షెడ్యూల్ క్యాస్ట్: జవజీవాలులేని రాజకీయ చైతన్యం!

0
522
షెడ్యూల్ క్యాస్ట్

షెడ్యూల్ క్యాస్ట్ రాజకీయ చైతన్యం ఇప్పటిది కాదు. మీ గోడల మీద రాసుకోండి మనం పాలకులం కాబోతున్నాం అని డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ ఇచ్చిన స్ఫూర్తి అది. డా బాబాసాహెబ్ అందుకు అనుగుణంగా షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్, ఇండియన్ లేబర్ పార్టి లను స్థాపించి రాజకీయ కార్యకలాపాలు చేశారు.

సంకెళ్ళు తెంపుకో, విముక్తమవుతావు.వేర్లను తెంపుకోకురోయ్!సచ్చిపోతావ్.ఆఫ్రికా సామెత. 


పైన చెప్పిన సామెత ఎస్సి రాజకీయ నాయకులకు బాగా ఉపయోగపడుతుంది అనుకుంటాను. బాబాసాహెబ్ డా బి ర్ అంబెడ్కర్ గారు రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో నిమ్నజాతులకు ప్రత్యేక రాజకీయ హక్కులు ఉండాలి అని అవిశ్రాంతంగా పోరాడి సాధించిన కమ్యునల్ అవార్డ్ ని గాంధీ నిరాహార దీక్ష తో  అడ్డుకుని నేడు జవజీవాలు లేని ఎస్సి రాజకీయ నాయకులు తయారు కావడానికి కారకుడు అయ్యేడు.

మాన్యుశ్రీ కాన్షీరాం మాటల్లో చెప్పాలి ఆంటే ‘చెంచాగిరి’ నాయకులు. ప్రస్తుతం ఇంకాస్త దిగజారి వివిధ రాజకీయ పార్టీలో ఉన్న నాయకులు కులాన్ని అడ్డంపెట్టుకుని ఇతర ఓ.సి కుల నాయకులను తిట్టటానికి మాత్రమే ఉపయోగపడుతున్నారు. 


గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాలలో ఉన్న షెడ్యూల్ క్యాస్ట్ రాజకీయ నాయకుల తీరు పరిశీలిస్తే వారు తమ సొంత కులానికి చేసిన ప్రయోజనాలు ఏమీ లేవు. గత 10 సంవత్సరాల లో ఎస్సి / ఎస్టి రిజర్వేషన్లు కుడు తమ కులం కోసం వారి రాజకీయ పార్టీని కానీ ప్రభుత్వన్ని ప్రశ్నించింది లేదు మరియు అభివృద్ధి కార్యక్రమాలు చేసింది లేదు.

గత ప్రభుత్వ హయాంలో రోజా ని తిట్టటానికో, అమే మీద అట్రాసిటీ కేసు పెట్టటానికో, జగన్, చంద్రబాబు, కేసిర్ ని లేదా ఇతర నాయకుల ను వారి పార్టీ అవసరాల కోసం తిట్టటానికి తప్పా ఇంకెప్పుడూ ఎస్సి నాయకులు నోరు విప్పటం లేదు.  ఎస్సి లలో పుట్టాలి అని ఎవరు కోరుకుంటారు, ఎస్టి లకు తెలివి లేదు అన్న చంద్రబాబు నాయుడు కి కనీసం తమ అసంతృప్తి ని కూడా వ్యక్త పరిచే స్వేచ్ఛ , ఆత్మమాభిమానం లేదు ఎస్సి నాయకులకు.

మంత్రి ఆదినారాయణ రెడ్డి బహిరంగంగా ఎస్సిలను కామెంట్ చేస్తే పార్టీ లో నిరసన వ్యక్తం చెయ్యలేక పోయేరు. అలాగే రోజా మేము, ఎస్సి / ఎస్టి లం కాదు తాకావచ్చు అని అన్నప్పుడు ఏ వై సి పి ఎస్సి / ఎస్టీ శాసన సభ్యుడు లేదా ప్రజా ప్రతినిధులు ఖండించలేక పోయేరు.

రెండు తెలుగు రాష్ట్రాలలో షెడ్యూల్ క్యాస్ట్ ప్రజల మీద దాడులు ఎక్కువ గా జరుగుతున్నాయి. మంథని లో మధుకర్ అనే యువకుడు ని అత్యంత కిరాతకంగా చంపితే నేటి వరకూ దోషులు ఎవరో పోలీసులు ప్రకటించలేదు. గరగపర్రు లో మూడు నెలలు 400 కుటుంబాల ఎస్సిలను అన్నీ కులాలు కలిసి ను వెలివేస్తే ఆ సంఘటన కి కారణం అయిన నవబారత నిర్మాత బాబాసాహెబ్ డా. బి ర్ అంబెడ్కర్ గారి విగ్రహం ప్రతిష్టించ లేకపోయేరు.

ఆగిరిపల్లి లో 10మంది ఎస్సి ఉన్నత విధ్యా వంతుల మీద రౌడీ షీట్ పెడితే ఏ నాయకుడు స్పందించలేదు. 2014 నుండి ఎన్నో గ్రామాల్లో బాబాసాహెబ్ విగ్రహాలు కూలకొడుతూ అవమానిస్తుంటే ఒక్క ప్రజా ప్రతినిధి ప్రభుత్వం చేతకాని తనం మీద తమ నిరసన తెలియచెయ్యలేదు.

కనీసం అందరూ కలిసి నిరసనగా వినతిపత్రం సమర్పించలేక పోయేరు. ఇక రాజ్యాంగ పరంగా ఎస్సి / ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు అధికార పార్టీ కులం కోసం ఉపయోగించుకుంటుంటే ఒక్కరూ నోరు తెరిచి మాట్లాడింది లేదు. డా. వై యెస్ రాజశేఖర్ రెడ్డి ఎస్సి ఉప ప్రణాళిక నిధులతో జల యజ్ఞం అంటూ భూస్వామ్యులకు ,వారి వ్యవసాయానికి నీరు ఇచ్చే కార్యక్రమం చేస్తే ఒక్క ప్రజా ప్రతినిధి మాట్లాడలేదు. 


పునా ఒప్పందం సమయంలో బాబాసాహెబ్ డా. బి ర్ అంబెడ్కర్ గారు వ్యక్త పరిచిన అనుమానాలు నేడు నిజం అవుతున్నాయి. ఎస్సి ప్రజా ప్రతినిధులు “నామకః” నాయకులే. శాసనసభ, పార్లమెంట్ సభ్యులు కుక్కిన పెనుల్లా కూర్చుంటున్నారు. 1932 నుండి 2017 వరకూ ఎస్సి రాజకీయ నాయకుల పరిస్థితి ఇదే!

గ్రామాల్లో , అక్రమంగా పెడుతున్న కేసులకు లెక్కలు లేవు, ఉద్యోగస్తుల ప్రమోషన్, బదిలీలలో జరుగుతున్న వివక్ష గురించి మాట్లాడేవారే లేరు.హాస్టళ్లలో ఉండి చదువుకుని నేడు మంత్రుల స్తాయిలో ఉన్న నాయకులే ప్రభుత్వ పాఠశాల, హాస్టల్ మూసి వేస్తుంటే చోద్యం చూస్తూ ఉంటారు.

అభివృద్ధి పేరుతో భూమి గుంజుకుంటుంది ఎస్సిల పోరంబోకు భూమి నే కదా, అయినా మాకెమి పట్టదు అన్నట్టుగా ఉంటారు. 


Till the time we won’t be successful in politics and not able to have power in our hands,  the social and economic transformation is not possible. Political power is the key to success.

బహుజన ఉద్యమం నిర్మించి బెహన్ జీ మాయవతి ని ముఖ్యమంత్రి చేసిన మాన్యశ్రీ కాన్షిరాం గారి పైన పేర్కొన్న వాక్యలు అర్ధం అయితే ఎస్సి రాజకీయ నాయకుల్లో కాస్త అయినా చైతన్యం వస్తుంది. ఉత్తర్ ప్రదేశ్ లో ఎందరో చదువుకున్న వారు ఉండగా ‘హరి’ అనే ఒక నిరక్షరాస్య ఎస్సి వ్యక్తిని నెహ్రు తన సేవకుడుని అభ్యర్థిగా నిలబెట్టినప్పుడు బాబాసాహెబ్ డా అంబెడ్కర్ గారు చదువుకున్న వ్యక్తి అయితే ఏనాటికైనా తమ జాతికి జరుగుతున్న అన్యాయాన్ని తెలుసుకుని ప్రశ్నిస్తాడు అందుకే కాంగ్రెస్ నిరక్షరాస్యుడుని అభ్యర్థి గా నిలబెట్టింది అని అంటారు.

1980 వరకూ ప్రతి రాజకీయ పార్టీ ఎస్సి / ఎస్టీ ప్రజా ప్రతినిధుల ను అలాగే ఎన్నుకుంటుంది. నేడు ఇంజినీర్ , డాక్టర్,   IAS, IPS లను అభ్యర్థులుగా నిలబెట్టినా కనీసం తమ జాతి ప్రయోజనాల కోసం నోరు విప్పలేని స్థితిలో ఉన్నారు ఆంటే ఎంతటి దౌర్భాగ్యపు స్థితిలో కులం ఉందో గ్రహించాలి.

ఆంధ్రలో మెజారిటీ ఓటర్లు షెడ్యూల్ క్యాస్ట్ ప్రజలు అలాగే తెలంగాణా లో ఎస్టీ , బి సి లు ఉన్నారు, కానీ జాతి ప్రయోజనాలు లేని రాజకీయం ఎందుకు? ఎవరి కోసం? రిజర్వేషన్లు అనే రిప్రజెంటేషన్ జాతి కోసమా లేక వ్యక్తుల కోసమా?


ఇటీవలనే మనం 71 సంవత్సరాల బారత స్వతంత్ర దినోత్సవం జరుపుకున్నాము. ఇన్ని సంవత్సరాలు అయినా ఎస్సిలలో సామాజిక, రాజకీయ మార్పు రాక పోవటానికి కారణం బాధ్యత లేని ఎస్సి ప్రజాప్రతినిధుల వలనే అని అనుకోవాలి. దాదాపుగా 25 శాతం జనాభా ఉన్న ఎస్సి / ఎస్టీ లు రాజకీయంగా స్వయం ప్రతిపత్తి సాధించలేకపోవటం సిగ్గు చేటు.

బాబాసాహెబ్ డా. బి ర్ అంబెడ్కర్ గారు Indian Labor Party స్థాపించి, మ్యానిఫెస్టో ప్రకటించినప్పుడు దేశ, విదేశీ పాత్రికేయులు నిమ్నజాతులకు, తెగలకు బాబాసాహెబ్ డా. అంబెడ్కర్ లాంటి గొప్ప నాయకుడు ఉండటం అదృష్టం గా వారు రాస్తారు. అంతటి మహోన్నతమైన శక్తి ఉండి కూడా ఇంకా రాజకీయ స్వతంత్రం లేక పోవడం విచారకరం. 


ప్రతి ప్రాంతీయ కుల పార్టీ వారి వారి సొంత కుల రాజకీయ , ఆర్థిక ప్రయోజనాల కోసమే ప్రభుత్వం నడిపిస్తుంది అనేది చేదు నిజం. అందులో ఎస్సి ప్రజా ప్రతినిధులు కుడా భాగస్వామ్యం అవుతున్నారు. 1994 నుండి నేటివరకు చంద్రబాబు నాయుడు, డా. రాజశేఖర్ రెడ్డి, కె సి ర్ పాలనలో వారి సొంత సామాజిక వర్గాల అభివృద్ధి ఎంత జరిగిందో ఎస్సి ప్రజా ప్రతినిధులు తెలుసు కోవాలి.

జలయజ్ఞం కాంట్రాక్టులు నూటికి 98 శాతం చేసింది రెడ్డి సామాజిక వర్గమే. అలాగే 2014 నుండి నీరు – చెట్టు కార్యక్రమం చేసింది కమ్మ సామాజిక వర్గమే. వేల కోట్లు కమ్మ, రెడ్డి రైతుల పొలాలకు నీటి సదుపాయం ఎస్సి ఉప ప్రణాళిక నిధులు  అని ఎస్సి ప్రజా ప్రతినిధులకు తెలియదు ఆంటే అతిశయోక్తి. 


నేడు ఎస్సి ప్రజల్లో రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉంది. ఏ ఒక్క వ్యక్తిని కదిలించినా రాజ్యాధికారం కావాలి అని నిచ్చాయంగా ఉన్నాడు. గ్రామస్థాయి నుండి నగరాల వరకూ ఏ ఇద్దరు కలిసినా బాబాసాహెబ్ ఆశయం గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ చైతన్యాన్ని జాతి అభివృద్ధి కోసం షెడ్యూల్ క్యాస్ట్ ప్రజా ప్రతినిధులు ఉపయోగించుకుంటారో లేక కుల పార్టీ ల వద్ద బానిసలుగా ఉండి, బానిస సంకెళ్లకు బంగారు రంగులు పులుము కుంటారో లేక బాబాసాహెబ్ డా అంబెడ్కర్ ఇచ్చిన స్వేచ్ఛ ను, చైతన్యాన్ని జాతి ప్రయోజనాలకోసం ఉపయోగిస్తారో తేల్చుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here