స్మార్ట్ ఫోన్ వినియోగంలో అమెరికాను మించిపోతున్న ఇండియా!

షేర్ చెయ్యండి
  • 35
    Shares


స్మార్ట్ ఫోన్ వినియోగం భారత దేశంలో పెరిగింది. అందుకే మొబైల్ తయారీదారులు చాలా మంది భారత్ వైపు చూస్తున్నారు. 

ప్రపంచంలో ఇంటర్నెట్ వినియోగంలో చైనా తర్వాత భారత దేశం రెండవ స్థానంలో ఉంది. ఆపిల్ లాంటి బ్రాండ్ లకు మన దేశం బంగారు ఖనిజ నిక్షేపం లాంటిది. 

ఇప్పుడు ఇప్పుడే మన దేశంలో ప్రజలు ఇంటర్నెట్ ఆధారత వ్యాపార లావాదేవీలకు మరియు బ్యాంకింగ్ వ్యవస్థలకు అలవాటు పడుతున్నారు. 

గత సర్వేల లెక్కలు ఒక్కసారి పరిశీలన చేస్తే, మొబైల్  ఫోన్ వినియోగదారులు భారత దేశంలో రోజు రోజుకూ పెరిగిపోతున్నారు అని చెబుతుంది. 

2015 లెక్కల ప్రకారం దేశంలో 199 మిల్లియన్ మంది ప్రజలు మొబైల్ ఫోన్ వాడుతున్నట్లు తెలుస్తుంది. 2017 కల్లా ఆసంఖ్య కు ఇంకో 100 మిలియన్ మంది చేరుకోగా 2019 నాటికి మొత్తం 340 మిలియన్ ప్రలు మొబలై వినియోగదారులు అవుతారు. 

మొత్తం సెల్ ఫోన్ వినియోగంలో 39 శాతం  భారతీయులే.  2022 సంవత్సరం నాటికి భారత దేశంలో స్మార్ట్ ఫోన్ వినియోగదారులు 442 మిలియన్స్ అయ్యే అవకాశం ఉంది. 

Also read  Lenovo Ideapad 330S Slimier & Lighter laptops

భారత దేశంలో ఇంటర్నెట్ వినియోగ ఖరీదు తగ్గేకొద్దీ వినియోగదారులు పెరుగుతూ పోతున్నారు. 4జి డిజిటల్ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఈ మధ్య కాలంలో
మొబైల్ ఫోన్ అమ్మకాలు జోరుగా పెరిగాయి. 

గత 2018 సంవత్సరంలో 150 మిలియన్ మంది మొబైల్ ఫోన్ వినియోగదారులు ఉన్నట్లు గా గణాంకాలు చెబుతున్నాయి. ఆ సంఖ్య 160 మిలియన్స్ కు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. 

130 కోట్ల మంది భారతీయులలో ఆ లెక్క పెద్దది కాదు. 2019 నాటికి 37. 4 కోట్ల మందికి స్మార్ట్ ఫోన్ చేరుకుంటుందని అని అంచనా, అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా 2.7 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్టున్నారు. 

ప్రపంచవ్యాప్తంగా చూస్తే స్మార్ట్ ఫోన్ వినియోగంలో భారతీయుల వాటా 13.8 శాతం అవుతుంది. 

అమెరికా లాంటి దేశాలను కాదని భారత దేశం స్మార్ట్ ఫోన్ వినియోగంలో రోజు రోజుకూ ముందుకు పోవడానికి కారణం చైనా నుండి వచ్చే తక్కువ ధర కల్గిన ఫోన్స్ వలన అని విశ్లేషకులు చెబుతున్నారు. స వినియోగంలో  భారత దేశం ఇంకొన్ని సంవత్సరాలలో భారత దేశం అమెరికా, చైనా లను దాటిపోయినా ఆచ్చర్య పడక్కర్లేదు. 

Also read  Infinix Note5 the Futuristic phone @9,999 Rs. only on Flipkart
(Visited 24 times, 1 visits today)

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!