టి టి డి దళితులకు ఇస్తున్నఅంటారని దేవుళ్ళు!

0
123

దళితులకు పౌరాహిత్యం నేర్పించి టి టి డి లాంటి ధనిక దేవాలయల్లోకి రానీయకుండా వేలివాడల్లో దేవుడిని గుడి కట్టిస్తాం అంటే ఒక నాటి మాల దాసర్ల కధే పునరావృత్తం అవుతుంది తప్పా!, దళితులకు, హిందు మతానికి ఎలాంటి ప్రయోజనం లేదు.

2017 డిసెంబరులో ప్రపంచంలోని అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానాలు (టిటిడి), దాని చరిత్రలో మొట్టమొదటిసారిగా షెడ్యూల్డ్ కులాలు మరియు తెగలు నుండి పూజారులుగా శిక్షణ ఇస్తున్నామని ప్రకటించింది.

అయినప్పటికీ, ఈ శిక్షణా కార్యక్రమంలో ఉన్న వ్యక్తుల్లో ఏ ఒక్క దళితుడిని  తి.తె దే (తిరుమల తిరుపతి దేవస్తానం) నిర్వహించే ఏ ఆలయాలలోనైనా, దళితను పూజారులుగా నియమించమని ప్రకరించింది.  

“TTD దేవాలయాలు అగమ శాస్త్రాలు అని పిలవబడే ఆచారాల ద్వారా నిర్వహించబడతాయి మరియు ప్రతి దేవాలయం దాని సొంత అమామా మరియు దాని సొంత వారసత్వ పూజారి వ్యవస్థను కలిగి ఉంది,” తిరుమల ఆలయం ప్రధాన పూజారి రమణ దీక్షితులు చెప్పేరు. TTD ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు దళితులను పూజారులు గా చేసే శిక్షణ కార్యమం కోసం సిలబస్ తయారు చేసినవాళ్ళలో ఒకరు.

“TTD దేవాలయాలలో దళిత పూజారులు లేరు. వారు ఇప్పటికే వారి దేవాలయాలలో పని చేస్తున్నారు; మేము వారిని పాలిష్ చేశాము మరియు వారికి మెళుకువలను నేర్పించేము “అని రమణ దీక్షితులు చెప్పాడు.

శిక్షణా విధానాల గురించి అడిగిన ప్రశ్నకు, రమణ దీక్షితులు సమాదానం చెబుతూ TTD పల్లెకారు(బెస్త) కులానికి, దళిత వర్గాలకు వారి స్తానిక దళిత గ్రామాలోని దేవాలయంలో పూజించటానికి శిక్షణ పొందుతున్నారు. ఆలయం లో ఎలా ఉండాలి, పరిశుబ్ర్తత, పవిత్రత  గురించి తర్పీదు ఇస్తునట్లు చెప్పేరు.  

కార్యక్రమం యొక్క ఆవిర్భావం

గ్రామాల్లోని కొందరు ప్రజలు, నాయకులు TTD ని వారి దేవాలయాల్లో పూజా విధానాలు మరియు మంత్రాలు నిర్వహించటానికి తమని సంప్రదించారని, వారి అబ్యర్ధన మేరకు టి టి డి ట్రస్ట్ బోర్డ్ ఈ నిర్ణయం తీసుకుందని టి టి డి పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పేర్కొన్నారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఉద్యోగుల శిక్షణా ఆకాడమీలోదళిత , పల్లె కారులకు శిక్షణ ఇచ్చేరు. శిక్షణ అనంతరం వారు వారి కుల ప్రజలు నిర్మించుకున్న దేవాలయాల్లో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు.

TTD లో శిక్షణ పొందిన వ్యక్తుల కోసం టి టి డి ఆర్ధిక సహాయం చేసి వారి ప్రాంతంలో గుడి కుడా నిర్మిస్తున్నారు. ఇప్పటివరకూ 300 మంది దళిత లకు పూజారులుగా శిక్షణ ఇచ్చినట్లు అలాగే 500 వందల దళిత, గిరిజన గ్రామాల్లో ఆలయాల నిర్మాణానికి ఆర్ధిక సహాయం చేసినట్లు తెలిపేరు.

టి టి డి చర్య అర్ధంపర్ధం లేనిది:

దళితులను హిందు మతంలో బాగం చెయ్యాలనుకుంటే ఇది సానుకూలమైన చర్యకాదని దళిత సంఘాలు మండి పడుతున్నారు. ఆగమ శాస్తం దళితులను వ్యతిరేకిస్తుందని, అంటారని వారికోసం అంటారని దేవుడిని ప్రతిష్ట చేస్తున్నారని దళిత ప్రజలు బావిస్తున్నారు. దీనివలన దళిత వర్గాల్లో ఎలాంటి మార్పు రాదు.

తిరుమల తిరుపతి దేవస్తానం కొత్త సంప్రదాయాన్ని ఏమీ ప్రవేశ పెట్టలేదు.దళితుల పట్ల హిందూ మతం అనుసరిస్తున్న పాత సంప్రదాయమే! పూర్వం హిందూ గురువు రామనుచార్యులు అంటారని ప్రజలకు తన పేరిట రామానుజ మతం ఏర్పాటు చేసి వారి మొహం పై తిరుచుర్ణం రుద్ది ఎందరినో దాసులు గా, వైష్ణువులు గా మార్చేరు వారె మాల దాసరులు గా, హరి దాసు లు గా నేటికీ గ్రామాల్లో హిందు దళితులకు పెడ్లి ఖర్మ కాండలు నిర్వహిస్తున్నారు. ఆనాడు ఊరూరా తిరిగి సూర్యుడు నడి నెత్తిన వచ్చే వరకూ విష్ణువును కీర్తించిన అంటరాని దాసులకు గర్బ గుడిలోని రాతి విగ్రహానికి అభిషేకించిన నీరు, గర్బ గుడి గొట్టం నుండి బయటకు జారి పోతుండగా  ఒక శూద్రుడు దాన్ని చెంబులో పట్టి దాసరి కి ఇచ్చేవారు. గుడి కడిగిన నీరే మాలదాసరి మహా ప్రసాదం లాగా  తాగేవారు. ఎవరైనా అగ్రకుల వ్యక్తి కనిపిస్తే వంగి, వంగి, బెదురుతూ, దూరంగా ఒక మూలకు చేరుకునే వారు. ఎవరైనా శుద్రులిచ్చిన ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని తినే వాడు. గుడి ఆవరణ బయటనే ప్రదిక్షణం చేసి పొద్దు గుకగానే తన గ్రామానికి వెళ్ళేవాడు. గుడి లోనకి కుడా కాలు పెట్టనించేవారు కాదు.  శ్రీకృష్ణ దేవరాయులు ఈ మాల దాసరులు గురించి తన “ఆముకత్తమాల్యద” లో వర్ణించేరు.

ఆనాటి దళితుల మాదిరిగానే నేటి దళితులు హిందు మతం కుట్రలో బాగం అవ్తుతున్నారు.దళిత పూజారులకు ఎలాంటి ఆర్ధిక సంపద ఉండదు, వారి వలన దళిత వర్గాలకు ఎలాంటి ప్రయోజనం లేదు. పూర్వం ఊరూరా అడుక్కొచ్చిన బియ్యం బద్రాచలం రాముడి కళ్యాణం రోజున దాసులు, మాల దాసరులు రాసులుగా పోసేవారు. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వలన హిందు మతం మరింత అపాఖ్యాతిపాలవుతుంది తప్పా హిందూ మత ప్రచారం ఎన్నటికీ జరగదు.

దళితుల గ్రామ దేవతులు, గుడుల్లో శూద్ర కులాలు వాళ్ళే ఎక్కువ శాతం పౌరహిత్యం నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటికే దేశంలో చాల ప్రాంతాల్లో దళితులను గుడుల్లోకి రానీయడం లేదు.

వేదాలు కానీ, ఆగమ శాస్త్రం కానీ లేదా హిందు ధర్మ సూత్రం మనుస్మృతి కానీ దళితులకు వ్యతిరేకంగా ఉంటే నేడు దళితులకు ఒక గుడినిచ్చి అందులో పూజారులుగా నియమిస్తే దళితులకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. దళిత వ్యతిరేక శ్లోకాలు హిందు శాస్త్రాల నుండి తోలిగించగలరా? కుల వ్యవస్తను నిర్ములించగలరా? అది జరగనప్పుడు దళితుల ఆలయ ప్రవేశం, దళిత పూజారులు తు. తూ మంత్రమే తప్పా ఎలాంటి ప్రయోజనం లేదు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here