కొవిడ్-19: రెక్కలు విరిగిన వలస బతుకులు 

0
217
కొవిడ్-19

కొవిడ్-19 కూడా ఉన్నోడు కి ఒక న్యాయం లేని వాడికి ఒక న్యాయం జరుగుతుంది భారతదేశం లో. భారతదేశంలో కొందరు మనుషులే కానట్టు మనువాదం చూసినా, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా గా ఏర్పడినప్పటి నుండి ప్రతి వ్యక్తి కి సమాన హక్కులు కల్పించారు నవభారత నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేడ్కర్. 


ఇప్పటి వరకూ భారతదేశంలో కరోనా వైరస్ 29,435 మందికి రాగా వారిలో 6,869 మంది కి కొవిడ్-19 నుండి విముక్తి చెందారు, 934 మంది చనిపోవడం జరిగింది. మార్చి 25 వ తేదీ నుండి మన దేశంలో లాక్ డౌన్ విధించారు. మొదట ఏప్రిల్ 14 వరకూ లాక్ డౌన్ విధించడం జరిగింది. 


మార్చి 25 కు ముందు ఒక్కరోజు ట్రయిల్ గా లాక్ డౌన్ చేసి ప్రజలను మానసికంగా సిద్ధం చేసింది కేంద్ర ప్రభుత్వం. 
కొవిడ్-19  వైరస్ ప్రభావం తెలియని , లాక్ డౌన్ పట్ల అవగాహన లేని చాలామంది తాము విధులు నిర్వహించే ప్రదేశంలో ఉండి పోవడం జరిగింది.

 
భారతదేశం లాంటి దేశం లో లాక్ డౌన్ అనేది ఊహించని పరిణామం. అకస్మాత్తుగా విమాన సర్వీసులు నుండి బస్సులు , రైళ్లు మరియు ఇతర రవాణా సౌకర్యం నిలిచిపోవడం జరిగింది. 


కొవిడ్-19 వైరస్ రైలు సర్వీస్ ను కూడా బంద్ చేస్తుందని ఎవరూ ఊహించని పరిణామం. ఉన్నట్టు ఉండి అన్నీ సర్వీసులు, పనులు, నిత్యావసర సరుకులు మరియు ఇతర సర్వీస్ లు బంద్ చెయ్యడం తో రోజు వారి కార్మికుల లలో , వలస కార్మికులలో అలజడి రేగింది. 


దేశ వ్యాప్తంగా బీహార్ , ఉత్తర ప్రదేశ్, బెంగాల్, ఒడిశా, మధ్యప్రదేశ్ , రాజస్థాన్ లాంటి రాష్ట్రాల నుండి వలస వెళ్లిన కూలీలు తమ స్వస్థలం వెళ్ళడానికి రోడ్ల మీదకు రావడం తో ఢిల్లీ , మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలలో పెద్ద ఎత్తున గందరగోళం ఏర్పడింది. 

ఢిల్లీ ప్రభుత్వం వలస కూలీలకు భోజన సౌకర్యాలు కల్పించినా వలస కూలీలు తమ స్వస్థలాలకు భారీ ఎత్తున వెళ్లడం ప్రారంభించారు. 
కరోనా వైరస్ లాక్ డౌన్ వలన లేదా వ్యక్తిగత దూరం పాటించడం వలన, లేదా వ్యక్తిగత శుభ్రత వలన తగ్గిపోతుందని ప్రభుత్వాలు భావించి ఆమేరకు ప్రకటనలు చేశారు. 


అసలు లాక్ డౌన్ ముందు కొవిడ్-19  వైరస్ ను ఎలా ఎదురుకోవాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ప్రణాళికలు లేవని ప్రజలకు అర్ధం అయింది. 
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ప్రజలకు కేజి బియ్యం , వెయ్యి రూపాయిలు డబ్బులు ఇస్తే సరిపోతుందని అనుకున్నారు. 


లాక్ డౌన్ వలన కరోనా వైరస్ ప్రబలకుండా కట్టడి చెయ్యగలం కానీ ఎంతమంది మంది కి కోవిడ్-19 వైరస్ సోకిందో చెప్పడం కష్టం. 
కోవిడ్-19 వైరస్ వ్యక్తులకు సోకిందా లేదా తెలుసుకునే ల్యాబరేటరీ లు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద లేవు. 

గాలి లో దీపం పెట్టినట్లు లాక్ డౌన్ చేసి ప్రజలను చప్పట్లు , లైట్లు వెలిగించండని ప్రధానమంత్రి కోరడం అంతటితో కరోనా వైరస్ అంతం అయినట్లు భావనలో ప్రజలు విజయోత్సవ ర్యాలీలు , దీపావళి చేసుకున్నారు. 


కరోనా వైరస్ ప్రభావం మరియు లాక్ డౌన్ నాణెం కు రెండో వైపు చూస్తే వలస కూలీలు, రోజు వారీ కార్మికుల జీవన విధానాన్ని తీవ్ర పరిణామాలకు గురిచేసింది. రోజు రోజుకు వలస కార్మికుల దుస్థితి అగమ్యగోచరంగా ఉండటంతో వారు తమ స్వస్థలాలకు పిల్ల, జెల్లా మూట, ముల్లె సర్దుకుని వేల కిలో మీటర్ల దూరం ప్రయాణించడం మొదలు పెట్టారు. 


వలస కూలీలు కొందరు రైలు మార్గం వెంబడి ప్రయాణం ప్రారంభిస్తే, మరికొందరు రోడ్డు దారిలో వేల మంది నడిచి వెళ్తున్న దృశ్యాలు ఇండియా – పాకిస్తాన్ విభజన ను గుర్తు చేసినట్లు అనేక మంది నిపుణులు, వార్త పత్రికలు, మీడియా అభిప్రాయపడ్డారు. 


కరోనా వైరస్ లాక్ డౌన్ దాదాపుగా 40 రోజులు గడువు విధించడం తో దిక్కు తోచక ఎందరో శ్రామిక వర్గాల జీవన స్థితి తీవ్రంగా నష్టానికి గురి చేసింది. వలస కూలీలు తిండికి లేక వెళ్లే దారిలో ఆత్మహత్య , ఆకలి చావులు చస్తుంటే , రోజు రోజుకూ విషమంగా మారుతున్న తమ పరిస్థితి చూసి కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. 


అమెరికా లో ఇప్పటి వరకూ 56,521 మంది చనిపోయినా అక్కడ ప్రజలు లాక్ డౌన్ ఎత్తి వేయాలని రోడ్ల మీద కు వచ్చి నిరసన చేస్తున్నారు. 
భారత దేశం లో ప్రతి సంవత్సరం మలేరియా బారిన పడి వేల మంది చనిపోతున్నారు. సరైన పౌష్ఠిక ఆహరం లేక చిన్న పిల్లలు కరోనా వైరస్ మరణాల రేటు కంటే ఎక్కువ మంది చనిపోతున్నారు. 


భారతదేశం కమ్యూనిటీ రోగాల ను ఎదుర్కోవడం కొత్త కాదు. మలేరియా లాంటివి ఎక్కువ శాతం అట్టడుగు వర్గాలకు మాత్రమే వచ్చే ఒక ప్రాణాంతక వ్యాధి. సంపన్నులకు వచ్చిన మరణాల రేటు 1 శాతం కూడా ఉండదు. 


కోవిడ్-19 వైరస్ వలన నష్టపోతున్న వ్యాపార, రైతు వర్గాలకే ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తున్నాయి కానీ  కూలి పనులు చేసుకుని బ్రతికే భారతీయుల పట్ల ప్రభుత్వాలు పూర్తి నిర్లక్ష్యం తో వ్యవహరిస్తున్నాయి. 


వలస కూలీలు గానీ లేదా పేద వర్గాల ప్రజలు ఈ దేశ ప్రజలే కానట్లు వాళ్ళను దాతల దయాదాక్షణలకు వదిలేసి అయిన వారికి ఉద్దీపన ప్రకటనలు , వ్యాపార అనుమతులు ఇస్తున్నారు. రైలు, రోడ్డు ప్రయాణాలకు అనుమతి లేకుండా  కరోనా వైరస్ వలన స్వస్థలాలకు  వెళ్లిన కార్మికులు / కూలీలు తిరిగి వచ్చే అవకాశం కనిపించడం లేదు. 


కేంద్ర ప్రభుత్వం ఇంటి నిర్మాణ పనులకు, గ్రామాల్లో ఉండే కర్మాగారాలు మరియు ఇతర నిత్యావసర వస్తువులు తయారీ పరిశ్రమలకు అనుమతి ఇచ్చినా రవాణా సౌకర్యం లేకపోవడం తో అనుకున్నంత ప్రభావం చూపించలేక పోయింది.

 
కేంద్ర ప్రభుత్వ MGNRES  కరువు పనులకు ప్రతి ఒక్కరికీ లేకపోవడం తో నగరాల నుండి, పట్టణాల నుండి స్వస్థలాలకు వెళ్లిన వారి కి MGNRES ఉపయోగపడటం లేదు. 


సహజంగానే భారత దేశం కుల ఆధిక్యతను ప్రదర్శించే దేశం. అయినవారికి సంపద దోచి పెట్టడం కాని వారికి  పప్పు బెల్లాలు పంచడం జరుగుతుంది. 


ఈ దేశ పాలకులు పేద, నిమ్న వర్గాల పట్ల సవతి ప్రేమ కనబరచడం వేల ఏళ్ళ తరబడి వస్తున్నదే. నిజం చెప్పాలంటే శ్రామిక కులాలు ఈ దేశానికి పట్టుకొమ్మలు లాంటి వారు. అలాంటి శ్రామిక కులాల పట్ల కరోనా వైరస్ మహమ్మారి సమయంలో కూడా వివక్ష పాటించడం ఈ దేశ ద్వంద నీతికి ఉదాహరణ. 


చాతుర్వర్ణ వ్యవస్థను గట్టిగా నమ్మే బిజెపి లాంటి పార్టి వలస కూలీల పట్ల దయ చూపెట్టాలనుకోవడం అత్యాసనే అవుతుంది. 
కొవిడ్-19 వైరస్ లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తివేస్తారో తెలియని పరిస్థితి. రోజు రోజుకూ తెలంగాణ , ఆంధ్రాలో పెరుగుతున్న పాజిటివ్ కేసులతో ఈ రోజుకూ వలస కూలీలు హైదరాబాద్ నుండి కాలి నడకన ఛతీస్ ఘడ్ లాంటి రాష్ట్రాలకు నడిచి వెళ్తున్నారు. 


ఒక వైపు రోజు రోజుకూ పెరుగుతున్న ఆర్ధిక భారం భవిషత్ ను కళ్ళకు గట్టినట్లు కనిపిస్తున్నా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీర్ లాంటి వారు బ్రతికి ఉంటే బలుసాకు తిని అయినా బ్రతుకుదాం అని చెప్పడం ఎవరి కోసం? 


కొవిడ్-19 లాక్ డౌన్ మే 3 తో ముగుస్తున్న గడువు, మరో వైపు ప్రజలను మరొకసారి లాక్ డౌన్ కు సిద్దపరుస్తున్న ప్రభుత్వాల ప్రకటనలతో పేద వర్గాల కడుపు  మీద పంజా విసిరినట్లు గా ఉంది. 


కొవిడ్-19 వైరస్ లాక్ డౌన్ యొక్క నియమ నిబంధనలు ప్రభుత్వం సవరించాలి. లాక్ డౌన్ పాక్షికంగా అమలు పరచి ప్రజలు ఆకలి చావులకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here