సిబిఐ:రాజకీయ లబ్ది కోసమే సిబిఐ!

షేర్ చెయ్యండి
  • 69
    Shares

కేంద్రంలో ని బిజెపి ప్రభుత్వం ఇప్పటి వరకూ సిబిఐ ని ఉపయోగించి రాజకీయమే చేస్తుంది కానీ దేశం నుండి తరలి వెళ్లిన నల్ల డబ్బును తీసుకు రాలేకపోయింది.

లేదా దేశంలో జరుగుతున్న నల్ల వ్యాపారాన్ని, అవినీతిని అరికట్ట లేకపోయింది.

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అతి పెద్ద కేసు జగన్మోహన్ రెడ్డి కి సంబంధించిన కేసుల్లో కూడా ఏమీ చేయలేక పోయింది. కనీసం జగన్ ని నిర్దోషిగా కూడా ప్రకటించ కుండా గేమ్ ఆడుతుంది.

మూడు రాష్ట్రాల ఎన్నికల్లో బిఎస్పీ – కాంగ్రెస్ పొత్తు అనగానే బెహన్ జీ మాయావతి ని బెదిరించి పొత్తులు లేకుండా చేసుకున్నారు.

ఇక ఎస్పీ – బిఎస్పీ కలియక అనగానే అఖిలేష్ యాదవ్ మీద దాడి.

నిన్న బెంగాల్ లో కూడా రాజకీయ దాడినే చేశారు.

శారద చిట్ స్కామ్ ని దోషులను తెలుచుకుండా సిబిఐ గత 4 సంవత్సరాలుగా ఏమి చేస్తుంది? మోడీ ప్రభుత్వం గుడ్డి గాడిదకు పళ్ళు తోముతుందా?

Also read  సేలం రాజ్యలక్ష్మి హత్య: కులం ప్రాతిపదికన స్పందిస్తున్న మీడియా పౌర సమాజం!

దేశ వ్యాప్తంగా బిజెపి వ్యతిరేక రాజకీయ పక్షాలు పెరిగేకొద్దీ మోషా ప్రభుత్వం కి వణుకు పుట్టింది.

ఎన్నికలు ఇక రెండు నెలల్లో జరుగుతాయి అనగా ఏదో ఒక వివాదం చెయ్యాలి ఓట్లు తెచ్చుకోవాలి లేదా ప్రాంతీయ పార్టీల ను గ్రిప్ లో పెట్టుకోవాలనే మోడీ వ్యూహం.

తృణమూల్ కాంగ్రెస్ ని మీద సిబిఐ తో రాజకీయ దాడి చేస్తూ బిజెపి అవినీతి సెంటిమెంట్ ఓటును ఆకర్షించాలనే ప్రయత్నం చేస్తుంది.

తెలుగు రాష్ట్రాలలో సిబిఐ అనగానే మనకు గుర్తు వచ్చే అంశం డా. మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమం.

ఇందిరా గాంధీ సిబిఐ ద్వారా చెన్నారెడ్డి ని బెదిరించి ఆ ఉద్యమాన్ని నిర్వీర్యం చేసినట్లు వార్తలొచ్చాయి.

ఆ తర్వాత వై యెస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు వై యెస్ జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ ని ప్రయోగించారు.

సిబిఐ చరిత్ర చూస్తే రాజకీయ నేతల చేతిలో కీలుబొమ్మ లాగా ఉంది.

Also read  దళితులను మోసం చేస్తున్న ప్రకాశం జిల్లా వై. యెస్. ర్. సి పి!

ఇటీవల కాలంలో బిజెపి ప్రభుత్వం సిబిఐ తో ఫుడ్ బాల్ అడుకున్నారని చెప్పాలి.

స్వతంత్ర భారత దేశంలో రాజ్యాంగ వ్యవస్థలను ఇంతలా దిగజార్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మోడీ ప్రభుత్వం అనే చెప్పాలి.

కాంగ్రెస్ పార్టీ కంటే దిగజారి సిబిఐ ద్వారా రాజకీయాలు చెయ్యడం గమనార్హం.

తెలంగాణ లో కేసిర్ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టే తెలంగాణ మీద ఇప్పటి వరకూ సిబిఐ ని ప్రయోగించ లేదు.

చివరకు గుజరాత్ రాజ్యసభ కు జరిగిన ఎన్నికల్లో అక్కడి నేతలను కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు శివకుమార్ తమ రిసార్ట్ లో ఆశ్రయం కల్పించాడని అతని మీద కూడా సిబిఐ ని ప్రయోగించింది మోడీ ప్రభుత్వం.

ఆంధ్రప్రదేశ్ లో నాలుగు సంవత్సరాలు ప్రభుత్వం లో భాగస్వామ్యం గా ఉండి, ఐదో సంవత్సరం విడిపోయి తెలుగుదేశం నాయకులు మీద సిబిఐ, ఈ డి లను ప్రయోగించడం బిజెపి రాజ్యాంగ వ్యవస్థలను తమ స్వప్రయోజనాల కోసం ఎలా వాడేస్తుందో అర్ధం అవుతుంది.

Also read  Dalits outrage effects politics in Andhra Pradesh!

ఏది ఏమైనా రాజ్యాంగ వ్యవస్థలను రాజకీయ అవసరాల కొసం ఉపయోగించుకోవడం పులి మీద స్వారీ చెయ్యడం లాంటిదే.

బిజెపి కానీ లేదా ఏ ఇతర పార్టీలు కానీ పదవిలో ఉన్నత కాలం రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తే పదవి పోయిన తర్వాత తిరిగి వారినే మింగేస్తుంది.

భారత రాజ్యాంగ వ్యవస్థ లను ఏ శక్తి అయినా తమ చెప్పు చేతల్లో పెట్టుకోవాలని చూస్తే లొంగేది కాదు.

ప్రతి ఐదు సంవత్సరాలకు వచ్చే ఓటు అనే ఆయుధం అలాంటి శక్తులను తుడముట్టిస్తుంది.

అప్పటి వరకూ స్వారీ చేస్తున్నాం అనే భ్రమల్లో కాలం గడపాల్సిందే!

(Visited 48 times, 1 visits today)

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!