పేదరిక నిర్ములనా: కులం నీడలో అభివృద్ధి రాజకీయాలు!

షేర్ చెయ్యండి
  • 134
    Shares

పైన ఫోటో చూస్తుంటే దేశంలో పేదరికం, ప్రభుత్వ పాలనా ఎలాగా ఉందొ మనకి అర్ధం అవుతుంది. 


ఆ పెద్ద మనిషి నిలబడింది ఏ శరణార్ధుల శిభిరం లో కాదు. ఏటా లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశ పెడుతున్న పార్టీలు ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు పెడుతున్నాయి? ఎవరి కోసం ఖర్చు చేస్తున్నారు? 


భారత దేశంలో 2/3 వ వంతు ప్రజలు పేదరికంలో ఉన్నారు. 68.8 శాతం మంది భారతీయులు రోజుకి రూ 100 /- కూడా ఖర్చు చేసే స్థితిలో లేరు. 


దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరవాత గరీబ్ హఠావో అంటూ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ అత్యంత పాపులర్ నినాదం / పధకం ప్రవేశపెట్టింది. 


భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 20 సంవత్సరాల వరకూ దేశంలో పేదరికం గురించి ఎవరూ మాట్లాడలేదు. ప్రభుత్వ పథకాలన్నీ కామాంధుల సంక్షేమానికే అన్నట్లుగా వ్యవహరించారు. 


1971 ఎన్నికల్లో ఇందిరా గాంధీ గరీబ్ హఠావో నినాధం పెద్ద సంచలనం కలిగించింది. ఇందిరా గాంధీ తదనంతరం రాజీవ్ గాంధీ కూడు గరీబ్ హఠావో నినాదం ఎన్నికల అస్త్రంగా మార్చుకున్నాడు. 


నాలుగు దశాబ్దాల తర్వాత ఇందిరా గాంధీ మనవడు నేటి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా గరీబ్ హఠావో అంటూ పేదరికం నిర్ములనకు కొత్త మార్గాలు ఎన్నుకున్నాడు. 


ఆనాటి కాంగ్రెస్ అధ్యక్షుడు మరియు దళిత నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ మాట్లాడుతూ , హిందూ సమాజం కులవ్యవస్ఠ మీద ఆధారపడి ఉంది.

ఇన్నిరోజులు ప్రభుత్వ సంపద అగ్రవర్ణాల ప్రజలే అనుభవించారు కానీ నేడు SC , ST, OBC లకు ప్రభుత్వం విద్య, ఉద్యోగ , ఉపాధి సౌకర్యాలు కల్పించి పేదరికం పారద్రోలుతామని గరీబ్ హఠావో నినాదం గురించి చెప్పారు. 

Also read  Honour killing in Telangana, man hacked to death in front of pregnant wife.

పేదలు ఎవరు? 


భారత దేశంలో పేదలు అనగానే బడుగు, బలహీన వర్గాల కులాలు వైపు చూపుడు వేలు వెళ్తుంది. ఈ కులాలు మాత్రమే ఎందుకు అత్యంత దుర్భర జీవితం అనుభవిస్తున్నారు? 


మౌర్య సామ్రాజ్యం పతనం తర్వాత భారత దేశం అంటే హిందూ మతం, హిందూ మతం అంటే కుల వ్యవస్థ. కులం లేకపోతే హిందూ వ్యవస్ఠ లేదు. 


నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో దిగువున ఉన్న కులాలను శూద్రులని , పంచములని వేరు చేసి హక్కులు నిరాకరించబడ్డారు. 


దళిత వర్గాలకు అస్తి హక్కు  లేకుండా నిరంతరం నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో అగ్ర బాగాన ఉన్న వారి మీద ఆధారపడే విధంగా ఏర్పాటు చేసింది. 


బ్రిటీష్ కాలంలోనూ రాజరిక వ్యవస్థను, కుల వ్యవస్థను భద్రంగా కాపాడుకోగల్గింది హిందూ వ్యవస్థ. అందుచేత ఏ కులాలకైతే హక్కులు నిరాకరించ బడ్డాయో వారి తరాలు నేటికీ పేదరికంలో మగ్గిపోతున్నారు.

కుల వ్యవస్థ చట్రం నుండి బయటకు రాలేక పోతున్నారు. కుల వ్యవస్థ సంచార జాతులను సృష్టించింది, కులాల్లో ఉప కులం అంటూ ఊరు, ఊరు తిరిగి అడుక్కునే వారుగా కుల వ్యవస్థ సృష్టించింది.


కాబట్టి భారత దేశంలో పేదరిక నిర్ములన చెయ్యాలంటే  కుల వ్యవస్థను రద్దు చెయ్యాలి. 

పేదరిక నిర్ములనా- కులం నీడలో అభివృద్ధి!


భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి బ్రాహ్మణ, భూస్వామ్య కులాలు సాంప్రదాయ ముసుగులో నుండి బయట పడి ఆధునిక భావజాలం వైపు అడుగులు వేస్తున్నారు. 


స్వతంత్రం తరువాత ఏర్పడిన ప్రభుత్వంలో ఈ కులాలే భాగస్వామ్యం గా ఏర్పడి, వారి కుల వృత్తులనే ప్రభుత్వ  ప్రణాళిక లో పెట్టి ప్రభుత్వం నుండి నేరుగా లబ్ది పొందారు. 

Also read  యోగి 'రాంజీ' అంబేడ్కర్ ఒక కుట్ర!


మొదటి పంచవర్ష ప్రణాళిక నుండి నేటి నీతి ఆయోగ్ వరకూ పాలక కులాలు వారి వారి కుల ప్రయోజనాలకే బడ్జెట్ కేటాయింపులు చేసుకున్నారు. 


వ్యవసాయం, పరిశ్రమలు అభివృద్ధి, ఆధునీకరణ, సాంకేతిక యంత్రాలు, బ్యాంకుల నుండి ఋణాలు, సబ్సిడీ, ప్రభుత్వ ఉద్యోగాలు  అన్నీ భూస్వామ్య కులాల జేబుల్లోకి వెళ్లాయి. 


సామాజికంగా వెనకబడిన తరగతులకు, దళిత వర్గాలకు ప్రభుత్వాలు సబ్సిడీ బియ్యం పధకాలు మాత్రమే ప్రవేశ పెట్టాయి గాని ఆర్ధిక అభివృద్ధి కి చిత్తశుద్ధి తో పని చెయ్యలేదు. 


ప్రభుత్వ అధినేతలు పధకాలు ప్రవేశ పెట్టినా క్రింద పనిచేసే మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శి స్థాయి నుండి సెక్షన్ ఆఫీసర్ వరకూ పేద వర్గాల అభివృద్ధి కి గండి కొడుతూనే ఉంటారు. 


ప్రభుత్వ పధకాలను, బడ్జెట్ ను, పరిశ్రమలను తమ ప్రయోజనాల వైపు మళ్ళించుకోవడమే ఫ్యూడల్ కుల ప్రభుత్వాల లక్ష్యం. 


లక్షల కోట్ల బడ్జెట్ లో అధిక శాతం రాయితీలు, ఋణాల మాఫీ, భూమి పంపకాలు పేదరికం నిర్ములనా కోసం కాకుండా వారి కులాల అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి.


పాలక కులాలు తమ కులం కోసం ఎలా పని చేసుకుంటాయో చంద్రబాబు నాయుడు 1994 నుండి 2004 వరకూ దలేల్ బెనబాలి అనే విదేశీ వనిత తన పరిశోధనా పత్రంలో వెల్లడించింది. 


వై యెస్. రాజశేఖర్ రెడ్డి చేపట్టిన జల యజ్ఞం కార్యక్రమం కోసం కేటాయించిన బడ్జెట్ అంతా రెడ్డి కుల కాట్రాక్టర్ ల జేబుల్లోకి వెళ్ళింది. 


పట్టణ పేదరిక నిర్ములనా కోసం మరియు గ్రామీణ పేదరిక నిర్ములనా కోసం ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాలు ‘కానుకల’ తో ముడి పెడుతూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు. 

Also read  స్టేట్ సోషలిజం - బారత ఆర్ధిక, సామజిక, రాజకీయ ప్రజాస్వామ్యం: డా.అంబేడ్కర్ ప్రతిపాదనలు!

పేదరిక నిర్ములనా పధకాల తో సాధ్యమా? 


పేదరిక నిర్ములనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే స్కీమ్స్ ( పధకాలు ) వలన సాధ్యం అవుతుందా? అంటే అవి ఓటు బ్యాంకు రాజకీయాలకు పరిమితం అవుతున్నాయి. 


ప్రపంచ సంస్థలు ఇచ్చే ఆర్ధిక సహాయంతో గానీ లేదా ఒత్తిళ్ల వలన మన దేశంలో గణనీయంగా పేదరిక నిర్ములనా జరిగింది అనేది వాస్తవం. 


అయితే వ్యవస్థాగతంగా పేదరికం లోకి నెట్టవేయబడిన కులాలు 80 శాతం వరకూ నేటికీ పేదరికంలోనే మగ్గుతున్నాయి. 


పేదరిక నిర్ములనా అనేది ప్రజలకు పెన్షన్ సౌకర్యాలు, రూ. 5 /- కి భోజనం పెట్టడం వలన, సబ్సిడీ బియ్యం , కానుకలు ద్వారా తీరేది కాదు. 


ప్రపంచ దేశాల మల్టీ డైమన్స్ నల్ ఇండెక్స్ ప్రోగ్రాం భాగంగా పక్కా గృహాలు నిర్మించడం, అంగన్ వాడీ కేంద్రాల లో పౌష్ఠిక ఆహరం పెట్టడం ద్వారా పోదు. 


పేద వర్గాలను అభివృద్ధి లో భాగస్వామ్యం చెయ్యకుండా, శాశ్విత పధకాలు కల్పించకుండా పేదరిక నిర్ములనా కార్యక్రం చేపడుతున్నాం అంటే అది రాజకీయమే అవుతుంది. 

(Visited 95 times, 1 visits today)

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!