దళిత సంఘాల శక్తి ఎకీకరణ అవుతుందా? వారి పయనం ఎటు?

0
114

బారత దేశంలోని దళిత ఉద్యమాలకు తెలుగు రాష్ట్రాల దళిత ఉద్యమం ఒక విధంగా చెప్పాలి అంటే తల్లిలాంటిది. మహారాష్ట్ర అంబేడ్కరిస్ట్ ఉద్యమాలు విచ్చిన్నం అయి గ్రూపులు గా విడిపోయి రాజకీయ పార్టీల పల్లకి మోస్తున్న క్రమంలో తెలుగు రాష్టాలలో దళిత ఉద్యమం సరికొత్త రూపం తీసుకుని ఫ్యూడల్ కుల ఆధిపత్యం పై విజయం సాధించింది.

1980 నుండి 1990 కాలానికి దేశ వ్యాప్తంగా దళిత ఉద్యమాలు రాజకీయ ఉద్యమం గా మారే క్రమంలో ఇక్కడ కుడా దళిత ఉద్యమాలలో పగుళ్ళు వచ్చాయి. నాయకత్వం అమ్ముడు పోయిందా లేదా ఫ్యూడల్ కులాల పల్లకి మోస్తుందా లేదా వారి ఎత్తుగడలో పావులు అయ్యేరా అనేది పక్కన పెడితే దళితులు ఒక చారిత్రాత్మక తప్పిదం అయితే చేసేరు అని చెప్పక తప్పదు.

నేర్రులు బారన నేల లో పిలకలు మొలకెత్తడం సహజం అలాగే దళిత ఉద్యమంలో కుడా అలాంటి పిలకలు ఊరికి ఒక్కటి, వీదికొక్కటి అన్నట్టు గా మొలకేత్తేయి. ఈ పిలకలే ఫ్యూడల్ కులాలకు ఎరువుగా ఉపయోగపడుతున్నాయి.

బాబాసాహెబ్ డా . బి ర్ అంబేడ్కర్ చెప్పినట్లు “ చరిత్ర తెలియని వాడు, చరిత్రను నిర్మించలేరు” కొత్తగా పుట్టిన దళిత సంఘాలకు దళితుల చరిత్ర కంటే దళిత ఉద్యమం మీద బ్రతకటమే తెలుసు. ఇక్కడ ఇంకో ప్రదాన సంఘన చేపుకోవాలి. దళిత ఉద్యమాలు కుల ఉద్యమాలు గా మరిపోయినప్పుడు ఇంటికొక సంఘం ఏర్పాటు చేసుకోవడం లో కుల సంఘాలు బిజీ అయిపోయేరు.

తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు దళిత మేధావులు, రచియితలు, కవులు, కళాకారులు, ప్రజా ఉద్యమకారులు చెప్పిన మాట చిన్న రాష్ట్రాలు దళితుల రాజ్యాధికారానికి ఒక మెట్టు అన్నారు. రాష్ట్రం విడిపోయి రెండు రాష్ట్రాలలో ఫ్యుడలిస్ట్ పార్టీలు అధికారం లోకి వచ్చి మునుపెన్నడూ లేనటువంటి దాడులు, వివక్ష దళితుల మీద జరుగుతుంటే కనీసం స్పందన లేని దళిత మేధావులు,కవులు,కళాకారులు, ప్రజా ఉద్యమకారులు.

బాబాసాహెబ్ మనవుడు ప్రకాష్ అంబేడ్కర్ గారు  2016 సెప్టంబర్ లో డిల్లీ లో దళిత సంఘాలు అన్నీ ఒకే తాటి మీదకు రావాలని ఒక DSS అంటే దళిత్ స్వాభిమాన్ సంఘర్ష్ ను ఏర్పరిచి ఒక బహిరంగ సభ నిర్వహించేరు.దళిత స్వభిమాన్ సంఘర్ష్ యొక్క ముక్య ఉద్దేశ్యం ది క్వింట్ అనే ఆంగ్ల వెబ్సైట్ కి ఇచ్చిన ఇంటర్వు లో  ప్రకాష్ అంబేడ్కర్ మాట్లాడుతూ  “We want the Dalit Swabhiman Sangharsh to become a catalyst organization at the socio, religious level”  అన్నారు.

దళితుల ఏకీకరణ ఇప్పుడే ఎందుకు?

కేంద్రంలోను , రాష్ట్రాల లోను దళితుల ఓట్ల తో అధికారంలోకి వచ్చిన బి జే పి, తెలుగు దేశం మరియు తెలంగాణా రాష్ట్ర సమితి ఎన్నికల్లో చేసిన ప్రమాణాలు గాలికి వదిలేసి దళితుల మీద దాడులకు సహకారం అందిస్తున్నారు. 2014 లో అత్యధిక దళిత ఓట్లు సాధించుకున్న BJP దళితుల హక్కులను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తుంది. దళిత ముఖ్యమంత్రి అని ఉద్యమం లో దళితులను వాడుకున్న కేసిర్, మందని లో మధుకర్ అనే యువకుడి హత్య పై  హైకోర్టు ఆర్డర్ ద్వారా రీ పోస్ట్ మార్టం చేసి నివేదకను ఇప్పటి వరకూ ఇవ్వలేదు అంటే దళిత వర్గాల పట్ల కేసిర్  చిత్త శుద్ధి ని తెలియజేస్తుంది. ఆంధ్రలో గత నాలుగు సంవత్సరాలలో దళితుల మీద దాడుల్లో ఐదో స్తానం లో ఉంది అంటే మనం ఊహించు కోవచ్చు.

మొట్ట మొదటి దళిత మహిళా ముఖ్యమంత్రి గా నాలుగు సార్లు ఉత్తర ప్రదేశ్ లో ప్రబుత్వాన్ని ఏర్పరిచిన బెహన్ జీ మాయవతి గారిని BJP ఉపాధ్యక్షుడు వైశ్య కంటే హీనం అని సంబోధించిన, ముఖ్యమంత్రి  నారా చంద్ర బాబు నాయుడు దళితుల్లో ఎవరు పుట్టాలి అని కోరుకుంటారు, అలాగే అతని మంత్రి వర్గ సహచరుడు ఆదినారాయణ రెడ్డి ‘దళితులు శుభ్రంగా ఉండరు’ అని కామెంట్ చేసినా మేము ఎస్సి, ఎస్తీలం కాదు మమ్మల్ని తాకొచ్చు అన్న వై సి పి శాశన సబ్యురాలు రోజా అన్నా , రోహిత్ వేముల, గరగపర్రు, అగిరిపల్లి, దేవరపల్లి, పెద్ద గొట్టిపాడు, పెందుర్తి లాంటి అనేక సంఘటనలు జరిగినా, జరుగుతున్నా దళిత నాయకత్వం ఒక్క గొంతు ద్వారా నిరసన ప్రకటించ లేక పోవడం శత్రువు కు బలం చేకుర్చినట్లు అయ్యింది.

దేశ వ్యాప్తంగా జరుతుగుతున్న సామాజిక, రాజకీయ మార్పులు, RSS-BJP యొక్క హిందుత్వ పోకడలు నేడు దళితుల అస్తిత్వానికి ప్రమాదం గా ఏర్పడింది. ఇటీవల SC,ST Act తీర్పు పై సుప్రీం కోర్టు న్యాయమూర్తి ప్రదానమంత్రి నే ఆ చట్టం నిర్వీర్యం చెయ్యమని ఇప్పుడు మా తీర్పును తప్పు పట్డండం కరెక్ట్ కాదు అనడం BJP దళిత అస్తిత్వం మీద బాబాసాహెబ్ డా అంబేడ్కర్ మీద చేస్తున్న కుట్ర అర్ధం అవుతుంది. 2026 నాటికి భీం స్మృతి ( బారత రాజ్యాంగం)ని పార్లమెంట్ సాక్షిగా తగలబెడతాం అని ప్రమాణాలు చేసుకున్న మితవాద హిందుత్వ శక్తులు అధికారంలోకి రాకుండా ఉండాలి అంటే దళితుల ఏకీకరణ జరగాలి. మనుస్మృతి బారత రాజ్యాంగం కాకుండా అడ్డుకోవాల్సిన ఆవశ్యకత ముక్యంగా దళిత వర్గాల మీద ఉంది.

దళితుల పయనం ఎటు?

దళితులు స్వతంత్రంగా రాజకీయం చేస్తారా లేక ఫ్యూడల్ కుల పార్టీలకే మద్దత్తు ఇస్తారా? అనేది తేల్చుకోవాల్సిన విషయం. కొన్ని కుల సంఘాలు నేరుగా ఫ్యూడల్ కుల పార్టీలకు మద్దత్తు పలకడం, వారి అధికారం కోసం కులాన్ని వారి కి జై కొట్టించే పని చెయ్యడం దళితుల సమాధి కి ఈ కుల సంఘాల నాయకులే గోతులు తీస్తున్నారు అనుకోవాలి. రెడ్డి జనాబ్యుదయ సంఘం పేరిట రెడ్లు రాజకీయం చేసినా, కమ్మ జనబ్యుదయ సంఘం పేరిట కమ్మలు రాజకీయంగా ఎదిగినా 1950 నుండి నేటి వరకూ జరిగిన, జరుగుతున్న కుల సమీకరణ లు అవగాహన్ చేసుకుని కులానికి దశ, దిశ కల్పించలేని దళిత మేధావి వర్గం మరియు కుల సంఘాలు ఇకనైనా తమ వైఖిరిలో మార్పు తీసుకోవాలి. ఒక వైపు దళితుల ఓట్ల తో దళితులను రాజకీయ, సామజిక సమాధి చేయ్యబోతుంటే గుడ్లప్పగించి చూస్తూ ఊరుకోవడం దళిత జాతికేవీరి చర్య సిగ్గుచేటు.

చివరిగా,

RSS-BJP హిందువు లకు రక్షణ గా నిలబడుతుంది అని బహిరంగంగా చెబుతుంది. దళిత వర్గాలకి ప్రదాన శత్రువు హిందూ మతం. మరి అలాంటి సంఘాలను, పార్టీ లను దళితులు ఎలా మద్దత్తు ఇస్తారు. వాళ్ళు గో రక్షణ , రిజర్వేషన్లు , అఖండ హిందూ దేశం గురించి, మనుస్మృతి గురించి మాట్లడుతున్నారు. మరి దళితుల గురించి మాట్లాడే సంఘం ఏది.

దళిత్ స్వాభిమన్ సంఘర్ష్ దళితుల సంస్కృతీ, సామాజిక స్తితిగతుల గురిచే మాట్లాడుతుంది అంటున్నారు ప్రకాష్ అంబేడ్కర్ గారు. ఈ పరిణాం ఒక విధంగా మంచిదే, దేశ వ్యాప్తంగా దళితుల కోసం, దళిత సంస్కృతీ కోసం ఒక సంస్త రావడం. మరి రాజకీయం గురించి ఎవరు మాట్లాడతారు? ప్రజలకే వదిలేద్దామా? వివిధ కుల సంఘాలగా, అంబేడ్కర్ సంఘాలగా విడిపోయి అధికార పార్టీల అడుగులకు మడుగులు వత్తు దామా?

సంకెళ్ళు తెంపు కో బానిస విముక్తి కలుగుతుంది,వేర్లు తెంపుకోకు చచ్చిపోతావు  అన్న ఆఫ్రికా సామెత దళిత వర్గాలకు ఆపాదిద్దామా? Let them decide?  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here