About Us

నేటి జర్నలిజం హేతుబద్దమైన అభిప్రాయాలకు బదులు, హేతు విరుద్దమైన మనో వికారానికి చోటు కలిగిస్తుంది. బాద్యత కలిగినవారి ఆలోచనలను ప్రబావితం చేయడానికి బదులు, బాధ్యతా రహితములైన వారిని ఉద్రేక పరుస్తుంది: బాబాసాహెబ్ డా అంబేడ్కర్

నేటి జర్నలిజం కులం పునాదుల మీద, ప్రాంతీయ పార్టీల ఆఫీస్ ల నుండి ఎడిట్ చేసుకుని వస్తుంది. ఏ వర్గానికి ఆ వర్గం తమ వర్గ ప్రయోజనాలకోసం మాత్రమే జర్నలిజం అనే తొడుగు వేసుకుని పని చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో అసలైన వార్త విశ్లేషణ మరుగున పడుతుంది.

సత్యాలను వాస్తవాల నుండి గ్రహించాలి అంటాడు ఒక పెద్ద మనిషి.

చరిత్ర తెలియని వారు చరిత్ర నిర్మించలేరు అంటారు బాబాసాహెబ్ డా అంబేడ్కర్.

ఏదైనా ఒక సామజిక స్తితిని విశ్లేషణ చెయ్యాలి అంటే ఆ విశ్లేషకుడు ఆ సామజిక స్తితినుండి రావాల్సిందే లేదా అనుభవించాలి.అప్పుడే నిజమైన విశ్లేషణ బయటకు వస్తుంది.