మోకాళ్ళ మీద నిలబడుతున్నదళిత ఉద్యమం!

0
130

సంకెళ్ళను తెంపుకో బానిస విముక్తుడవుతావు, వేర్లు తెంపుకోకు చచ్చిపోతావు: ఆఫ్రికన్ సామెత

రోహిత్ వేముల మరణంతో దేశంలో ఎస్సీల మీద రాజ్యం పరోక్షంగా దాడి ప్రారంభించింది అని ఈ వ్యాసాన్ని ప్రారంభించుకోవాలి. 2014 తర్వాత కేంద్రంలో కొత్తగా వచ్చిన బా జ పా సంకీర్ణ ప్రబుత్వం హిందూ అతివాద బావజాలం గల రాజకీయ పార్టీ గా దాని పూర్వాపరాలు పరిశీలన చేస్తే అర్ధం అవుతుంది. బా జ పా పుట్టుక రాష్టీయ స్వయం సేవక్ అని మనకి తెలిసిందే. ఈ దేశంలో రెండు సార్లు ఆర్ ఎస్ ఎస్ ని నిషేధించేరు. ఇలాంటి నేపధ్యం ఉన్న ధార్మిక –రాజకీయ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి రాగానే ఎస్సీల మీదకి తమ దళాలను పంపేరు. హైదరాబాద్ లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఇంకొన్ని రోజుల్లో డాక్టరేట్ తీసుకోబోతున్న రోహిత్ వేముల అనే విద్యార్ధి మరణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రోహిత్ వేముల మీద చర్యకు సాక్షాత్ కేంద్ర మంత్రి, బా జ పా నాయకుడు  బండారు దత్తేత్రేయ గారు సిపార్సు చెయ్యటం , ఆ పార్టీ ఏం ఎల్సీ రామచంద్ర రావు విస్వద్యలయంలోని ఆ పార్టీ విద్యార్ధి విభాగం తో మరియు వి సి ని కలవడం ఆ తర్వాత రోహిత్ వేముల అతని సహచర విధ్యార్ధులను కాలేజీ నుండి బహిష్కరించటం చక చకా జరిగిపొయాయి. ఆ తర్వాత వెంటనే మద్రాస్ విశ్వవిద్యాలయంలో అంబేడ్కర్ –పెరియార్ చైర్ ను రద్దు చెయ్యటం, పూణే ఫిలిం యునివర్సిటీ లో దాడి ఇవి అన్నీ ఒక దాని వెంట వరసగా జరుగిన సంఘటనలు.

ఇలాంటి నేపధ్యంలో తెలుగు రాష్ట్రాలలో జరిగిన కొన్ని సంఘటనలకు ప్రబుత్వం నుండి జవాబుదారీ తనం శూన్యం అని చెప్పాలి.  

తెలుగు రాష్ట్రాలలో ఎస్సీల పైన దాడి

జాతీయ స్తాయిలో ఎస్సీల మీద , బాబాసాహెబ్ డా అంబేడ్కర్ అనుచరుల మీద దాడి  హైదరాబాద్ కేంద్రం నుండి మొదలైతే అప్పటినుండి తెలుగు రాష్ట్రాలలో నవబారత నిర్మాత బాబాసాహెబ్ డా బి ర్ అంబేడ్కర్ గారి విగ్రహం మీద దాడి చెయ్యటం మొదలు పెట్టి పచ్చమ గోదావరి జిల్లా “గరగపర్రు” లో 400 మంది ఎస్సి కులస్తులను సాంఘిక బహిష్కరణ చెయ్యటం తో ఎస్సి లు ఆందోళన బాట పట్టేరు. ఆ తర్వాత ఒంగోలు మండలం లోని పెళ్లూరు లోని సామాజిక భవనంలో ఉన్న బాబాసాహెబ్ అంబేడ్కర్ గారికి చెప్పుల దండ వేసి అవమానించటం , అదే ప్రకాశం జిల్లలోని పరుచూరు నియోజకవర్గంలో అధికార శాసన సబ్యుడు రాత్రికి రాత్రే 400 మంది సాయుధ పోలీసు ల అండతో అధునాతన యంత్రాలు తీసుకు వచ్చి గత 40 సంవత్సరాలు పైబడి ఎస్సి లు సాగు చేసుకుంటున్న భూమిని ‘నీరు –చెట్టు’ పేరుతొ గుంటలు తవ్వటం , ఖమ్మం జిల్లా మందని లో మధుకర్ అనే యువకుడిని ప్రేమ వ్యవహారంలో అతని మర్మాంగాలు కోసి , చిత్రహింసలు చేసి చంపటం, యానం లోని ప్రవేట్ కాలేజీ లో , గుడివాడ , పచ్చమ గోదావరి జిల్లా లో బుడగ జంగాలు ప్రతిష్ట చేసుకున్న బాబాసాహెబ్ శిలా విగ్రహం తొలగించటం , ఆబగ్నపట్నం లో ఇద్దరు ఎస్సి యువకులను ముక్కు ను నెలకు రాయించటం సంఘటనలు మరియు కొత్త సంవత్సరం నేపద్యంలో గుంటూరు జిల్లా పెద్ద గొట్టిపాడు లో యువకుల మీద దాడి, విజయనగరం జిల్లా లో జన్మ భూమి కార్యక్రమంలో తన సమస్య గురించి అర్జీ రాస్తున్న ఎస్సి యువకుడిన చితకబాదిన సంఘటన్ , పెండుర్తిలో వివాహిత మహిళను బహిరంగంగా వివస్త్రను చేసి దాడి చెయ్యటం లాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.   

ఈ సంఘటనలు ఇలా ఉంటే ఆంధ్ర ప్రదేశ్ లో అధికార తెలుగు దేశంకి సంభందించిన ముఖ్యమంత్రి, మంత్రులు మరియు ప్రతిపక్ష నాయకురాలు ఎస్సి లను తక్కువ చేసి మాట్లాడటం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎస్సి లలో ఎవరు పుట్టాలి అని ఎవరు కోరుకుంటారు అంటే అయిన సహచరుడు మంత్రి ఆది నారాయణ రెడ్డి ఎస్సి లు పరిశుబ్రంగా ఉండరు అని బహిరంగంగా కామెంట్ చేసేరు. అలాగే ప్రతిపక్ష నాయకురాలు రోజా , మేము ఎస్సి / ఎస్టీ లం కాదు మమ్మల్ని ముట్టుకోవచ్చు అని మాట్లాడితే , ముక్య మంత్రి చంద్రబాబు ఎస్టీ లకు తెలివిలేదు అని కించపరిచేడు.

జవాబు లేని ఎస్సీల ఉద్యమం

తలుగు ఎస్సిలకు దేశ వ్యాప్తంగా ఒక ప్రత్యెక స్తానం, గౌరవం ఉంది. బాబాసాహెబ్ డా బి ర్ అంబేడ్కర్ గారితో కలసి పనిచేసిన మాదిరి బాగ్య రెడ్డి వర్మ వంటి  నాయకులు , మాకొద్దీ నల్ల దొరతనం అని ఆనాటి ఫ్యూడల్ కులాల పెత్తనం ను ఎండగట్టిన కుసుమ ధర్మన్న , బి ఎస్ వెంకట రావు అలాగే కారంచేడు, చుండూరు ప్రతిఘటనా పోరాటం ద్వారా ఎస్సీల ఉద్యమ శక్తి దర్భన్ వేదిక మీద ప్రపంచానికి చెప్పిన ఎస్సి నాయకత్వం ఉన్న తెలుగు రాష్ట్రాలలో నేడు ఉద్యమాలకు ప్రబుత్వం నుండి  కనీసం స్పందన కరువుతుందా అనిపిస్తుంది.

గరగపర్రు పోరాటం ఎస్సీల చైతన్యానికి ఒక నిదర్సనం. ఆంధ్ర , తెలంగాణా లోని ఎస్సి లు , బాబాసాహెబ్ వారసులు మీడియా ద్వారా గరగపర్రు వెలి ని తెలుసుకుని స్వచ్చందంగా వేలాది మంది యువకులు గరగపర్రు గ్రామాన్ని దర్శించి నాలుగు నెలలుగా హక్కుల కోసం పోరాడుతున్న ప్రజలను అక్కున చేర్చుకుని భరోసా కల్పించేరు. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో యాద్రిచ్చికంగా యాకోబు అనే గరగపర్రు బాదితుల కమిటీ నాయకుడు లారీ ప్రమాదంలో అనుమానాస్పదంగా చనిపోవడం నేటికీ ఒక పెద్ద ప్రశ్న గా మిగిలిపోయింది. ప్రబుత్వం తరుపున గరగపర్రును దర్శించిన ఎస్సి నాయకులు కేసును నీరుగార్చేరే గానీ గరగపర్రు మాల కులం ప్రజల వెలికి ప్రదాన సమస్య అయిన బాబాసాహెబ్ డా అంబేడ్కర్ విగ్రహం వారు కోరుకున్న స్తలంలో ప్రతిస్ట చేసుకోలేకపోయేరు. యాకోబు ప్రమాదం, విహ్రహ ప్రతిష్ట రెండూ ప్రబుత్వం తరుపునుండి వచ్చిన ఎస్సి నాయకులే నీరుగార్చేరు అని ప్రజలు అనుకుంటున్నారు. అలాగే దేవరపల్లిలో ఎస్సిలకు తిరిగి వారి భూమి ఇచ్చినట్లు గా ఇచ్చి , అధికార పార్టీ సానుబూతి పరుడు , అదే కులానికి సంభందించిన వ్యక్తీ తో కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్ తీసుకురావడం అంతా ప్రబుత్వ పెద్దల కనుసన్నల్లో జరిగిపోయింది. అలాగే మందని మధుకర్ సంఘటనలో రెండు రాష్ట్రాలనుండి యువత స్వచ్చందంగా మంధనిలో ధర్నా చేసి రీ పోస్ట్ మార్టం కి అనుమతి తీసుకుని చేయించినా ఇప్పటి వరకూ పోస్ట్ మార్టం రిపోర్ట్ బహిరంగ పరచలేదు. ఆబగ్నపట్నంలో ఎన్నో నాటకీయ పరిణామాల తర్వాత దోషిని అరెస్ట్ చేసినా కంటితుడుపు చర్యగానే ఎస్సి లు బావిస్తున్నారు. పాలకులు, ఫ్యూడల్ కులాలు ఇదే అలసుగా ఎస్సీల మీద దాడి చేస్తున్నాయి.

చరిత్ర మరచిన ఎస్సి నాయకత్వం?

ఆంధ్రప్రదేశ్ రెండుగా విభన జరిగిన తర్వాత ఇరు రాష్ట్రాలలో ఎస్సీల కు రాజకీయ అధికారం చేజిక్కించుకునే అవకాసం చాల ఎక్కువ. ప్రత్యెక తెలంగాణా ఉద్యమానికి ఆంధ్రాకి సంభందించిన ఎస్సీలు మద్దత్తు పలకటానికి కారణం కుడా బవిషత్ ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే. తెలంగాణా ఉద్యమాన్ని ముందు వుండి నడిపింది, ధూం – ధాం చేసింది ఎస్సి కళాకారులే! కానీ తమ సొంత రాజ్యదికారంకోసం మాత్రం తప్పటడుగులు వేస్తూనే ఉన్నారు. జనభా పరంగా ఇరు రాష్ట్రాలలో అధికంగా ఉన్నా సమస్యల మీద పోరాడటంలో పూర్తిగా విఫలం చెందేరు. ప్రతి ఒక్కరూ బూర్జువా కులాల బోయలుగా మారటానికి తహ తహలాడుతున్నారు. మరి కొందరు నాయకులు ఒక అడుగు ముందుకు వెళ్లి వారి ఫ్యూడల్ నాయకుడిని అణగారిన వర్గాల ఆశాజ్యోతి బాబాసాహెబ్ డా బి ర్ అంబేడ్కర్ గారిని పోల్చడం ఎస్సీ నాయకత్వం యొక్క మానసిక స్తితి అర్ధం అవుతుంది.

వందేళ్ళ తెలుగు దళిత ఉద్యమ చరిత్ర ఈరోజు నిర్వీర్యం అవటం , కొందరు వెన్నుముక లేని నాయకులు నిటారుగా నిలబడలేక మోకాళ్ళ మీద నుంచునే ప్రయత్నం చెయ్యటం ఎస్సీల బవిషత్ కి ప్రమాదకరంగా మారింది అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు.

ఎస్సీల యువ నాయకత్వం అయినా నిటారుగా నిలబడుతుందేమో చూద్దాం! 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here