డా.అంబేడ్కర్:అంబేడ్కర్ ను వెలివేసిసాధించేదేమిటి?

షేర్ చెయ్యండి

డా.అంబేడ్కర్, మిలియన్ మంది  ప్రజలు  ప్రేమతో, గౌరవంతో బాబాసాహెబ్  అని పిలుచుకునే నవభారత నిర్మాత, డా బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని పంజాగుట్ట , హైదరాబాద్ లో తొలగించి నెల దాటింది.


హైదరాబాద్ లాంటి హైటెక్ నగరం నడి బొడ్డున బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ విగ్రహన్ని ఏర్పాటు చేసిన అయన అభిమానులు. తెల్లవారేసరికి బాబాసాహెబ్ డా.అంబేడ్కర్ విగ్రహం ముక్కలు, ముక్కలుగా చేసి చెత్తకుప్పలో పడేసారు.


కోట్లాదిమంది ప్రజల ఆరాధ్యదైవం. రాజ్యాంగ నిర్మాత, చెత్తకుప్పలో పడేయటాన్ని జీర్ణించుకోలేని డా.అంబేడ్కర్ అనుచరులు విగ్రహం తొలిగించిన ప్రదేశంలో ఆనాటి నుండి నేటి వరకూ ఉద్యమాలు చేస్తూ ఉన్నారు.


డా.అంబేడ్కర్ ను వెలివేసి సాధించేదేమిటి?


బాబాసాహెబ్ డా.అంబేడ్కర్ కేవలం ఒక వ్యక్తి  పేరు మాత్రమే కాక అది ఒక చైతన్యానికి ప్రతీకగా, కోట్లాది మంది అణగారిన వర్గాలను సంఘటితపర్చే ఒక స్ఫూర్తికి పర్యాయపదం.


నిస్సందేహంగా నేడు సమకాలీక రాజకీయాలు, సంస్కృతి, సామాజిక నిర్మాణాలు బాబాసాహెబ్ డా.అంబేడ్కర్ పేరు కేంద్ర బిందువు అయ్యింది. ఆయన ప్రతిపాదించిన సామాజిక సూత్రాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించడమో లేదా తిరస్కరించడమో చెయ్యాలి.


ఏ ప్రతిపాదన చేసినా డా.అంబేడ్కర్ పేరు ప్రస్తావన లేకుండా అయినా ప్రతిపాదించిన ఆచరణాత్మక సూత్రాలు ప్రస్తావన లేకుండా భారత సమాజంలో సామజిక, ఆర్ధిక,రాజకీయ, సాంస్కృతిక నైతిక అంశాలుగానీ వాటి మార్పు కోసం జరుగుతున్న ఉద్యమాలు కానీ లేవనడం అతియోశక్తి కాదు.


డా.అంబేడ్కర్ అంటే ప్రాధిమిక హక్కుల సూత్రదారి. సమాజపరంగా కానీ లేదా వ్యక్తిగతంగా హక్కులు కోల్పోయినప్పుడు గుర్తు వచ్చేది డా. బాబాసాహెబ్ అంబేడ్కర్.

 
పంజాగుట్ట డా.అంబేడ్కర్ కి జరిగిన అవమానం యావత్ తెలంగాణా రాష్ట్ర సార్వభౌమాధికారాన్ని జరిగినట్లే భావించాలి. ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడటానికి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ద్వారా ఏర్పాటు చేసిన ప్రతిపాదన వలన మాత్రమే అని కెసిర్ ప్రభుత్వం గుర్తుతెచ్చుకోవాలి. 

Also read  "బాబాసాహెబ్" డా. అంబేడ్కర్ ఆగ్రా ఉపన్యాసం!


ఎవరి ప్రయోజనాల కొరకు బాబాసాహెబ్ డా.అంబేడ్కర్ ను అవమానిస్తున్నారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న కుట్రలు గాంధీ నుండి కెసిర్ వరకూ, సోషలిస్టుల నుండి మావోయిస్టు ల వరకూ,  కుల మీడియా నుండి సోషల్ మీడియా వరకు డా.అంబేడ్కర్ మీద చేస్తున్న కుట్రలు ఎవరి ప్రయోజనాల కొరకు?


డా.అంబేడ్కర్ మీద వ్యతిరేకతకు కారణం ఏమిటి?


ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ ఏమంటారు అంటే Dr. Ambedkar’s legacy has been destroyed to suit particular interests. He was a great scholar, institution builder, and economic theorist. 
ఎవరి ప్రయోజనాల కోసం డా. అంబేడ్కర్ ను కట్టడి చేస్తున్నారు. అయిన యొక్క భావజాలాన్ని వ్యాపించకుండా అడ్డుకుంటున్నారు. కారణాలు ఏంటి? 


1932 లో కమ్యూనల్ అవార్డు ను గాంధీ అడ్డుకుని మొదటిసారి డా.అంబేడ్కర్ ను అడ్డుకున్న వ్యక్తిగా దళితుల హృదయాల్లో ద్రోహిగా ముద్రపడ్డాడు.

 
1996 జులై – ఆగస్టు ‘ఈనాటి ఏకలవ్య’ సంచికలో డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ పీడిత ప్రజల మనిషి కాదు అన్న శీర్షికతో ఆనాటి పీపుల్స్ వార్ గణపతి వర్గం నాయకుడు వెంకటరాం రాసిన వ్యాసం ద్వారా దళితులకు మావోస్టులు ల వ్యూహం అర్ధం అయింది.


అరుణ్ శౌరి , రంగనాయకమ్మ లాంటివారు వ్యాసాలు, పుస్తకాలు రాసుకున్నా డా.
బాబాసాహెబ్ అంబేడ్కర్ మీద వ్యతిరేకతకు కారణం కులం.


ఈ దేశంలో కులం అన్నిటికన్నా అత్యంత శక్తివంతమైనది. బాబాసాహెబ్ డా.
బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆ శక్తివంత్తమైన కులాన్ని కుకట్టివేళ్ళు తో తొలగిస్తేగాని ఈ దేశంలో మెజారిటి పౌరులు ఆత్మ గౌరవంతో బ్రతకగలుగుతారని బావించారు. 

Also read  ఆదివాసీ యువశక్తి "జాయ్స్" ఫేస్ బుక్ పేజి నుండి అసెంబ్లీ ఎన్నికల వరకూ!


కుల నిర్ములనా జరిగితే, దాని మీద ఆధారపడి జీవిస్తున్న బ్రాహ్మణ వర్గాల ఆధిపత్యం పోతుందనే భయంతో కులాన్ని సజీవంగా ఉంచడానికి డా. అంబేడ్కర్ ని టార్గెట్ చేస్తున్నారు. 

క్యాపటలిజం కానీ బ్రాహ్మణ, బనియా భూర్జువ దోపిడీ దొంగల రాజ్యాధికారం ప్రమాదంలో పడకుండా ఉండాలంటే డా. అంబేడ్కర్ అనే చైతన్యదీపికను నిత్యం వెలగకుండా చూడాలి. 


దళితులు మరియు ఇతర పీడిత వర్గాలు బాబాసాహెబ్ డా.అంబేడ్కర్ విగ్రహం కేంద్రంగా చైతన్యం అయితే పీడక కులాలకు లేదా భూస్వామ్య కులాల రాజ్యాధికారం నుండి శాశ్వితంగా తొలగిపోతుందనే భయం విగ్రహాల మీద, సిద్ధాంతం మీద బ్రాహ్మణ బనియా కులాలతో చెయ్యి కలిపి విగ్రహాల మీద దాడి చేస్తున్నారు.

 
ఉత్తర భారత దేశంలో బిసి మరియు దళిత కులాలు రాజ్యాధికారం చేపట్టి బ్రాహ్మణ, బనియా మరియు క్షత్రియ కులాలను, భూర్జువా భూస్వామ్య కులాలను రాజ్యాధికారం నుండి దూరంగా  వేశారు. 


మాన్యశ్రీ కాన్షిరాం బహుజన సిద్ధాంతం  డా.అంబేడ్కర్ కేంద్రంగా దేశవ్యాప్తంగా విస్తృతమైన ప్రచారం పొంది సో కాల్డ్ అగ్రవర్ణాల రాజకీయ ఉనికి ని ప్రశ్నించింది. 


ఈ హఠాత్ పరిణామాలతో దళిత వర్గాల ఆయువుపట్టు బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ ని నిర్వీర్యం చేస్తే దళితులు మరియు బహుజన సమాజం సంఘటితం కాకుండా అడ్డుకోవచ్చనే ఆలోచన పీడక కులాలది.

 
దళితులను కేవలం ఓటు బ్యాంకు గానే ఊహిస్తూ 100 అడుగుల విగ్రహాలు, స్మృతి వనం నిర్మిస్తామంటూ ఊసరవెల్లి మాటలు చెబుతున్న భూర్జువ కుల ముఖ్యమంత్రులు దళితులు సొంతగా డా. అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు చేసుకుంటే బయపడుతున్నారు.


నాటి డా బాబాసాహెబ్ అంబెడ్కర్ పాత ప్రశ్నలే నేటి కొత్త ప్రశ్నలై ఈ మట్టిని తొలుచుకొని వాస్తవాలు వెలికి వస్తున్నాయి. కులం – వర్గం లో ఏ అభ్యుదయ  రాత చూసినా అంతర్గతంగా కులం ముద్రనే కనిపిస్తుంది.

Also read  కెసిర్ ఫెడరల్ ఫ్రంట్ కేంద్రం మీద పెత్తనం కోసమేనా!


82 సంవత్సరాల క్రితం కుల నిర్ములనా గ్రంధం  ద్వారా డా బాబాసాహెబ్ అంబేడ్కర్ లేవనెత్తిన ప్రశ్నలకు గాంధీ వారసులు, మావోయిస్టు లు, కమ్యూనిస్టు లు నేటికీ సమాధానం చెప్పలేదు. 

డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ పీడిత వర్గాల ప్రతినిధి కాదంటూ మావోయిస్టులు, లాల్ – నీల్ సలాం అంటూ మర్క్స్ సరసన కూర్చోబెట్టడానికి కమ్యూనిస్టులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.


దీనంతటికి కారణం బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ వారసులను రాజ్యాంధికారం నుండి దూరం చేసే ఎత్తుగడలో భాగంగా ఫ్యూడల్ కులాలు దళిత – బహుజనులను నిత్యం ఘర్షణకు గురిచేస్తున్నాయి. 


పంజాగుట్ట బాబాసాహెబ్ డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహం కేంద్రంగా దళిత సంఘాలు బోధించు , పోరాడు,  సమీకరించు అనే త్రికరణ సూత్రాలకు ఆధారంగా భూర్జువా కులాలను రాజ్యాంధికారం కు దూరం చేసే  ప్రణాళికలు రచించాలి.

(Visited 156 times, 1 visits today)

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!