ఆంధ్రప్రదేశ్ ప్రత్యెక హోదా పోరు రాజకీయం కోసమే!

0
92

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం రెండుగా విభజన చేసినప్పుడు పార్లమెంట్ సాక్షిగా వినిపించిన మాట ‘ప్రత్యెక హోదా’ ముక్యంగా నేటి పాలక పక్షం తెలుగు దేశం , బా జ పా 2014 ఎన్నికల సమయంలో ఆంద్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన హామీ ప్రత్యెక హోదా! ఐదు కాదు, పది సంవత్సరాలు కావాలి అన్నది కుడా నేటి పాలక పక్షమే. ఇంకా చెప్పాలి అంటే తిరుపతి ఎన్నికల సభలో నేటి ప్రదాని సాక్షిగా ముఖ్యమంత్రి పది సంవత్సరాలు చాలదు పదహైదు సంవత్సరాలు కావాలి అన్నాడు. ఎన్నికలు అయిపోయాయి, మాట మారింది. ప్రత్యెక హోదా ఏమీ సర్వరోగ నివారిణి కాదు అన్నారు, ప్యాకేజీ ముద్దు అన్నారు. ఇక అనుచరగణం అయితే ఒకటే ఊకదంపుడు ప్యాకేజీ తో ఆంధ్ర ప్రదేశ్ వెలిగిపోతుంది అన్నారు. ఒక మంత్రి అయితే అయిన ప్రమాణ స్వీకారం చేసిన సంవత్సరంలోనే లక్షల్లో ఉద్యోగాలు కల్పించెను అని ప్రకటించుకున్నాడు.

మళ్ళీ ఎన్నికల సమయం వచ్చింది. కొత్త నాటకానికి తెర లేసింది. ఒకరు జాక్ అంటున్నారు, ఒకరు పార్లమెంట్ సబ్యులు రాజినామా అంటున్నారు, ఇంకొకరు వారికంటే ముందే మేము సిద్దం అంటున్నారు. ప్రబుత్వ పెద్దలు చూసి, చూడనట్లు పోదాం అంటున్నారు.

అసలు ప్రత్యెక హోదా అంటే ఏంటి?

1969 లో ఐదవ ఫైనాన్స్ సంఘం అస్సాం, జమ్ము & కాశ్మీర్ మరియు నాగాలాండ్ కి ప్రత్యేక ఆర్ధిక సదుపాయాలు అంటే కేంద్ర ప్రబుత్వ సహాయం మరియు పన్నుల్లో రిబేట్ కల్పించింది.  జాతీయ అభివృది మండలి (National Development Counsel) ఏదైనా రాష్ట్రానికి ప్రత్యెక హోదా కల్పించటానికి కొన్ని మార్గదర్సకాలు నిర్ణయించింది.

సరైన రహదారులు లేని కొండ ప్రాంతం

తక్కువ జనాభా లేదా గిరిజన ప్రాంతం

అత్యంత కీలకమైన సరిహద్దు రాష్ట్రాలు

ఆర్ధిక మరియు కనీస సదుపాయాల లో వెనకబడిన రాష్ట్రం

ఆర్ధిక స్తోమత లేని రాష్ట్రం

ఈ ఐదు నిబందనలు గల రాష్ట్రాలకు ప్రత్యెక సదుపాయాలు కల్పిస్తూ కేంద్రం తన ఆర్ధిక సహాయంలో 30% ప్రత్యెక హోదా రాష్ట్రానికి మిగతా 70% రాష్ట్రాల జనాభ ఆధారంగా పంచుతుంది. ప్రత్యెక హోదా ఉన్న రాష్ట్రాలు కేంద్ర ఎక్సైజ్ పన్ను , ఆదాయ పన్ను మరియు కస్టమ్స్ పన్ను లో రాయితీ కల్పిస్తుంది. అలాగే ఎక్కువగా కేంద్ర ప్రబుత్వ పధకాలు, ఏదైనా ప్రత్యెక ప్రాజెక్ట్ లు ప్రత్యెక హోదా వలన కేంద్రం ఇస్తుంది. కేంద్రం ప్రకటించే ప్రత్యెక పనుల్లో 10 శాతం మాత్రమె రాష్ట్రం భరిస్తుంది మిగతా 90శాతం కేంద్రమే ఖర్చు చేస్తుంది.

ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యెక హోదా.

ప్రత్యెక తెలంగాణా రాష్ట్రం ఏర్పడే రోజున ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధిక లోటు తీర్చటానికి ఆనాటి UPA ప్రబుత్వం ఆంధ్ర ప్రదేశ్ కి ఐదు సంవత్సరాలు ప్రత్యెక హోదా కల్పిస్తాము అని ప్రదాని మన్మోహన్ సింగ్ పార్లమెంట్ లో ప్రకటన చేసేరు.దీనిపై చర్చలో పాల్గొన్న ఆనాటి రాజ్యసభ లో ప్రతిపక్ష నాయకుడు బా జ పా సబ్యుడు, నేటి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఐదు సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కావలి అని కేంద్ర ప్రబుత్వాన్ని బ్రతిమిలాడటం ఆనాడు మీడియాలో ప్రముఖంగా వచ్చింది. రూ 70 వేల కోట్లు రెవెన్యు వచ్చే హైదరాబాద్ లాంటి క్యాపిటల్ సిటీని వదులుకుని కొత్త రాజధాని తో ఏర్పడే రాష్ట్రానికి ఆరోజు ప్రత్యెక హోదా సమంజసం గా తోచింది, ఆనినాధమే మిత్ర పక్షాలు అయిన బా జ పా , తెలుగు దేశం కి ప్రధాన ఎన్నికల నినాదం అయ్యింది.

తిరుపతి వెంకన్న సాక్షిగా 15 సంవత్సరాలు ప్రత్యెక హోదా కావలి , మేము అధికారంలోకి వస్తే సాధిస్తాం అని నమ్మ బలికిన మోడీ – చంద్రబాబు ఆ తర్వాత ప్రణాళిక సంఘం రద్దు చేసి నీతి అయోగ్ అంటూ ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యెక హోదా ని  బంగాళాఘాతం లో కలిపేసేరు. ప్రతి పక్ష వైఎస్సార్  సి పి నాయకుడు వై ఎస్ జగన్ మొదట్లో ప్రత్యెక హోదా కోసం నిరసన కార్యక్రమాలు చేపట్టినా ప్రజల్లో నమ్మకం కలిగించలేకపోయేరు. మీడియా సహకారం లేక హోదా పోరును విజయం దిశగా నడిపించలేకపోయేరు.   ఇక అధికార పార్టికి అత్యంత సన్నిహితుడు, 2014 లో బా జ పా / తెలుగు దేశం పార్టీ లో ప్రధాన బాగస్వామి, ప్రస్నించటానికే పార్టి పెట్టిన జనసేన అధ్యక్షుడు మిత్ర పక్షాల మీద ఈగ వాలనీయకుండా అప్పుడు అప్పుడు ప్రత్యెక హోదా కావలి అని, ప్యాకేజీ కావాలి అని జనాల్లోకి వస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ రాజకీయ డొల్లతనాన్ని చూసి ప్రజలు నవ్వుకున్నా నేను ఉన్నాను అని గుర్తు చేస్తూ ఉంటాడు.

హోదా రాజకీయం.

ఇటీవల కేంద్రం ప్రవేశ పెట్టిన 2018-19 లో ఆంధ్రప్రదేశ్ కి ఎలాంటి కేటాయింపులు జరపలేదు అని సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలతో ఒక్కసరిగా రాష్ట్రంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలు రోడ్ల మీదకు రావడం ఇందుకు మేము తక్కువ తిన్నామా అని పార్లమెంట్ ముందు అధికార తె దే పా పార్లమెంట్ సబ్యులు పార్లమెంట్ ముందు నిరసన ప్రదర్సన చెయ్యడం తెలిసిందే. కేంద్రంలో బాగస్వామ్యం అయిన తె దే పా కుడా కేంద్ర ప్రబుత్వం మీద నిరసన చెయ్యడం , ఆ పార్టీ మంత్రులు కొందరు కేంద్రానికి మద్దత్తుగా రాజ్య సభ లో మాట్లాడటం తె దే పా రాజకీయ ఎత్తుగడ ప్రజలు గ్రహించి దుమ్మెతి పోసేరు. ఇదే అదునుగా వై ఎస్ ర్ సి పీ అధ్యక్షుడు వై ఎస్ జగన్ ప్రత్యెక హోదా అంటూ మాట్లాడటం వారి పార్టీ పార్లమెంట్ సబ్యులు రాజీనామా చేస్తాము అని ప్రకటించడం తెలిసిందే.

ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టం లో ప్రత్యెక హోదా ఉన్నా అధికార తెలుగు దేశం పార్టీ రాజకీయ అవసరాల కోసం హోదా ను పణంగా పెట్టి ప్యాకేజీ కి అంగీకరించిన మాట యావత్ దేశం విన్నది. త్వరలో ఎన్నికలు వస్తాయి ఏమో అని ఒకవైపు ప్రతిపక్షాల విమర్శల దాడి నుండి తప్పించుకోవడానికి ఇంకొక వైపు తె దే పా కుడా నిరసన ర్యాలీ చేసింది. కానీ కేంద్ర ప్రబుత్వం యొక్క ఆలోచనలు వేరుగా ఉన్నాయి. కేంద్ర ఆర్ధిక మంత్రి పార్లమెంట్ లో మాట్లాడిన తీరు ఆంధ్ర ప్రదేశ్ కి రావాల్సిన వాటా కంటే ఎక్కువ నిధులు ఇచ్చేము అని చెప్పడంతో బా జ పా ఆంధ్ర ప్రదేశ్ శాఖా తె దే పా మీద ఎదురుదాడి కి దిగింది. ఇంకొక వైపు పవన్ కళ్యాణ్ జాయింట్ యాక్షన్ ఫోర్స్ అంటూ లెక్కలు చెప్పాలి అని అడగడం తో ముక్య మంత్రి చంద్రబాబు రంగంలోకి దిగి తె దే పా ని శ్రేణులను సముదాయించే పని చేసేరు.

ఇప్పుడు హోదా పోరు అనేది ఎన్నికల పరుగు కోసమే అని ప్రజలు అర్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రబుత్వం చేసిన హామీని నెరవేర్చకపోగా మిత్ర పక్షం యొక్క రాజకీయ అవినీతిని అడ్డంపెట్టుకుని మోడీ ప్రబుత్వం ప్రత్యెక హోదా ని ‘నీతి అయోగ్’ మెడ మీద నుండి ఆంధ్ర ప్రజలను కాల్చాలి అని చూసింది.

బా జ పా నాయకులు మేము ఆంధ్ర ప్రదేశ్ కి హోదా కంటే ఎక్కువ నిధులు ఇచ్చేము అంటుంటే చంద్ర బాబు నీళ్ళు నములుతున్నాడు. ప్రజలు మాత్రం ప్రత్యెక హోదా ఉద్యమం మరో సమైక్య ఆంధ్ర ఉద్యమం అని అనుకుంటున్నారు. తెలుగు దేశం – బా జ పా రెండు అధికారంలో ఉండి వారి ఫైల్యూర్ ని కప్పి పుచ్చుకోవడానికి హోదా రాజకీయం చేస్తున్నారు అని అనుకుంటున్నారు.

ఏది ఏమైనా వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ రాజకీయం మరింత రసవత్తరంగా తయారు అవ్వొచ్చు లేదా కలగూర గంప అవ్వొచ్చు. ప్రజలు ఎప్పటిలాగానే ఓటు తో సిద్దంగా ఉన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here