దళిత రాజకీయం: మా (దళితులకు) కెందుకు రాజకీయం!

షేర్ చెయ్యండి
 • 155
  Shares

దళిత రాజకీయం నేడు నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో పైన ఉన్న శూద్ర కులాలు అయినా కమ్మ, రెడ్డి తదితరలు ప్రశ్నించే స్థాయికి వెళ్ళింది. 


దెందులూరు శాసన సభ్యుడు చింతమనేని ప్రభాకర్ దళితులను ఉద్దేశించి ‘ మీరు దళితులు, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు, మీకెందుకు రాజకీయాలు పిచ్చి ముండా కొడుకుల్లారా’ అని మాట్లాడిన వీడియో నేడు వైరల్ గా మారింది. 


చింతమనేని వ్యాఖ్యలు దళితుల మనోభావాలను కించపరిచే విధంగా ఉన్నాయని రాష్ట్ర వ్యాప్తంగా దళిత, ప్రజా సంఘాలు రోడ్లెక్కి చింతమనేని ప్రభాకర్ కి మరియు అధికార తెలుగు దేశం ప్రభుత్వానికి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. 


ఈ సందర్బంగా దళిత రాజకీయం మీద పలువురు చర్చ చేసుకోవడం, డెబ్భై ఏండ్ల స్వతంత్ర దేశంలో దళితులను ( ఎస్సి ) రిజర్వుడు నియోజక వర్గాలకే పరిమితం చేసిన వైనాన్ని షెడ్యూల్ క్యాస్ట్ మరియు ఇతర కులాల లో చర్చ జరుగుతుంది. 


దళితులకు కెందుకు రాజకీయం!


స్వతంత్ర భారత దేశంలో స్వజాతీయుల 70 సంవత్సరాల పాలన చూసిన తర్వాత దళితులకెందుకు రాజకీయం అంటే ‘ప్రపంచంలోని అతి పెద్ద లిఖిత రాజ్యాంగం అయిన భారత రాజ్యాంగాన్ని, చట్టాలను, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత దళితుల మీద ఉంది’ 


దేశం మతం , ప్రాంతం ప్రాదిపదికన మరొకసారి విడిపోకుండా, అన్నీ కులాల , మతాల హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత దళితుల మీద ఉంది. 


నేడు పాలక పార్టీలు నామకః అభర్ధులనే వారి ప్రతినిధులుగా పార్లమెంట్, శాసన సభకు ఎన్నుకుంటూ అవినీతి, బంధు ప్రీతి లో పీకల్లోతుల్లో కూరుకుపోయి ఉన్నారు. ఎంతో కస్టపడి సాధించిన దేశ స్వతంత్రం నేడు అవినీతి, మతత్వ రాజకీయ నాయకుల చేతిలో కీలు బొమ్మ గా మారింది.

 
దోపిడీ దారులు, అవినీతి పరులు, రాజకీయ వ్యభిచారుల నుండి దేశాన్ని విముక్తి చెయ్యడం కోసం దళితులకు రాజకీయం అవసరం.

 
దేశ అభివృది లో దళిత రాజకీయ నాయకుల పాత్ర!


దళిత రాజకీయ ప్రస్థానం లో మొదటి అడుగు నవభారత నిర్మాత బాబాసాహెబ్ డా. అంబేడ్కర్.   


బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం లో కీలకమైన లేబర్ మంత్రిగా, స్వతంత్ర భారత దేశంలో న్యాయశాఖ మంత్రిగా బాబాసాహెబ్ డా అంబేడ్కర్ చేసిన కృషి నేటికీ ఏ ఒక్క ఫ్యూడల్ కుల రాజకీయ నాయకులు చేయలేదంటే అతియోశక్తి కాదు. 


నీటిపారుదల సౌకర్యాల పితామహుడు, హిరాకుడ్ ప్రాజెక్టు, దామోదర్ నదీలోయ ప్రాజెక్టు, సోన్ నది లాంటి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల డిజైన్ దగ్గర నుండి పూర్తి చేసేదాకా బాబాసాహెబ్ డా అంబేడ్కర్ కృషి ఉంది. 

Also read  IAS officer without UPSC? Call of the upper castes by the back door!


భారత దేశ చరిత్రలో అనుకున్న ఖర్చు మరియు అనుకున్న సమయంలో పూర్తయిన నీటిపారుదల జల విద్యుత్ ప్రాజెక్టులు ఇవే.  

మెరుగైన నీటిపారుదల కోసం Central Waterway and Irrigation Commission (CWIRC) ఏర్పాటు చేసారు. జలవనరుల నుండి విధ్యుత్తుత్పత్తిని క్రమబద్ధం చేయడం కోసం Central technical power board స్థాపించారు. 


ఇప్పటికీ సమస్యలు లేకుండా విజయవంతంగా నడుస్తూ దేశంలో విధ్యుత్తు సరఫరాలో కీలక పాత్ర పోషిస్తున్న “గ్రిడ్ వ్యవస్థ ” బాబాసాహెబ్ ఆలోచనే. 


ఇప్పుడు నిరుద్యోగులకు అత్యంత సహాయకరంగా నిలుస్తున్న “ఎంప్లాయిమెంట్ ఎక్సచేంజీలు” (Employement exchange) బాబాసాహెబ్ స్థాపించినవే. 


భారత దేశంలో సాంకేతిక విధ్య అందుబాటులో లేని కారణంగా నిరుద్యోగులను యూనిట్ గా చేసుకుని ITI లాంటి సంస్థలు ఏర్పాటు చేసి అవసరం అయితే వారిని విదేశాలకు పంపి శిక్షణ ఇప్పించాలని ప్రతిపాదించారు బాబాసాహెబ్ డా అంబేడ్కర్. 


హిందూకోడ్ బిల్లు – మహిళల విధ్య, ఆర్థిక సమానత్వం కోసం (హిందువులు తీవ్రంగా వ్యతిరేకించినందున పార్లమెంటు నిరాకరించడంతో బాబాసాహెబ్ మహిళా హక్కుల కోసం మంత్రి పదవి వదిలేసారు.


పురుషులతో పాటు మహిళలకు సమాన వేతనాలు,  మహిళలకు గర్భధారణ సమయంలో 8 వారాల ప్రత్యేక సెలవు (Maternity leave). పని ప్రాంతాలలో మహిళకు ప్రత్యేక సౌకర్యాల కోసం పథకాలు. 


స్త్రీ శిశు సంక్షేమ చట్టం – ఇది తరువాతి కాలంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆవిర్భావానికి దారి తీసింది. 

భారత ఆర్ధిక వ్యవస్థను పటిష్ఠపరిచిన వ్యక్తి బాబాసాహెబ్ డా. అంబేడ్కర్. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా రూపశిల్పి డా. అంబేడ్కర్. 


కార్మిక చట్టాలను, వారి హక్కులకు రూపకల్పన చేసిన వ్యక్తి బాబాసాహెబ్ డా అంబేడ్కర్ అని గొప్ప గా చెబుతున్నాం. 


తెలుగు రాష్ట్రాలలో  అధికారం కోసం నేడు పోటీ పడి ఇస్తున్న వృధ్యాప్య పెన్షన్ పధకం మొట్ట మొదట రూపకల్పన చేసిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ దామోదర సంజీవయ్య గారు. 


దామోదర సంజీవయ్య గారి తల్లి సుంకాలమ్మ  అడిగిన ఒకే ఒక ప్రశ్న ను స్ఫూర్తిగా తీసుకుని నేడు కులాలకు అతీతంగా పెన్షన్ లభిస్తుందంటే దళితుల ఆలోచనా సరళిని , సమాజం పట్ల వారికి ఉన్న మాతృగుణం, బాధ్యత తెలియజేస్తుంది.

 
సంజీవయ్య గారు ముఖ్యమంత్రి హోదాలో తన జన్మస్థలం కర్నూల్ జిల్లా కల్లూరు గ్రామం, పెద్ద పాడు గ్రామాన్ని దర్శించి నప్పుడు తల్లికి రూ 100 / – బహుకరిస్తే , ఆ  గొప్ప మాతృమూర్తి ‘ నాకైతే ముఖ్య మంత్రి కొడుకు గా డబ్బులు ఇచ్చేవు, నాలాంటి తల్లు లకు ఎవరు డబ్బులు ఇస్తారు’ అని ప్రశ్నించింది.  

Also read  Fascism has no place in democracy!


ఆ దళిత తల్లి ప్రశ్న నే , ఆ దళిత రాజకీయ నాయకుడి ప్రశ్న , సమాజం లోని తన తోటివారి పట్ల బాధ్యత నే నేడు లక్షలాది మంది కి వృధ్యాప్య పెన్షన్ సౌకర్యం,
దామోదర సంజీవయ్య గారు ఇందిరా గాంధీ క్యాబినెట్ లో పరిశ్రమల శాఖ  మంత్రిగా (1965 ) లో పరిశ్రమల లో పనిచేసే కార్మికులకు  బోనస్ సౌకర్యాలను కల్పించిన వ్యక్తి  ఒక దళిత రాజకీయ నాయకుడు కావడం ఈ దేశానికే  గర్వకారణం.


నేడు లక్షలాది ప్రభుత్వ, ప్రవేట్ ఉద్యోగులు వాళ్ళ తల్లితండ్రులకు కూడా ESI ద్వారా లబ్ది పొందుతున్నారంటే అది ఒక దళిత రాజకీయ నాయకుడైన దామోదర సంజీవయ్య గారి కృషి వలనే. 


ఆరు లక్షల ఎకరాల భూమిని దళితులకు , ఆదివాసీలకు ఇచ్చిన వ్యక్తి దామోదర సంజీవయ్య అంతే కాకుండా చేనేత  కార్మికుల పొట్ట కొట్టే పవర్ లూమ్స్ ని అడ్డుకుని వాటి మీద భారీ దిగుమతి సుఖం విధించిన వ్యక్తి ఒక దళిత రాజకీయ నాయకుడు. 
బిసి రిజర్వేషన్ల కోటా 24 నుండి 38 కి పెంచిన వ్యక్తి, కాపులకు రిజర్వేషన్లు కల్పించిన మహానుభావుడు ఒక దళిత రాజకీయ నాయకుడు. 


తెలుగు ను , ఉర్దూ ను అధికార బాష గా గుర్తించిన గొప్ప వ్యక్తి దామోదర సంజీవయ్య కావడం, అది కూడా ఒక దళిత రాజకీయ నాయకుడు కావడం , దళితులకు రాజకీయం ఎందుకని ప్రశ్నించే వారు తెలుసుకోవాలి. 


దామోదర సంజీవయ్య గారు అవినీతి రాజకీయ నాయకులను , ఉద్యోగులను నివారించడానికి ACB అవినీతి నిరోధక శాఖ  ని  ఏర్పాటు చేసిన వ్యక్తి , అంతే కాకుండా అక్రమ సారాయి వ్యాపారులను అరికట్ట డానికి Excize and probhishion  శాఖను ఏర్పాటు చేసారు. 


నేటి గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మరియు మొట్ట మొదటి లా కమీషన్ ను ఏర్పాటు చేసిన వ్యక్తి దామోదర సంజీవయ్య 

దళితులకు రాజకీయాలెందుకని ప్రశ్నించే మనువాదులకు సింహ స్వప్నం దళిత రాజకీయ నాయకులే. కె ఆర్ నారాయణన్ రాష్ట్రపతి గా , రాష్ట్రపతి పదవి రబ్బరు స్తాంప్ కాదని ఋజువు చేసిన ఏకైక రాష్ట్రపతి ఒక దళితుడే కావడం దళితులకు రాజకీయం ఎందుకని అడిగే మనువాద నాయకులు తెలుసుకోవాలి. 


బెహన్జీ కుమారి మాయావతి దేశంలో అతి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా చరిత్రను సృష్టించిన వ్యక్తి.  30 సంవత్సరాలు బెంగాల్ ను పాలించిన కమ్యూనిస్టు లు కంటే వ్యవసాయ భూమిని నిరుపేద దళిత , ఆదివాసీలకు పంచిన వ్యక్తి. 


ఫ్యూడల్ కులాలకు పట్టుకొమ్మైనా ఉత్తర ప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేసిన ఉక్కు మహిళ బిఎస్పీ అధినేత కుమారి మాయావతి. 

Also read  Relevance of Dr.Ambedkar in Mayday!


దేశ రాజకీయాలకు తానే కేంద్ర బిందువు గా తన చుట్టూ తిప్పుకుంటున్న ఏకైక మహిళా నాయకురాలు దళిత రాజకీయ నాయకురాలని దళితులకు రాజకీయాలెందుకని ప్రశ్నించే వారు తెలుసుకోవాలి. 


అవినీతి, బంధు ప్రీతి లో అగ్రవర్ణ రాజకీయం!


భారత దేశం వ్యవస్తీకృత అవినీతిలో రోజు రోజుకూ పైకి వెళ్తుంది. దీనికి కారణం దేశాన్ని, రాష్ట్రాలను పాలిస్తున్న అగ్ర వర్ణ రాజకీయ నాయకులదే. 


అగ్రవర్ణ  రాజకీయ నాయకుల అవినీతి సరి హద్దులు దాటి స్విస్ బ్యాంకు ల్లో మూలుగుతన్నా పట్టించుకోలేని పాలకులు కూడా సో కాల్డ్ అగ్రవర్ణమే. 


దేశ ఆర్ధిక వ్యవస్థ లను కొల్లగొట్టి, వేలాది కోట్ల ధనం బ్యాంకుల కు ఎగగొట్టి విదేశాలు పారిపోయింది కూడా అగ్రవర్ణ రాజకీయ నాయకులు దేశాన్ని పాలిస్తున్న సమయంలోనే. 


భారత దేశం స్వతంత్రం వచ్చిన నాటి నుండి నేటి రాఫెల్ యుద్ధ విమానాల కుంభ కోణాల వరకూ దేశాన్ని పాలించిన , పాలిస్తున్న వ్యక్తులు అగ్ర వర్ణమే కదా? 
అగ్రవర్ణ రాజకీయం లో ఈ దేశం అధోగతిపాలు కావడం తప్పా ఏదైనా అభివృద్ధి చెందింది అంటే దళిత రాజకీయ నాయకుల కృషి వలెనే. 


భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డా అంబేడ్కర్ ఒక దళితుడు కావడం, ఈ దేశాన్ని అగ్రవర్ణ రాజకీయ నాయకుల చేతిలో కుక్కలు చింపిన విస్తరి లా కాకుండా కాపాడిన వ్యక్తి  దళితుడే కావడం విశేషం.


దళితులకు రాజకీయం ఎందుకంటె దేశం మాది, ఈ దేశ నిర్మాతలు మూలవాసులైన దళితులు. ఈ దేశం యొక్క కుళ్ళిన కంపును రోజూ శుభ్రం చేస్తుంది దళితులు.

 
దళితులకు రాజకీయం ఎందుకంటె కుళ్ళి న ఈ రాజకీయ వ్యవస్థను కడగటానికి , ఈ దేశ చరిత్రను సువర్ణాక్షరాలతో లిక్కించడానికి దళితులకు రాజకీయాలు అవసరం. 
ఈ దేశంలో ఓట్లు మావి, సీట్లు మీవా? కాదని చెప్పటానికే దళితులకు రాజకీయం అవసరం.

(Visited 183 times, 1 visits today)

One thought on “దళిత రాజకీయం: మా (దళితులకు) కెందుకు రాజకీయం!

 • 22/02/2019 at 7:19 PM
  Permalink

  అంబేద్కర్ సమసమాజం కోసం పునాదులు వేశారు.
  కాని అగ్రకులామకునేవారి ఆలోచన భిన్నంగా ఉంది.
  మద్యపానం వల్ల ఆర్థికంగా చితికిపోయది ఎవరు ?
  అది ఉన్నన్నాళ్ళు వీరి ఆలోచన పెరగదు.
  వారి బుద్ధి మారదు.

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!