ఆత్మగౌరవానికి తోలి మెట్టు పెత్తందార్లాను బహిష్కరించడం!

0
229

మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలి. అందుకే దేవుడు మీద కానీ మహానుబావుల మీద కానీ ఆదారపడవద్దు:బాబాసాహెబ్ డా. బి ర్ అంబేడ్కర్.

1929 వ సంవత్సరం ఏప్రిల్ నెలాఖరులో జరిగిన రత్నగిరి జిల్లా నిమ్న జాతుల మహాసభకు అధ్యక్షత వహించిన బాబాసాహెబ్ డా బి ర్ అంబేడ్కర్” ఆత్మ గౌరవాన్ని కోల్పోయి ఇతరులపై ఆధారపడి జేవించే నీచమైన మనస్తత్వానికి నిమ్నజాతీయులు  స్వస్తి చెప్పాలి. తమ భానిస బంధాలను చేధించుకునేందుకు తామే స్వశక్తితో కృషి చెయ్యాలి. మానవుడికి ఆత్మగౌరవం కంటే విలువైనది మరొకటి లేదు, ఆత్మగౌరవం లేని వారు బండి సున్నా తో సమానం అంటారు.

బాబాసాహెబ్ ఈ మాట దళిత వర్గాలకు చెప్పి దాదాపు గా  తొమ్మిది దశాబ్దాలు కావొస్తుంది. ప్రతి ఏటా బాబాసాహెబ్ డా అంబేడ్కర్ జన్మదినం రోజున  దళితులు అయిన ఆశయాలు కొనసాగిస్తాం అని నినాదాలు చేస్తున్నారు, కానీ గ్రామాల్లో పెట్టందారులకు మాత్రం దాసోహం అవుతున్నారు.

గ్రామాల్లో కుల వివక్ష, కులపరమైన అణిచివేత ఆర్ధిక- రాజకీయ పెత్తనంతో సన్నిహితంగా ముడి పడి ఉంటాయని స్థూలంగా చెప్పవచ్చు.

గ్రామల్లో ఈ పెత్తనం ఎవరి చేతుల్లో ఉంటుదో మనం వేరే చెప్పకర్లేదు. గ్రామాల్లో పెట్టందారుడికి వర్గం కావలి, గ్రామాల్లోనే కాదు ప్రస్తుతం నగరాల్లో కుడా పరిణామక్రమం చెందిన ఈ పెత్తందారీకి ఒక వర్గం కావాలి. ఆ పెత్తం దారికి దళితుల మద్దత్తు కావలి. కాబట్టి గ్రామల్లో దళితులను రెండు వర్గాల గా చీలుస్తారు. ఈ రెండు వర్గాలకి వైరం పెడతారు. అవసరం అయితే పోలీసు స్టేషన్ లో కేసులకు డబ్బులు కుడా ఇస్తారు. ఈ విధంగా గ్రామల్లో ఒక పల్లె లో జీవించే దళితులు రెండు వర్గాలు గా జీవిస్తారు. కవి, రచియిత పైడి తెరేష్ బాబు తన ‘హిందూ మహాసముద్రం’ లో అన్నట్టుగా ‘సరిహద్దుకు అవతల ఉన్న వాళ్ళ మధ్య సరిహద్దులు గీస్తారు’  ఈ సరిహద్దుల వలన దళితుల ఐక్యత కి విఘాతం ఏర్పడుతుంది.

గ్రామాల్లో దళితుల మధ్య ఈ సరిహద్దుల వలన దళితులు గట్టు దాటి వచ్చే లోపల పెత్తందారి మళ్ళీ తానె పంచాయితీ లేదా తన కుల వ్యక్తినే ఎంన్నికల్లో నిలబెట్టి  అధికారం చేజిక్కించు కుంటారు.

గ్రామాల్లో పెత్తందారులు చేసే పనే దళితులు ఎందుకు చేసుకోకూడదు. ప్రతి దళిత కులం లోని వారికి కుల పెద్దలు ఉంటారు, ఈ కుల పెద్దల ద్వారా గ్రామల్లో సౌకర్యాలు మెరుగు పరుచుకోవచ్చు. ప్రజలు ఐక్యంగా ఉంటే ఉద్యమం విజయం సాధిస్తుంది. దళితులు తమ సమస్యల పరిక్షారం కోసం భుస్వామ్యుల వద్దకు వెళ్ళకుండా కొట్లాటలు కానీ, మహిళ ల తగాదాలు లేదా కుటుంబ కలహాలు తదిర విషయాలలో దళితులు భుస్వామ్యులు వద్దకు వెళ్ళకుండా తామే స్వతంత్త్రంగా తమ సమస్యలు తీర్చుకోవాలి.

అంతేకాకుండా ప్రబుత్వ సౌకర్యాల చదువుకున్న యువత పెత్తం దారుల పంచన చేరకుండా స్వతంత్రంగా, స్వచ్చందంగా ప్రజలకు సహకరిస్తే ఏ పెత్తందారి కుడా మన వైపు కన్నేత్తే సాహసం చెయ్యడు, వాడి పెత్తందారి తనం పోతుంది.

బాబాసాహెబ్ ఒక్కడే ఈ పెత్తం దారులను ధైర్యంగా ఎదుర్కొన్నారు. రత్నగిరి జిల్లా నిమ్నజాతీయుల సభలో బాబాసాహెబ్ ప్రజలను ఉద్దేశించి మాట్లడుతూ “నన్ను చంపుతామంటూ బెదిరిపు ఉత్తరాలు రాస్తున్నారు, ఒక్కొక్కసారి ఏదో ఒక మిషతో పోట్లాటకు దిగుతున్నారు, కానీ ఇలాంటి అడిరింపు లకు, బెదిరిపులకు జడిసి నా ప్రజలను, ఉద్యమాలను విడనాడే మనిషిని కానని శపథం చేస్తున్నాను. మనిషి అన్నవాడు ఎప్పుడో ఒకప్పుడు చావాల్సిందే కానీ  ‘బానిసగా మాత్రం’ నేను జీవించదలుకచుకోలేదు.

నేడు గ్రామాల్లోని దళిత పల్లెల్లో కనీసం 10వ చదివి కాస్తో కూస్తో రాజకీయ అవగాహన కలిగిన వారు ఒకరిద్దరు అయినా ఉంటారు, అలాగే ఇంకా ఉన్నతి చదువులు, ఉద్యోగం చేస్తున్నవారు ఉంటారు. రిజర్వేషన్లు ద్వారా విద్యా, ఉద్యోగం పొందిన వీరు కనీసం బాబాసాహెబ్ యొక్క ఆలోచనా విధానం నేర్చుకుని వారి సొంత గ్రామాల్లో అమలు పరచాలి. చదువుకున్న యువత వారి పల్లెను బానిస విముక్తి నుండి స్వేఛ్చ కలిపించాలి.

బాబాసాహెబ్ కమ్యూనల్ అవార్డ్ ద్వారా దళిత వర్గాలకు ఓటు హక్కు కలిపించేరు. ఈ ఓటు ద్వారా నే పెత్తందారులు దళితుల మీద పెత్తనం చేస్తున్నారు అని తెలుసు. అయినా ఆర్ధిక వేలుసు బాటు కోసం కులీ నాలీ చేసుకునే దళితులు పెత్తందారులకు కొమ్ము కాస్తున్నారు. ఈ బావజాలం నుండి మార్పు రాక పొతే ఇంకో ఏడు దశాబ్దాలు అయినా దళితుల రాజ్యాధికారం రాదు.

ఆర్ధికపరమైన ప్రయోజనాలకంటే ఆత్మగౌరవమే మానవులకు ముక్యం:బాబాసాహెబ్ డా అంబేడ్కర్. దళితులు తినకపోయినా, సరైన గృహ వసతి లేకపోయినా, కుల విక్ష ను సహించలేరు. కానీ గ్రామాల్లో ఈ పరిస్తితి కి కారణం చదువుకున్న యువతలో బాబాసాహెబ్ దృక్పధం లేకపోవడం లేదా ఉద్యోగస్తుల్లో తమ కమ్యునిటీ పట్ల బాద్యత లేకపోవడం.

“చైతన్య పరుచు, ఆందోళన సాగించు, సంఘటిత పరచు” బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ త్రికరణ సూత్రాలు అంబేడ్కరిస్ట్ లు మరిచిపోయేరు. నాలుగు గోడల మధ్య మేము అంబేడ్కర్ సిద్దాంతం లెక్చర్లు ఇస్తున్నాం అనుకునే మేధావులు, ప్రొఫెసర్స్ గ్రామాల బాట పట్టాలి. బాబాసాహెబ్ సంఘాలు విధిగా గ్రామాల్లో పని చెయ్యాలి. పెత్తందారుల నుండి దళిత ఆత్మగౌరం కాపాడక పొతే నగరాల్లో ఏ ఉద్యమం చేసినా నిష్ప్రయోజనం.

అంబేడ్కరిస్టులు గా 70 సంవత్సరాల నుండి చేస్తున్న ఉద్యమం దళిత ఓటు బ్యాంకు గా మార్చుకోలేక పొతే, “మీ గోడల మీద రాసుకోండి, మనం పాలకులం” కాబోతున్నం అన్న బాబాసాహెబ్ ఆశయాలు వదిలేసినట్లే.

ఇకనైనా దళిత సంఘాలలో, అంబేడ్కరిస్టులు అనబడే మేధావుల్లో మార్పు రాకపోతే అంబేద్కరిజాన్ని దళితులే తుంగలో తోక్కినట్లే.                                                                                                                                                                                                     

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here