దళితులు అల్టర్నెట్ కల్చర్ని ఏర్పాటు చేసుకోవడం లో విఫం అయ్యేరా!

0
97

బారత ఉప ఖండంలో ఆర్యుల సంస్కృతి ఉప ఖండమంతా వ్యాపించింది. సంస్కృతీ అంటే నిర్వచనం ఏంటంటే, ఒక వ్యక్తి వారి సంస్కృతిని ఎలా గుర్తించాడో మరియు ఆ సంభందం ఎలా వారి జీవితాలు ప్రబావితం చేస్తుందో చెబుతుంది. ప్రతి వ్యక్తి వారి సంస్కృతి ని కొన్ని అంశాలలో గుర్తిస్తాడు.

దురదృష్ట వశాత్తు బారత దేశంలో ఆర్యుల సంస్కృతినే యావత్ బారతీయుల సంస్కృతి అనే బావం ప్రపంచమంతా వ్యాప్తి చెందింది. ఇక్కడ ఉన్న ఆదిమ తెగలు, జాతుల సంస్కృతి ఆర్యుల దండయాత్ర వలన నాశనం చెయ్యబడింది. హరప్పా, మొహెంజదారో లో వెల్లివిరిసిన సంస్కృతి నేడు బారత దేశంలో ఎక్కడా కనిపించదు. మొహెంజదారో ని దెయ్యాల దిబ్బగా అభివర్ణించారు.

కల్చరల్ ఐడెంటిటీ నిర్వచనం:

సాంస్కృతిక గుర్తింపు యొక్క నిర్వచనం, దాని అత్యంత ప్రాధమిక రూపంలో చెందినది. ఇది సహజీవనం, నమ్మకాలు, ఆసక్తులు మరియు జీవన ప్రాథమిక సూత్రాల భాగస్వామ్య భావనను కలిగి ఉంటుంది. ఒక వ్యక్తి వారి సంస్కృతిని గుర్తించినప్పుడు, వారు తరచూ ఆచరించే సాంప్రదాయాలను సంవత్సరాలుగా ఆమోదించారు. సాంస్కృతిక గుర్తింపు లింకు వారి వారసత్వానికి ఒక వ్యక్తికి అదే సంప్రదాయాలు మరియు ప్రాథమిక విశ్వాస వ్యవస్థలు కలిగిన ఇతరులతో గుర్తించడానికి వారికి సహాయపడుతుంది.

ఒక వ్యక్తిని గుర్తిన్చేతప్పుడు అతని యొక్క సంస్కృతి పునాదిగా గుర్తింప బడుతుంది. దాని పై ప్రతి అంశం నిర్వహించబడుతుంది. ఒక సంస్కృతిని మనం అలవాటు చేసుకోవడం అంటే ఒక మతాన్ని, లేదా అలవాట్లను, వేషదారణని అలవాటు చేసుకోవడమే. అదే ఆవ్యక్తి ఏ మతానికి తెగకి లేదా ప్రాంతానికి సంభందించిన వ్యక్తో తెలుస్తుంది.

బారత దేశం విభిన్న కులాలు, మతం, ప్రాంతాల మధ్య వైరుధ్యంతో కలిసి మెలిసి ఉంది. ఆర్యుల ప్రబావంతో కుల వ్యవస్థ ఇక్కడ ప్రభలంగా నాటుకు పోయింది. కులం లో హెచ్చు తగ్గులు మనిషిని మనిషినీ వేరు చేసింది. ఒక బ్రాహ్మణ ఆచార వ్యవహారాలు మరే ఇతర కులాలలో కనిపించవు, అలగే ప్రాంతానికి ప్రాంతానికి మధ్య సాంస్కృతిక ఆచరణ లో తేడాలు స్పష్టంగా ఉంటాయి. బ్రాహ్మణ సంస్కృతి దళితుల , ఆదివాసీల సంస్కృతి ఎప్పటికీ కాలేదు. ఆలాగే దళితుల సంస్కృతి బ్రాహ్మణుల సంస్కుతి కాలేదు.

మను ధర్మం ప్రకారం శుద్ర కులాలకు సాంస్కృతిక వారసత్వం ఉండరాదు. వారు సేవకులే కానీ, ఎలాంటి హక్కులు ఉండకూడదు. పరిణామక్రమంలో అభివృది చెందిన శూద్రులు తమ చరిత్రను, సంస్కృతిని నిర్మించుకున్నారు. బ్రాహ్మణ ఆధిపత్యాన్ని రాజకీయంగా తగ్గించి వేసి శూద్రులు కొందరు అధికారంలోకి వచ్చేరు. కుల వ్యవస్తలో పంచములు గా వేరు చెయ్యబడ్డ అణిచివేత ప్రజలను అంటరానివారిగా చేసి ఏ హక్కు లేకుండా వెళ్ళ తరబడి దోపిడీకి గురిచేసేరు. అంటారనివారిగా ఉన్న వారిని నేడు దళితులు అని పిలుస్తున్నారు. బారత దేశంలో మెజారిటీ ప్రజలు అయిన ఈ దళిత వర్గాలకు తరాలుగా రాజ్యాధికారం కానీ లేదా ఒక సాంస్కృతిక సంభంధం కానీ లేకుండా, గుర్తింపు లేకుండా చేసేరు. రామానుజ మత ప్రబావంతో చాలామంది దళిత వర్గాలు హిందు మతాన్ని ప్రచారం చేసి అందులో ఉన్నా, కుల వ్యవస్థ వారికీ సరైన నిర్వచనం ఇవ్వలేదు. కులాలు, ఉప కులాలుగా హిందూ వ్యవస్తను మోయటానికే ఉపయోగించుకున్నారు.

1891 ఏప్రిల్ 14 న జన్మించిన బాబాసాహెబ్ డా అంబేడ్కర్, దళితుల అస్తిరత్వాన్ని కాపాడి వారి బవిషత్ కి బాటలు వేసిన వ్యక్తి. అయితే 1956 డిసెంబర్ 6 న చనిపోయిన బాబాసాహెబ్ డా అంబేడ్కర్ తర్వాత దళితుల అస్తిత్వం కోసం నాయకత్వం వహించిన వారు లేరు. బాబాసాహెబ్ ఒక ఆంత్రోపాలజిస్ట్ గా, సామాజిక శాత్రవేత్త గా, చరిత్రకారుడుగా, ఆర్ధిక వేత్తగా , రాజకీయ నాయకుడిగా దళితులను ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి.

దళితుల సాంస్కృతిక ఐక్యత అవసరం ఏంటి?

ముందు చెప్పుకున్నట్లు బారత దేశం వివిధ కులాల, మతాల , ప్రాంతాల, బాషల సమ్మేళనం. బిన్నత్వంలో ఏకత్వం కోసం బాబాసాహెబ్ డా బి ర్ అంబేడ్కర్ గారు ప్రతి పౌరుడికి  స్వేచ్చ, సమానత్వం, సౌభ్రాతత్వం ఉండాలని రాజ్యాంగాన్ని రచించేరు. రాజ్యాంగ దీపిక లో బారతీయుల మైన మేము అంటూ సంభోధించేరు. దురదృష్ట వశాత్తు మన దేశంలో ప్రతి చోటా ప్రబావితం చూపుతూ దళితులను అనగద్రోక్కుతుంది. రాజ్యంగ పరంగా హక్కులు కల్పించినా, అంటారనితనం నేరంగా పరిగనించినా బారతీయులలో కులం ముద్ర పోలేదు. అది రోజు రోజుకు తన ప్రబావాన్ని వివిధ రూపాల్లో దళితుల మీద చూపెడుతుంది.

బాబాసాహెబ్ డా అంబేడ్కర్ దళిత వర్గాలను వారి యొక్క స్తితిని మార్చేందుకు ఏ దేవుడి మీద కాని లేదా మహాత్ముడి మీద కానీ ఆదార పడవద్దు అని చెప్పేరు. కానీ సమాజం లో నేటి పరిస్తితి దళితులను ఓటు బ్యాంకు సమూహంగా గుర్తించి వారిని తెలివి గా ఫ్యూడల్ కులాల మీద ఆడరపడే విధంగా చేసేరు. గ్రామాల్లో రేషన్ కార్డు కానీ, ఆరోగ్య స్కీం కానీ,  వృద్దాప్య పెన్షన్ ఇలా ఒకటేమిటి ప్రతిదీ ఆ గ్రామ పెత్తందారి మీద ఆదరపడే విధంగా చేసేరు. వార్డ్ మెంబర్ దగ్గర నుండి ప్రతి ఎన్నికల్లో పెత్తందారి చెప్పిన వారికి ఓటు వేయక పొతే వారికి ప్రబుత్వ పధకాలు రద్దు చేస్తారు. ఈ క్రమంలో దళిత వర్గాలు ఒక్కటిగా ఉండాలంటే వారు సంస్కృతి పరంగా కలుస్తూ ఉండాలి. మిగతా దళిత వర్గాలతో అనుబంధం ఏర్పడాలి. ఒక చోట కూర్చొని చర్చించు కోవాలి. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక చోట కలవాలి.

హిందువులు ఏడాది పొడవునా మత పరంగా, పుష్కరాలు, తిరునాళ్ళు, పండగలు మరియు  వివధ సాంస్కృతిక కార్యక్రమాలు, వన బోజనాల పేరిట ఒక పెద్ద సమూహంగా కలుస్తారు. అది వారిలో ఒక ఐక్య బావాన్ని తీసుకు వస్తుంది. అదే ఇతర మతస్తుల్లో చాల తక్కువ. ఎవరికి వారే యమునాతీరు లా ఉంటారు.

ప్రత్యన్యాయ సంస్కృతి దళితుల్లో మార్పు తెస్తుందా?

దళితులు రెండే రెండు సందర్బాలలో దళితులుగా కలుస్తారు.ఒకటి బాబాసాహెబ్ జన్మించిన రోజు, రెండు బాబాసాహెబ్ మరణించిన రోజు. మతం మారిన దళితులు క్రిస్టియన్స్ గా క్రిస్టమస్ , ఈస్తర్ లేదా ప్రార్ధన సమావేశాల్లో కలుస్తారు. ఆ సందర్భంలో వారికి దళిత అస్తిత్వం కంటే క్రిస్టియన్ అస్తిత్వమే ఎక్కువ గుర్తింపు ఉంటుంది.

బాబాసాహెబ్ 127 వ జన్మదినం సందర్భంగా చాలా గ్రామాల్లో దళిత యువత బాబాసాహెబ్ డా అంబేడ్కర్ జయంతి ఉత్సవాన్ని ఒక పండగ వాతావరణం చెయ్యడం మనం చూసేము. గ్రామం లోని దళితులు అందరూ బాబాసాహెబ్ డా అంబేడ్కర్ విగ్రహం వద్ద బోజనాలు చెసరు. ఇలా సంవత్సరానికి ఒక రోజు అయినా వారు కలుసుకోవడం బాబాసాహెబ్ ని స్మరించుకోవడం, బాబాసాహెబ్ ని తెలుసు కోవడం ఐక్యత కు దారి తీస్తుంది. కుటుంబ సమేతంగా దళితులు ఒకచోట చేరాలి, అదే పెద్ద విప్లవానికి దారితీస్తుంది.

బాబాసాహెబ్ భీమ కోరేగాంవ్ ప్రతి సంవత్సరం సందర్శించే వారు. ఈ జనవరి 1 వ తేదీన లక్షాలాది దళిత యువత కోరేగంవ్ సందర్సించేరు. అలాగే బాబాసాహెబ్ బౌద్ధ దీక్ష రోజున మహారాష్ట్ర దళితులు నాగపూర్ లో సమావేశం అవుతారు. ఇలాంటి సమ్మేళనాలు అప్పుడు అప్పుడు జరగాలి. దళితుడి గా కుటుంబం తో సహా కలిస్తే విధాన నిర్ణయాలు తీసుకోవచ్చు, ప్రతి దళితుడిని బాబాసాహెబ్ మార్గంలో నడిపించవచ్చు.

మాన్యశ్రీ కన్షిరాం అంబేడ్కర్ సమ్మేళనాలు జరిపి దళిత ప్రజలను ఒక చోట చేర్చేవారు. బాబాసాహెబ్ డా అంబేడ్కర్ మనవడు ప్రకాష్ అంబేడ్కర్ DSS అనే సంస్తను స్తాపించి దేశ వ్యాప్తంగా దళిత కల్చర్ మరియు చరిత్రను  బోధించి దళితలను సమీకరించే పనిలో ఉన్నారు.

RSS లాంటి సంస్తలు హిందువులను సమీకరించటానికి దాదాపుగా 170 వివిధ ఆర్గనైజేషన్స్ ద్వారా చేస్తుంది. హిందు అనేది దేశంలో సవర్ణ హిందువులతో పాటు శుద్రులను అలాగే ఆదివాసీలను, దళితులను ఆకర్షిస్తుంది. దానికి కారణం హిందు సాంస్కృతిక ప్రయోగమే!.

విప్లవం సృష్టించాలంటే నాకో లక్ష సాంస్కృతిక సంఘాలు కావాలంటాడు ఒక పెద్ద మనిషి. బాబాసాహెబ్ అసయాలకోసం, రాజ్యాధికారం కోసం దళితులు ఎన్ని సాంస్కృతిక సంఘాలు ఏర్పాటు చేసుకుంటారో దళితులే నిర్ణయించుకోవాలి.   

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here