బి ఆర్ అంబేద్కర్ ను అర్ధం చేసుజోవడం—హరీష్.కే.పురీ

0
117

ఈ నెల స్వేచ్చాలోచన మాస పత్రికలో ప్రహురితమైన వ్యాసం ………బి ఆర్ అంబేద్కర్ ను అర్ధం చేసుజోవడం—హరీష్.కే.పురీ —-అనువాదం-అనిసెట్టి,శాయికుమార్.
ముఖ్యంగా, భారత దేశ ఐక్యత,స్వాతంత్రా లకు సంబంధించి బి.ఆర్.అంబేద్కర్ పాత్రను గురించి,ఆయన ఆలోచనా ధోరణిని గురించీ,విస్తృతంగా అపోహలు వ్యాపించి ఉన్నాయి. అందుకు కారణాలు సుపరిచితమే. అంబేద్కర్ కాంగ్రెస్ నాయకత్వంలో సాగిన స్వాతంత్ర పోరాటంలో పాల్గొనలేదు.వాస్తవానికి ఆయన కాంగ్రెస్ ను తిరస్కరించి, క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించాడు. ఆయన భారత దేశపు వైశ్రాయ్ యొక్క కార్య నిర్వాహక వర్గంలో సభ్యుడు అయేడు.అట్లా కావడంవల్ల ఆయన బ్రిటీషు పాలకులకు విధెయుడుగానూ,ద్రోహి గానూ చిత్రించబడ్డాడు. రౌండ్ టేబుల్ చర్చలలో ఆయన అనేక ఇతర అల్పసంఖ్యాక వర్గాల వారికి ఇస్తున్నట్లుగానే, అదేవిధమైన ప్రత్యెక నియోజక వర్గాలను అల్ప సంఖ్యాక వర్గాలుగా ఉన్న ‘ఆస్ప్రుశ్యులకు’ఇవ్వాలని విన్నవించాడు.ఆయన విన్నపాన్ని1932 లో ఇచ్చిన ‘కమ్యూనల్ అవార్డ్’ లో బ్రిటీష్ ప్రభుత్వం ఆమోదించడంతో,ఆయనను ‘హిందువులను విభజించేందుకు లొంగిపోయిన చెడు మేధావిగా భావించారు.ఈ అంశానికి సంబంధించి,మహాత్మా గాంధీ ఆమరణ నిరాహార దీక్షపై పెల్లుబికిన సానుభూతితో, ప్రధాన స్రవంతి ప్రజాభిప్రాయం అంబేద్కర్ కు వ్యతిరేకంగా మారింది.గాంధీజీ ప్రాణాలు ప్రమాదంలో పడేందుకు ఆయనను బాద్యుడిని చేశారు.పాకీస్తాన్ కోసం ముస్లిం లీగ్ డిమాండ్ కు ఆయన మద్దతు ఇవ్వడం భారత జాతీయ వాదులను మరింత అసహనానికి గురి చేసింది. మనుస్మృతి ప్రతిని తగలబెట్టడం,హిందూ సామాజిక వ్యవస్థపై ఆయన సంధించినవిమర్శనాస్త్రాలు, హిందూ మతాన్ని తిరస్కరించి,అంతిమంగా లక్ష మందికి పైగా అస్ప్రుశ్యులతోకలిసి బౌద్ధ మతంలోకి మారటం వంటివి హిందూ సమాజానికి అవమానకరమయేయి.ఈనాటికీ, అనేకమంది ,’ ముందుగా షెడ్యుల్డ్ కులాలకు, అనంతరం వి.పీ.సింగ్ వల్ల ఇతర వెనుకబడిన తరగతులకూ పోదడిగించడం జరగిన “రిజర్వేషన్లు”,ప్రత్యెక సౌకర్యాలు, దేశ విచ్చిన్నతకూ ఇంకా రాజకీయ అస్తిరత్వానికీ ప్రధాన కారణ’మని నమ్మేవాళ్ళున్నారు.వారు శాంతికి అంబేద్కర్ నే ప్రధాన శత్రువుగా అనుకుంటున్నారు.కాబట్టి, ఆయన దోహదం చేసిన అంశాలపై వివాదముంది.
భారత దేశ ఐక్యతకు అంబేద్కర్ చేసిన విభిన్నమైన దోహదం రెండు అధికారిక చర్యలలో కనబడుతుంది.ఒకటి;భారత దేశ ప్రాదేశిక ఐక్యత,రాజకీయ ఏకత్వానికి దోహదం చేశిన రాజ్యాంగ స్వరూపాన్నితయారుచెసి,అన్వయంలోకి తేవడం.ఇందుకుగాను ఆయనను బ్రంహాండంగా కీర్తించారు.రెండోది,అనేక రకాలైన భిన్నత్వాలు,వేళ్ళునుకునిఉన్నఅసమానతలూ ఉన్న ఈ విశాలమైన దేశంలో విలక్షణమైన మంచి సమాజానికి చెందిన భావనాత్మకతకు,”ప్రజల ఐక్యత ” కూ సంబందించినదే కాకుండా,సామాజికార్ధిక మార్పుకు పునాది వేసిన అంశం.ఇది తీవ్రంగా ప్ప్రశ్నించబడిన అంశం.ఐతే,ఆయన ఒంటరి కాదు.ఓ కొత్త మానవత్వపు దార్శనికత,న్యాయమైన సామాజిక క్రమతను గురించి ఆయన జవహర్లాల్ నెహ్రు ని భాగస్వామిగా చేసుకున్నాడు.ఐతే అంబేద్కర్ మరింత అనుమానాస్పదునిగా ఉన్నాడు.బహుశా మరే ఇతర నాయకుడు కూడాసామాజిక మార్పు లక్ష్యానికి వ్యతిరేకంగా అంత తీవ్రంగా పాతుకుపోయిన సామాజిక శక్తులపట్ల అంతచైతన్యవంతంగా లేడు.


కుల వ్యవస్థలోను,వర్గ అధికార పరంపరలోను అట్టడుగున ఉన్న అంబేద్కర్ సామాజిక స్థాయి ఆయనకు కిందిస్థాయి సామాజిక వాస్తవిక దృష్టిని ఇచ్చింది.ఆయనకు ఉన్నతమైన,అత్యున్నత అదికార స్తాయి పరిచయాలు ఆయన ప్రపంచాని భిన్నంగా చూడడానికి దోహద పడింది.గాంధీ ఎదుర్కొన్న సామాజిక వివక్ష ఆయనయొక్క జాతి వివక్షా వ్యతిరేక, సామ్రాజ్యవాద వ్యతిరేక భావనకు దోహదంచేసింది. ఏప్రియల్ లో జలియన్ వాలాబాగ్ లో జరిగిన మూకుమ్మడి హత్యాకాండతో ఆయన బ్రిటీషు పాలన ;పైశాచిక’పాలన అని భావించాడు.అస్ప్రుశ్యునిగా ఆయన జీవితానుభవాలు ;కుల నిర్మాణ వ్యవస్థకు,కులఅణచివేతకూ వ్యతిరేకంగా ధృడంగా ఆయన మార్గాన్ని నిర్దేశించింది. ఆయనకు రాజకీయ స్వాతంత్రం కంటే,మానవ ఆత్మగౌరవానికి,ఐక్యతకూ అత్యవసరమైన, కుల అసమానతలను అంతం చేయడం,అల్ప సంఖ్యాకులకు న్యాయమైన హోదా కలగజేయటం,తనకు అత్యవసర షరతులుఅయాయి.ఏదేమైనా,రాజ్యాంగ సభలోని ఆధిపత్య వర్గాల బలంతో,సామాజిక మార్పుకు సంబంధించిన అంశాన్ని,ద్వేషభావం తోనూ,పాక్షికంగాను, రాజ్యాంగంలో పొందుపరిచారు.ఆ పరిమిత అంశాలను కూడా పాక్షికంగా అమలు పరిచారు.ఈనాడు సమాజం ఇంకా రాజకీయం మరింత దెబ్బతిన్నట్లు కనబడుతున్నది.ఐతే,గతంలో అణచివేయబడ్డ వారి ధృఢ సంకల్పం సామాజిక మార్పును వేగవంతం చేసేంతగా శక్తివంతమైంది.అంబేద్కర్ ఐక్యత కోసం చేసిన కృషికి వచ్చిన అభినందన ఈ విషయంలో కుల – వర్గ విభాజక రేఖ వేరుగా ఉంచింది.


ఇప్పుడు ఆయన స్తానాన్ని గురించీ,ఈ రెండు అదికార చర్యలద్వారా ఆయన ఏమి చేశాడనేదీ చూద్దాం.
అస్పృశ్యుల కోసం ప్రత్యెక నియోజక వర్గాలు కావాలనే పోరాటాన్ని అట్లా ఉంచితే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో బ్రిటీషు వాళ్లకు అయన ఒక్క విషయాన్ని స్పష్టంగా చెప్పేడు.’అది కేవలం స్వాతంత్రానికి సంబంధించిన రాజ్యంగం, అందులో మేం రాజకీయాధికారం మాచేతుల్లోకి తీసుకొనేందుకు ఏమైనా అవకాశం ఉండాలి; అది లేకుండా మా ప్రజల సమస్యలకు పరిష్కారం లేదు.’అంబేద్కర్ మొదటిసారిగా 1931 ఆగస్ట్ 14వ తేదీన గాంధీని కలిసినపుడు,ఆయనకు మహాత్మా గాంధీ వివరంగా చెప్పేడు,’రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లోనీవిచ్చిన నివేదికలో నాకు అందిన ప్రకారం, నీవెంతో విలువైన దేశ భక్తునివని నాకు తెలుసు.’ అంబేద్కర్ దేశభక్తిని గురించి ఎ అభ్యంతరమూ ఉండనక్కరలేదు.ఐతే, దేశ స్వాతంత్రం అనేది తప్పనిసరిగా ప్రజల స్వాతంత్రం కానక్కరలేదనేది ఆయనను ఒప్పించారు.


ముందుగా ప్రస్తావించినట్లుగా ఆయన సామాజిక స్తానం ప్రధాన స్రవతి రాజకీయ నాయకులకంటే కిందినుంచీ వచ్చిన భారతీయ వాస్తవికతపై,దాన్ని ఎదిరిం చేందుకు ఆయన ఒక్కడే ప్రసిద్ధ నాయకునిగా చేసింది.కాంగ్రెస్ జాతీయ వాదాన్ని ఆయన వ్యతిరేకించాడు. దీన్ని ప్రొఫెసర్ గోరె చర్చించాడు. ఉదాహరణకు చెప్పుకోవాలంటే,భారత దేశ చరిత్రను గురించి నెహ్రు, అంబేద్కర్ లు చూసే దృష్టిలో స్పష్టంగా విరుద్ధంగా ఉంది. నెహ్రు తన డిస్కవరీ ఆఫ్ ఇండియాలో స్పష్టంగా చెప్పినట్లు ఆయన దృష్టికోణంలో, గొప్ప విభిన్నతలో అంతర్లీనంగా ఓ సమన్వయము, ఐక్యతా కచ్చితంగా ఉన్నాయి. ఐతే, మరోవైపున అంబేద్కర్ దృష్టికోణంలో భారత దేశమనేది పరస్పరం ఘర్శించుకునే సాంస్కృతిక ప్రవాహాలతో,లోతయిన విభజనతో స్థరీకరణ చెంది ఉంది.నెహ్రు దృష్టికోణం ప్రధాన స్రవంతి ప్రతిబిమ్బిస్తుండగా, అంబేద్కర్ ద్రుష్టి కోణం అల్ప సంఖ్యాక సమూహాల దృష్టితో ఉంది.జాతీయ వాదం అనే అంశానికి సంబంధించి దాని చారిత్రిక పరిణామానికి కారణం సాధారణంగా నాటికి రూపు దిద్దుకొంటున్న కొత్త పాలక వర్గం.అది సమాజంలోని బాగా అభివృద్ధి చెందిన విభాగానికి చెందిన వారి ప్రయొజనాలనూ,వారి ఆలొచనలకూ ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి,అది ప్రాధమికంగా ఒంటెత్తు పోకడ.గుడ్డి జాతీయవాదమనేది చాలా ప్రమాదకరంగా ప్రజావ్యతిరేకప్రజా వ్యతిరేక రూపం దాలుస్తుందని అంబేద్కర్కు సుస్పష్టం.దాన్ని గట్టిగా ప్రతిఘటించి,సమానత్వం కోసం ఒక బలమైన సామాజిక పునాది నివ్వాలి.


బ్రిటిషు పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసే సమయంలో,ఈ “జాతీయవాద” ఆదర్శం, తమకు ఓ జాతీయ గుర్తింపు కొరుతూ ప్రజలందరి ఏకత్వాన్ని గురించి నొక్కి చెప్పడం జరిగిందని అర్ధం చేసుకోవచ్చు. వారు, వర్గము,కులము, మతము,ప్రాంతము, భాష తదితర అంశాలపై ఆధారపడిఉన్న అంతర్గత విభేదాల ప్రాముఖ్యతను తోక్కివేయడమే కాదు,ఇంకా ఈ విభేదాలు విచ్చిన్నం చేసేవి గానూ, జాతి వ్యతిరెకమైనవిగానూ ముద్రవేసి ప్రచారం చేసేరు.అన్ని సముదాయాలలోని భారతీయులను లేదా అన్ని కులాల హిందువుల మధ్యనా ఉమ్మడి ప్రయోజనాలున్నాయనేదాన్ని అంబేద్కర్ ఖండించాడు. అస్పృశ్యులకూ,ఇతర అల్ప సంఖ్యాకులకూ శాసనబద్ధమైన రాజ్యాంగపర రక్షణలు కావాలనీ,వారంతా తమ న్యాయబద్ధమైన సమానత్వం,న్యాయాలను సాధించడంకోసం ఐక్యంగా సమీకరణకావాలని ఆయన పట్టుబట్టేడు. ప్రధాన స్రవంతి జాతీయవాద నాయకుల ప్రధాన పోరాటం రాజకీయ స్వాతంత్రం కోసం కాగా అంబేద్కర్ మాత్రం,సమాజంలో ఆర్ధికంగానూ, రాజకీయంగానూఅడుగున ఉన్న కింది కులాలు/వర్గాల స్థరంలోనివారిపై మరింత దౌష్ట్యంతో బహిరంగంగా ఆధిపత్యంతో ‘దమనం’ సాగిస్తారనేవిషయం గ్రహించాడు. ఆరకమైన పాలనలో,అసమానతలు తగ్గించేందుకు గల సామాజిక సంస్కరణకు గల అవకాశాలు మరింతగా దూరమౌతాయి.కాబట్టి, ఆయన రాజకీయ స్వాతంత్రంకంటే ముందు సామాజిక సంస్కరణ యొక్క అత్యవసరాన్ని నొక్కి చెప్పేడు.గాంధీ కయినా సరే,అస్పృశ్యతా నిర్మూలన కంటే,ముందుగా ఎంచుకోవలసింది స్వాతంత్ర పోరాటమనేదాన్ని, 1930 దశకం మధ్యలో ఆయన ఒప్పించాబడ్డాడు. ఆవిధంగా,ఆయన ప్రధాన స్రవంతి జాతీయ పోరాటంలో భాగస్వామి కాలేకపోయాడు.
ఏదేమైనా,ఆయన తన విభిన్నమైన ప్రత్యక పోరాటంలో భారత రాజకీయ వ్యవస్థను బలోపేతం చేయడంలో ఏంటతో కృషి చేశాడు. ప్రాంతీయ ప్రతిపత్తితో సహా కొత్త రాజ్యాంగపు ఏర్పాట్లకోసం సిఫార్సులను సంసిద్ధం చేసేందుకు 1928లో సైమన్ కమిషన్ ఇండియాకు వచ్చినపుడు,కాంగ్రేస్ సైమన్ కమిషన్ బహిష్కరణకు పిలుపునిచ్చింది.మరోవైపు అంబేద్కర్ మాత్రం,ముఖ్యమైన విషయాలు చర్చించేందుకు,తన వినతి పత్రాన్ని సమర్పించేందుకూ,దానిముందుకు హాజరయేడు.ఆయనిలా వాదించాడు.


“నేను పూర్తి ప్రాంతీయ ప్రతిపత్తినిఏర్పాటు చూడాలని ఆత్రుతతో కోరుతున్నాను.ప్రజల దృష్టిలో దాని ఉనికి కనబడనిదిగా ఉండేది కానీ, లేదా దాని జాతీయ స్వభావానికి జతకూడనిది కానీ,ఎరకంగానైనా కేంద్ర ప్రభుత్వాన్ని బలహీన పరిచేదిగాకానీ,ఉండే ఎ మార్పునైనా నేను వ్యతిరేకిస్తాను…….నా ఉద్దేశ్యం జాతీయ ప్రభుత్వం అనేది ప్రాంతీయ ప్రభుత్వాల బలిమి వల్ల నిలబడి ఉండేట్లు ఉండకూడదు.”
రాజకీయ ఐక్యతను కాపాడేందుకు ఒక బలమైన కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి అవసరమని ఆయన భావించాడు.ఆపై ఆయన చాలా స్పష్టమైన సిఫార్సులను సమర్పించాడు.
అన్ని అవశేషాధికారాలూ కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉండి తీరాలి.
దేశ ప్రయోజనాలపట్ల పక్షపాత ధోరణితో వ్యవహరించడం, లేదా తిరుగుబాటు చేసే, లేదా అవిధేయతతో ఉండే ప్రాంతాలను అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి తప్పనిసరిగా నిర్దుష్ట అధికారం ఉండాలి. ప్రాంతీయ ప్రభుత్వాలకు ఇచ్చిన అన్ని అధికారాలకు సంబంధించి,అవి సక్రమంగా నిర్వర్తించలేకపోయినట్లయితే,తిరిగి కేంద్ర ప్రభుత్వానికి అప్పజిప్పాలి.కేంద్ర శాసన సభ్యులకు ననేరుగా ఎన్నికలు ఉండాలి.


(అంబేద్కర్ రచనలు-ఉపన్యాసాలు, సంపుటి.II పెజీ 385)
ఆయనకు రాజ్యాంగాన్ని వ్రాసే పని అప్పజేప్పినపుడు, షెడ్యుల్ కులాలు, అల్పసంఖ్యాకులకు రక్షణలు కల్పించడమూ, అస్పృశ్యతను అంతం చెయదమూ మాత్రమమే కాకుండా, ఆయన ప్రధాన లక్ష్యం ఇండియా ఐక్యతను పరిరక్షించడం. అప్పటికి ఇండియా సార్వభౌమాధికారం, కొద్ది సార్వభౌమాదికారాల్తో అనేక రాజులేలే రాజ్యాలుగా విభజించబడి ఉంది.ఈ పరిస్తితుల్లో ఇండియాను ఏకం చేసేపని కష్ట సాధ్యం.అనేక రూపాలలో ఐక్యతకు ముప్పు ఉంది. అంబేద్కర్ ఐక్యతా రోపం తెచ్చేందుకు తన అనితర సాధ్యమైన తన న్యాయపరమైన,రాజ్యాంగపరమైన శ్రేష్టతను, ఉపయోగించడమే కాకుండా తన ప్రతిపాదనలను రాజ్యాంగసభ ఆమోదిన్చేట్లు చేయడానికి తన ప్రజ్ఞ ను ఉపయోగించి ఏంటో నైపుణ్యంతో వాదించాడు.
వివిధ అంశాలతో వ్యవహరించేదుకు,వాటిపై ముసాయిదాలు తయారు చేసేందుకూ,రాజ్యాంగ రచనా సంఘం తొమ్మిది ఉప సంఘాలను ఏర్పాటు చేసింది. ఇక్క్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే,వారి స్వంత రాజ్యాంగం తయారు చేసుకునే అవకాసం వారికి ఇవ్వడంతోసహా రాజులు ఏలే రాజ్యాలకు కొద్దీ గొప్పా తేడాలతో సతంత్ర ఉనికిని అప్పజెపుతూ,వారి స్వంత సైన్యాలను ఏర్పాటు చేసుకోవడంతో సహా ఈ ఉపసంగాలు ప్రతిపాదనలను తయారు చేసాయి.డా.అంబేద్కర్ కలవరపాటుకూ ఆగ్రహానికీ లోనయాడు.అయన రాజ్యాంగ సభకు ఇట్లా చెప్పేడు: “నేను దీన్ని భారత దేశపు ఐక్యతను దేబ్బతీసేదిగాను,కేంద్ర ప్రభుత్వాన్ని కులదొసెదిగానూ ఉన్న, తిరోగమన మైన ప్రమాదకరమైన అంశంగా భావిస్తున్నాను.” ఆయన కేంద్రానికీ వారికీ మధ్యన ఉండే సంబంధాలలో, ప్రాంతీయ ప్రభుత్వాలకూ, రాజుల పాలనలోని సంస్థానాలకు ఒకే విధమైన సంబంధాలు ఉండేట్లు చూసేడు
.ఆయన ప్రకారం, భారతదేశ సమగ్రతకు సంబంధించి,బలమైన కేంద్ర ప్రభుత్వం, బలమైన సమాఖ్య వ్యవస్థా రెండూ అవసరం. ఆయన వ్యక్తిగతంగా ఎకకేంద్ర ప్రభుత్వానికి అనుకూలం.ఆయన రాజ్యాంగ సభకు చెప్పినట్లుగా,’నన్ను ఎక్కువగా చీకాకు పరిచే వాస్తవం ఏమిటంటే,భారతమాత అంతకుముందు ఒకసారి తన స్వాతంత్రాన్ని కోల్పోవడమే కాకుండా,దాన్ని తన స్వంత ప్రజల కట్టుబాటు లేమివల్ల,దగావల్లా కోల్పోయింది.” ఆయన అనేక సంఘటనలు ఉటంకించిన తరువాత ఈ ప్రశ్న లేవనేత్తేడు.”చరిత్ర పునరావృత మౌతుందా? బహుశా మన స్వాతంత్రంరెండోసారి అపాయంలోపడి శాస్వితంగా దురమౌతుండదా? మన చివరి రక్తపు చుక్క ఉన్నంతవరకూ మన స్వతంత్రాన్ని ధృఢ సంకల్పంతో కాపాడుకుందాం.


రూపొందే కాలంలో కేంద్ర ప్రభుత్వం ఓ శక్తివంతమైన ఉత్తెజాన్నిచ్చేట్లుగా ఉండాలి.మనకు ప్రస్తుతం ఉన్న రాజ్యాంగంలోని 355,356,ఇంకా 365 ప్రకరణాలు భారత ప్రభుత్వ చట్టం – 1935 లోని ఆవిధమైన చట్టం యొక్క సారాంశమే. ఆయన ‘సమాఖ్య’ అనే పదానికి బదులు ‘ఎకకేంద్రం’అనే మాటనే వాడడానికి ఎక్కువ ఇష్టపడ్డాడు.ఐతే,చాలా ధృఢమైన కేంద్ర ప్రభుత్వం వాళ్ళ వచ్చే ప్రమాదాలపట్ల ఆయన అమాయకంగా లేడు.”దాన్ని మరింత బలోపేతం చేసే పోకడలను ఎదుర్కోవాలి.అది జీర్ణించుకో గలిగినంత మొత్తానికంటే ఎక్కువ నమల గూడదు.దాని బలం దాని బరువుతో సరిపోలేట్లు ఉండాలి.దాన్ని మరీ ఎక్కువ బలంగా తయారు చేయడం దాని బరువుకే అది పడిపోయేట్లు ఉండకూడదు.కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన అధికార విభజన అత్యవసరం. రాజ్యాంగంలోని కేంద్ర అంశం ఏమంటే దాన్ని అనుకూలంగా మలుచుకో గలగటం.పార్లమెంటరీ ప్రజస్వామ్యం యొక్క గట్టి రక్షణ దాని మంత్రిత్వ శాఖల,యంత్రాంగం జవాబుదారీతనంకోసం,ఇంకా,రాష్ట్రపతి యొక్క నామమాత్రపు స్థాయి, అధికారం పై ఒకదాన్ని మరొకటి తనిఖీ చేసే వ్యవస్థలు ఉండటం.


ఇండియా లాటి అతిపెద్ద భిన్నత్వమున్న దేశంలో రాజకీయ స్థిరత్వం కోసం కావాల్సిన సామాజిక పరిస్తితులను గురించికూడా ఆయన దీర్ఘంగా ఆలోచించాడు.ఆ విధమైన స్థిరత్వం కోసం ప్రాధమికమైనవిగా మూడు సూత్రాలు ఆయనకు కనబడ్డాయి. అవి,సహా జీవనం,ఉమ్మడి లక్ష్యాలు, ఇంకా స్వేచాయుతంగా సామాజికంగా పరస్పర సంబంధాలతో కలిసి మెలిసి ఉండటం.సహా జీవనానికి,స్వేచాయుతంగా సామాజికంగా పరస్పర సంబంధాలతో కలిసి మెలిసి ఉండటానికీ కుల వ్యవస్థ అనేది నిర్దిష్టంగా పెద్ద అడ్డంకి.ఆయన తన ‘కులాన్ని అంతం చేయటం’ అనే గ్రంధంలో వ్రాసినట్లుగా,అది జాతీయ భావనకు వ్యతిరేకం.కుల సమాజంలో ప్రజాభిప్రాయానికి చోటు లేదు.
సమాజంలోని అతిపెద్ద విభాగం సంపద నుంచీ విద్య నుంచీ దూరం చేయబడటమనేదివారిని సమాజం లోని ఉన్నత స్తాయి వారికి బానిసలుగా చేయటమేకాక,దేశానికి వారి విధెయతనూ,సామాజికార్దికాభివృద్ధికి వారి గొప్ప శక్తివంతమైన సేవలను కూడా దూరం చేయడమౌతుంది. రాజ్యాంగ సభలో ఆయన నొక్కి చెప్పినట్లుగా, ఒక జాతిదేశంగా భారత దేశం ఇంకా శిశువు దశలోనే ఉంది.మనం వివిధ సామాజిక శక్తులను కలిపి వాటినన్నిటినీ ఉద్వేగాపరంగా ఒకే దేశంగా భావిన్చేట్లు చేయడానికి మనం ఎంతోదూరం ప్రయాణించాల్సి వుంది.


దానికి జాతి ఐక్యత యొక్క సామాజిక నిర్మాణాన్ని అభివృద్ధి చేయటం అవసరం.రాజ్యాంగంలోని ప్రాధమిక హక్కులు, ఇంకా ప్రభుత్వ విధాన నిర్దేశిక సూత్రాలూఉన్న అధ్యాయాలు ఆ లక్ష్యం కోసమే ఉన్నాయి.అస్పృశ్యతా నిర్మూలన ,ఏ వివక్షా లేకుండా అందరికీ స్వేచ్చ సమానత్వాలకై హక్కులు,చట్ట సభలలో ను,విద్యా ఉద్యోగాలలోనూ పరిహారాత్మక రిజర్వేషన్లు కల్పించే ప్రత్యెక నిబంధనలు,సమాన అవకాశాలుడే ఆర్ధిక వ్యవస్థను నిర్మించేందుకు, అల్ప సంఖ్యాకుల హక్కుల రక్షణ వంటివి వీటిలో చేరి ఉన్నాయి.ఏదేమైనా మరింత తీవ్రమైన సామాజిక ఆర్ధిక మార్పు ఇంకా ముందుకు తీసుకెళ్ళాల్సిన అంఆశ్ప్రుశ్యులకుమాత్రమె నాయకునిగా ఉండిపోయాడా అనే విషయం సందేహాస్పదం.మహాత్మాగాంధీని గురించిన తన దృక్పధాన్ని వివరించినంత ప్రత్యేకంగా వేర్క్కడా తన మింగుడుపడని తనం ప్రతిఫలించలేదు.ఇంకా అందుకు విరుద్ధంగా,ఒకరు మరొకరికి స్పూర్తి నిచ్చే పరస్పర పూరకాలుగా ఉన్నారు.’దళిత వర్గాల’కు అల్పసంఖ్యాకుల హోదా కావాలంటూ భేరి మోగించిన దెబ్బకు గాంధీజీ ఆశ్ప్రుస్యతా నిర్మూలనకుపూనుకునే విధంగా చైతన్యవంత మయేడు.అయితే, గాంధీజీకి మాత్రం అది ఒక కొత్త నైతిక క్రమతను నిర్మాణం చేసే సామాజిక నైతికత మాత్రమె.కుల విభాగాల రాజకీయ స్వభావాన్ని అంబేద్కర్ గుర్తిన్చినట్లుగా గాంధీ గుర్తించలేదు.బహుశ అందుకే ఆయన అస్ప్రుస్యతా నిర్ములనకోసం సత్యాగ్రహం చేయలేదు.ఆయన కులీన హిందువుల అభిప్రాయాలను ప్రతిఫలించే పనిముట్టుగా మారినా, అంబేద్కర్ శాసనపరంగా స్వతంత్ర భారతంలో రాజ్యాంగం ద్వారా సుసాధ్యం చేయడానికి దోహదపడ్డాడు.గాంధీజీ యొక్క సవర్ణ హిందూ అనుచరులకూ దళితులకూ మధ్య వ్యతిరేక స్తానాలివ్వడంకంటే,వీరిద్దరరూ పరస్పర పూరకంగా అందించినదాన్ని సుసాధ్యం చేసేందుకు,అంబేద్కర్,గాంధీ,నెహ్రు లు కళలు గన్న ఇంకా పూర్తికాని ఆశయాలను పూర్తిచేసే దిశగా కదలాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here