పతనం అంచున బారత దేశం!

0
98

త్రిపుర ఎన్నికల పలితాలు తర్వాత ఆ రాష్ట్రంలో జరిగిన సంఘటనలు దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలను కాస్త బయాందోళనకు గురిచేసింది. ఎన్నికల్లో ఒక రాజకీయ పార్టీ ఓడిపోతే దాని ప్రత్యర్ధులు ఓడిన పార్టీ కార్యాలయాల మీద ఆ పార్టీ నాయకుల విగ్రహాల మీద దాడి చెయ్యడం, కూల్చి వేయడం ఇటీవల కాలంలో దేశంలో జరిగిన కొత్త పోకడ. ఈ విపరీతమైన చర్య దేశ ప్రజలను ఆచ్చర్యక్రితులను చేసింది.

త్రిపురాను సుదీర్ఘ కాలం పాలించిన మాజీ ముక్యమత్రి మాణిక్ సర్కార్ అవినీతి రహితుడు గా,వివాద రహితుడుగా దేశంలోని నాయకులకు ఆదర్శప్రాయంగా ఉన్న వ్యక్తి. అలాంటి నాయకుడి అధ్వర్యంలో 1998 నుండి కమ్యునిస్ట్ ప్రబుత్వం పాలన ఫిబ్రవరిర్చి 18,2018 న జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందింది. 20 సంవత్సరాలు పాలించిన ఏ నాయకుడికి అయినా ప్రజా వ్యతిరేకత ఖచ్చితంగా వస్తుంది. అదే మొన్నటి ఎన్నికల పలితాల్లో కనిపించింది. దీనికి బా జ పా శ్రేణులు రెచ్చిపోయి కమ్యునిస్ట్ పార్టీ ఆఫీస్ ల మీద దాడి , దహనం చెయ్యడం , లెనిన్ విగ్రహాలు కూల్చివేత లాంటి సంఘటనలు బారత ఎన్నికల వ్యవస్తను, ప్రజాస్వామ్య వెతిరేక కార్యకలాపాలు ప్రపంచ దేశాల్లో బారత మనుగడ ప్రశ్నార్ధకంగా మారుస్తుంది.

త్రిపురా లాంటి రాష్ట్రాలలో బా జ పా గెలుపు హిందుత్వ శక్తులు కొత్త అర్ధాలు వెతికితే అది ప్రజాస్వామ్య మనుగడకు ఆటంకం. త్రిపుర లో క్రిస్టియన్స్ , షెడ్యుల్ తేగల ప్రజలు ఎక్కువ అయినా హిందుత్వ అజెండా కలిగిన బా జ పా గెలిచింది అంటే బారత ప్రజల లౌకిక పునాది ఎంత బలంగా ఉందో అర్ధం చేసుకోవాలి.

బారత దేశానికి మతం కొత్త కాదు, మత ఘర్షణలు కొత్త కాదు. శైవ – వైష్ణవ మారణహోమం , హిందూ – buddist ల మారణకాండ, ముస్లిం, క్రిస్టియానిటీ ఇలా ఏ రాజు దేశాన్ని పాలిస్తే ఆ రాజు మతమే నయనో, భయానో  ప్రజల మతం అయ్యింది. వందల సంవత్సరాలు పాలించిన ముస్లిం, క్రిస్టియన్ పాలనలో ప్రజలు మత సామర్స్యంతోనే ఉన్నారు. అక్కడ, అక్కడా కొన్ని సంఘటనలు జరిగినా ఈ కొత్త మిలియన్ సంవత్సరంలో జరుగుతున్న సంఘటనలు బారతీయుల అత్మస్తైర్యం దేబ్బతేస్తుంది.

 బా జ పా దాని అనుబంద మత ధార్మిక సంస్తలు నేడు ప్రచారం చేస్తున్నట్లు బారతీయులు లౌకిక విధానంను విడ్చిపెడుతున్నారు అనుకుంటే పొరపాటే! మత పిచ్చితో ఒకప్పుడు రగిలిపోయినా యురోపియన్ దేశాలు నేడు ప్రశాంతంగా ఉంటే ఆ మత పిచ్చి నేడు ఆసియా దేశాల్లో జడలు విప్పుకుంది. 2014 ఎన్నికలు తర్వాత హిందూ మతం రాజకీయంతో మమేకమై ప్రముఖ హేతు వాదులను చంపడంతో మత పిచ్చి వ్యవస్తాగతం అయ్యింది.మత పిచ్చి నేడు ఉగ్రవాద రూపం దాల్చింది.

లౌకిక  మతాలతో జరిపిన ప్రయోగాలు ఇంచుమించు వైఫల్యం చెందాయి ; అభివృద్ధి నిరోధక మానవతీత బావలతో, నమ్మకాలతో, కార్యాచరణ మునిగితేలుతున్న మతోద్యమాలు గణనీయంగా విజయం సాదించాయి అని పీటర్ బర్గ్ అంటారు

గత నాలుగు సంవత్సరాలుగా బారత దేశంలో జరుగుతున్న పరిణామాలు పీటర్ బర్గ్ చెప్పినదానికి మంచి ఉదాహరణలు. మత గురువులు, పెట్టుబడిదారుడు, రాజకీయ నాయకుడు నేటి త్రిమూర్తులు. వీరి ముగ్గురి కాంబినేషన్ లో నేడు బారత రాజకీయం నడుస్తుంది. 2009 లో మోడీ ని గెలిపించటానికి యోగా గురువు రాందేవ్ బాబా లాంటి వాళ్ళు తీవ్ర ప్రయత్నం చేసేరు. 2014 లో వీళ్ళిద్దరికీ పెట్టుబడి దారుడు తోడై ఎన్నికల్లో విజయంసాధించేరు. ప్రస్తుతం బారత దేశంలో జాత్యంహంకర దిశగా నడుస్తుంది. మధ్యతరగతి ప్రజలకు దేవుడు మరింత దగ్గర అయ్యేడు. కార్పోరేట్ దేవుడు నిత్యం టి వి లలో మనకి కనిపిస్తూ ఉంటాడు. బక్తి చానెల్స్ కి లెక్కలేదు. అలాగే ప్రబుత్వ కార్యకలాపాలలో బక్తి బాహటంగా ప్రదర్శిస్తున్నారు. ఆంధ్ర – తెలంగాణా గవర్నర్ లాంటి వాళ్ళ మకాం తిరుమల గుడి అంటే ఆచ్చర్య పడక్కర్లేదు. మతాన్ని బాహాటంగా ప్రదర్శిస్తూ సంస్తాగతం చేస్తున్నారు. వాజిపాయ్ ప్రబుత్వం విశ్వవిద్యాలయాలలో ఆస్ట్రాలజీ, జ్యోతిష్య శాస్త్రం ప్రవేశ పెట్టి యు జి సి నుండి నిధులు కుడా ఇప్పిస్తుంది. ఇలా రాజకీయాన్ని అవకాసవాదం గా తీసుకుని మతాన్ని చాపక్రింద నీరులా ప్రవేశ పెట్టేరు

ద్వేష పూరితమైన హిందూ మతోన్మాధం.

బారత దేశంలో సంఖ్యా పరంగా హిందువులదే అధిపత్యం.ఈ సంఖ్యా బలాన్ని రాజకీయ ఆధిక్యం దిశగా తీసుకువెళ్ళాలి అని సంఘ్ పరివార్ ప్రయత్నం 2014లో నెరవేరింది. హిందూ ధార్మిక సంస్తలు క్రిస్టియన్స్, ముస్లిం ప్రచారకులు మతం ముసుగులో హిందువులను లోబరుచుకుని బలవంతాన మత మార్పిడి కి పాల్పడి  హిందువులను మైనారిటీలుగా చేస్తారు అనే బయాన్ని ప్రచారం చేస్తున్నారు. అయితే బారతతీయులు అతివాద హిందువులు ఆరోపించినత దుర్మార్గంగా లేరు. ఆది నుండి భిన్నత్వ సంస్కృతి కలిగిన ప్రజలు సంఘ్ పరివార్ మరియు దాని అనుబంద ధార్మిక సంస్తలు ఆరోపిస్తున్న వాదనలకు పూర్తీ వ్యతిరేకంగా ఉన్నారు. అయినప్పటికీ కరుడుకట్టిన RSS మరియు చాందసవాద పీతాదిపతులు కొందరు క్రిస్తవ, ఇస్లాం మత వ్యతిరేకతను నిరంతరం రేచ్చాగోడుతూనే ఉన్నారు. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా RSS తన మౌత్ పీస్ ఆర్గనైజర్ లో మరియు ‘బారతీయ వాణి’ పత్రిక ద్వారా మత విద్వేషాలు రేచ్చాగోడుతూ ఇస్లాం, క్రైస్తవం మీద దుష్ప్రచారం చేస్తున్నారు.

నాజీలు నుండి నేటి చందాస హిందువుల వరకూ

ఆనాటి నాజీల ఫాసిజం బావల నుండి స్పూర్తి పొందిన RSS సిద్దాంతకర్త గోవాల్కర్ హిందూ జాతీయత అనే బావాన్ని వ్యాప్తి చెయ్యాలి అనే ప్రయత్నం చేసేరు. అదే నేడు బా జ పా ఓట్లు తెచ్చే అతి పెద్ద పధకం అయ్యింది. బారతీయ ఫాసిస్ట్ లు వారి స్పూర్తి ప్రదాతలు అయిన జర్మనీ , ఇటలీ నాజీల అపఖ్యాతిపాలైన చరిత్రను తెలుసుకోవాలి. నవబారత నిర్మాత బాబాసాహెబ్ డా అంబేడ్కర్ దేశ ప్రజలకు మత స్వేఛ్చ కల్పించేరు. ఏ వ్యక్తి అయినా తనకు నచ్చిన మతంలోకి మారేందుకు వ్యక్తిగత స్వేఛ్చ ను , ప్రతి మతాన్ని గౌరవించాలని దేశప్రజలకు చుచించేరు. కానీ గో రక్షణ సమితి పేరుతొ హిందూ చాందస బావజాలన్ని నూరిపోసి దాడులకు దిగుతున్నారు. వివిధ మీడియాలో హిందూ మతం గొప్పదనం  పేరుతొ చేసే ప్రచారం అంతా క్రిస్టియానిటీ , ఇస్లాం వ్యతిరేక బావాజాలన్ని ప్రచారం చేస్తున్నారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కుడా ఇతర మతాల వ్యతిరేక బావజలన్ని రకరకాల కమ్యునిటీ గ్రూప్ ల పేరుతొ క్రిస్తవ, ఇస్లాం వ్యతిరేకతను రెచ్చగొట్టే విధంగా ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి దుష్ప్రచారం నుండి ప్రేరణ పొందిన వారే త్రిపురా ఎన్నికల్లో కమ్యునిస్ట్ లు ఓడిపోగానే ఆ రాష్ట్రంలో లెనిన్ విగ్రహం మీద దాడి చేసి కూలదోసేరు. తమిళనాడులో పెరియార్ విగ్రహాన్ని పాక్షికంగా ద్వంసం చేసేరు. అలాగే బాబాసాహెబ్ డా అంబేడ్కర్ విగ్రహాలను కూల్చి వేసేరు. ఆంధ్ర, తెలంగాణలో అడపా దడపా క్రిస్టియన్ మత ప్రచారకులు మీద, చర్చీలు మీద దాడులు చేస్తున్నారు. ఈ విపరీతి దోరణి ఇంకా ప్రబలంగా మారుతుంది అని విశ్లేషకుల అంచనా. ఇదే జరిగితే ప్రజల్లో అసహనం ఎక్కువ అయి ప్రబుత్వం మీద దాడి చేసే ప్రబావం ఉంటుంది.  ఇటీవల కాలంలో కేంద్ర మంత్రులే వివాదాస్పద ప్రకటనలు చేస్తున్నారు. రాజ్యాంగం మారుస్తాము అని మరికొందరు ప్రకటనలు చేస్తూ ప్రజలను గందరగోళం లోకి నెడుతున్నారు.

బారతీయుల పతనం తప్పదా?

బారతదేశ ప్రజలమైన మేము బారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశం గా నిర్మించుకోవడానికి ఇన్ని రోజులు ప్రజలు ఎంతో పాటుపడ్డారు. ఇప్పుడు అర్ ఎస్ ఎస్ / బా జ పా మరియు వాటి పరివార్ బారత రాజ్యాంగాన్ని, పార్లమెంట్ సాక్షిగా తగలపెడతాము అని ప్రతిఘ్న చేస్తున్నారు. ఒక వేల ప్రస్తుత రాజ్యంగాన్ని తగలపెడితే ఆ క్షణం నుండే దేశం తగలబడుతుంది. ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తుంటే ఖచ్చితంగా ప్రజల మధ్య ఉన్న సోదరబావం మరింత క్షీనించి అంతర్గత దాడులు చేసుకుంటారు.  బారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఇప్పుడు మత గురువు, పెట్టుబడిదారుడు, రాజకీయ నాయకుడి చేతిలో కీలు బొమ్మగా మారిపోయింది ఈ స్వబావం ప్రజలను అశాంతికి గురిచేస్తుంది. సమకాలీన పెట్టుబడిదారి సమాజంలో వస్తున్న అర్ధికపరమైన మార్పులు, పర్యవసానాలు బక్తి మాయతో కప్పివేసి తీర్ధ ప్రసాదాలు ఇస్తూ ప్రజలను మబ్య పెడుతున్నారు. దూప,దీప నైవైద్య కార్యక్రమలు, తీర్ధయాత్రలను ప్రబుత్వాలే నిర్వహిస్తూ ప్రజల సంక్షేమ కార్యక్రమాలు గాలికోదిలేసేరు. దేవుడిని మార్కెట వీదుల్లో ముందు పెట్టి వ్యాపార లావాదేవీలు , రాజకీయం, విద్యాలయాల్లో , ఆసుపత్రి ఆధ్యాత్మిక కార్యక్రమలు నిర్వహిస్తూ లౌకిక తత్వాలను పరిహాసం చేస్తున్నారు. గ్లోబలీకరణలో బారత దేశం మత మౌడ్యాన్నిమాత్రమె దిగుమతి చేసుకుందేమో అనిపిస్తుంది. సరళీకరణ, ప్రపంచీకరణ పర్వవసనంగా అవిర్బవించిన సంపద మత విశ్వాసాలను రేచ్చగోట్టేదానికే ఉపయోగిస్తున్నారు. బారత దేశం ప్రపంచీకరణ మొదట్లో ప్రారంబమైన మత దురాబిమానం బాబ్రీ మసీద్ కూల్చివేత తో ప్రారంబమై నేడు మొత్తం బారతీయ సమాజమే పతనం దిశగా ఉంది.    

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here