దళితుల బంద్ బా జ పా దళిత ఓటు బ్యాంక్ కి గండి కొడుతుందా!

0
79

మార్చి 20 న సుప్రీం కోర్టు ఎస్సి, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం (పి ఓ ఏ యాక్ట్ ) దుర్వినియోగం అవుతుంది అంటూ పటిష్టమైన చట్టాన్ని నిర్వీర్యం చేస్తుంది అంటూ చేసిన బారత్ బందు 2019లో దళితుల ఓటు బ్యాంక్ కి గండి కొట్టబోతుందా? అంటే అవును అనే సమాదానం చెప్పాలి.

గత కొంత కాలంగా దళితుల పై దాడులు పెరిగిపోతున్నాయి. బా జ పా కేంద్రంలో అధికారం చేపట్టిన నాటి నుండి నిరంతరం దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపధ్యం లో SC/ST Act బ్లాక్ మైయిల్ కు మాత్రమె ఉపయోగపడుతుంది అని సుప్రీం కోర్టు తీర్పు పై కేంద్ర ప్రబుత్వం సరైన చర్యలు చేపట్ట లేదు అని BJP పార్టనర్స్ మరియు ఎస్సి / ఎస్టీ పార్లమెంట్ సబ్యులు ప్రబుత్వం రివ్యు పిటీషన్ వేయకుండా అలసత్వం చేసింది అని నిరుత్సాహంగా ఉన్నారు.

కేంద్రంలోని బారతీయ జనతా పార్టీ (BJP) ఎస్సి , ఎస్టీ యాక్ట్ పై అలసత్వం చూపిస్తూ వారి మీద చేస్తున్న దాడి 2019లో బా జ పా కి దళితుల ఓట్లు తగ్గే అవకాసం ఎక్కువగా ఉంది. ఒక వేల BJP కాని దళిత ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం ముమ్మరంగా జరిగితే సవర్ణ హిందువులు బా జ పా కి దూరం అయ్యే అవకాసం ఎక్కువ. ఎక్కువ శాతం OC లు SC, ST Act ని వ్యతిరేకిస్తున్నారు. వారు ఈ యాక్ట్ ని నిర్వీర్యం కావలి అని కోరుకుంటున్నారు.

దశాబ్దాల చరిత్ర కలిగిన బారత రాజకీయం వ్యవస్థ  లో ఎస్సి లు , ఆదివాసీల ఓట్లు BJPకి 2014 జనరల్ ఎలేక్షన్స్ లో ఎక్కువ వచ్చేయి. కాంగ్రెస్స్ కంటే ఎక్కువ రావడం జరిగింది. కానీ బా జ పా మాత్రం ఎక్కువ శాతం అగ్ర కుల హిందు ఓటర్ల మద్దత్తునే కోరుకుంటుంది.

CSDS ( centre for the study of developing societies) లెక్కల ప్రకారం Caste Hindus పెద్ద ఓటు బ్యాంక్ BJPకి క్రింది పట్టికను పరిశీలిస్తే 2014 ఎన్నికల్లో ముస్లింలో కాంగ్రెస్స్ కి ఇచ్చిన మెజారిటీ అంతకంటే ఎక్కువ శాతం Caste Hindu వులు బారతీయ జనతా పార్టీ కి ఓటు వేసేరు. ఇక అదే పట్టికను పరిశీలన చేస్తే దళితుల, అదివాశీల ఓట్లు గణనీయంగా BJP కి పడ్డాయి. ఇది ఒకవిధంగా చెప్పాలి అంటే ఇది చారిత్రాత్మకం.ఎందుకంటె బా ,జ పా పుట్టక నుండి అది బ్రాహ్మణ , బనియా పార్టీ గా ముద్ర పడింది. జన సంఘ్ నుండి నేటి బా జ పా వరకూ ఆ పార్టికి గట్టి మద్దత్తు దారులు ఫండ్ ఇచ్చేవారు ఆ రెండు కులాలే.

BJP కుడా కుల రాజకీయాలు చెయ్యడం మండల కమీషన్ అమలు పరిచిన తర్వాత ప్రారంభించింది. BC ల ఓట్లు ఆకర్షించడానికి ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో BCలను ముఖ్యమంత్రి గా ప్రమోట్ చేస్తూ వచ్చేరు. నరేంద్ర మోడీ ని BC గా చూపుతూ దళిత ఓట్లు సాధించే క్రమంలో దళిత పల్లవి అందుకున్నారు. ఈ మధ్య ప్రదాని నరేంద్ర మోడీ క్రమంగా బాబాసాహెబ్ డా అంబేడ్కర్ జపం చేస్తూ ఉన్నాడు. అయితే బా జ పా చరిత్ర, వారి ప్రస్తుత పార్లమెంట్ సబ్యుల ను పరిశీలన చేస్తే BJP దళిత పల్లవి ఓటు బ్యాంక్ రాజకీయాలే, రాష్ట్రపతిగా రామనాద్ కోవింద్ గారి లాంటి దళిత వ్యక్తికి కట్టబెట్టడం కుడా ఒక ఎత్తుగడ గా దళితులు బావిస్తున్నారు. క్రింది పట్టికను పరిశీలన చేస్తే 2014లో BJP పార్లమెంట్ సబ్యులుగా ఎన్నిక అయింది Caste Hindus. అలాగే బా జ పా పాలన రాష్ట్రాలలో ఫ్యూడల్ కుల నాయకులే ఎక్కువ శాతం, ముక్యమంత్రులుగా,  మంత్రులుగా  ఉన్నారు. కాబట్టి బా జ పా దళిత పల్లవి ఒట్టి బూటకం అని చెప్పాలి.

SC ST లను పక్కన పెడితే BJP BC లకు కుడా మొండి చెయ్యి చూపించింది. జనాభా పరంగా అధికంగా ఉన్న బి సి లకు పార్టీలో సరైన ప్రాదాన్యత లేదు. అధికారంలో కుడా ప్రాదాన్యత లేదు. Caste Hindu వులు తర్వాత బి జే పి కి BC లే ఆయువుపట్టు, రోడ్ల మీద జెండా మోస్తుంది వారే. అలాంటి BCలను కుడా బా జ పా తెలివిగా పక్కన పెట్టి అగ్రకుల హిందువు లకే ప్రద్దన్యత ఇస్తూ క్రింది కులాలను ఓటు బ్యాంక్ రాజకీయానికి జెండా మోసేదానికే ఉపయోగించు కుంటుంది. ఇప్పుడు BJP పాలిత రాష్ట్రాలలో ఇద్దరే ఇద్దరు BC ముక్యమంత్రులుకాగా దళితులకు మొండి చెయ్యి చూపించేరు.

జాతీయ స్తాయిలో దళిత నాయకత్వం విఫలం అవడం, మరియు కాంగ్రెస్ మీద బా జ పా చేసిన దుష్ప్రచారానికి దళిత , ఆదివాసీలు కుడా ఆకర్షితులు అవడం తో దళిత నాయకులు BJP గొడుకు క్రిందకు చేరేరు. BSP లాంటి బహుజన పార్టీ 2014లో పూర్తిగా విఫలం చెందింది. మహారాష్ట్ర, బీహార్ , ఉత్తర ప్రదేశ్ లో పేరు ఉన్న దళిత నాయకులు BJP పార్టీకి లోపాయికార మద్దత్తు పలికేరు. కొందరు ఎన్నికల పొత్తు పెట్టుకున్నారు.

కేంద్రంలో బారతీయ జనతా పార్టీ గుజరాత్ మోడల్ అంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత రోహిత్ వేముల, యునా లాంటి సంఘటనలు యాదృచ్చికంగా జరిగేయి అని అనుకున్నరేకానీ ఒక టార్గెట్ గా దళితుల మీద దాడులు చేస్తున్నారు అని దళిత నాయకత్వం గ్రహించలేక పోయింది.

ప్రదాన మంత్రి మనకీ బాత్ లో బాబాసాహెబ్ డా అంబేడ్కర్ యొక్క ఆవశ్యకత ఈ సమాజానికి ఎంతావసరమో వారి లక్ష్యాలు కోసం మేము పనిచేస్తున్నాం అని చెబుతున్నా జరిగిన సంఘటనలు నుండి ఇప్పుడు, ఇప్పుడే దళితులు, ఆదివాసీలు మేల్కొకుంటున్నారు.

దళిత , గిరిజన ప్రజలకు రాజ్యాంగ పరంగా ఉన్న ఒకే ఒక్క ఆయుధం ఈ SC ST Act దీనికి  కోర్టు ద్వారా నిర్వీర్యం చేసే ఎత్తుగడ BJP చెయ్యడం వ్యూహాత్మకంగా పెద్ద తప్పు. BJP యొక్క దళిత సానుబుతి మేడి పండు లాంటిదే అని తేటతెల్లం అయ్యింది. బా జ పా లో ఇటీవల దళిత , ఆదివాసీల మేదావులు రాజకీయ పునరావాసం కోసం చేరుతున్నా BJP అసల స్వరూపం చూస్తూ ఎక్కువకాలం ఆ పార్టీలో ఉండే పరిస్తితి లేదు.

ఇటీవల ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో BSP అధినేత్రి బెహన్ జీ మాయావతి సమాజ్ వాది పార్టీ (SP) కి వ్యూహాత్మకంగా మద్దత్తు ఇచ్చి 2019లో BSP కీలక పార్టీ అని ఒక సందేశం ఇచ్చింది. BJP ద్వంద నీతి రోజు రోజుకు బయట పడుతుంది కాబట్టి 2019 లో జరిగే ఎన్నికల్లో బా జ పా కి ఖచ్చితంగా దళిత , ఆదివాసీల ఓట్లు గండి పడే అవకాసం ఎక్కువగా ఉంది.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here