బాబాసాహెబ్ డా. బి ర్ అంబేడ్కర్ మరియు వెనకబడిన కులాలు!

0
301
Ambedkar_Agra_Historic_speech

బాబాసాహెబ్ డా అంబేడ్కర్ అంటే ఈ దేశంలో దళితుల మార్గదర్శకుడిగా మాత్రమే గుర్తింపు పడ్డారు.అయితే అయన దళితులు మరియు అన్ని వెనకబడిన వర్గాల కోసం అయిన పోరాడరు. కానీ కుల వ్యవస్త కారణంగా శుద్రులైన బి. సి లు సాంఘిక నిచ్చెన మెట్ల కుల వ్యవస్తలో దళితులను అంటారని వారిగానే పరిగణిస్తున్నారు. బ్రాహ్మణీయ కుల వ్యవస్థ బి సి లను శుద్రులుగా, అంటరాని వారిని అతి శూద్రులు గా చూసింది. కుల వ్యవస్థ దోపిడీ లో బి సి లు కుడా బాదితులే. చేతి వృత్తులు ఉండటం చేత వారికి హిందూ కుల వ్యవస్థ కాస్త దగ్గరగా తీసుకునట్టు కనిపించినా బి సి లు కూడా బ్రాహ్మణిజం యొక్క వివక్షకు గురికాబడిన వారే.

దళితులు సాంఘికంగా వెనకబడిన కారణంగా బి సి లు నిచ్చెన మెట్ల కుల వ్యవస్తలో పై ఉన్న కారణంగా వారు కుడా సాంఘిక ఆధిపత్యన్ని దళితుల మీద చూపిస్తూ ఉంటారు. ఈ సాంఘిక ఆదిపత్య బ్రాంతి కారణంగా బి. సి కులాలు బాబాసాహెబ్ డా బి ర్ అంబేడ్కర్ ని తమ నాయకుడిగా అంగీకరించలేక పోతున్నారు? బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ ని ఆదర్శంగా తీసుకుని దళితులు హిందూ మతం మీద పోరాడుతుంటే బి సి కులాలు బ్రహ్మనీకరణ చెందుతున్నారు.సవర్ణ  హిందువుల ప్రబావితం ఉన్న బి సి కులాలు దేశంలో బాబాసాహెబ్ డా అంబేడ్కర్ స్పూర్తితో దళితులకు సంఘీబావం ప్రకటించకుండా ఉన్నారు. నిచ్చెన మెట్ల కుల వ్యవస్తలో ఉన్న ఎగువ కులాలు బి సి లను బాబాసాహెబ్ బావజాలం కు దగ్గర కానీయకుండా గందరగోళ పరిస్తితులు సృష్టిస్తున్నారు. దీనికి బి సి కుల సంఘాల నాయకులు, దళిత సంఘాల నాయకులు కుడా బాద్యత వహించాల్సి ఉంటుంది.

బాబాసాహెబ్ డా అంబేడ్కర్ బి సి కులాల హక్కుల కోసం, అలాగే అణగారిన కులాల హక్కుల కోసం అవిశ్రాంతంగా  పోరాడేరు.

బి సి కులాల తో బాబాసాహెబ్ డా అంబేడ్కర్ స్నేహబావంతో ఉన్నారు. అలాగే బాబాసాహెబ్ డా అంబేడ్కర్ ఉన్నత విద్యకు సహాయపడిన వారు బరోడా మహారాజు మరియు సాహుజీ మహారాజ్. అలాగే మహాత్మా పులే యొక్క సాంఘిక ఉద్యమ ప్రబావం తో మహాత్మా పూలే ని గురువు గా బవించేరు. దక్షిణ బారత దేశంలో నాస్తిక ఉద్యమ నాయకుడు పెరియార్ తో సన్నిత సంబందాలు కొనసాగిస్తూ ఈ దేశంలో హిందూ మత ప్రబావం నుండి అణగారిన, బి సి కులాల విముక్తి కి పోరాడేరు. కేరళా లోని ఇజావా (వెనకబడిన కులం ) ఉద్యమానికి బాబాసాహెబ్ మద్దత్తు పలికేరు.

బాబాసాహెబ్ డా అంబేడ్కర్ బి సి కులాల విముక్తి కోసం చేసిన పోరాటం.

వెనకబడిన కులాలకు ప్రబుత్వ ఉద్యోగాల లో రిజర్వేషన్లు కోసం 1928 లో సైమన్ కమీషన్ కు ప్రతిపాదనలు చేసేరు.

రాజ్యాంగంలో సెక్షన్ 340 లో వెనకబడిన కులాలను ( బి సి ) గుర్తించడానికి బాబాసాహెబ్ డా అంబేడ్కర్ చేసిన ప్రయత్నం వలన జరిగింది.

బాబాసాహెబ్ స్తాపించిన షెడ్యుల్ క్యాస్ట్ ఫెడరేషన్ లో బి సి కులాల ప్రాదాన్యత తో పాటు వారి సమస్యల గురించి కుడా పార్టీ మ్యానిఫెస్టో లో చేర్చేరు. షెడ్యుల్ క్యాస్ట్ ఫెడరేషన్ లో షెడ్యుల్ కులాలు , తెగలే కాకుండా వెనకబడిన కులాల అభివృది కోసం కుడా ఏర్పాటు చెయ్యడం జరిగింది.

1951 లో బాబాసాహెబ్ డా బి ర్ అంబేడ్కర్ హిందూ కోడ్ బిల్లు పార్లమెంట్ ఆమోదించకుండా అడ్డుకున్నప్పుడు ప్రకటించిన రాజీనామా లో బి సి కులాల సమస్య లు ప్రస్తావించేరు. రాజ్యాంగాన్ని ఒక సంవత్సరంలో ఆమోదించుకో గలిగేము కాని బి సి కులాల సమస్యల ఫై ఏర్పాటు చేసిన కమీషన్ ఇంకా తన రిపోర్ట్ ఇవ్వలేక పోవడం దురదృష్టకరం అంటూ ఎద్దేవ చేసేరు.

లక్నో విశ్వవిద్యాలయంలో విధ్యార్ధులను ఉద్దేశించి బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ ప్రసంగిస్తూ పార్లమెంట్  వెనకబడిన కులాల ను విస్మరించడం హెచ్చరించెరు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here