డిజిటల్ దళితులు-సోషల్ మీడియా దళితుల రాజకీయ అవకాశాలను పెంచుతుందా

షేర్ చెయ్యండి
 • 30
  Shares
 
 
 • మీడియా ఉద్యమానికి వెన్నుముక లాంటిది.సామజిక ఉద్యమాల ద్వారా సాధించదలుచుకున్న ధ్యేయాలను ప్రజలకి తెలియజేస్తూ ప్రజల్లో సంఘ చైతన్యం కోసం మీడియా  ముఖ్య అవసరం. 
 
ఆరోజుల్లో నే బాబాసాహెబ్ డాక్టర్ అంబెడ్కర్ పత్రికలు స్థాపించేరు. కరపత్రాలు పంచేవారు. మూక్ నాయక్, బహిష్కృత భారత్ , జనతా తదితర పత్రికలు బాబాసాహెబ్ ఉద్యమానికి వెన్నుదన్ను గా నిలిచేయి. 
 
నేడు సాంకేతిక అందుబాటులోకి వచ్చిన తర్వాత క్షణాల్లో వార్త లు జనాలకి అందుబాటులో ఉండాలి. సోషల్ మీడియా సృష్టించిన విప్లవం నేడు ప్రధాన మీడియా సైతం ప్రజల నాడి తెలుసు కోవడానికి  సోషల్ మీడియా మీద ఆధారపడాల్సి వస్తుంది. 
 
తెలుగు రాష్ట్రాలలో దళితులు సామజిక మాధ్యమాలను ఉపయోగించుకునే విధానాన్ని రెండు గా వేరు చెయ్యొచ్చు. హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల మరణం కి ముందు, మరణం తర్వాత, 2016 లో రోహిత్ వేముల ఆత్మహత్య లేఖ సోషల్ మీడియా లో ఒక సంచలం పుట్టించింది. దానితో దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలలో మరియు గ్రామాల్లో సైతం రోహిత్ వేములకు బాసట గా దళితులు ఆందోళన చేసేరు. 
 
పచ్చిమ గోదావరి జిల్లా గర్గపర్రు లో 400 మంది మాల సామాజిక కుటుంబాలను 3 నెలలుగా గ్రామ బహిష్కరణ చేస్తే పట్టించుకోని ప్రధాన మీడియా సామజిక మాధ్యమాల లో వార్త వచ్చిన క్షణం లోనే వేలాది మంది దళిత యువత స్వచ్ఛందంగా గరగపర్రు వెళ్లి అక్కడి బాధితులకు అండగా నిలబడటం చరిత్రలో మొదటిసారి. ఏ నాయకుడా లేకుండా, ఏ మీడియాలో వార్త లేకుండా ఒక్క సామాజిక మీడియా ద్వారా కుల రాక్షసి కోరలు పీకేరు దళిత యువత, మరియు ప్రజలు. అలాగే  ఖమ్మం జిల్లా మంథాని లో మధుకర్ అనే యువకుడిని హత్య చేసిన వారిని అరెస్ట్ చెయ్యాలంటూ సోషల్ మీడియా ద్వారా ఇచ్చిన పిలుపుకు రెండు రాష్ట్రాల నుండి దళిత యువత , మేధావులు, సంఘాలు మంథని లో ఆందోళన చేసేరు. అలాగే ఆగిరిపల్లి , ఆభగ్నాపట్నం ఇంకా అనేక చోట్ల ప్రజా స్పందనకి కారణం సోషల్ మీడియా. 
 
దళితులకు మీడియా అంటూ లేకపోవడం పెద్ద అవరోధమే కానీ ఫేస్ బుక్ గ్రూప్ లు , వాట్సాఅప్ , ట్విట్టర్ వచ్చిన తర్వాత దళితుల్లో వారి హక్కుల పట్ల బాధ్యత పెరిగింది. జాతీయ స్థాయిలో ఆంగ్ల మాధ్యమం లో ఇంటర్నెట్ ఆధారిత దళిత సమస్యలు లేదా అంబేద్కరిజం చర్చించటానికి రౌండ్ టేబుల్ ఇండియా, దళిత్ మరియు ఆదివాసీ , అంబెడ్కర్ డాట్ ఆర్గ్ , సావరి , వెలివాడ లాంటి వెబ్సైట్స్ వున్నాయి . అలాగే దళిత కెమెరా అనే యూట్యూబ్ ఛానెల్ లు దళితుల కోసం పని చేస్తున్నాయి. ఇటీవల కాలంలో  డిజిటల్ మీడియా ప్రాముఖ్యత పెరగడం తో మరికొన్ని వెబ్సైట్స్ తెలుగు లో కూడా  వార్తలు , విశ్లేషణ అందిస్తున్నాయి. 
 
జాతీయ స్థాయిలో జరిగే సంఘటనల మీద కూడా మారుమూల ప్రాంతంలో దళితులు స్పందిస్తున్నారు అంటే కారణం సోషల్ మీడియా. గుజరాత్ లోని ఉనా సంఘటన ఆంధ్ర, తెలంగాణా లోని దళితులను కదిలించింది. ఇటీవల ఎస్సి , ఎస్టీ అత్యాచారాల చట్టం నిరీర్యం చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కి వ్యతిరేకంగా దళిత వర్గాలు ఆందోళన , బందు నిర్వహించేయి. 
 
సోషల్ మీడియా ద్వారా దళితులు ఆందోళన, నిరసనలు మాత్రమే కాదు, రాజకీయ చైతన్యం దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రాంతీయ పార్టీలలో దళితుల భాగస్వామ్యాన్ని ప్రశ్నిస్తున్నాయి. దళితుల మీద వరసగా జరుగుతున్న దాడుల వలన ప్రభుత్వం మీద దళితులు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. జాతీయ స్థాయిలో భీమ కోరేగాంవ్ మరియు ఉన తదితర సంఘటనల తర్వాత BJP మీద తీవ్ర నిరసన తెలియజేస్తున్నారు దళితులు. 
 
సోషల్ మీడియా లో దళిత వర్గాల మధ్య రాజకీయం తీవ్రంగా చర్చ జరుగుతుంది. కొందరు బహుజన సమాజ్ పార్టీ (BSP) వైపు వెళ్తుండగా మరికొందరు పార్టీలు పెడుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో ‘రాష్ట్రీయ దళిత కాంగ్రెస్’ పేరిట ఎవరూ చెయ్యని సాహసం చేస్తున్నారు. ఇప్పటికే అసెంబ్లీ , పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటిస్తూ దళిత రాజ్యాధికారం వైపు అడుగులు వేస్తున్నారు. ‘ఆంధ్ర బహుజన సమితి’ పేరిట విజయవాడలో ఇటీవల ఇంకొక పార్టీ ని దళిత వర్గాలు ఆవిష్కరించు కున్నాయి. 
 
సోషల్ మీడియా కి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. నో డౌట్ సోషల్ మీడియా ఒక చైతన్యాన్ని రగిలించగలదు కానీ పూర్తిగా దానిమీద ఆధారపడితే ప్రతి ఫలం రాదు. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన రాష్ట్రీయ దళిత కాంగ్రెస్ పార్టీ అయినా , ఆంధ్ర బహుజన సమితి అయినా లేదా ఇంకెవరైనా గ్రామాల్లో ప్రతి గడపని తాకి వస్తే ప్రతిఫలం ఉంటుంది. 
 
 
 
 
 
 
 
 
 
 

 

 
(Visited 100 times, 1 visits today)
Also read  ఇండియాలో హిట్లర్ వారసులు-విద్వేషమే అజెండా!

One thought on “డిజిటల్ దళితులు-సోషల్ మీడియా దళితుల రాజకీయ అవకాశాలను పెంచుతుందా

 • 01/06/2018 at 6:26 PM
  Permalink

  అయ్యా మా గా)మము చౌడువాడ,కె.కోటపాడు (మం.)విశాఖపట్నం జిల్లా ఇప్పటికి 70 సం”కావచ్చు చునదండి కానీ ఏ ఒక్క రోజయన మా షెడ్యూలు కులము వారికి గా)మపంచయతీ పె)సిడెంట్ రిజర్వేషన్ రాలేదు. ధనికుల అధికారమే సాగుతోంది .ఈ2019లో అయినా మాకు నాయము జరిగించండి

  Reply

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!