ప్రజలను యాచాకులుగా తయారు చేసే దేశం చివరకు యాచక దేశంగా మారుతుంది

0
109

యుద్ధం కోసం తయారు చేసే ప్రతి తుపాకీ, ప్రతి యుద్ద విమానం , నిపులు చిమ్ముకుంటూ వెళ్ళీ రాకెట్ ఇవి అన్నీ తయారు చేస్తుంది దొంగతనంతోనే. ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టకుండా యుద్ద సామగ్రి తయారు చేసుకోవడం దోపిడీ నే. ఒంటిపై బట్టలు లేకుండా చలిలో ఉండే వారికి బట్టలు ఇవ్వకుండా అంగారక గ్రహాల మీద యాత్ర చెయ్యడం పేదలను దోపిడీ చెయ్యడమే.

మధు కేరళ ఆదివాసి, దొంగతనం చేసేడు అని అతని చేతులు కట్టేసి సేల్ఫీ లు తీసుకుని కొట్టి చంపేసేరు. ఆకలి గా ఉన్న వ్యక్తి దొంగతనం చేసేడు అని కొట్టి చంపే దౌర్భాగ్యం స్తితికి ఈ దేశం రావడం 125 కోట్ల మంది బారతీయులు ప్రపంచం ముందు తల దించుకునే స్తితి.

ప్రబుత్వం ప్రజలను నైతికంగా పతనం చెయ్యకూడదు. ప్రజలను యాచకులుగా తయారు చెయ్యకూడదు.ప్రజలను యాచాకులుగా తయారు చేసే దేశం చివరకు యాచక దేశంగా మారుతుంది: బాబాసాహెబ్ డా. బి ర్ అంబేడ్కర్

30సంవత్సరాల మధు కేరళా లోని అట్టపడి ప్రాంతానికి చెందిన వ్యక్తి. అతని మానసిక స్తితి సరిగా లేదు. మతి స్తిమితం లేని ఒక వ్యక్తి  ని చేతులు కట్టేసి నలుగురైదుగురు కలిసి చచ్చే వరకూ కొట్టడం వారి మనిసిక స్తితి చనిపోయిన మధు మనిసిక స్తితి కంటే ఘోరంగా ఉంది అనుకోవాలి.

ఒక కుక్కను కొట్టాలి అంటే ఆ కుక్కని పిచ్చిదానిని చెయ్యాలి. అట్టపడి కొండ ప్రాంతం లోని వ్యాపారస్తులు మధుని దొంగను చేసేరు. అగిలి పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ కధనం ప్రకారం వ్యరస్తుల వద్ద మధు షాపులను దొంగ తనం చేస్తున్న సి సి టి వి విడియో ఉంది. ఆ విడియో ఆధారంగా మధు ని దొంగ తనం చేస్తుండగా పట్టుకున్నారు అని చెబుతున్నారు. మధు మీద రెండు కేసులు కుడా వున్నట్టు సి ఐ చెబుతున్నారు.

మధు చనిపోయింది స్తానిక వ్యాపారస్తులు  కొట్టడం వలెనే అని అప్పుడే నిర్ధరించలేము అని అగిలి డిప్యుటీ  పోలీసు సుపరెందేంట్ అంటున్నారు.

మధు కొడుతున్న సేల్ఫీ సోషల్ మీడియా లో రావడంతో ప్రజలు ఈ దుర్మార్గమైన చర్య పై  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా లో కవితలు మరియు స్టేటస్ ల రూపంలో ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మధుర భూమి అనే వారపత్రిక జర్నలిస్టు మనీల.సి.మోహన్ తన ఫెసుబుక్ స్టేటస్ లో ఈ క్రింది విధంగా స్పందిచేరు.

“Those who don’t have power won’t understand the powerless, they won’t understand that the powerless have the right to live. They aren’t guilty, but they have the silent pleasure of conducting a murder.” 

అట్టప్పడి హిల్ ఏరియ అభివృది కమిటీ కార్యకర్త ఉష పునతిల్ తన ఫేస్ బుక్ లో మధు మీద జరిగిన దాడి పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ విధంగా ఈ సమాజాన్ని ప్రశ్నించింది. “After stealing the land and everything the Adivasis owned, and making legislation for all that, now an Adivasi is beaten to death. He had nowhere to go when he was attacked. An Adivasi is killed accused of stealing food, then how should we who have stolen everything from them be killed?”

       ‘Madhu’s death is because our system is responsible… a system which has ordered mob justice and a person who attacks another is no human. How can we declare ourselves modern and progressive?


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here