ఇంకెన్నాళ్ళు రిజర్వేషన్లు అనే వారు తెలుసుకోవాలి.

Also read  Annihilation of caste - A visionary document to build modern India!

దేశ ప్రజలు అందరూ సమానమే అనుకున్న రోజు కుల రిజర్వేషన్లు అవే తొలగిపోతాయి. అలా కాకుండా కుల ప్రయారిటీలు ఉన్నంత వరకూ రిజర్వేషన్లు ఉంటాయి.

 

 

 

(Visited 56 times, 1 visits today)

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!