పలాస 1978: పెత్తందారుల మీద తిరుబాటు చేసిన దళితల కధ 

0
265
Palasa 1978 review

పలాస 1978 సినిమా ఒక సంచలనం సృష్టించింది. చిత్ర నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవడం జరిగింది. ఇది దళితుల కధ అంటూ , దళితులే కథలో హీరోలు వాళ్ళే ఈ సినిమాను హిట్ చేసే బాధ్యత తీసుకోవాలని అనడం విమర్శలకు దారితీసింది   

కంచరపాలెం సినిమా చుసినప్పుడే అనుకున్నా ఉత్తర ఆంధ్రా లోపల మళ్ళీ ఏదో అసహనం తన్నకలాడతా వుందీ అని.ఐనా తూర్పు కొండల లో ఉదయించిన ఉద్యమం, ఆంద్రా లో ఎక్కడెక్కడో మూలల్లో రగిలించి విస్తరింప చెసుకుంది.ఈ విషయం అంత త్వరగా మరచిపోతా మా..!!! దాని ప్రభావం నా తరం 1973నుండీ చూస్తానే ఉంది.


ఒక తరం ఒక ఋతువులా వర్షించి ఒక కార్యరూపం ఎజెండా గా ముందుకు తెచ్చి వదిలింది. దాని కొనసాగింపుగానే ఇప్పటి పరిస్తితులు.పలాస 1978 మళ్ళీ ఊరికి దూరం గా నెట్టబడుతూనే ఉన్న ఒక అస్తిత్వం ని అడ్రస్ చేస్తా వుంది. ఇప్పటికీ అవే పరిస్తితులు వెనక బాటు కి కేరాఫ్ అడ్రస్ గా వున్న ఈ గెడ్డ లో వలస కార్మికులు ని ఎగుమతి చేసే ఓ అమాయక ప్రాంతం.


పలాస 1978 సినిమా ఇలా కూడా తీసి జనాలని మెప్పించ వచ్హు అని కంచర పాలెం సినిమా ఋజువు చేసింది. ఇప్పుడు తమ స్థానిక అంశాల మీద దృష్టి పెట్టి చెప్పాలని అనుకున్న విషయాన్ని సూటిగా చెప్పింది. స్వతహాగా నే చాలా తక్కువ విస్తృతి కలిగిన జీవన విధానం ,అక్కడే బతికి ,కష్టం అయినా నష్టం అ యినా ఉన్న ఊరిని అంటి పెట్టుకుని బతుకు బండిని తోసుకుపొయె నేపధ్యం నుండీ, తర తరాలుగా దోపిడి కి గురి అయ్యే తన జాతి ఒక అడుగు ముందుకు వేసి…దోపిడి చేసే వర్గం పక్కనే వుండీ ఎత్తుకు ,పై ఎత్తులు అర్దం చేసుకుంటూ సమైక్యంగా ఎదుర్కొనే క్రమం భాగా చూపించారు.

దోపిడీ చేసే వర్గం ఒక క్రమానుగతం గా వంతుల వారీగా అధికారం,రాజకీయం చేస్తానే వుంటాయి.ఆ అధికారం రావాలి అంటె,మళ్ళీ ఈ శ్రమజీవుల సంఖ్యా బలం,,కండ బలం కావలసినదే! ఆ నిజం ముందు నుండీ గుర్తెరిగి పావులు కడుపుతూ,,ప్రత్యర్డి ని ఎదుర్కొనే క్రమం లో ఒక్క రిద్దరు వ్యక్తుల తో కట్టడి చేసే వ్యవహారం కానే కాదు.


అవకాశం ఎప్పుడొ ఒకప్పుడు ప్రతి వ్యక్తి కీ కలసి వస్తుంది! కానీ ఇక్కడ మనిషే మిగలకుండా విద్వసం చేసినా! మనిషే లేని బతుకు ఎవరి కోసం?
అసలు ఈ విషయాలు,ఎత్తుగడలు,నిచ్హెన మెట్ల అంతరాలు తెలుసు కోటానికి వెలి వాడకు ఒక వంద నుండీ 500సంవత్సరాలు కావచ్హు ఏమో కానీ అది అంటరాని వసంతం పుస్థకం నుండీ ప్రతి ఊరి నైజం ని బేరీజు వేసుకుని చదువు కొవల్సిన ప్రాధమిక విద్య అవసరం ఇప్పుడు మొదలవ్వ వలసిన అంకం.

పలాస 1978 సినిమా లో దర్శకుడు కథ నడిపిన విధానం చాలా చక్కగా ఉంది. సహజంగా ఉండటానికి శ్రీకాకుళం జిల్లా యాస ను పూర్తి సినిమాలో పెట్టడం దర్శకుడు విజయం సాధించాడు. 
ఈ పలాస 1978 సినిమా లో నటించిన నటీనటులు అందరూ కొత్త వారు కావడంతో ఫ్రెష్ లుక్స్ తో బాగా చేసారు. సంగీత దర్శకుడు రఘు కుంచె అద్భుతమైన పాటలను , బ్యాక్ గ్రౌండ్ సంగీతం ఈ సినిమా కి హైలెట్ అని చెప్పొచ్చు. 


Anil Kumar ఫెస్ బుక్ వాల్ నుండి 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here