నాయకుడు లేని ఎస్సి సామాజిక వర్గం!

0
93

బారత దేశానికి స్వతంత్రం రాకమునుపే “కీలు బొమ్మల” కాలం మొదలైంది. మాన్యశ్రీ కన్షిరాం ఈ కీలుబొమ్మల కాలాన్నే “చెంచాయుగం” అన్నారు. ఈ చెంచాయుగం పూర్వాపరాలు పరిశీలిస్తే 1932 ఆగస్టు 17న బాబాసాహెబ్ డా బి ర్ అంబేడ్కర్ గారు దళితుల కోసం అంటే ఆనాటి నిమ్నజాతీయులు కోసం బారత దేశ చరిత్రలో మొదటిసారి కొన్ని హక్కులు సాధించేరు. అది “కమ్యూనల్ అవార్డ్” అనే భలమైన, ఆత్మగౌరవ హక్కు. ఈ ఆత్మగౌరవ రాజకీయ హక్కులు ఎస్సిలకు, ఎస్టీలకు రావడం ఏంటి అని నేవ్వేరిపోయిన గాంధీ, ఎర్రవాడ జైలు లో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చొని, స్వేఛ్చ, స్వతంత్ర రాజకీయ హక్కులను బలవంతాన లాక్కొని, సవర్ణ హిందువులతో అంటే నేటి అగ్ర కులం వారితో కలిసి రాజకీయం చేసుకోమన్నాడు. ఆరోజే బాబాసాహెబ్ డా అంబేడ్కర్, గాంధీ-కాంగ్రెస్ ఎస్సి లను నమ్మకః బ్యాచీలను తాయారు చేస్తుంది అని బయపడ్డారు. నేటికి 86 సంవత్సరాల క్రితం వచ్చిన  ఒక అనుమానం నేటికీ సజీవంగా ఉంది. 1982 లో మాన్యశ్రీ కన్షిరాం చెప్పిన చెంచా సిద్దాంతం ఈరోజుకీ ఋజువు చేస్తూనే ఉన్నారు ఎస్సి నాయకులు.

ఆంధ్రప్రదేశ్ దళిత మహా సభ, డా. కత్తి పద్మారావు నేతృత్వంలో తెలుగు షెడ్యుల్ క్యాస్ట్ ప్రజలను, ఉద్యమాలను ప్రపంచంతా గుర్తించే విధంగా తీసుకువస్తే రాజకీయంగా విఫలం చెంది నేడు సిద్దాంత చర్చల్లో ఉండిపోయేరు. బొజ్జ తారకం బహుజన సమాజ్ పార్టీ తో విభేదించి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ని స్తాపించినా ఎస్సి  జాతిని రాజకీయంగా ముందుకు నడిపించలేక పోయేరు. ఇక ఉత్తర బారత దేశంలో మాన్యశ్రీ కన్షిరాం కృషితో అధికారంలోకి వచ్చిన బహుజన సమాజ్ పార్టీ కూడా సరైన నాయకుడిని అందించలేక పోయింది.

ఆంధ్రప్రదేశ్ లోని షెడ్యుల్ కులం  రాజకీయ బవిషత్ 1994 తోనే ముగిసింది అని ఘంటా పదంగా చెప్పవచ్చు. నేటి ఆంద్ర, తెలంగాణాలో ఉన్న ఎస్సి నాయకత్వం చేసిన తప్పులు బహుజన్ సమాజ్ పార్టీ ని అధికారానికి శాశ్వతంగా దూరంగా నెట్టి వేసింది.

దీనికి కారణం కుడా దళిత నాయకత్వమే! 1932 లో బాబాసాహెబ్ డా బి ర్ అంబేడ్కర్ రౌండ్ టేబుల్ సమావేశంలో దళితుల పక్షాన మాట్లాడటానికి లండన్ వెళితే, ఇండియాలో ఉన్న ఇద్దరు నాయకులు అసలు డా. అంబేడ్కర్ మా ప్రతినిధి కాదు, గాంధీ నే మా ప్రతినిధి అన్నారు. ఆనాటి చెంచా వారసులే 1994 లో ఎస్సి లను ఉమ్మడి ఆంధ్రలో అధికారానికి దూరం చేసేరు.

ఎస్సి నాయకులు అని చెప్పుకునే వాళ్ళు ఆనాటి నుండి పుట్ట గొడుగుల్లా పుట్టుక రావడం మొదలు పెట్టేరు. తమ సీనియర్ నాయకత్వం అమ్ముడు పోవడం కళ్ళారా చుసిన జూనియర్ నాయకులు కుల సంఘాన్ని ఉపాధి మార్గంగా పెట్టుకున్నారు. రాజకీయమా! అదేమీ మాట ప్రాంతీయ కుల పార్టీల్లో కుల సెల్ కి నాయకుడు అవడం అదే రాజ్యాధికారం గా వారి బూర్జువా కుల పార్టీ నాయకుడే బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ తర్వాత అంబేడ్కర్ అంతటి వాడు అంటూ కీలు బొమ్మల సంస్కృతికి మరింత బలంచేకుర్చేరు.

ఈ పరిణామంలో ఊహించని ఒక పరిణామం మొత్తం నిమ్నజాతీయులు  నేడు ఉన్న దుర్భర పరిస్తితికి ఆజ్యం పోసినట్టు అయ్యింది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పేరిట ఎస్సి రిజర్వేషన్లు వర్గేకరించాలి అంటూ మాదిగలు మాలలతో విభేదించి, అవసరం అయితే పామును అయినా వదిలి మాలోడిని కొట్టండి అని ఒక వైరుధ్యాన్ని పెంచి పోషించేరు. వీరికి కౌంటర్ గా మాల మహానాడు. ఇక ఎస్సి / ఎస్టీ / బిసి / మైనారిటీ  ఐక్యత అంటూ విజిటింగ్ కార్డు నాయకులకు కొదవలేదు.

ఆనాటి నుండి నేటి వరకూ డిల్లీ నుండి గల్లీ వరకూ అగ్రవర్ణ నాయకులను అడుక్కుంటూ మాకు బవిషత్ ఇవ్వండి అంటూ ఎమ్మర్పిఎస్ మాదిగల రాజకీయ చైతన్యాన్ని నిర్వీర్యం చేస్తే కౌంటర్ ఉద్యమాలతో మాల మహానాడు అసలు రాజకీయం మాట్లాడటమే మరచిపోయేరు.

కుల నాయకులు కొందరు ఆనాటి ముఖ్యమంత్రి వద్ద సూటు కేసులు మోసుకు వస్తే, కొందరు రాజకీయ పదవులు తీసుకునన్నారు.

ప్రపంచీకరణలో బాగంగా ప్రపంచంలోని అన్ని జాతులు స్వేఛ్చ , సమానత్వం, సౌభ్రాతత్వం కోసం రాజకీయంగా తమ వర్గ శత్రువుని ఎదిరిస్తూ రాజ్యాధికారం కోసం శ్రమిస్తూ ఉంటే ఆంధ్ర – తెలంగాణా లోని ఎస్సిలు అమ్ముడు పోవడంలో ఒకరికి ఒకరు పోటీ పడుతున్నారు.

కమ్యూనల్ అవార్డ్ సమయంలో సవర్ణ హిందువులకు, గాంధీ కి మద్దత్తు పలుకుతున్న మద్రాస్ కు చెందిన యం.సి రాజా ని ఉద్దేశించి బాబాసాహెబ్ డా బి ర్ అంబేడ్కర్ మాటలు నేటి దళిత నాయకత్వం కి కుడా బాగా సూటు అవుతాయి. “హిందువులు ఎంతో మారిపోయారు అని అణగారిన వర్గాలకు చెప్పాలి అని గొంతు చించుకుంటున్నరాజాను అవతలి వారు ఉమ్మడి నియోజకవర్గంలో తనను ఎన్నుకోవడానికి సిద్దంగా లేరు అని గుర్తించాలి”  అంటే రిజర్వర్డ్ నియోజకవర్గంలో కాకుండా జనరల్ నియోజకవర్గం లో దళితులను ఎన్నుకోవడానికి బూర్జువ పార్టీలు సిద్దంగా లేవు. బూర్జువా నాయకులను దళిత పక్షపాతి , ఎస్సిల  దేవుడు , అంబేడ్కర్ అంటూ పొగిడే నేటి కీలు బొమ్మ నాయకులు అనాడు బాబాసాహెబ్ చెప్పింది ఒక్కసారి చదువుకోవాలి. మెజారిటీ ఓట్లు ఎస్సిలవి  అయినా రిజర్వర్డ్ నియోజకవర్గాలకే ఎస్సి లకు సీట్లు ఇస్తారు తప్పా ఒక్క స్తానం కుడా అదనంగా ఇవ్వరు.

“ఎందరో మహాత్ములు పుట్టారు. నిష్క్రమించారు. కానీ అంటారని వారు అంటరానివారుగానే మిగిలి పోయారు” బాబాసాహెబ్ డా. బి ర్ అంబేడ్కర్

చంద్రన్న , రాజన్న , జన సేన లేదా బా జ పా నాయకత్వానికి జై కొడుతున్న దళిత నాయకులు, యువత బాబాసాహెబ్ డా అంబేడ్కర్ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకోవాలి.

రాష్ట్రం విడిపోతే లెక్కలు మారతాయి అని అటు తెలంగాణాలో , ఇటు ఆంధ్రలో చెప్పిన ఎస్సి నాయకులు, కళాకారులు, రచియితలు నాలుగు సంవత్సరాలు అయినా బానిస బావజాలం నుండి బయటపడక స్వార్ధ ప్రయోజనాలకు దళారీ అవతారం ఎత్తడం సిగ్గుచేటుగా బావించాలి.

అనిచివేయబడిన మేధావులు

మాన్యశ్రీ కాన్షీరాం తన చెంచాయుగం లో షెడ్యులు కులాల , తేగలకు వారి హక్కులకు గుర్తింపు లభించిన తర్వాత పెద్ద సంక్యలో వారికి విద్య అందుబాటులోకి వచ్చింది. ఈ చదువుకున్న వారిలో చాల మందికి ఉద్యోగం వచ్చింది వివిధ రాజకీయ పార్టీలు ఎస్సి/ ఎస్టీ ఓట్ల కోసం ఈ చదువుకున్న ఉద్యోగులను మచ్చిక చేసుకున్నారు అంటారు. వాస్తవంగా చెప్పాలి అంటే ఇదే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో జరుగుతుంది. మాజీ ఐ ఏ ఎస్ , ఐ పి ఎస్ లు వివిధ హోదా లో వున్నవారు ఉద్యోగాలకు రాజీనామా చేసి బాబాసాహెబ్ కి వ్యతిరేక బావలు ఉన్న రాజకీయ పార్టీలలో , ఫ్యూడల్ కుల పార్టీలలో చేరుతున్నారు, వారికి సర్వీస్ చేస్తున్నారు. ఈ అభివృద్ధి చెందిన వర్గం యొక్క స్వబావాన్ని దృష్టిలో పెట్టుకుని మన్యశ్రి కన్షిరాం వీరిని “అణిచివేయబడిన మేధావులు” అని పేరు పెట్టడం జరిగింది.

ఫ్యూడల్ రాజకీయ పార్టీలలో చేరిన వీరిని చెంచాలు గానే పిలిచినా పాలనా పరమైన అనుభవం ఉన్న వీరిని చెంచాలకే చెంచాలు అని మాన్యశ్రీ కాన్షీరాం అన్నారు.

ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఈ రెండు వర్గాలు ప్రజలకు దూరం అవుతూ వస్తున్నా, రాజకీయ పార్టీలు వీరిని ప్రోస్తాహిస్తూ ఉంటాయి. ఎందుకంటె ఈ వర్గాలు కాళీగా ఉంటే షెడ్యుల్ కులాల తేగల లో రాజకీయ చైతన్యం రావటానికి కారకులు అవుతారు. ఎస్సి , ఎస్టీ లలో మార్పు వస్తే ఫ్యూడల్ వ్యవస్థ అస్తిత్వానికే ముప్పు వస్తుంది. ఫ్యూడల్ రాజకీయ పార్టీల అస్తిత్వానికి మార్పు వస్తుంది.

ఎస్సిలకు రాజకీయ పదవులు ఇవ్వరు , ముక్యమంత్రులు చెయ్యరు, లేదా సరైన ప్రాదాన్యత గల పదవులు ఇవ్వరు, కానీ వారిని ఆయా పార్టీలలో ఉండే విధంగా చేసుకుంటారు. సొంత ప్రయోజనాల కోసం ఎస్సి నాయకులు కుడా ఆ ఫ్యూడల్ నాయకత్వం లోనే ఉండే విధంగా తమ ప్రణాలికలు చేస్తారు. దీనినే మాన్యశ్రీ కన్షిరాం “రక్షిత వివక్ష విధానం” అంటారు. ఈ రక్షిత వివక్ష విధానం వలన తెలుగు రాష్ట్రాలలో ఎస్సి / ఎస్టీ లలో నాయకత్వ సమస్య కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.

ముందు చెప్పుకునట్లు ఆంధ్రప్రదేశ్ విభజన ఎస్సి / ఎస్టీ ప్రజలకు రాజ్యాధికార అవకాశాలు చాల ఎక్కువగా ఉన్నాయి. ఆత్మనూన్యత తో ఇతర పార్టీల వైపు మొగ్గు చూపటానికే ప్రయత్నిస్తున్నారు కానీ సొంతగా రాజకీయ పార్టీ దిశగా ఆలోచించడం లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఎస్సి ల జనాభా కంటే తక్కువగా ఉన్న కాపులు వారి కుల నాయకుడు పవన్ కళ్యాణ్ కి ఇచ్చినంత ప్రాదాన్యత మెజారిటీ ఓటర్లు గల ఎస్సి నాయకులకు ఇవ్వడం లేదు. పవన్ కళ్యాణ్ బలం అతని కులం అనే వాస్తవం గ్రహించి వివిధ రాజకీయ పార్టీలు అతనికి ఇచ్చే గౌరవం చూసి అయినా సొంత పార్టీ ఆలోచనలు చేస్తారు అని ఆశిద్దాం.   

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here