డా బి ర్ అంబేడ్కర్ జీవితం నుండి ఏమి నేర్చుకోవాలి?

0
364
Ambedkar

దేశం ఏప్రిల్ 14 నాడు బాబాసాహెబ్ డా బి ర్ అంబేడ్కర్ 127 వ జన్మదినం సందర్బంగా ఘనంగా  నివాళ్ళు అర్పించింది. దళిత సామాజిక వర్గాలు ఉత్సాహంగా పండగ వాతావరణంలో అయిన జయంతి చేసేరు. అయితే ఇక్కడ పాలకులతో పాటు ముక్యంగా దళిత సామాజిక వర్గం గుర్తించుకోవాల్సింది అయిన ఆశయాలు ఎంతవరకు నెరవేరుస్తున్నాం ? అనే ప్రశ్న వేసుకోవాలి.

బాబాసాహెబ్ డా బి ర్ అంబేడ్కర్ దళితులకు హక్కులు కల్పించిన ఏకైక వ్యక్తి. దళితుల ఆత్మగౌరవం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప కార్యదీక్షుడు. రాజ్యాంగ పరంగా దళితుల అభ్యున్నతి కోసం చట్టాలు చేసిన వ్యక్తి.

నేటి చాలామంది యువకుల కు తెలియని అంటరానితనం డా బాబాసాహెబ్ అంబేడ్కర్ చిన్నతనంలో ఎదుర్కొన్నాడు. స్కూల్ వరండాలో తన గొనె పట్టా తానె తెచ్చుకుని ఆ పట్ట మీద కూర్చున్నాడు. దాహం వేసి మంచినీరు తాగే వీలు లేదు. మహార్ కులస్తుడు అని తెలిసి తను వస్తున్న గుర్రపు బండిని మధ్యలో ఆపి దించివేస్తే నడుచుకుంటూ స్కూల్ కి వచ్చేవాడు. కొలంబియా యునివర్సిటీ లో ఆర్ధిక శాస్త్రం లో పట్టా పుచ్చుకున్నా కులం యొక్క వివక్షను ఎదుర్కున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి బవిషత్ తరాలు వివక్షకు గురికాకూడదు అని అహర్నిశలు శ్రమించి దళిత జాతి కోసం తన జీవితాన్ని అంకితం చేసేడు.

డా బి ర్ అంబేడ్కర్ నుండి దళిత యువత ఏమి నేర్చుకోవాలి?

అంటరానితనం, కుల వివక్ష నేటికీ జరుగుతున్నాయి. స్కూల్స్ లో మధ్యహాన బోజన సమయంలో దళిత పిల్లలు మధ్య మేము కుర్చుని భోజనం చెయ్యం అని స్కూల్ విద్యార్ధులు బహిష్కరించిన సంఘటనలు ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో మిడ్ డే మీల్స్ లో దళిత విధ్యార్ధులను వేరుగా కుర్చోబెడుతున్నారు. ఇలాంటి సమాజంలో బాబాసాహెబ్ జీవిత పోరాటం నుండి దళిత యువత ఎలాంటి స్పూర్తిని పొందటం నేర్చుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here