దళిత సాహిత్యానికి బాబాసాహెబ్ డా అంబేడ్కర్ జీవితం

0
110
Reservations

దళితులకు “మార్గము, సత్యము, జీవము” బాబాసాహెబ్ డా అంబేడ్కర్. దళిత ఉద్యమ నిర్మాత మరియు  “భోధించు, పోరాడు, సమీకరించు” అనే త్రికరణ సూత్రాలతో దళితులకు స్పూర్తి నింపిన వ్యక్తి. బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ గొప్ప  మేధావి, రచియిత, ఉద్యమకారుడు, పబ్లిషర్ ఇలా ఒకటి కాదు రెండు కాదు ఈ దేశంలోని కోట్లాదిమంది ప్రజల చైతన్యం కోసం ఉదయించిన సూర్యుడు.

దళిత సాహిత్యానికి బాబాసాహెబ్ డా అంబేడ్కర్ జీవితం, ఉద్యమ చరిత్ర, తత్త్వం ప్రేరణ. దళిత ప్రజలకు బాబాసాహెబ్ డా అంబేడ్కర్ ఇచ్చినంత ప్రేరణ మరే నాయకుడు ఇవ్వలేదు అంటే అతియోశక్తి కాదు. ప్రముఖ దళిత సాహిత్యవేత్త శరణకుమార్ లింబాలే దళిత సాహిత్యం గురించి ఈ విధంగా అంటారు. “దళిత సాహిత్యం విప్లవాత్మకమైనది, మరియు పరివర్తనం చెందుతూ ఉంటుంది. దళిత రచియితలుపై సోషలిజం మరియు మార్క్సిజం బావజాలం ఉంది. దళిత రచియితలు కులాన్ని చాలెంజ్ చెయ్యడం ద్వారా వారిలోని ఈ విప్లవాత్మక తిరుగుబాటు వలన వారిని విప్లవాత్మకం అన్నమే కానీ అసలు వాళ్ళక్ స్పూర్తి బాబాసాహెబ్ కుల నిర్మూలన పోరాటమే.”

స్వంత పరిపాలన జేసేద్దమంటారు

చెంతకు మము జేర నీరు,

స్వరాజ్య మనుచు సర్కారుతో పోరాడి

 స్వాతంత్రము మడుగుతారు

మాకు స్వతంత్రమియ్యమంటారు

మాకు హక్కు లేదంటే స్వరాజ్య మెక్కడ దక్కు ….

మాకు హిందుసంగము నందు

స్వాతంత్ర్య మాగు వరకు

మాకొద్దీ నల్లదోరతనము.

అంటూ కుసుమ ధర్మన్న(1900-1946) ఈ దేశంలోని కుల వ్యవస్థకు వ్యతిరేకంగా రాసిన “మాకొద్దీ నల్ల దొరతనం” తెలుగు లో మొట్ట మొదటి దళిత కవిత్వం గా, కుసుమ ధర్మన్న  మొట్టమొదటి కవి గా చెప్పుకోవచ్చు.  ఆ తర్వాత వచ్చిన వారిలో బోయి భీమన్న సాక్షాత్తు బాబాసాహెబ్ డా అంబేడ్కర్ పేరును తన కవితల లో స్పూర్తిగా నింపేరు. “‘దళిత జనులకంబేడ్కరు, ధర్మమె మతమన్నాడు, బౌద్ధధర్మమొకటేరా, భారతీయమన్నాడు’ అలాగే ఇంకొక రచన లో “దళితులనుద్ధరించని ధర్మం కుంటిదంటూ” ఈ దేశపు సనాతన ధర్మం మీద తన నిరసన ప్రకటించేడు. బోయి భీమన్న బాబాసాహెబ్ డా అంబేడ్కర్ కుల నిర్మూలన సిద్దాంతం ప్రేరణ గా “పాలేరు” (1938) నాటకాన్ని రాసేరు. అగకుల భూస్వామి కూతురు ని ఆ భూస్వామి కుబెరయ్య  ఇంటిలో పని చేసే పాలేరు వెంకన్న ఎన్నిబాదలు పడాలో అన్ని బాధలు, అగ్ర కుల దౌర్జన్యాన్ని ఈ రెండు పాత్రల ద్వారా కళ్ళకు కట్టినట్టు రాసేరు. బోయి భీమన్న కవి తన “రాగవసిష్టం” నాటికం లో అరుంధతి, వసిష్టుల ప్రేమ గాధ లో కూడా కులాంతర వివాహాల గురించి రాస్తూ పరోక్షంగా కుల నిర్మూలన యొక్క విసిస్టత వ్యక్తపరుస్తూ వచ్చేరు. భారత్‌లో వర్గపద్ధతి (ఛిజ్చూటట) లేదు. వర్ణవ్యవస్థ అంటే కుల వ్యవస్థ (ఛ్చిట్ట టడట్ట్ఛఝ) వుంది. ఇక్కడ కూలీలంతా అభ్యుదయం సాధించాలంటే ముందుగా అంటరానితనాన్ని తొలగించాలి’ అన్నాడు.

“ఆ యభాగ్యుని రక్తంబు నావరించి

ఇనుప గజ్జెల తల్లి జీవనము సేయు

కసిరి బుసగొట్టు నాతని  గాలిసోక

నాలుగు పడవల హైందవ నాగరాజు”

గుర్రం జాషువా, హైందవ విష సర్పం దళితుల జీవితాలను ఏవిధంగా కాటు వేస్తుందో చెప్పేరు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here