డా.కత్తి పద్మారావు-మనిషే మహా కావ్యం!

0
225
డా. కత్తి పద్మారావు
Dr.Kathi padmarao

డా.కత్తి పద్మారావు మనిషే మహా కావ్యం! ఆయనలో ఒక తత్వవేత్త ఉన్నాడు, నాస్తికుడు, ఉద్యమకారుడు ఉన్నాడు. కవి, రచియిత, అనర్గళంగా బహుబాషాల్లో మాట్లాడే మంచి ఉపన్యాసికుడు ఉన్నాడు. సమాజాన్ని తనదైన శైలిలో గొప్ప గా విశ్లేషణ చేయగల మేధావి, పొలిటికల్ థింకర్ కూడా ఉన్నాడు. ఒక మంచి ఆర్గనైజర్, క్రమశిక్షణ గల నాయకుడు. 


ఒక మనిషి లో ఇన్ని గుణాలు కల్గిఉండటం అంత సులువైన పని కాదు. ఎంతో శ్రమిస్తేగాని, ఎన్నో గంటలు సాధన చేస్తే గాని ఒక పనిలో నిష్ణాతులం గాలేము. అలాంటిది ఒకే మనిషి బహుముఖ ప్రజ్ఞాశీలి, దళిత వైతాళికుడు డా. కత్తి పద్మారావు. 


స్నేహితుడి భార్యను పరామర్శించడానికి చీరాల హాస్పిటల్ కు వచ్చినప్పుడు కారంచేడు ఘటన విని చూడటానికి వెళ్లి తల్లు లు , బిడ్డలు ఏకమై ఏడుస్తున్న హృదయవిధాయకరమైన పరిస్థితి ని చూసి, రక్తపు మడుగులో పడి ఉన్న శవాలు, పరిగెత్తి, పరిగెత్తి అలసి స్పృహ తప్పి పడిపోయిన వారు కళింగ యుద్ధం మరోసారి జరిగిందా అన్నట్లు గా ఉన్న ఆ పంట భూముల్లో పడి ఉన్న దళితులను చూసి, చలించి , అప్పటికప్పుడు నాయకుడిగా అవతరించి ఒక మహోజ్వల ఉద్యమాన్ని నడిపిన డా. కత్తి పద్మారావు గారు. 


కారంచేడు – ప్రపంచ అణగారిన వర్గాల పోరాటాల చరిత్రలో సరికొత్త అధ్యాయం సృటించిన ఒక గొప్ప ఉద్యమం గా చరిత్రకెక్కిన ఉద్యమం. అందుకు కారణం ఆంధ్రప్రదేశ్ దళిత మహా సభ , దాని నాయకుడు డా. కత్తి పద్మారావు. 
ఒక గ్రామాన్ని మొత్తాన్ని తరలించి విజయ నగర కాలనీ పేరుతొ కొత్త గ్రామాన్ని నిర్మించిన దార్శినికుడు ఆయన. ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం, పొలం నష్టపరిహారంగా ఇప్పించిన ఘనత ఆయనది. 


అంతే గాకుండా చుండూరు ప్రతిఘటన ఉద్యమంలో బాధితుల వద్దకే కోర్టు ను తీసుకు వచ్చి ప్రపంచ న్యాయ చరిత్రలో సరికొత్త విధానానికి పునాది వేసిన ఉద్యమ నాయకుడు డా. కత్తి పద్మారావు గారు. 


డా. కత్తి పద్మారావు గారి గురించి చెప్పాలంటే ఎవరెస్టు శిఖరం అంత చెప్పాలి. అందుకే ఆయనకు ఇటీవల డా.బి ర్ అంబేడ్కర్ – రమాబాయి చారిటబుల్ ట్రస్ట్ – ఒంగోలు వారు “దళిత ఉద్యమ శిఖరం ” పేరుతో అవార్డును ప్రకటించి ఘనంగా సత్కరించడమైనది. 


డా. కత్తి పద్మారావు గారు , ఇప్పటికే 77 పుస్తకాలు రచించారు, ఒక అస్పృశ్యుని యుద్ధ గాధ పేరుతొ తన జీవిత చరిత్రను తానే రాసుకుని మొదటి భాగాన్ని విడుదల చేశారు. లుంబినీ వనం ఒక పెద్ద లైబ్రరీ  వేల పుస్తకాలు ఆ ఇంటి నిండా ఉన్నాయి. లుంబినీ వనం పై అంతస్తు లైబ్రరీ కోసం కేటాయించారు. 


68 వ పుట్టిన రోజు జరుపుకుంటున్న డా.కత్తి పద్మారావు గారు, ప్రతి రోజు విధిగా తన విజిటింగ్ రూమ్ లో కి వచ్చి రోజు వచ్చే అనేక సంఘాల నాయకులతో , కార్యకర్తలతో , ఆత్మీయులతో మాట్లాడుతూనే ఉంటారు.  మధ్యాహన్నం ఉన్న వారికి వదినమ్మ చేత భోజనం వండించి తినిపించిగానీ పంపరు. అలా వదినమ్మ చేతి వంట తిన్న వేలమంది లో నేను కూడా ఒకడిని అని చెప్పడానికి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను.

 
నాయకుడంటే ఒక రాజకీయపార్టి కి ఉండే విలాసవంతమైన జీవితం కాదు. మూడు పూటలా పచ్చడి మెతుకులకు కూడా నోచుకోని అభాగ్యజీవుల కు నాయకుడు. అంటే తన జీవితం త్యాగమయం. 


అప్పటికే సంస్కృత ఉపాధ్యాయుడి గా ఉంటూ , ఉద్యమాన్ని బూజన వేసుకుని ముందుకు వెళ్లిన డా.కత్తి పద్మారావు గారు వెనక ముగ్గురు చిన్న పిల్లలు , భార్య ఉన్నారనే ఆలోచనే రాలేదు. ఆ కుటుంబం ఏమైపోతుందోనని భయపడలేదు. రోజుల తరబడి, నెలలు తరబడి ఇంటి మొహం చూడకుండా ఉద్యమాన్ని నడిపాడు. 


ఒకానొక సందర్భంలో కలిసినప్పుడు ఈ రోజుల్లో సాయంత్రం అయితే ఇంటికి వెళ్లాలనే నాయకులు ఉండటం వలన ఉద్యమాలు నిలబడటం లేదని తన అనుభవాన్ని చెప్పారు.


డా బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు తన కళ్ళముందే కుమారులు చనిపోతున్నా, అమ్మ రమాబాయి ప్రాధేయ పడినా ఆమెకు నచ్చజెప్పుకుని ఉద్యమాలు చేసాడు. డా.కత్తి పద్మారావు గారు కూడా  వదినమ్మ స్వర్ణ కుమారి గారిని ఒప్పించి పిల్లల ఆలనాపాలనా తన చేతిలో పెట్టి ఆంధ్రప్రదేశ్ దళిత మహా సభ ను నిర్మించి ఈ రోజు ఎస్సి , ఎస్టి ల వైపు కన్నెతి చూడాలంటే భయపడే విధంగా ఎస్సి , ఎస్టి అత్యాచార నిరోధక చట్టం -1989 కు రూపకల్పన చేసిన దళిత ఉద్యమ శిఖరం అయన. 

డా.కత్తి పద్మారావు గారు ఒక ఉద్యమ నాయకుడు గానే మనకు బాగా పరిచయం. అయన మంచి వ్యక్తిత్వ వికాస నిపుడు కూడా అని చెప్పడానికి ఎలాంటి సందేహించవల్సిన అవసరం లేదు. కుటుంబ వ్యవస్థపట్ల ఎంతో దృడమైన విశ్వాసం గల వ్యక్తి. తన తల్లిని ఎంతగా ప్రేమిస్తాడో,  ఎన్నిసార్లు తన ప్రసంగాల్లో చెబుతాడో అన్నిసార్లు తన భార్య గురించి మాట్లాడతాడు. భార్య భర్తలు ఎలా ఉండాలో చెబుతారు. జేబులో పెన్ను – రాసుకోవడాని  కనీసం పేపరైనా ఉండాలని చెబుతాడు. 


నేటి కాలంలో డా బాబాసాహెబ్ అంబేడ్కర్ వలన బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు చేస్తున్న దళితులు పల్లె మొహాలు చూడటంలేదని ఆవేదన చెందుతాడు. అంతే కాకుండా తాగుడు కు బానిసై పోతున్న ఉద్యోగస్తులను చూసి విలవిలాడి పోతాడు డా. కత్తి పద్మారావు గారు. 


దళితులంటే మహా ప్రేమ మూర్తులని, వారియర్స్ రేస్ అయినా ఇప్పటివరకు భూమి కోసం గాని లేదా ఇతర సామజిక అవసరాల కోసం ఒక మనిషిని కూడా హత్య చేయనటువంటి ప్రేమ, కరుణ గల వారని అభివర్ణింస్తారు. 
డా. కత్తి పద్మారావు గారు జులై 27 1953 గుంటూరు జిల్లా లో జన్మించారు. ఇప్పటి వరకూ అయనను వరించిన అనేక పురస్కారాలలో కొన్ని 

అంతే కాకుండా ప్రజలు, ఆయన అభిమానులు, శిష్యు లు  మహా మహోపాధ్యాయ , అభినవ అంబేడ్కర్ , మహా వక్త, దళిత ఉద్యమ శిఖరం లాంటి ఎన్నో అవార్డు లతో ఆయనను సత్కరించారు. 
డా.కత్తి పద్మారావు గారి కి జన్మదిన శుభాకాంక్షలు. జై భీం 


Team:The EDITOR TIMES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here