నేనొక అంతర్జాల పోకిరీని

0
114

ఆ మధ్య ప్రదాని మోడీ టిట్ట్వర్ ఖాతా ను అనుసరించే వారి జాబితా మీద అలాగే ప్రదాన మంత్రి అనుసరించే జాబితా మీద పెద్ద చర్చ జరిగింది. సాక్షాత్ దేశ నాయకుడు అయిన ప్రదాన మంత్రి మత విద్వేషాలను , కుల విద్వేషాలను రెచ్చగొట్టే పోకిరీలను అనుసరించడం పెద్ద దుమారాన్ని లేపింది.

విద్వేష పూరితమైన ట్వీట్ లు చేసి వ్యక్తుల ప్రాణాలకు ముప్పుకలిగించే లా లేదా మత కలహాలకు దారితీసే విధంగా ప్రవర్తించే వారిని ప్రదాన మంత్రి అనుసరించడం మరియు ఈ విద్వేషన్ని రగిలిస్తున్న ముటా గుట్టు రట్టు చెయ్యడానికి స్వాతి చేతుర్వేది తన క్రిమినల్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ద్వారా సోదించి  అదిరిపడే వాస్తవాలు తెర పైకి తీసుకువచ్చారు.

తెల్లారి లేఛి చుస్తే చాలు నా ట్విత్తార్ ఖాతాలో వందలాది అసబ్యకరమైన, అబ్యాంతరకరమైన నోటిఫికేషన్లు దర్శనమిస్తుంటాయి. రాత్రికి నా రేటు గురించి,రాత్రిపూట రాతి రహస్యాల గురించి, అత్యంత అసబ్యకరమైన రీతిలో నన్నొక కామపిచాచిలా చిత్రీకరిస్తూ సందేశాలు పెడుతున్నారు. ఇరువై ఒక్కేండ్ల నా వ్రుత్తి ధర్మాన్ని చిదిమేసి సామాజిక మాధ్యమంలో నన్నొక బజారు ఆడదానిలా చిత్రీకరించటానికి ప్రయత్నిస్తున్నారు.

పై మాటలు అన్నది “నేనొక అంతర్జాల పోకిరినీ” పుస్తక రచియిత సీనియర్ జర్నలిస్ట్ స్వాతి చతుర్వేది. ఆరు నెలలు తను మనోవేదన పది పోలీసులకు పిర్యాదు చేస్తే జాతీయ, అంతర్జాతీయ స్తాయిలో పెద్ద చర్చ జరిగింది. తనకి విశేష స్పందన వచ్చింది. కేసు రిజిస్టర్ చేసేరు. కానీ నేటికీ అతనిని అరెస్ట్ చెయ్యలేదు.ఎందుకటే అతనికి బా జ పా ప్రబుత్వ పెద్దల అండదండలు ఉన్నాయి.

ఈ అంతర్జాల పోకిరీలు అసబ్యకరమైన చిత్రాలు,అబ్య్నతర కరమైన నిర్లిప్త రాతలతో తెగబడుతుంటారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే వీళ్ళంతా అంతర్జాల గుండాలు అంటారు స్వాతి చతుర్వేది. ఈ అంతర్జాల పోకిరీలను మొదట తయారు చేసింది బా జ పా నే. 2014లో వీరి గెలుపు ఈ పోకిరీలు సోషల్ మీడియా లో చేసిన ప్రచారం. వీరు మితవాద హిందుత్వ, సుడో దేశ బక్తి బావజలనికి సంబధించిన వ్యక్తులు. వీరు బారతీయ జనతా పార్టీ మీద కానీ లేదా మోడీ ప్రబుత్వం మీద కానీ లేదా హిందూ జాతీయ వాదం మీద సహేతుకమైన విమర్శ చేసేరు అంటే ఇక వారి పని పట్టడమే. సహజంగా ఈ అంతర్జాల గుండాల ప్రొఫైల్ ఫోటో లు హిందూ దేవుళ్ళ ఫోటో లతో ఉంటాయి, లేదా యువతను ఆకర్షించటానికి అందమైన యువతి బొమ్మలు పెడుతుంటారు. ఉదాహరణకు ట్విట్టర్ లో “పోనమ్” పేరుతొ బికినీ బొమ్మ ముఖచిత్రం గల ఒక ఖాతా ఉంది. ఈ ఖాతా నుండి ఎప్పుడు చూసినా ముస్లిం లను ద్వేషిస్తూ, బూతులు తిడుతూ ట్వీట్ లు వస్తూ ఉంటాయి. ఇలాంటి ఖాతాలకు ఊరు, పేరు ఉండదు. ఫేక్ ఖాతాలు.

హేతువాద, లౌకిక బావలు గల హై ప్రొఫైల్ ఖాతా ల మీద ఈ పోకీరీల దాడి ఎక్కువగా ఉంటుంది. ఈ దాడి పచ్చి బూతులతో, పోర్న్ పోటో లు పంపిస్తూ , అత్యంత అసబ్యాకరమైన పదజాలం వాడుతూ వారి ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా మెసేజ్ లు పంపిస్తారు. ముక్యంగా BJP ని లేదా వారి సుడో హిందూ జాతీయ వాదం మీద విమర్శ చేసే వారినే వీరు టార్గెట్ గా ఎంచు కుంటారు. అవసరం అయితే వీరి మొబైల్ నంబర్ ని వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేసి అసబ్య పదజాలంతో దూషించే విధంగా ప్రేరేపిస్తారు. సెక్యులర్ బావజాలం గలవారిని సిక్యులర్ (రోగగ్రస్తులు) అంటూ మీడియా లో పనిచేసేవారి ని “మీడియా వ్యభిచారులు” అంటూ సంబోధించడం వీరికి చాల సులువైన పని.

సోషల్ మీడియా లో ఉన్న కామన్ మ్యాన్ కి రియాలిటీ తెలియదు. పోకిరీల బావజలన్ని తెలిసో తెలియక వారు కుడా ప్రచారం కల్పిస్తూ ఉంటారు. నిజం అని నమ్ముతారు. ఇప్పటివరకూ చాల మంది కామన్ మ్యాన్ కి సోషల్ మీడియా లో “ఫేక్ అకౌంట్” లు ఉంటాయి అని తెలియదు.  

2015 లో సెప్టంబర్ లో అక్లాక్ అనే వ్యక్తి అంతర్జాల పోకిరీలు చేసిన తప్పుడు ప్రచారం ద్వారా నే చంపబడ్డాడు అంటే ఎవరైనా నమ్ముతారా? మహ్మద్ అక్లాక్ అనే వ్యక్తి గోమామసం కలిగి ఉన్నాడు అని ఫేక్ ఫోటోలు పెట్టి ట్విట్టర్లో ప్రచారం చేసేరు. ఆ తర్వాతనే అతని మీద దాడి చెయ్యడం జరిగింది. ఇదంతా ఒక చైన్ వ్యాపారం లాగా జరుగుతుంది.

ఈ అంతర్జాల పోకిరీలు చదువుసంధ్య లేని వారు అనుకోవద్దు. వీరిలో చాల మంది ప్రముఖులు కుడా ఉన్నారు. బాలివుడ్ నేపధ్య గాయకుడు అభిజిత్ లాంటి వారు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహవాగ్ లాంటి వారు కుడా మాటల ద్వారా ప్రజలను రెచ్చగొట్టే, విద్వేషాలు పెంచే ప్రయత్నం చేస్తుంటారు.

2016 హోలీ రోజున డిల్లీ లో డాక్టర్ పంకజ్ నారంగ్ హత్యోదంతాన్ని తీసుకోండి. రాహుల్ రాజ్ పేరుగల ఆతను తన ట్విట్టర్ ఖాతా ప్రభక్ – సాలా  ద్వారా డా. నారంగ్ ను ముస్లిం లు చంపేసేరు అని ప్రచారం చేసేరు. ఇతని ఖాతాను 77 వేల మంది అనుసరిస్తారు ప్రదాని మోడీ కుడా ఇతని ఖాతా ను అనుసరిస్తాడు.  అతను చేసిన ప్రచారం ద్వారా డిల్లీ లో మత విద్వేషాలు, అల్లర్లు జరిగే లోపల డిల్లీ పోలీసులు అలెర్ట్ అయ్యి మీడియా ద్వారా అలాంటి హత్య జరగలేదు అని ప్రకటన చెయ్యవలసి వచ్చింది. అసలు ఎవరీ ప్రబక్ – సాలా అంటే ఇతను బెంగుళూరు లోని ప్రముఖ ఫర్మా కంపెనీ నోవరర్టీస్ లో మేనేజర్ గా  పని చేస్తున్నాడు. మితవాద హిందూ బావాజలం ప్రచారం చేసే “ఓపి ఇండియా “ వెబ్సైట్ నడిపేది కుడా ఇతనే.

 ఈ అంతర్జాల పోకిరీల మీద కేసులు ఉండవా అంటే, ఉండనే ఉండవు. వీరంతా బా జ పా కి వీర విధేయులు. స్వాతీ చతుర్వేది ని అత్యంత అవమానకరంగా దూషించిన వారి మీద కేసు పెడితే ఇప్పటికీ దోషులను అరెస్ట్ చెయ్యలేదు. కేంద్ర మంత్రి మేనకా గాంధీ ఇలాంటి అంతర్జాల పోకిరీల మీద ఒక చట్టం తీసుకు వస్తాం అని ప్రకటించి చేతులు దులుపుకున్నారు. అలాగే 2015లో అక్లాక్ హత్యకు ప్రేరేపించిన ట్విట్టర్ ఖాతా దారుడి మీద గాని, 2016 డిల్లీ లో అల్లర్లకు ప్రేరేపించిన నోవర్టీస్ ఉద్యోగి రాహుల్ రాజ్ మీద కానీ ఇప్పటి వరకూ ఎలాంటి కేసు నమోదు కాలేదు.

2009 లో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్కూల్ విద్యార్ధిని పై కులం పేరుతొ అసబ్యంగా తన పేస్ బుక్ ఖాతా లో రాసిన ఒక ఉపాద్యాయుడు అతనికి సపోర్ట్ చేసి స్లండాగ్ లకు క్యాస్త్రేషన్ చేయించాలి అని చర్చ చేసిన అతని మిత్ర బృందం పై న కేసు పెట్డం జరిగింది. సోషల్ మీడియాలో అదే మొదటి కేసు. మీడియా లో కుడా ప్రముఖంగా చర్చకు వచ్చింది. ఆతర్వాత కులం, మతం, రిజర్వేషన్లు మీద ఆ వర్గాల నాయకులు, ప్రజల మీద అసబ్య పదజాలం తో దుషిస్తూ ప్రజలను రెచ్చగొడుతున్న నెల్లూరు జిల్లాకి చెందిన ఒక వ్యక్తీ ని అరెస్ట్ చెయ్యడం జరిగింది. వీరంతా అతివాద హిందూ బావజాలం కలిగిన వ్యక్తులే.

పేస్ బుక్ ఖాతా లో లెక్కలేనన్ని దొంగ ఖాతా లు. మహిళ ల పై విరుచుకు పడుతూ వారి మీద తప్పుడు ప్రచారం చేస్తుంటారు. ఇక్కడ ఇంకొక ప్రముఖ విషయం ఏంటంటే స్నేహంగా ఉంటూనే వారి వ్యక్తిగత విషయాలు తెలుసుకుని, తమ అభిప్రాయాలకు సపోర్ట్ చెయ్యడం లేదని ఫేక్ ఖాతా ద్వారా తన స్నేహితురాలి వ్యక్తిగతం పోస్ట్ లు ద్వారా ప్రచారం చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు.

ఈ అంతర్జాల పోకిరీలు ఇప్పుడు వ్యక్తిగత స్తాయిలో , గ్రూపులు గా కుడా ఉన్నారు. ఈ బావజాలం ఇప్పుడు, ఇప్పుడే మిగతా వర్గాల ప్రజలను ఆకర్షిస్తుంది. వారు కుడా కౌంటర్ మెసేజ్ కోసం ఫేక్ ఖాతా లను తెరుస్తున్నారు.

ఈ అంతర్జాల పోకిరీల వలన దేశం నిట్టనిలువునా చీలే ప్రమాదం ఉందంటే అతిశయోక్తి కాదు, అది జరిగినా జరగవచ్చు బా జ పా , అతి వాద హిందుత్వ బావజాలం కలిగిన సంస్తలు తాయారు చేసిన ఈ పోకీరీల గుంపు మంత్రుల దగర నుండి వివధ కేడర్ లో పనిచెవారి వరకూ వాడే బాష సబ్య సమాజం తల దించుకోవాలి. బి ఎస్పీ అధినేత్రి కుమారి మాయావతి గారి ఉద్దేశించి BJP ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్   “వ్యభిచారి కన్నా హీనం” అన్న మాట    వుపయోగించేడు అంటే వారి యొక్క నైతిక స్తితి అధికారం కోసం, మత విద్వేషాలను, కులాలను రెచ్చగొట్టి వారిని డిఫెన్స్ లో పడేయటానికి, ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా చెయ్యడానికి అంతర్జాలాన్ని ఉపయోగిస్తున్నారు. ఇది ఖచితంగా దేశ అస్తిత్వం దెబ్బతీసే పని. దేశంలో అంతర్ యుద్దాలకు దారితీసినా అచ్చర్యపడక్కర్లేదు.

రిఫెరేన్స్ : స్వాతి చతుర్వేది ‘ నేనొక అంతర్జాల పోకిరీని’ పుస్తకం ఆధారంగా  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here