బలహీనమైన మెజారిటీ

0
224

బారత దేశంలో 1.2 బిలియన్ జనాభాలో 200 మిలియన్ దళితులు, 104 మిలియన్ మంది ఆదివాసీ ప్రజలు నివసిస్తున్నారు. దేశ జనాభా లో వీరు 25% ఉన్నారు. వీరితోపాటు 40% వెనుకబడిన కులాలకు  చెందిన వారు. దీనితో ఈ వర్గాల ప్రజల సంఖ్య 70 శాతానికి చేరుతుంది. 

1947 లో బారత దేశం స్వతంత్ర దేశం అయ్యింది ఆనాటి నుండి రాజకీయ పార్టీలు దళితులను ఒటు బ్యాంకు రాజకీయాలకు ఉపయోగించుకుంటూ తప్పుడు వాగ్దానాలతో దళితులను ఆర్ధిక, సామజిక అభివృద్ధి నుండి అలాగే మానవ అభివృద్ధి నుండి దూరం చేసేరు.

2014 లో బి జే పి అధికారంలోకి వచ్చింది. బి జే పి లో 40 మందికి పైగా దళిత పార్లమెంట్ సబ్యులు ఉన్నారు. కానీ నాలుగు సంవత్సరాలు అయిపోతున్నా బా జ పా దళితులకు ఇచ్చిన ఒక్క వాగ్దానం కుడా నెరవేర్చలేదు. కానీ దళితుల మీద దాడులు మాత్రం పెరిగిపోయాయి.

దళితుల పై నేరాలు క్రమంగా పెరుగుతున్నాయని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో నివేదికలు ద్వారా తెలుస్తుంది. గత నాలుగు సంవత్సరాల నుండి దళితుల పై దాడులు రెట్టింపు అయ్యాయి. దళిత మహిళ ల మీద దాడులు, వేధింపులు, హత్యలు సంఖ్య కుడా పెరిగిపోయింది.

దళిత యువత నేడు ఎక్కువగా షోషల్ మీడియా ద్వారా రాజకీయ పార్టీల వైఖిరిని అలాగే ప్రబుత్వాలు చేస్తున్న కుట్రలను తెలుసుకుంటున్నారు. , సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ అధ్యయనం ప్రకారం 2014లో దళిత ఓట్లు ఎక్కువగా బా జ పా కి పడ్డాయి. ఇంతకు ముందు చెప్పుకున్నట్లు పార్లమెంట్ లో మొత్తం 84 దళిత పార్లమెంట్ స్తానాలు రిజర్వ్ చేసి ఉంటే అందులో 40 మంది బా జ పా నుండి ఎన్నిక కావడం గమనర్హం.

2014 లో కేంద్రంలో BJP అధికారంలోకి వచ్చిన క్షణం నుండి దళితులకు ప్రమాదం పొంచి ఉన్నదని ఆ పార్టీ చర్యలు ద్వారా తెలియజేసింది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయంలో  పి. హెచ్. డి స్కాలర్ వేముల రోహిత్ సంఘటన నుండి, గుజరాత్ లోని ఉనా సంఘటన మరియు డిల్లీ విశ్వ విద్యాలయం, మద్రాస్ విశ్వవిద్యాలయం లో జరిగిన సంఘటనలు BJP దళిత వ్యతిరేక పార్టీ గా మరోసారి రుజువు చేసింది.

ఎస్సి, ఎస్టీ యాక్ట్ పై కేంద్ర ప్రబుత్వం యొక్క తీరును దళితులు తీవ్రంగా ఖండిస్తున్నారు. సాక్షాత్ తీర్పు చెప్పిన సుప్రీం కోర్టు న్యాయమూర్తి ప్రబుత్వం చేసిన కుట్రను పత్రికా ముఖంగా తెలియజేసేడు.

గతంలో మాదిరిగా కాకుండా నేటితరం దళిత యువతకు తమ హక్కులు పట్ల అవగాహన ఎక్కువగా ఏర్పడుతుంది. గతంలో ఫ్యూడల్ కుల పార్టీల చెప్పుచేతల్లో ఉండేవారు.ఇప్పుడు స్వతంత్రంగా ఆలోచిస్తున్నారు. ఇదే సరైన సమయం. ఇంకెన్నాళ్ళు రాజకీయ బానిసత్వం అంటున్నారు.ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దళిత యువత ఆందోళన చేస్తున్నారు.పటిష్టమైన SC, ST ACT ని సుప్రీం కోర్టు ద్వారా నిర్వీర్యం చేస్తున్న RSS-BJP కుట్రలకు వ్యతిరేకంగా దళిత యువత సంఘటితం అవుతున్నారు.  

ఉత్తర బారత దేశంలో దళిత రాజకీయానికి కొత్త ముఖం గుజరాత్ కి చెందిన జిగ్నేష్ మేవాని, ఉత్తర ప్రదేశ్ కి చెందిన “భీమ్ ఆర్మీ” చంద్ర శేఖర్ ఆజాద్. గుజరాత్ ‘ఉనా’ సంఘటన తర్వాత గుజరాత్ లో సమావేశాలు, సెమినార్ లు  నిర్వహించి దళిత ప్రజలను బాబాసాహెబ్ బాటలో నడిపిస్తున్నాడు. జిగ్నేష్ మేవాని అద్వర్యంలో వేలాది మంది దళితులు హిందూ మతం వీడి బుద్దిజం లోకి మారేరు. బాబాసాహెబ్ 127 వ జన్మదినం సందర్బంగా ఉనా బాదితులు బుద్ధిజం లోకి మారటం గమనార్హం. దళితులు జంతు కళేబరాలు తీయం అని ప్రతిజ్ఞ చేసేరు. అలాగే జిగ్నేష్ మేవాని శాసన సబ్యుడి గా గెలిచి గుజరాత్ అసెంబ్లీ లో ఏకైక దళిత ప్రతినిదగా తన గొంతును వినిపిస్తున్నాడు. 

చాలామంది దళిత నాయకులు కులాన్ని నిందిస్తున్నారు. కమ్యునిటీలో మార్పు రావడం లేదని అంటున్నారు. కానీ కమ్యునిటీ దళిత నాయకత్వంలో మార్పు రావాలని కోరుకోవడం విశేషం.

దళిత యువత ఇప్పుడు దళిత ప్రజలకు చెందాల్సిన హక్కులు, రావాల్సిన నిధులు, వాస్తవాల మీద ప్రబుత్వాన్ని నిలదీస్తున్నారు.గతంలో కమ్యునిటీ దోరణి వేరుగా ఉండేది. కానీ ఇప్పుడు దళిత యువత గత చరిత్రను తెలుసుకోవడంలో, చరిత్రను నిర్మించే పని ఉన్నారు.

ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ లో దళితుల పక్షానా రెండు పార్టీలు ఆవిర్భవించాయి. రిజర్వేషన్ వర్గీకరణ వ్యతిరేక పోరాటం చేసిన మాల మహానాడు గ్రూపు లు చల్లా నరసింహ రావు  రాష్ట్రీయ దళిత కాంగ్రెస్స్ పార్టీ పేరిట ఒక పార్టీ మరియు, పంతగాని రమేష్ గారి నాయకత్వం లో ఆంధ్ర బహుజన సమితి అనే పార్టీ లు దళితుల స్వతంత్ర రాజకీయం దిశగా అడుగులు వేస్తున్నాయి. రాస్ట్రీయ దళిత కాంగ్రెస్స్ ఒక అడుగు ముందుకు వేసి అసెంబ్లీ , పార్లమెంట్ అభ్యర్ధులను ప్రకటిస్తుంది. తెలంగాణా లో BSP పార్టీ మాజీ నాయకుడు విశరాదన్ నాయకత్వంలో దళిత శక్తి ప్రోగ్రాం పేరిట దళితులను రాజకీయం దిశగా నడిపించే ప్రయత్నం చేస్తున్నారు.  

మెజారిటీ ప్రజలు అధికారానికీ దూరంగా ఉన్నారు అనేకంటే అధికారానికి దూరంగా పేటేరు. అది నిన్న కాదు మొన్న కాదు, తరతరాలుగా ఇంకా అదే మతం, భూస్వామ్య కులాల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here