స్త్రీ విమోచనా తొలికిరణం సావిత్రిబాయి పూలె!

షేర్ చెయ్యండి
  • 189
    Shares
 
ఆమె పేరు వినబడితే కోటానుకోట్ల శాంతికపోతాలు రెక్కలు విప్పార్చి ఆకాశంలోకి ఎగిరి పోతున్న అనుభూతి కలుగుతుంది. 
 
ఆమె స్మృతి మదిలో మెదిలితే సంకెళ్లు తెగుతున్న స్వేచ్చారాగం ఒక అమృత గానమై వినిపిస్తుంది. 
 
ఆమె గళం తలుపుకొస్తే విముక్తికై పెనుగులాడుతున్న పీడిత జనాంగం ధిక్కార నినాదాల హోరు శతకోటి తరంగాల ఘోషలా మార్మోగుతుంది. 
 
ఆమె చిత్తరువు ముందు నిలబడితే సగం ఆకాశం నేలమీదకు వంగి చుబుకాన్ని ముద్దాడినట్లు, భూమి బంధనాలను తెగ తెంచుకుని, ఆకాశంలోకి జెండాలా ఎగిరినట్లు ఒక విముక్తి దృశ్యం కనుల ముందు కదులాడింది. 
 
ఆమె పేరు సావిత్రిబాయి పూలె. దళిత ధిక్కార కవి, రచయిత కలేకూరి ప్రసాద్ గారు అద్భుతంగా వర్ణించిన విధానం. 
 
తోలి జీవితం: 
 
సావిత్రిబాయి పూలె జనవరి 3, 1831 న ప్రస్తుతం సతారా జిల్లా లోని నైగాంవ్ గ్రామం, మహారాష్ట్ర రాష్ట్రం లో జన్మించారు. 
 
వ్యవసాయ కుటుంబం లో జన్మించారు  సావిత్రిబాయి. తల్లితండ్రులు ఖండోజీ నీవేసే పాటిల్ మరియు లక్ష్మీ. సావిత్రిబాయి పూలె ఇంటికి పెద్ద కుమార్తె. 
 
ఆరోజుల్లో బాల్య వివాహాలు జరిగేవేవి.సావిత్రిబాయి పూలె కి 9 సంవత్సరాలకే 1840 లో 12 సంవత్సరాల జ్యోతిరావు పూలే కి ఇచ్చి పెళ్లి చేశారు. 
 
ఆరోజుల్లో భర్త అడుగుజాడల్లో నడవడమే భార్య విధి. జ్యోతి రావు పూలె సాంఫిక ఉద్యమ కారుడు, రచయిత, కుల వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించేవాడు. మహారాష్ట్ర సాంఘిక సంఘ సంస్కర్తల లో జ్యోతిరావు పేరు కూడా ప్రముఖంగా వినిపించేది. 
 
సావిత్రిబాయి పూలె విద్య ఆమె వివాహం తరువాత ప్రారంభమైంది. భర్త జ్యోతిరావు పూలె ప్రోద్భలం తో చదువు ప్రారంభించింది. అహ్మద్ నగర్ లోని శ్రీమతి ఫరాస్ సంస్థలో టీచర్ గా శిక్షణ తీసుకున్నారు. 
 
భర్త సాంఘిక కార్యక్రమంలో వెన్ను దన్నుగా నిలబడింది సావిత్రిబాయి పూలె.
 
మహిళా విద్య & సాధికారత!
 
1848 పూలె దంపతులు పూనె లో ఆడపిల్లల కోసం మొట్టమొదటి స్వదేశీ పాఠశాలను ప్రారంభించారు. 
 
ఆరోజుల్లో హిందూ మతం  స్త్రీలకు, అంటరాని ( ఎస్సి / ఎస్టీ ) వారికి విద్యను నిషేధించింది. ఒక వైపున  స్త్రీ దేవత అంటూనే మరోవైపున విద్యకు దూరంగా, అభివృద్ధి కి దూరంగా, చంచల స్వబావిరాలుగా, కపటిగా పరిగణిస్తూ అనేక ఆంక్షలు విధించి, బంధించారు. 
 
స్త్రీ కి స్వతంత్రం ఇస్తే , నలుగురిలో తిరగనిస్తే ఎక్కడ వివాహిత సంబంధాలు పెట్టుకుని గౌరవం పోగొడుతుందని ” న స్త్రీ స్వాతంత్ర మర్హతి ” అని శాసనం చేశారు. 
 
బ్రాహ్మణులు స్త్రీ చదువుకుంటే ఆమె భర్తకు అరిష్టం, ఆయువు తగ్గుతుందని ప్రచారం చేశారు. 
 
పాఠశాలను ప్రారంభించిన తరువాత సావిత్రిబాయి పూలె దంపతులను సమాజం నుండి బ్రాహ్మణులు వెలివేశారు. 
 
గ్రామ బహిష్కరణ కు గురైన సావిత్రిబాయి పూలె దంపతులకు  ఉస్మాన్ షేక్ మరియు అతని సోదరి ఫాతిమా షేక్ వారి ఇంటిలో ఆశ్రయం  ఇచ్చారు. 
 
అంతేకాకుండా పాతిమా షేక్ ఇంటి ఆవరణలోనే పాఠశాలను ప్రారంభించటానికి అవకావం కల్పించారు. సావిత్రిబాయి పూలె మొట్ట మొదటి ఉపాద్యాయరాలు గా మారేరు. 
 
తరువాత సావిత్రిబాయి పూలె దంపతులు మహర్ మరియు మాంగ్ అనే అంటరాని  కులం పిల్లల కోసం స్కూల్ ప్రారంభించారు.
 
1852 నాటికి  మొత్తం మూడు పాఠశాలను పూలె దంపతులు నడిపేవారు. 
 
నవంబరు 16, 1852 లో బ్రిటీష్ ప్రభుత్వం సావిత్రిబాయి పూలె దంపతులను, విద్యారంగంలో చేసిన సేవకు గుర్తింపు ఇచ్చి సన్మానించారు. 
 
అదే రోజు సావిత్రిబాయి పూలె అత్యుతమ ఉపాధ్యాయునిగా సత్కరింపబడింది. అదే సంవత్సరం సావిత్రిబాయి స్త్రీల హక్కులు మరియు ఇతర సాంఘిక సమస్యల గురించి అవగాహన కొరకు మహిళా మండలి స్థాపించారు. 
 
ఆరోజుల్లో బ్రాహ్మణులు వితంతువు లకు క్షవరం ( గుండు చేయించడం ) చేయించడం వ్యతిరేకించి బొంబాయి మరియు పూనే లో మంగలి వారితో సమ్మె నిర్వహించింది. 
 
సావిత్రిబాయి పూలె నడుపుతున్న మూడు స్కూల్స్ 1857 సిఫాయిల తిరుగుబాటు వలన జరిగిన సంఘటనల తో మూతపడిపోయాయి. 
 
ఆ తరువాత ఫాతిమా షేక్ తో కలిసి సావిత్రిబాయి  మొత్తం 18 పాఠశాలలు ప్రారంభించారు. 
 
అంటరాని వారికి చదువు చెప్పడం ప్రారంభిచారు. దీనిని పూనే లోని బ్రాహ్మణులు తీవ్రంగా వ్యతిరేకించారు. 
 
సావిత్రిబాయి పూలె , పాతిమా షేక్ లను ఎన్నోసార్లు బ్రాహ్మణులు అవమానించారు. వారి మీద రాళ్లు రువ్వడం, పేడ తో కొట్టడం లాంటివి చేశారు, ఎన్ని సార్లు బెదిరించినా వారు అట్టడుగు వర్గాల పిల్లలకు చదువు చెప్పడం మానలేదు. 
 
సావిత్రిబాయి పూలె బ్రాహ్మణ వర్గం చేస్తున్న దాడుల వలన ఎప్పుడూ ఒక చీరను తన వెంట  ఉంచుకునే వారు. 
 
సావిత్రిబాయి , ఫాతిమా షేక్ లకు తోడుగా సుగుణాబాయి చేరింది. సుగుణాబాయి ఆతరువాత మహిళా విద్యకోసం పాటుపడిన వ్యక్తిగా గొప్ప పేరుతెచ్చుకున్నారు. 
 
సావిత్రిబాయి దంపతులు రైతులు , ఇతర కూలి పనిచేసుకునే వారి కోసం ప్రత్యేకంగా రాత్రి బడిని ప్రారంభించారు. 
 
1863లో సావిత్రిబాయి  దంపతులు బాలహత్య ప్రతిబంధక్ గృహ ను స్థాపించారు. శిశు హత్యలను నివారించటానికి బారత దేశంలో ప్రారంభమైన మొట్టమొదటి కేంద్రం. 
 
వితంతు స్త్రీలు, పెళ్లి కాని వారు గర్భం దాలిస్తే వారిని చంపేసేవారు. అలాంటివారిని  చేరదీసి కాన్పు చేయించి పంపేవారు. 
 
1874 లో ఒక బ్రాహ్మణ వితంతువుకు పుట్టిన బిడ్డను సావిత్రిబాయి పూలె దంపతులు దత్తతు తీసుకుని సమాజానికి ఒక మెసేజ్ పంపేరు. ఆ పిల్లాడి పేరు యస్వంత్ రావు, ఆతరువాత యస్వంత్ రావు డాక్టర్ అయ్యేడు. 
 
బాలయ్య వివాహాలు అడ్డుకోవడమే కాకుండా వితంతు స్త్రీలకు తిరిగి పెళ్లి చేసేవారు. 
 
జ్యోతిరావు పూలె తో కలిసి ‘సెప్టెంబర్ 24, 1873 లో పూనే లో సత్య శోధక్ సమాజ్” ని స్థాపించారు. 
 
సావిత్రిబాయి పూలె మరణం!
 
జ్యోతిరావు పూలె మరణించిన తరువాత సత్యశోధక్ సమాజ్  బాధ్యతను కుమారుడు యస్వంత్ రావు కలిసి నిర్వహించారు. 
 
1897 లో మహారాష్ట్ర లో వచ్చిన కరువు మరియు దానివలన ప్రబలిన ప్లేగు వ్యాధి బారిన పడిన వారిని సత్యశోధక్ సమాజ్ కార్యాలయంలో కుమారుడు యస్వంత్ రావు తో వైద్యం చేయించేది. 
 
ఎక్కువుగా ప్లేగు వ్యాధి గ్రస్తులకు సేవ చెయ్యడం వలన మార్చి 10, 1897 లో సావిత్రిబాయి మరణించడం జరిగింది. 
 
లెగసీ!
 
సమాజం లోని దుష్ట సాంప్రదాయాలు , సంస్కృతి ని వ్యతిరేకించి ప్రజా సేవ చెయ్యడంలో సావిత్రిబాయి ఎనలేని కృషి చేసింది. ఆమె కృషికి ఫలితంగా 1998 లో పూనే మునిసిపల్ కార్పొరేషన్ వారు స్మారక స్తూపం నిర్మించారు. 
 
భారత ప్రభుత్వం మార్చి 10, 1983 నాడు స్టాంపును విడుదల చేశారు. పూనే విశ్వవిద్యాలయం పేరు 2015 లో సావిత్రిబాయి విశ్వవిద్యాలయం గా మార్చారు. 2017 లో  గూగుల్ డ్యూడ్యుల్  సావిత్రిబాయి పుట్టినరోజు సందర్బంగా ఆమె  ఫొటో పెట్టి సత్కరించుకున్నారు. 
 
 
(Visited 161 times, 1 visits today)
Also read  మదర్స్ డే:దళిత మాతృమూర్తులు

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!