ప్రజాస్వామ్య దేశంలో ఓటు ప్రదాన హక్కు

0
107
Ahmedabad: Dalit community members shout slogans during a protest in Ahmedabad on Friday against the recent attack on dalit members at Una, Rajkot. PTI Photo (PTI7_22_2016_000130A)

పూర్వకాలం లెక్కలు అనుసరించి బారత దేశంలో దళిత, ఆదివాసీ ల జనాభా 21% మాత్రమె. ప్రజాస్వామ్య దేశంలో ఓటు ప్రదాన హక్కు. దళితులు, ఆదివాసీలు ఒకప్పుడు గంప గుత్తుగా కాంగ్రెస్స్ పార్టీకి వేసేవారు. కానీ ఇప్పుడు పరిస్తితులు మారేయి. 50% పైగా దళిత ఓట్లు చీలిపోయాయి. అందులో బిఎస్పీ కాంగ్రెస్స్ నుండి రాబట్టుకుంటే ఇటీవల కాలం లో దళితుల ఓట్లు కాంగ్రెస్స్ కంటే ఎకువ గా పడ్డాయి.

ఎస్సి, ఎస్టీ అత్యాచార చట్టం (ఫై ఓ ఏ యాక్ట్ ) పై సుప్రీం మాట్లు వేసే పరిస్తితి చుసిన తరువాత దళిత , గిరిజన ఓటర్లు బా జ పా నుండి దూరం జరుగుతారా? ది మోస్ట్ అంటచబుల్ పొలిటికల్ పార్టీ బా జ పా ని అంటరాని ప్రజలు బుజాన మొయ్యాలి అనుకుంటున్నారా?

ఆంధ్రప్రదేశ్ లో ఎస్సి/ఎస్టీ ఓటర్లు 18% మైనారిటీ ఓటర్లులను కలుపుకుంటే 27 %. గత ఎన్నికల్లో అంధ ప్రదేశ లో తె దే పా మరియు బా జ పా పొత్తు ద్వారా ఉమ్మడిగా ఎన్నికల బరిలో దిగి విజయం సాధించారు. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో కోస్తా జిల్లాల్లో ఒక్క స్తానం కుడా సొంతగా గెలవలేని బా జ పా కి నేడు మాత్రులు గా కూడా ఉన్నారు. బా జ పా గెలడానికి కారణం తె దే పా తో  పొత్తు అనుకుంటే, దళితులు, మైనారిటీ లు,బా జ పా కి ఓటు వేసేరు. అలాగే కాశ్మీర్ లో పి డి పి తో పొత్తు పెట్టుకున్నారు. దీనిని బట్టి దళిత , మైనార్టీ ప్రజలు తమ గోతిని తాము తోవ్వుకున్నారు. తెలంగాణా లో తె రా సా వైపు నడిచేరు.

దళిత ఓటర్ల కు అవగాహన లేదా?

దళితులకు హిందూ మనుస్మృతి ప్రదానమైన శత్రువు గా బావించి, బాబాసాహెబ్ డా బి ర్ అంబేడ్కర్ గారు 1956 డిసెంబర్ 25న బహిరంగంగా తగలబెడతారు.ఆనాటి నుండి దళితులు బాబాసాహెబ్ డా అంబేడ్కర్ దహనం చేసిన రోజుని గుర్తు చేసుకుంటూ దేశ వ్యాప్తంగా మనుస్ప్రుతి ని దహనం చేస్తారు

బారతీయ జనతా పార్టీ  ఆర్ ఏస్, ఎస్ యొక్క రాజకీయ సంఘం ఈ విషయం రాజకీయాలు అవగాహన ఉన్న ప్రతి దళితుడు , ఆదివాసీలకు తెలుసు. CSDS అనే సంస్త ప్రకారం దళితుల ఓట్లు 2014లో  కాంగ్రెస్స్ కంటే బా జ పా కే ఎక్కువ పడ్డాయి అని చెబుతుంది. మరి ఇది ఎలా సాద్యం.ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ మదత్తు పలికిన బా జ పా కి ఓటు వేసేరు. తెలుగు దేశం-బా జ పా ప్రబుత్వం 2014 నుండి రాష్ట్రంలో దళితుల పై దాడి చేస్తూనే ఉన్నారు. బారతీయ జనతా పార్టీ చరిత్ర తెలిసిన ఏ దళితుడు ఆ పార్టీ కి డైరెక్ట్ గా గానీ లేదా ఇండైరెక్ట్ గా గాని సపోర్ట్ చెయ్యకూడదు. కానీ దళితులు ఇవి ఏమీ పట్టించుకోవడం లేదు. గుడ్డెద్దు చేలోపడినట్లు ఫ్యూడల్ కులాల, మనువాద పార్టీల కు ఓట్లు వేసి అందలం ఎక్కిస్తున్నారు. దీనికి దళిత నాయకులు, వారి అనుచరగణం యొక్క స్వార్ధపూరిత రాజకీయం మద్దత్తు పలుకుతుంది.

చైతన్యం లేని దళిత నాయకత్వం!

ఎస్సి ,ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం (పి ఓ ఏ యాక్ట్ ) 1989 ని దుర్వినియోగం చేస్తున్నారు, బ్లాక్ మైయిల్ చెయ్యటానికి మాత్రమె ఉపయోగిస్తున్నారు కాబట్టి ఈ చట్టం పై ఎలాంటి ముందస్తు అరెస్ట్ చెయ్యకూడదు అని మార్చి20 న ఇచ్చిన తీర్పు ని నిరసిస్తూ చేసిన బంద్ లో దాదాపు 10 మంది చనిపోయినా ఎస్సి/ ఎస్టీ రాజకీయ నాయకులు కనీసం ఖండించక పోవడం అత్యంత దురదృష్టకరం. సామాన్య దళిత ప్రజల అసంతృప్తి వారి నాయకత్వాన్ని ఏదో ఒకరోజు పాడెమీద పడుకోబెట్టే రోజు వస్తుంది.

ప్రజలు కుడా మార్పు చెందాలి. మూస రాజకీయ విధానాన్ని వదిలిపెట్టాలి. నీ ఓటమికి అవతల వాడి భలం ఒక ఎత్తు అయితే నీ నిర్లక్ష్యం 10 రెట్లు. దళిత ప్రజల టార్గెట్ ఫ్యూడల్ రాజకీయ నాయకత్వం మీద కాదు. సొంత రాజకీయ నాయకులను టార్గెట్ చెయ్యాలి, ఆ నాయకత్వాన్ని ప్రజా ఉద్యమాల లోకి తీసుకురావాలి. దళిత నాయకత్వం ఎప్పుడైతే ప్రశ్నించడం మొదలు పెడుతుందో అప్పుడు ఆ పార్టీ అధినేతలు దిగి వస్తారు When you put the fire under beneath of Dalit leadership their leadership will be in trouble. ఈ చర్య పార్టీ అస్తిత్వాన్ని కోల్పోతుంది. కాబట్టి దళిత ప్రజలు ముందు ప్రశ్నించాల్సింది తమ నాయకత్వాన్నే.

వ్యవస్తను తమ వాడలకు అనుకూలంగా మల్చుకోలేని దళిత ఉద్యోగులు మరియు రాజకీయ నాయకులు చరిత్రాత్మకమైన తప్పిదం చేసేరు, చేస్తున్నారు. బాబాసాహెబ్ డా బి ర్ అంబేడ్కర్ అగ్ర లో చేసిన చరిత్రాత్మకమైన ఉపన్యాసంలో ఉద్యోగస్తులను హెచ్చరించినా నేర్చుకోలేనితనం లో ఉన్నారు. ఒక విధంగా చెప్పాలి అంటే దళితులు విఫలం చెందటానికి కారణం ఇదే కావొచ్చు!

బామ్సేఫ్ లాంటి సంస్తలు ఉద్యోగస్తులను సమీకరించినా నాలుగు గోడల మధ్య సిద్దాంత చర్చలకే పరిమితం తప్పా వ్యవస్తని ఎలా ఉపయోగించుకుని గ్రామీణ దళితులకు అండగా ఉండలేక పోయేరు. వ్యవస్త లో ఉంటూ ఆ వ్యవస్తని ఉపయోగించుకోలేక పోవడం దళిత సిద్దాంత కర్తలు, మేధావులు నాయకులు చేసిన ఘోర తప్పిదం.

ఇప్పుడు మనువాదం యొక్క విషపు కోరల్లో చిక్కుకుంటున్న దళితులను రక్షించుకోవాలి అంటే బ్యాక్ తు బేసిక్స్

భోధించు, పోరాడు, సమీకరించు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here