నీరవ్ మోడీ రూ.12 వేల కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కాం దేశ ప్రజలను షాక్ కి గురిచేసింది

0
78

నీరవ్ మోడీ రూ.12 వేల కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కాం దేశ ప్రజలను షాక్ కి గురిచేసింది. మోడీ ప్రబుత్వం లో కుడా స్కాం లు జరుగుతాయా? అని రచ్చ బండ దగ్గర విశ్రాంతి ఉద్యోగులు చర్చ చేసుకుంటున్నారు.

బారత దేశానికి అవినీతి కొత్త కాదు. ఇప్పటికే దేశం అవినీతిలో నిండా మునిగి ఉంది. రాజకీయ అవినీతి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.అయితే కొన్ని అవినీతి సంఘటనలు కొందరికి పదవులు పోయాయి. బోఫర్స్ కుంబకోణం రాజీవ్ గాంధీ పదవి పోయింది. పార్లమెంట్ లో తీవ్ర చర్చ జరిగింది. కార్గిల్ శవ పేటికల కుంబకోణం జార్జి ఫెర్నాండేజ్ లాంటి నాయకులను చరిత్ర పుట లలో నుండి తొలగించేరు.వాజిపాయి ప్రబుత్వం ఎన్నికల్లో ఓడిపోయింది.

ఫిబ్రవరి 1 న మోడీ ప్రబుత్వం తమ చివరి బడ్జెట్ ప్రవేశ పెట్టె సమయానికి మోడీల అవినీతి ఈ దేశంలో తీవ్రంగా జరుగుతున్న చర్చ. ప్రదాని నరేంద్ర మోడీ గ్రాఫ్ పాదరసంలా కరిగిపోతున్న సమయం.

నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కాం కి ముందు లలిత్ మోడీ, విజయ్ మాల్య లాంటి బడా వ్యాపారవేత్తలు దేశం నుండి వెళ్ళిపోయేరు. ఒకవిధంగా చెప్పాలి అంటే పారిపోయేరు.

మోడీల అవినీతి అంటూ సోషల్ మీడియా లో జరుతున్న చర్చ. ప్రదాని మోడీ 56 అంగుళాల చాతి కుచించుకు పోయిన సంఘటన. ప్రతిపక్షాలను బ్రస్టాచార్ అని తన మన్ కీ  బాత్ లో అనే అవకాసం కోల్పోయిన సంఘటన. ఈ ముగ్గురు వ్యాపార వేత్తలు దేశం విడిచి వెళ్ళిపోవడానికి మోడీ ప్రబుత్వం అండ దండలు ఉన్నాయి అని ప్రజల్లో చర్చ.

మోడీ మీద ప్రజలు ఎందుకు విశ్వాసం పెంచుకున్నారు?

బారతీయ జనతా పార్టీ 2014 లో మోడీ తరహా అభివృది, గుజరాత్ మోడల్ అంటూ ప్రచారం వుదరగోట్టేరు. అవినీతి విషయంలో కాంగ్రెస్స్ ని ముద్దాయి గా పేర్కొంటూ దేశ వ్యాప్తంగా ఉద్యమాలు చేసేరు.

ఎన్నికల ప్రచారంలో బాగంగా బా జ పా ప్రదాని అబ్యార్దిగా నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ విదేశీ బ్యాంక్ లలో దాచుకున్న అవినీతి సొమ్ము తీసుకు వచ్చి ప్రతి పోరుడి ఖాతా లో రూ .15 లక్షలు డిపాజిట్ చేస్తాను అని ఎన్నికల ప్రచారంలో హోరెత్తించిన ప్రదాని నేడు ఆ ఉసే ఎత్తడం లేదు.

దేశంలో అవినీతి రహిత పాలన కావలి అని, స్వచ పాలన, లోకపాల్ బిల్లు తెసుకురవాలి అని డిల్లీ లో దీక్షలు చేసిన అన్నా హజారే , అరవింద్ క్రేజ్రివాల్ , కిరణ్ బెడి లాంటి వారు అవినీతి గురించి మాట్లాడటం లేదు.

UPA కాంగ్రెస్ ప్రబుత్వం వివిధ ఆర్ధిక కుంబకోణాలలో తల మునకలై ఉన్న సమయంలో మోడీ అవినీతి రహిత అభివృద్ధి అంటే అన్ని వర్గాల ప్రజలు ఓట్లు వేసి విశేషమైన మెజారిటీ తో గెలిపించేరు. కానీ ప్రజల ఆశలు ఆవిరై పోవడానికి చాల తక్కువ సమయం పట్టింది.

మోడీ ప్రబుత్వం 2018-19 ఆర్ధిక బడ్జెట్ ప్రవేశ పెట్టె సమయానికి సరిగ్గా నెల రోజుల క్రితం జనవరి 1, 2018 న, నీరవ్ మోడ్ దేశం విడిచి పారిపోయేడు. దేశ ప్రజలు గగ్గోలు పెట్టేరు. అసలే ఆర్ధిక లోటు తో, పెద్ద నోట్ల రద్దు వలన బ్యాంకు ల్లో డబ్బులు లేక ప్రజలు అల్లాడిపోతుంటే ఈ మోడీ లు వేల కోట్ల రూపాయిలు స్కాం లు చేసి దర్జాగా ఎలా దేశం విడిచి పారిపోతున్నారు అని ప్రజల్లో నరేంద్ర మోడీ ప్రబుత్వం మీద అసహనం పెరిగిపోయింది. నీరవ్ మోడీ బందువు , ఐ సి సి ఐ బ్యాంకు చైర్మన్ చందా కొచ్చార్ భర్త , గీతాంజలి డైమండ్స్ అధినేత మేహల్ చోస్కి జనవరి 6 , 2018 న దేశం నుండి వెళ్లిపోయేడు. నీరవ్ మోడీ , లలిత్ మోడీ , మేహల్ చౌస్కి మొదలగు పెద్ద పెద్ద స్కం లు చేసిన వారు గుజరాత్ కి సంభందించిన వ్యక్తులు కాబట్టి ప్రదాని నరేంద్ర మోడీ మీద ప్రజలకు అనుమానం కలుగుతుంది.

వేల కోట్ల స్కాం పార్లమెంట్ లో ఎందుకు చర్చకు రాలేదు?

సహజంగా ఏ చిన్న సంఘటన అయినా ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ మీద దుమ్మెత్తి పోయటానికి పార్లమెంట్ ఒక మంచి వేదికగా తీసుకుంటారు. ప్రబుత్వమే స్తంభించిన రోజులు బారత పార్లమెంట్ ప్రజాస్వామ్యం లో జరిగింది. అలాంటిది వేల కోట్ల రూపాయిల డబ్బు స్కాం చేసి విదేశాలకు దర్జాగా పారిపోయిన మోడీలా అవినీతి పార్లమెంట్ లో ఒక్క సెకండ్ కుడా చర్చకు రాలేదు అంటే దీని వెనకాల అధికార పక్షాల పెద్ద రాజకీయ వ్యూహం ఉండి ఉంటుంది.

నెల రోజులుగా లోక్ సభ , రాజ్య సభ ఎలాంటి బిజినెస్ లేకుండా వాయిదాలు మీద వాయిదాలు వేసుకుంటూ కాలం గడిపేరు. పార్లమెంట్ లో నాయకుడు, ప్రదాని నరేంద్ర మోడీ మౌన మునిలా ఒక్క మాట కుడా మాట్లాడకుండా కొన్ని ప్రాంతీయ పార్టీలు పార్లమెంట్ ని స్తంభింప చేస్తుంటే చూస్తూ ఊరుకోవడం అంటే తమ ప్రబుత్వం మీద అవినీతి బురద ను అడ్డు కోవడం కోసమేనా !

ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యెక హోదా , తమిళనాడు లో కావేరీ జల వివాదం, తెలంగాణా లో రిజర్వేషన్లు ఈ మూడు అంశాలు దేశం మొత్తం సమస్యలను పక్కదారి పట్టించేయి అంటే సామాన్య ప్రజలు కూడా అచ్చర్య పడక తప్పదు.

ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యెక హోదా విభజన అంశం లోనిది. కేంద్రం ప్రత్యెక హోదా కాదు, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాము అంటే చంద్రబాబు నాయుడి ప్రబుత్వం ఆహ్వానించింది. కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ కి , నేటి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడి కి సన్మానాలు, తిరుమల ప్రసాదాలు పంచి పెట్టింది. ప్రత్యెక హోదా అంటే విధ్యార్ధులను జైలు కు పంపిస్తాం అన్నారు. ప్రతిపక్ష నాయకుడు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ని అభివృద్ధి నిరోధకుడు అని ప్రచారం చేసేరు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుడా ప్యాకేజీ బాగుంది అని కితాబు ఇచ్చేడు. ఆలాంటిది ఇప్పుడు జనసేన అధినేత, వై సి పి అధినేత ప్రత్యెక హోదా అంటూ రోడ్ల మీద ర్యాలీలు చేస్తూ పార్లమెంట్ లో నిరసన చేస్తున్నారు. అవిశ్వాస తీర్మానం అంటూ నెల రోజులుగా పార్లమెంట్ ని స్తంభింపజేసేరు.

గత పార్లమెంట్ సెషన్ లో ఆంధ్ర కి ప్రత్యెక హోదా కోసం మద్దత్తు పలికిన TRS పార్టీ MP కవిత నేడు పార్లమెంట్ లో ఆచర్చ రాకుండా ఆడుకోవడం ఒక కుట్ర. అదేవిధంగా కావేరి జల వివాదం కోసం AIADMK పార్లమెంట్ లో నినాదాలు చేస్తూ మోడీ ప్రబుత్వం మీద అవినీతి చర్చ జరగకుండా చేసే ఎత్తుగడ గా ప్రజలు విశ్వసిస్తున్నారు.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో వెలుగులోకి వచ్చిన అతి పెద్ద ఆర్ధిక కుంబకోణం ఎలాంటి చర్చ లేకుండా ముగిసింది అంటే అవినీతి రహిత పాలన అందిస్తాం అన్న మోడీ – బా జ పా ప్రబుత్వం మీద అనుమానాలు రేకేతిస్తుంది. ఒక విధంగా చెప్పాలి అంటే దేశ ప్రజల విశ్వాసాన్ని నరేంద్ర మోడీ వమ్ము చేసేరు అని చెప్పవచ్చు.

పాద యాత్రలో నిండా మునిగి ఉన్న వై ఎస్ జగన్మోహన్ రెడ్డి, అనూహ్యంగా హోదా ఉద్యమం ఎత్తుకోవడం ఖచ్చితంగా కేంద్ర ప్రబుత్వాన్ని కాపాడే కుట్రలో బాగమే. అలాగే పొరుగు రాష్ట్రాలు ప్రత్యెక హోదా మీద చర్చ లేకుండా ఒకరు రిజర్వేషన్లు పేరుతొ ఇంకొకరు కావేరి జల వివాదం పేరుతొ పార్లమెంట్ ని అడ్డుకోవడం కుడా మోడ్ రాజకీయ వ్యూహం లో బాగమే?

మోడీల అవినీతి పార్లమెంట్ లో చర్చ కు  రాకపోవచ్చు కానీ ప్రజా కోర్టు లో చర్చ జరుగుతుంది.అవినీతికి మద్దత్తు తెలిపిన ప్రతి ఒక్కరూ ప్రజా కోర్టులో దోషులు గా నిలబడాల్సిందే!

పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశ పెట్టిన నాటి నుండి ఆంధ్ర రాజకీయ పార్టీలు ప్రత్యెక హోదా గళం ఎత్తుకున్నారు. ముక్యంగా వై సి పి పార్టీ అధ్యక్షుడు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్ ముగియగానే వై సి పి పార్లమెంట్ సబ్యులు పదవులకు రాజీనామా చేస్తాము అని ప్రకటించేరు.

వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటన యాదృచ్చికంగా వచ్చిందా! లేక దాని వెనకాల ఏమైనా కుట్ర ఉందా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here