అమ్మాయితో సహజీవనం చేస్తున్నా: భారత క్రీడాకారిణి ద్యుతీ చంద్

షేర్ చెయ్యండి
ఒలంపియన్ ద్యుతీ చంద్  భారతదేశపు మొట్టమొదటి అథ్లెటిక్స్  గే క్రీడాకారిణిగా చరిత్ర రికార్డ్స్ లో చోటుచేసుకుంది. 
సరిగ్గా సంవత్సరం క్రితం సుప్రీం కోర్టు Gay sex ని అనుమతి ఇచ్చిన తర్వాత బహిరంగంగా ఒక అంతర్జాతీయ క్రీడాకారిణి గా ప్రసిద్ధి చెందిన ద్యుతీ చంద్ ఇంకొక మహిళ తో సహజీవనం చేస్తున్నాను అని, ఆమెనే పెళ్లి చేసుకుంటానని ప్రకటించింది.
 
ద్యుతీ చంద్, 23 సంవత్సరాల ద్యుతీ 2015లో   ప్రధాన వార్తల్లో కి ఎక్కింది. ఒక మహిళ గా తనకు గేమ్స్ లో పాల్గొనటానికి అనుమతించాలని ఆమె పోరాటం చేసింది. ద్యుతీ చంద్ కు టెస్టోటిరీన్ అధికంగా ఉత్పత్తి అవుతుండం తో ఆమెను అథ్లెటిక్స్ నుండి బహిష్కరించారు. ద్యుతీ 2016వ సంవత్సరం బ్రెజిల్ రాజధాని రియో లో జరిగిన ఒలింపిక్స్ లో భారతదేశం తరుపున పాల్గొన్నది. 
 
తనతో సహజీవనం చేస్తున్న మరో మహిళ యొక్క భద్రతా దృష్ట్యా ఆమె  ఆధారాలు చెప్పడానికి ద్యుతీ నిరాకరించింది. గత సంవత్సరం సెప్టెంబర్ లో భారత ఉన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు స్వలింగ సంపర్కం నేరం కాదని తీర్పు ఇచ్చిన దరిమిలా తన యొక్క లైంగిక వాంఛను బయటపెట్టింది. 
 
ద్యుతీ మీడియా తో మాట్లాడుతూ, తన మనస్సుకు నచ్చిన  జీవిత భాగస్వామి నాకు దొరికిందని, ప్రతి ఒక్కరికి తన జీవిత భాగస్వామిని ఎన్నుకునే స్వేచ్ఛ ఉందని పేర్కొంది. స్వలింగ సంపర్కాన్ని నేను ఎప్పుడు సమర్ధిస్తూ ఉంటానని, అది వ్యక్తుల మనస్సు, వ్యక్తిగత జీవితం మీద ఆధారపడి ఉంటుందని ద్యుతీ చంద్ చెప్పుకొచ్చారు. 
 
అయితే ప్రస్తుత నా దృష్టి అంతా ప్రపంచ అథ్లెటిక్స్ మీద మరియు ఒలంపిక్స్ మీద ఉందని ఆమె చెప్పారు. ఆ తర్వాత నా స్నేహితురాలిని పెళ్లి చేసుకుంటానని ద్యుతీ చంద్ ప్రకటించింది. 
 
ద్యుతీ తీసుకున్న నిర్ణయాన్ని ఆమె తల్లి అఖోజీ చంద్ తీవ్రంగా వ్యతిరేకించింది. తనకంటే వయసురీత్యా చిన్న అమ్మాయి మరియు తనకి కూతురు వరస అయ్యే అమ్మాయితో సహజీవనాన్ని ఒప్పుకోనని ఖరాఖండిగా చెప్పింది. 
 
ద్యుతీ చంద్ ను బ్లాక్ మెయిల్ చేసి ఇలా ఇలా చెప్పించారని ఆమె సోదరి ఆరోపిస్తున్నారు. తన మేనకోడలు కూతురు తో ద్యుతీ సంభందం పెట్టుకుందని, వరసకు కూతురు అయ్యే అమ్మాయితో పెళ్లి అంటే ఒడిస్సా సమాజం ఒప్పుకోదని అఖోజి చంద్ చెబుతుంది. 
 
భారతదేశం యొక్క చట్టాలు  LGBT, స్వలింగ సంపర్క వివాహాలను గుర్తించడంలేదు. కానీ నిబంధనలు సడలించి గత సంవత్సరం సుప్రీం కోర్టు స్వలింగ సంపర్కం నేరం కాదంటూ తీర్పు వెల్లడించింది. 
 
ద్యుతీ అక్క ఇదంతా తన భాగస్వామి కుటుంబం తన డబ్బులు / ఆస్తుల కోసం చేస్తున్నారని, ద్యుతీ మీద ప్రేమతో కాదని ఆమెకు చెప్పినట్లు పేర్కొంది. ఆమెతో సాహచర్యం , పెళ్లి రద్దు చేసుకోకపోతే జైలు కు వెళ్లాల్సి వస్తుందని ద్యుతీ ని ఆమె అక్క బెదిరించింది. 
 
ద్యుతీ లాంటి ఒక సెలబ్రిటీ స్వలింగ సంపర్కం గురించి ప్రకటించడం ఇండియా లాంటి దేశాలకు వరం లాంటిదని, ఆమె ధైర్య సాహసాలకు గర్వంగా ఉందని  క్రీడల్లో మహిళల పట్ల జరుగుతున్న వివక్షత, లైంగిక దాడి మీద రీసెర్చ్ చేస్తున్న పయోషాని మిత్ర ట్వీట్ చేసారు.  
 
 ద్యుతీ చంద్ అథేల్టిక్స్ నుండి బహిష్కరణ!
 
ప్రపంచ అథేల్టిక్స్ ఫైనల్ కు సెలెక్ట్ అయిన సంవత్సరం తర్వాత ద్యుతీ చంద్ ను అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ( Athletics Fedaretion of India ) AFI ఆమెను గేమ్స్ నుండి బహిష్కరించింది. 
 
ఆడవాళ్లకు సహజంగా ఉండాల్సిన మోతాదుకంటే ఎక్కువ శాతం టెస్టోటిరిన్ అధికంగా ఉండటం చేత ద్యుతీ చంద్ ను ప్రపంచకప్ లో పాల్గొనకుండా ఆమెను బహిష్కరించారు. అంతేకాకుండా ఒక్క సంవత్సరం పాటు ఎలాంటి పోటీలో పాల్గొనకుండా బహిష్కరించింది అథ్లెటిక్స్ ఫెడరేషన్. మరియు సంవత్సరం తర్వాత టెస్టోటిరిన్ తగ్గించుకొని రావాలని షరతు పెట్టింది అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. 
 
అయితే ఈ చర్య మీద ద్యుతీ కోర్టుకు వెళ్ళింది. తన ప్రమేయం లేకుండా శరీరం లో ఉత్పత్తి అయ్యే రసాయన చర్యను తన తప్పు కాదంటూ ఆమె కోర్టుకు వెళ్ళింది. 
 
సైన్స్ సహజంగా ఉత్పత్తి అయ్యే టెస్టోటిరిన్ ప్రభావం ఆటల్లో ఎలాంటి ప్రత్యేక ప్రభావం చూపెడుతున్నట్లు చెప్పలేదని పేర్కొంటూ 2015 లో ఆమె తిరిగి ఆటల్లో పాల్గొనటానికి కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పు అనంతరం తిరిగి ట్రాక్ మీద పరిగెత్తిన ద్యుతీ గత సంవత్సరం జరిగిన ఆసియా గేమ్స్ లో 100 మరియు 200 మీటర్ల పరుగు పందెంలో వెండి ( Silver Medal ) సాధించింది. 
 
ద్యుతీ ఇప్పుడు 2020 లో జపాన్ రాజధాని టోక్యో లో జరిగే ఒలంపిక్స్ లో పాల్గొనడానికి సమాయత్తం అవుతుంది. 
ద్యుతీ తల్లి కూడా ఆమె ఆటలో నిమగ్నమై దేశానికి పేరు తేవాలని కోరుకుంటుంది. 

(Visited 149 times, 1 visits today)
Also read  దళిత మిలినియర్స్: స్ఫూర్తిదాయకమైన దళిత మిలియనీయర్స్

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!