కీలు బొమ్మల కాలం.కీలుబొమ్మల కాలం ఈనాటిది కాదు

0
128

కీలుబొమ్మల కాలం ఈనాటిది కాదు, 1932 గాంధీ చచ్చిపోతాను అని ఎర్రవాడ జైలులో తిండి తినకుండా కోట్లాది నిమ్నజాతీయులను బెదిరింపులకు గురిచేసి, బాబాసాహెబ్ డా బి ర్ అంబేడ్కర్ తన ప్రజ్ఞ పాటవాలతో బ్రిటీష్ రాజును మెప్పించి సాధించిన ‘కమ్యూనల్ అవార్డ్’ ను యధావిధిగా అమలుపరచ కుండా నిమ్నజాతీయుల హక్కులను కాలరాసే ఒప్పందం జరిగిన రోజు నుండి కీలు బొమ్మలు కాలం ప్రారంభం అయ్యింది.

ఇటీవల నెల్లూరు జిల్లా నాయుడు పేట మునిసిపల్ చైర్మన్ శ్రీమతి శోభారాణి గారిని మంత్రి నారాయణ, మాజీ శాసన సబ్యుడు ముంగమూరు శ్రీధర్ రెడ్డి తదితరులు నిర్వహించిన పత్రికా సమావేశంలో మహిళా మునిసిపల్ చైర్మన్ ని కుర్చోనీయకుండా, ఒక్కరినే తమ వెనక నిలబెట్టుకోవడం ‘కీలు బొమ్మలు’ మళ్ళీ గుర్తుకు వచ్చింది. ఈ సంఘటన జరిగిన రెండు రోజులు ముందు గుంటూరు జిల్లా మంగళగిరి లో చోటు చేసుకున్న మరో పరిణామం కీలు బొమ్మలు అనే సినిమా దిగ్విజయం శత దినోత్సవం చేసుకుంటుంది. దర్శి వనరాణి అనే తె దేపా పార్టీ నాయకురాలు మాట్లాడుతుండగా ఇది చౌదర్ల (కమ్మ కులం ) పార్టీ నీకు మాట్లాడే అర్హత లేదు కూర్చో అంటూ ఒక పోలవరపు హరిబాబు అనే వ్యక్తి దబాయించేడు, కులం తక్కువ వాళ్ళకు పదవులు ఇవ్వకూడదు అని అన్నాడు. వీళ్ళే కాదు, సంవత్సరం క్రితం చిత్తూరు పార్లమెంట్ సబ్యుడు కుడా రోడ్దేక్కెడు. ఇన్ని అవమానాలు జరుగుతున్నా సర్పంచ్ దగ్గర నుండి రాజ్య సభ సబ్యుడి వరకూ ప్రతి ప్రజాప్రతినిధి వారి పార్టీలకు రాజీనామా చెయ్యాలి. కానీ అలా జరగడం లేదు. కాళీ ఆయిన స్తలం లో అదే సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తిని నిలబెడతారు. ఇంకో కీలు బొమ్మ రెడీ.

ఎవరైతే సొంత ఆలోచనలు లేకుండా ఇతరుల చేతిలో ఆడించబడతారో వారినే చెంచా(కీలు బొమ్మ ) అని సంబోదిస్తాము. పూనా ఒప్పందం సందర్భంగా బాబాసాహెబ్ డా బి ర్ అంబేడ్కర్ ఉమ్మడి నియోజకవర్గాల గురించి మాట్లాడుతూ

ఉమ్మడి నియోజకవర్గాలు సవర్ణ హిందువులకు ఒక వరంవలే దొరికాయి. వీటి ద్వారా సవర్ణ హిందువులు నామమాత్రమై తమ చేతిలో కీలుబొమ్మలు మలే ఆడే ఎస్సీలను మాత్రమె ప్రతినిధులుగా ఎంపిక చేస్తారు

నాయుడుపేట, మంగళగిరి లేదా అంతకు పూర్వం చిత్తూరు లేదా ఇప్పటి వరకూ జరిగిన సంఘటనలు – ఎస్సి రాజకీయ నాయకులకు జరిగిన అవమానం కీలుబొమ్మలు వలెనే అని మనము అర్ధం చేసుకోవాలి. తమని అవమానిస్తున్నా భరిస్తూ ఆయా రాజకీయ పార్టీలకు జై కొట్టడం అంటే ఆత్మగౌరవం లేదు అని అనుకోవాలి.

1929 వ సంవత్సరం ఏప్రిల్ నెలాఖరులో జరిగిన రత్నగిరి జిల్లా నిమ్నజాతీయుల సభలో బాబాసాహెబ్ డా అంబేడ్కర్ అధ్యక్ష ఉపన్యాసం చేస్తూ

ఆత్మగౌరవాన్ని కోల్పోయి ఇతరులపై జీవించే నీచమైన మనస్తత్వానికి నిమ్నజాతీయులు స్వస్తి జెప్పాలి. తమ బానిస బంధనాలను చేధించేందుకు తామే స్వశక్తితో కృషి చెయ్యాలి. మానవునికి ఆత్మగౌరవం కంటే విలువైనది మరొకటి లేదు. ఆత్మగౌరవం లేని మనిషి సున్నాతో సమానం అంటారు.

ప్రపంచీకరణలో బాగంగా బారత దేశంలోని గ్రామాలలో పెత్తందారి విధానాలకు స్వస్తిపలకాల్సిన అవస్యక్త ఏర్పడింది. రాజకీయం వికేంద్రీక్రుతమై తమ స్వరూపాన్ని మార్చుకుని పెట్టుబడిదారుడు, రాజకీయ నాయకుడు ఒక్కడే అయ్యేడు.ప్రపంచీకరణ వలన ఎస్సీలు గ్రామాలను వదిలి పట్టణాలకు వలస పెరుగుతున్నా రాజకీయ ఆదిపత్యం లేక పెట్టుబడిదారుడి సరికొత్త  రాజకీయ ఎత్తుగడలకు మొదట బలిఅవుతుంది ఎస్సిలే. ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రంలో కులాలను అస్తిరపరుస్తూ కుల అస్తిత్వ పోరాటాలను వెనక నుండి ప్రోస్తాహిస్తూ ఐక్యంగా ఉన్న ఎస్సి , ఎస్టీ , బి సి కులాలను వర్గీకరిస్తున్నారు. దీనికి ఎస్సిలలో విద్యావంతులు కూడా జై కొడుతూ కుల పోరాటాలకు దిగేరు. ఈ విభజన పాలక కులాలకు బాగా కలిసి వస్తుంది. దీని ప్రబావమే నాయుడు పేట లాంటి సంఘటన, లేదా మంగళగిరి లో జరిగిన సంఘటన. విచ్చిన్నం అయిన ఎస్సి లు కనీసం తమ వర్గ మహిళలకు జరిగిన అవమానాలు గురించి నిరసన కుడా తెలపలేక పోయేరు. ప్రజల నుండి కుడా నిరసన రాకపోవడానికి కారణం కీలు బొమ్మల వలనే.

పూనా  ఒప్పందం అమలులోకి వచ్చి రిజర్వడ్ నియోజకవర్గాల వలన ఎస్సీల పరిస్తితి మరింత దిగజారుతుంది అని బాబాసాహెబ్ డా బి ర్ అంబేడ్కర్ ఉహించేరు. అందుకు ఉదాహరణగా 1946 లో జరిగిన ఎన్నికలు నిరూపించిన దాన్నిబట్టి ఉమ్మడి నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగితే అణగారిన కులాలు ఓటు హక్కును దాదాపుగా కోల్పోయినట్లే లెక్క అంటారు. కమ్యూనల్ అవార్డ్ అంటారని వారికి రెండు ప్రయోజనాలను కల్పించింది.

1.ప్రత్యెక నియోజవర్గాల ద్వారా అంటరానివారు తమ ప్రతినిధులను తామే ఎన్నుకునే నిర్దిష్ట సంక్యలో సీట్లు కేటాయిస్తారు.

2. వారికి సాదారణ నియోజక వర్గాలలో ఒకటి, ప్రత్యెక నియోజక వర్గాలలో ఒకటి అని రెండు ఓట్లు ఇవ్వబడినాయి.

ఎస్సీల తక్షణ కర్తవ్యం ఏంటి?

స్వాతంత్ర్యం వచ్చి 71 సంవత్సరాలు అవుతుంది ఇన్ని రోజులు అయినా ఎస్సిలలో కీలుబోమ్మలనే ఫ్యూడల్ పార్టీలు తమ అబ్యర్దులుగా నిలబెడుతూ ఎస్సిల ప్రయోజనాలు తుంగలో తొక్కుతున్నా స్వతంత్ర రాజకీయం వైపు అడుగులు వేయడంలో ఇంకా తప్పటడుగులు వేస్తున్నారు. కుల సంఘాల నాయకులను, అమ్బెడ్కరిస్తులు అనే చెంచాల(కీలుబొమలు)ను ఫ్యూడల్ కులాలు తమ స్వార్ధం కోసమే వాడుకుంటున్నారు. మాల మహానాడు అధ్యక్షుడు గా పనిచేసిన జూపూడి ప్రభాకరరావు గారిని చూసి చిన్న చితక నాయకులు ప్రత్యెక కుల సంఘాలు పెట్టి రాజకీయ లబ్ది పొండు దాము అనే భ్రమల్లో కులాన్ని పక్కద్రోవ పట్టిస్తున్నారు. అలాగే మంద కృష్ణ మాదిగ గారిని చూసి రాజకేయ ప్రాభల్యం పెంచుకోవాలని మాదిగ కులం లో కొత్త నాయకులు పుట్టుకొస్తూ అధికార పార్టీలకు జై కొడుతూ కీలు బొమ్మలుగానే ఉంటున్నారు. ఇక అంబేడ్కరిస్ట్ అనే చెంచాలు ఉన్నత ఉద్యోగాల్లో ఉంది , ఉద్యోగం చివరిలోనో , పదవీ విరమణ తర్వాత అంబేడ్కరిస్ట్ లు అని చెప్పుకుంటూ ఫ్యూడల్ కులాలకు వంత పాడుతున్నారు. ఈ కుల సంఘాల చెంచాలు, అంబేడ్కరిస్ట్ చెంచాలు బాబాసాహెబ్ ఉద్యమానికి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తున్నారు. ఈ పరిణామాలను చైతన్యం కలిగిన కొత్త తరం ఎదుర్కోవాలి. బారత దేశంలో వస్తున్న మార్పులు గమనిస్తూ రాజకీయ పోరాటం చెయ్యాలి. ఎస్సిలలో స్వతంత్ర రాజకీయ పోరాటం కొనసాగాక పొతే అది ఎస్సీల బవిషత్ మీద తీవ్రమైన ప్రబావం చూపిస్తుంది.

ఎస్సి / ఎస్టీ లలో అభివృద్ధి చెందిన వారు పరాయీకరణ చెందకుండా కులం యొక్క ప్రయోజనలలో బాగస్వామ్యం కావలి. ముక్యంగా యువత తమ సామాజిక, రాజకీయ బవిషత్ గురించి, జాతి ప్రయోజనాల దృష్ట్యా నాయకత్వం వైపు అడుగులు వేయాలి

పెట్టుబడిదారుల రాజకీయం, మతోన్మాదుల రాజకీయం గుర్తించకపొతే కీలుబొమ్మల రాజకీయంలో బవిషత్ సమాధి అవుతుంది.    

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here