దళిత మిలినియర్స్: స్ఫూర్తిదాయకమైన దళిత మిలియనీయర్స్

షేర్ చెయ్యండి
Image credits: Amazon

దళిత మిలియనియర్స్ ఆ మాట వింటుంటే ఏదో కొత్త బాషా పదం లాగా అనిపిస్తూ ఉండవచ్చు. దళితులు ఏంటి మిలియనియర్స్ ఏంటి అనుకోవచ్చు. కానీ దళిత మిలియనియర్స్ అనే పదం వాస్తవం. 


దళితుల్లో మిలియనియర్స్ ఉన్నారా? దళితుల్లో బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉన్నారా? అని ఆచ్చర్యపడొచ్చు. అంటరానితనం నుండి, వెలివాడల నుండి దేశం గర్వించ్చ దగ్గ పారిశ్రామిక వేత్తలు దాకా ఎదిగిన దళిత్ మిలియనియర్స్. ఉన్నారు. 


ఆర్ధిక శాస్త్రం దళితులకు (షెడ్యూల్ క్యాస్ట్) ప్రజలకు తెలియదు అనుకుంటారు. కానీ మహర్ అనే దళిత కులం లో పుట్టిన డా బాబాసాహెబ్ అంబేడ్కర్ ‘ ది ఇవాల్యూషన్ ఆఫ్ ప్రోవినిషియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటీష్ ఇండియా’  అనే గ్రంధాన్ని రాసి చరిత్రకెక్కింది ఒక దళితుడే. 


డా బాబాసాహెబ్ అంబేడ్కర్ రాసిన ప్రాబ్లమ్స్ ఆఫ్ ది రూపీ – ఇట్స్ ఆరిజన్ – ఇట్స్ సొల్యూషన్ అనే గ్రంధం యొక్క ఆధారంగానే రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ని స్థాపించడం జరిగింది. 


మనువు వర్గీకరించిన కుల వ్యవస్థ అనే బ్రహ్మాండాన్ని బద్దలు కొట్టి దళితులు శ్రామిక కులాలుగానే కాదు విద్యా వ్యాపార వ్యవస్థ లో అయినా మొదటి వరసలో ఉండగలం అని నిరూపించిన దళిత్ మిలియనియర్స్. 


దళిత మిలియనియర్స్ 

కల్పనా సరోజ్, పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో రోజుకు రెండు రూపాయిల కూలీ గా పనిచేసిన కల్పనా సరోజ్ నేడు రూ 1000 కోట్ల టర్నోవర్ కలిగిన కమాని ట్యూబ్స్ లిమిట్ ( Kamani Tubes Limited ) కి అధిపతి. 

Also read  ఎస్సి, ఎస్టీ లకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు వ్యతిరేకించడం రాజ్యాంగ ప్రాధమిక హక్కును హరించడమే!


అశోక్ ఖడే, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష సమయంలో పెన్ను పాళీ ఇరిగిపోతే కొత్తది కొనుక్కునే స్తొమత లేని వ్యక్తి. ఇలాంటి 15 మంది దళితుల విజయ గాధ దళిత మిలియనియర్స్ అనే పుస్తకం. 


మిలింద్ ఖండేకర్, రీను తల్వార్, వందన సింగ్ ల త్రయం కలిసి సేకరించి, కూర్పు చేసిన విజేతల గాధ. దళిత మిలియనియర్స్. 


 ఒక్కొక్కరిది ఒక్కో కధ, ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నారో, ఎన్ని అవమానాలు, నిద్రలేమి రాత్రులు గడిపారో స్ఫూర్తి దాయకంగా వారి యొక్క ప్రయాణాన్ని పూసగుచ్చినట్లు రాసిన పుస్తకం దళిత మిలియనియర్స్. 


అశోక్ ఖడే DAS Offshore Engineering Pvt Ltd పేరుతొ ఆయిల్ రిఫైనరీ ప్లాట్ ఫామ్ తయారు చేసే కంపెనీ ని స్థాపించాడు. కల్పన సరోజ్ మూతపడిన కంపెనీ ని తీసుకుని నేడు లాభాల బాట పట్టించారు. 


ఆగ్రాకు చెందిన హరికిషన్ పిపల్ హెరిటేజ్ హాస్పిటల్ కు అధినేత. దేవకీనందన్ సన్ తాజ్ ప్లాజా పేరుతో తాజ్ హోటల్ పక్కనే ఒక హోటల్ స్థాపించి నడుపుతున్నాడు.

అహ్మదాబాద్ కు చెందిన సవితబెన్ కొల్సవాలా టైల్స్ కంపెనీ ని నడుపుతున్నాడు. బావనగర్ లో దేవీభాయ్ మక్వాన ఫిల్మెంట్ యార్న్ తయారీ కంపెనీ స్థాపించి లాభాల బాటలో ఉన్నాడు, సంజయ్ క్షిరసాగర్ రూ 500 కోట్ల టర్నోవర్ కల్గిన కంపెనీ కి అధిపతి. 

Also read  ఎస్సి సామాజికవర్గం: దిశ దశ లేని ఎస్సి సామాజికవర్గం!


గత 20 సంవత్సరాల లో  ప్రపంచకీరణ, సరళీకరణ ఆర్ధిక విధానాలు కల్పించిన సదావకాశాలు ఉపయోగించుకునే దళితులు ప్రభుత్వం నుండి పెద్దగా ఆర్ధిక ప్రయోజనాలు పొందకుండా స్వయం కృషితో వ్యాపార దిగ్గజాలుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. 


వర్ణ వ్యవస్థ గిరిగీసి కట్టడి చేసిన వ్యవస్థనుండి వచ్చి దళిత మిలియనియర్స్ అభివృద్ధి చెందటం అంటే ఏదో గాలివాటం గా జరింది కాదు. ఈ విజేతల గాధలను పెంగ్విన్ బుక్స్ పబ్లిష్ చేసింది .   

దళిత మిలియనియర్స్!


అశోక్ ఖడే, నాన్న ముంబయ్ లోని దాదర్ దగ్గర ఉన్న చిత్ర టాకీస్ ముందు చెప్పులు కొట్టేవాడు. తల్లి రైతు కూలీ గా రోజుకు 12 అనాలకు పనిచేసేవారు. పెన్ను పాళీ ఇరిగిపోతే కొత్తది కొనలేని స్థితిలో ఖడే క్లాస్ టీచర్ డబ్బులు ఇవ్వడంతో కొత్త పాళీ కొనుక్కుని పరీక్ష రాసాడు. ప్రస్తుతం రూ 140 కోట్ల రూపాయిల వ్యాపారానికి అధిపతి.

 
కల్పన సరోజ్, బాల్య వివాహం, అత్త ఇంటి నుండి అవమానాలు బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకున్న దళిత మహిళ. కానీ అదృష్టం బాగుండి బ్రతికింది. ముంబయ్ కి వచ్చి రోజుకు రూ 2 /- ల పనికి చేరింది. ఆతర్వాత ఆమే జీతం నెలకు రూ 225 అయ్యింది. నేడు రూ 1000 కోట్ల వ్యాపార పరిశ్రమకు అధిపతి.

Also read  అర్బన్ నక్సలైట్ అనేది బిజెపి ప్రభుత్వం మీద దళితుల వ్యతిరేకతను పక్కదారి పట్టించే ఎత్తుగడలో భాగమేనా?


ఒకప్పుడు రిక్షా తొక్కిన హరికిషన్ పిప్పల్  నేడు ఒక కార్పొరేట్ హాస్పిటల్ కు అధిపతి. అంతేకాకుండా హోండా కారు డీలర్ మరియు బూట్లు తయారీ మరియు ఎక్స్ పోర్ట్ చేసే కంపెనీల కు అధిపతి. 


ఏ అక్షరం అయితే వెలివాడలకు దూరం అయిందో ఆ అక్షరమే ఆయుధంగా చేసుకుని డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు భారత దేశానికి దశ – దిశ నిర్దేశించాడో అదే స్పూర్తితో ఆర్ధిక శక్తిగా దళితులు కృషి చేస్తున్నారు. 


దళిత మిలియనియర్స్ ఎందరికో స్ఫూర్తి. సామాజిక, ఆర్ధిక పరిణామాలు జరగకుండా రాజ్యాధికారం సాధించలేమని పేర్కొన్న డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశయాలు నెరవేరే దిశగా దళితులు శ్రమిస్తున్నారు. 


దళితులు అంటే ఉద్యోగాల కోసం క్యూలో ఉండేవారు కాదు, ఉద్యోగాలు ఇచ్చే వారుగా నేడు దళిత మిలియనియర్స్ అభివృద్ధి చెందుతుండటం గమనార్హం.

(Visited 1,152 times, 1 visits today)

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!