బాబాసాహెబ్ డా అంబేడ్కర్ పాపులారిటీ ని తగ్గించడానికే బా జ పా ఈ ప్రయత్నాలు చేస్తుంది అనుకోవచ్చు

0
131

ఉత్తర ప్రదేశ్ ప్రబుత్వం, యోగి ఆదిత్యనాద్ నేతృత్వంలో మార్చి 28న నవబారత నిర్మాత బాబాసాహెబ్ డా. భీంరావ్ అంబేడ్కర్ పేరు ను భీంరావ్ రాంజీ అంబేడ్కర్ గా మారుస్తూ ఒక ప్రకటన చేసింది. ఈ చర్యలపై దేశంలోని బాబాసాహెబ్ అనుచరులు, దళిత సంఘాలు తమ నిరసన ప్రకటించేరు.

బాబాసాహెబ్ డా అంబేడ్కర్ పేరులో “రాంజీ” ని ప్రత్యేకంగా చేర్చడం హిందుత్వ పోకడ గా నిరసనకారులు తెలియజేస్తున్నారు.

1935 లో బాబాసాహెబ్ డా బి ర్ అంబేడ్కర్ “నేను హిందువు గా జన్మించెను గానీ, మరణించను అని ఒక పబ్లిక్ సమావేశంలో ప్రకటన చేసేరు.

భగవద్గీతలోని ఒక్క వాక్యమైనా సరిగా చదివి అర్ధంచేసుకోలేకపోయినా భ్రాహ్మణుడు బ్రాహ్మణుడే! ఒక్క భగవద్గీత నే గాక మొత్తం హిందూ శాస్త్ర గ్రంధాలన్నీ చదివి వాటికి అర్ధాలు చెప్పగలిగినా నేను అస్పృశ్యున్నే! బాబాసాహెబ్ డా అంబేడ్కర్.

ఎస్సి/ ఎస్టీ అత్యచారాల నిరోధక చట్టం 1989 సుప్రీం కోర్టు నిర్వీర్యం చెయ్యడం, విస్వవిద్యాలయాలలో రిజర్వేషన్లు తీసివేసి కాంట్రాక్ట్ ఉపాద్యాయులను చేర్చుకోవడం, ఇప్పుడు బాబాసాహెబ్ డా అంబేడ్కర్ పేరును మార్చడంలాంటి పరిణామాలు గమనిస్తే దళితుల సంఘటిత శక్తిని నిర్వీర్యం చేసే కుట్రగా దళిత సంఘాలు నిర్వచిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఉత్తర ప్రదేశ్  ముక్యమంత్రి యోగీ అధిత్యనాద్ బాబాసాహెబ్ పేరు మార్చడం పై స్పందిస్తూ చరిత్రలో చేసిన తప్పులు సరిదిద్దుకోవాలి అందులో బాగంగానే బాబాసాహెబ్ డా అంబేడ్కర్ పేరులో రాంజీ ని చేర్చడం జరిగిందని అన్నారు.

మీకు చేతనైతే హిందూమతాన్ని అన్ని కులాలవారికి న్యాయం జరిగేలా సంస్కరించండి. అలా జేయడం మీకు చేతకానప్పుడు మాదరిన మమల్ని వదిలేయండి: బాబాసాహెబ్ డా.  అంబేడ్కర్.

హిందూ మతాన్ని విదాడతాను అని ప్రకటన చేసిన బాబాసాహెబ్ డా అంబేడ్కర్ ని కలవడానికి వచ్చిన లేదా ఉత్తరాలు రాసిన వారికి పై ప్రశ్న  బాబాసాహెబ్ అడిగేవారు. ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ ప్రబుత్వాన్ని కుడా దళితులు ఇదే ప్రశ్న బహిరంగంగా అడుగుతున్నారు

2014 బా జ పా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటినుండి దలిత , అదివాశీల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. దళితుల, గిరిజనుల అత్మౌరవాన్ని వ్యవస్తల ద్వారా బంగపరిచే కుట్రలు చేస్తున్నారు. ఇందులో బాగమే బాబాసాహెబ్ డా అంబేడ్కర్ పేరు మార్చడం.

బారత దేశంలో ఎస్సి/ ఎస్టీ ల మీద జరుగుతున్న కుట్రలు అనాదిగా వస్తున్నావే. దళిత వర్గాలు అభివృద్ధి చెందకుండా పెత్తందారి వ్యవస్థ దళితుల అభివృద్ధి అంటూ మొసలి కన్నీరు కారుస్తూ వస్తుంది.

రాంజీ రాముడు పేరుకు నిదర్శనం అయితే, నేను హిందువుగా మరణించను అని లక్షలాది మంది తన అనుచరులతో బౌద్ద మతం స్వీకరించిన బాబాసాహెబ్ రాముడి కృష్ణ లీలలు ( The riddles of Rama & Krishna )లో బాబాసాహెబ్ యొక్క అభిప్రాయం తెలుసుకుందాం.

బౌద్ద రామాయణంలో కధ చాలా సహజంగా ఉంది. ఆర్యుల వైవాహిక  సూత్రాలకు (అన్నా చేల్లిల్ల మధ్య వివాహం ఆర్యుల లో సమ్మతమే) విరుద్దంగా కుడా ఉండదు.  ఈ కదే కనుక నిజమైతే సీతారాముల వివాహం అందరూ అంగీకరించదగిన ఆద్ర్సవంతమైనదేమీ కాదు. మరొకలా చెప్పాలంటే, అసలు సీతారాముల వివాహం అనుసరించదగిందీ, ఆడర్షంవంతమైనదీ  కానే కాదు. రామునికి ఆపాదించే గుణాలలో ఒక్కటి అతను ఏకపత్నీవ్రతుడు ఈ అభిప్రాయం అందరూ అంగీకరించేలా  ప్రచారంలోకి వచ్చిందో తెలుసుకోవడం కష్టం. ఎందుకంటె దీనికి ఏ ఆదారాలు లేవు. వాల్మీకి సైతం రామునికి ఎందరో బార్యలుండేవారని అంటాడు(అయోధ్యకాండ – సర్గ 8, శ్లోకం’12) వీరికి తోడు అతనికి ఇంకా ఎందరో ఉంపుడుగత్తె లుండేవారు. ఈ విషయంలో రాముడు తన నామమాత్రమైన తండ్రి  దశరధునికి నిజమైన తనయుడే. ఎందుకంటె దశరధునికి ముగ్గురు బార్యలె కాదు. ఇంకా ఎందరో బార్యలుండేవారు.

ఒక వ్యక్తిగా, రాజుగా రాముని శీలం ఎటువంటిదో పరిశీలిద్దాం

రాముడిని ఒక వ్యక్తిగా చెప్పుకునేటప్పుడు కేవలం రెండే రెండు సంఘటనలు ప్రస్తావిస్తాను. ఒకటి వాలి పట్ల అతని ప్రవర్తన, రెండోది తన బార్య అయిన సీత పట్ల అయిన వ్యవరించిన తీరు. ముందుగా వాలి కధ పరిశీలిద్దాం.

వాలి సుగ్రీవులిద్దరు అన్నదమ్ములు. వానర జాతికి చెందినవారు.వారది రాజవంశం. దానికి కిష్కింద  రాజధాని. సీతను రావణుడు అపహరించుకొని పోయేనాటికి కిష్కిందను వాలి పరిపాలిస్తూ ఉండేవారు.వాలి  మాయావి అనే రాక్షసునితో యుద్దనికి తలపడతాడు, మాయావి పారిపోయి ఒక గుహలో దాక్కుంటాడు, వాలి అతనిని చంపటానికి గుహలోకి వెళ్తాడు. గుహ బయట సుగ్రీవుడుని ఉండమని వాలి చెబుతాడు. కొంత సేపటికి గుహ నుండి రక్తం వరదలా ప్రవహిస్తూ వస్తుంది. మాయావి వాలిలిని చంపి ఉంటాడు అని సుగ్రీవుడు నిచ్చయించుకుని కిష్కింద కు వెళ్లి రాజుగా ప్రకటించుకుంటాడు.

వాలి గుహ నుండి బయటకు వచ్చి సుగ్రీవుడు చేసిన మోసం గ్రహించి అతనిని తరిమి కొడతాడు. ఒకవేళ యుద్దంలో వాలి చనిపోతే వాలి కుమారుడు ‘అంగదడు’ రాజు కావలి కానీ సుగ్రీవుడు రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. అందుకే వాలి సుగ్రీవుడిని తరిమేసేడు. ఇదే సమయంలో రాముడు సీతను వెతుకుంటూ సుగ్రీవుడి కి తారసపడతాడు. రాముడు సీతను వెతికే క్రమంలో సహాయం చెయ్యమని కోరుతాడు అందుకు వాలి మీద యుద్ధం చేసి రాజ్యాన్ని అప్పజేబుతాను అంటాడు. వాలి ,సుగీవుడి కి జరుగుతున్న ద్వంద యుద్దంలో రాముడు చెట్టు చాటునుండి వాలిని చంపుతాడు. ఒక రాజు గా ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండా రాముడు వాలిని చంపుతాడు. ఇది మోసం , నేరం , పిరికిపందలు చేసేపని. వాలి చేతిలో ఎలాంటి ఆయుధం లేదు.

తన సొంత బార్య పట్ల రాముడు ఎలా ప్రవర్తించేడో చూద్దాం.

నిన్ను చేరబట్టిన నా శత్రువుని యుద్ధం లో జయించి నిన్ను జయించుకు వచ్చెను. నా గౌరవాన్ని నిలబెట్టుకున్నాను. నా శత్రువుని శిక్షించాను. నా వీర పరాక్రమాన్ని ప్రజలు తిలకించేరు. నా శ్రమకు పలితం దొరికిందని సంతోషంగా ఉంది. రావణుడుని హతమార్చడానికి , కళంకాని తుడిచివేసుకోవడానికి నేనిక్కడికి వచ్చాను. నీకోసం నేను ఈ శ్రమను తీసుకోలేదు.

నీ శీలాన్ని శంకిస్తున్నాను, రావణుడు నిన్ను ఖచ్చితంగా చేరచివుంటాడు. నిన్ను చూస్తూ ఉంటే  నాకు అసహ్యం వేస్తుంది. ఓ జనకుని కూతురా ! నీ ఇష్టమొచ్చిన చోటికి వేల్లనిస్తాను, నీతో నాకెలాంటి సంభంధంలేదు. నిన్ను తిరిగి జయించుకున్నాను. నాకు తృప్తిగా ఉంది. ఎందుకంటె నాలక్ష్యం అదే. నీ అంత సౌందర్యవంత మైన స్త్రీని అనుభవించకుండా రావణుడు విడిచి పెట్టి ఉంటాడని నేను అనుకోవడం లేదు.(యుద్దకాండ –సర్గ 115 ; శ్లోకాలు 1-15)

రాముడి గుణగణాల మీద అతని పాలన మీద సదాభిప్రాయం లేని బాబాసాహెబ్ డా అంబేడ్కర్ కి రాంజీ పేరు చేర్చి దళితులను ఆకట్టు కునే ప్రయత్నం చేస్తున్నారా లేక బాబాసాహెబ్ వ్యక్తిత్వాన్ని కించ పరుస్తున్నారా ?

2014 లో జరిగిన ఎన్నికల్లో దళిత ఓటర్లు కాంగ్రెస్ కంటే ఎక్కువగా బా జ పా కి సపోర్ట్ చేసినట్లు CSDS (Centre for Study of Developing Societies )  లెక్కలు చెబుతుంది. బారత ఎన్నికల చరిత్రలో దళితుల ఓట్లు బా జ పా కి పడటం ఇదే ప్రధమం.

బాబాసాహెబ్ డా అంబేడ్కర్ పాపులారిటీ ని తగ్గించడానికే బా జ పా ఈ ప్రయత్నాలు చేస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటె బా జ పా ఇదియాలజీ తన RSS కేంద్రం నుండే వచ్చింది. RSS మనుస్మృతి సూత్రాల ఆదారంగా పనిచేస్తుంది. మత ఆధారంగా చేస్తున్న అంటరానితనం మనుస్మృతి ని 1927 డిసెంబెర్ 25 న బాబాసాహెబ్ బహిరంగంగా తగలబెట్టేరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here