బుద్ధ పూర్ణిమ:బుద్ధ ధర్మ సారం మానవాళికి వెలుగు దివ్వెలు!

షేర్ చెయ్యండి

భోధి అంటే పరిపూర్ణమైన బుద్ది, నైతిక ప్రవర్తనల మేలు కలయిక. భోధిని పొందిన వ్యక్తిని బుద్ధుడు అంటారు. ఇటువంటి బుద్దులు బోధించిన ధర్మాన్ని బుద్ధ ధర్మం లేదా బౌద్ధం అని పిలుస్తున్నాం. 


మనిషి   బోధిని కేవలం మానవ ప్రయత్నం ద్వారా పొందవచ్చు. అలా బోధిని పొందిన సుప్రసిద్ధుడు “గౌతమ శాక్యముని”


బౌద్ధధర్మాన్ని స్థాపించిన గౌతమ శాక్యముని అని సాధారణంగా చెబుతారు. కాని తనకంటే ముందు ధర్మబోధ చేసిన బుద్ధులున్నట్లు శాక్యముని ప్రస్తావించాడు. 


క్రైస్తవమత స్థాపకుడైన జీసస్ తాను ‘దేవుని కుమారుడన ని ప్రకటించాడు. క్రీస్తు తనను నమ్మినవారి పాపభారం తనపై వేసుకుని శిలువపై మరణించి, తిరిగి జీవాన్ని పొందాడని నమ్మనివారిని క్రైస్తవుడని అనరు. 


అలాగే ఇస్లాం మతస్థాపకుడైన మహమ్మద్ ‘దైవదూత’ అని విశ్వసించనివారిని మహమ్మదీయుడని పిలవరు. 


బుద్ధుడు తాను మానవుణ్ణి మాత్రమేనని అంతకుమించిన అతీంద్రీయశక్తులేవీ తనకు లేవని చెప్పాడు అయితే అయన పరిపూర్ణమయిన మానవుడనడంలో సందేహంలేదు.

 
తనను అనుసరించినవారి పాపాలను కడిగివేసే రక్షకుడిగా బుద్ధుడు తనను ప్రకటించుకోలేదు. మానవాతీత శక్తుల (దైవ) సందేశాన్ని ప్రజలకు అందించడానికి వచ్చిన ప్రవక్తనని చెప్పలేదు. 

Also read  ధర్మో రక్షిత; రక్షతః - ఒక అనైతికం


ఏ మార్గం ద్వారా బుద్ధుడు తన విముక్తిని సాధించుకున్నాడో, ఆ మార్గాన్ని యితరులకు బోధించాడనికి మించి తనవద్ద మరేమీ లేదన్నారు. ప్రతి ఒక్కరూ తమ పాపభారాన్ని తామే భరించాలని అలాగే తమ విముక్తినీ తామే సాధించుకోవాలని బోధించాడు. 


ఈ విషయాన్ని శాక్యముని బోధనల సకంలనంగా  చెప్పబడే “ధర్మపద” నొక్కిచెబుతుంది. మన ఆలోచనల ఫలితమే మన జీవితం అది మన ఆలోచనల పునాదిపై వాటి సమాంతరంగా నిర్మించబడింది. 

నువ్వు చెడు చెప్తే వాటి ఫలితం నీకే చెందుతుందినువు మంచి చేస్తే వాటి ఫలితం నీకే దక్కుతుంది. మంచయినా చెడయినా యాడ్ నీకోసం నువు చేసుకునేదే ఒకరు మరొకరిని వుద్దలించలేరు సుమా!స్వయంకృషితో నీ ముక్తిని నీవేసాధించాలి. తధాగతులు దారి మాత్రమే చూపగలరు.


మహాపరినిర్వాణసూత్రంలో ఆనందునికిచ్చిన ఉపదేశం దీనికి ఋజువు. ఓ ఆనందా మీకు మీరే వెలుగుదివ్వెలు కావలి. మీకు మీరే దిక్కు వెలుగునిచ్చే ధర్మాన్ని ఆశ్రయించండి. మీకు మీరే రక్ష వేరెవ్వరూ మిమ్మల్ని రక్షించలేరు. 


ఇప్పుడైనా, నా తదనంతరమయినా, ఎవరైతే తమకు తామే ఆలంబన అవుతారో, ఎవరయితే తమకు తామే దీపాలై వెలుగు పొందగలుగుతారో వారే మహోన్నతమైన సంబోధిని పొందుతారు. 

Also read  మతం బారతీయ సమాజాన్ని విడిదీస్తుందా లేక ఏకీకృతం చేస్తుందా? C/o కంచరపాలెం సినిమా ఏమిచెబుతుంది?


మానవుని విముక్తి సాధనలో మానవాతీత శక్తుల పాత్రను నిరాకరించడమే గాక, తమపై నమ్మకం ఉంచినంత మాత్రానే దుఃఖవిముక్తి జరుగుతుందని శాక్యముని ఎక్కడ చెప్పలేదు. 


అంతేగాక తనకు వ్యక్తిగా ఎలాంటి ప్రాముఖ్యత యీవొద్దని, నిరంతరం ధర్మాచరణ మీదే దృష్టి నిలపమని తన శిష్యులను కోరాడు. 

బుద్ధుడి అష్టాంగ విధానం. 
1. సమ్యక్ దృష్టి
2. సమ్యక్ సంకల్పం
3.సమ్యక్ వచనం
4.సమ్యక్ కర్మ
5. సమ్యక్ జీవనం
6.సమ్యక్ కృషి
7. సమ్యక్ స్మృతి
8. సమ్యక్ సమాధి.

సమ్యక్ ఆంటే మంచి, ఇతరులకు హాని కల్గించనది. ఈ అష్టాంగములు ఆచరించనవారికి దుఃఖం కలుగదు.

“అసతోమా సద్గమయ – అసత్యం నుండి సత్యంవైపు.

తమ సోమా జ్యోతిర్గమయ – చీకటి నుండి వెలుగువైపు.

మృత్యుర్మా అమృతంగమయ – మృత్యువునుండి అమృతత్వము వైపు సాగుదాం”

క్రెడిట్స్ & థాంక్స్  : బుద్ధ ధర్మ సారం – Peacock Classics

(Visited 90 times, 1 visits today)

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!