అంబేడ్కర్ ఆలోచనా విధానం:మే 17 కామ్రేడ్స్ సామాజిక విప్లవం!

షేర్ చెయ్యండి
  • 244
    Shares

అంబేడ్కర్ ఆలోచనా విధానం సాయం లేకుండా ఇండియాలో సామాజిక విప్లవాన్ని ఆలోచించలేం. 


బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ 1936లో, కులనిర్మూలనా గ్రంధంలో ఆనాడు ఈ మూస మార్క్సిస్టు నేతలకు ఏ చారిత్రాత్మక  ప్రశ్నలు వేసాడో ఆ ప్రశ్నలకు ఇంతవరకూ వారి నుండి బదులు లేదు. 


1985-95 కారంచేడు దళిత దశాబ్దంలో ముందుకొచ్చిన “నూతన దళిత వాడ రచ్చబండ సిద్ధాంత పోరాటం” లేవనెత్తిన కొత్త ప్రశ్నలు కూడా వారు సమాధాన పరచలేక పోయారు. 


నిర్దిష్టమైన నిర్మాణాత్మక విమర్శ ద్వారా ఆత్మ విమర్శ ఆవశ్యక్తను మళ్ళీ ముందుకు తెచ్చిన ఈ నూతన దళితవాదం రెండు పందాల మధ్య సిద్ధాంత పోరాటాన్ని మార్క్సిస్టు శిభిరంలో ఎజెండాకేక్కించింది. 


ఆనాడు బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ లేవనెత్తిన ప్రశ్నలకీ, ఈనాడు నూతన దళితవాదం లేవనెత్తిన ప్రశ్నలకి సారూప్యత ఉన్నా మౌలికమైన తేడా ఒకటుంది. 
అదేమంటే డా. అంబేడ్కర్ ఆనాడు ఒక నాన్ మార్క్సిస్టుగా మార్క్సిస్టు శిబిరానికి బయట నుండి ఆ ప్రశ్నలు వేశాడు. 


మూస మార్క్సిస్టు ఉక్కు చట్రం ఉమ్మడిగా దాన్ని పక్కదారి పట్టించి, వక్రీకరించి దాటవేసింది. కానీ నేడు మార్క్సిస్టు శిబిరంలోనే దళిత బహుజన విప్లవ శక్తుల నుండే అంతర్గతంగా దళిత బహుజన వాద నూతన విప్లవ సిద్ధాంతం ఎజెండాకెక్కి కొత్త చరిత్రను మలుపు తిప్పింది.

Also read  Fascism has no place in democracy!

 
అంబేడ్కర్ ఆలోచనా విధానం ఈ దేశంలో ఉన్న ఏ వాదంలోనైనా కులం అనేది ఉందని ఋజువు చేసినట్లు ఈ సందర్బంగా మనం అర్ధం అవుతుంది.


ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాక్కున్నాయో అన్న కామ్రేడ్ మర్క్స్  ఇండియా లో ఏ వాదం వెనక అయినా కుల ఉందని తేటతెల్లం చేశాడు బాబాసాహెబ్ డా. అంబేడ్కర్. 


బ్రాహ్మణీయ సామాజిక మూలాలనుండి తలెత్తిన బ్రాహ్మణేతర దళిత బహుజనోద్యమం మార్క్సిస్టు శిబిరంలోనికి దళిత బహుజన విప్లవ శక్తులన్ని ప్రభావితం చేసి అంతర్గత చర్చకి నాంది పలికింది.

 
అయితే ఎ పోరాటం అయిన దాని అంతిమ లక్ష్యం రాజ్యాధికారం సాధించడమే కనుక మనం సాధించాల్సింది సామాజిక న్యాయానికి సామాజిక సమానత్వానికి రాజ్యాధికారం చేపట్టడం చాలా కీలకమైన అంశమని బాబాసాహెబ్ డా అంబేడ్కర్ స్పష్టంగా చాటి చెప్పాడు. 


Political power is the master key, which we can open each and every lock: Dr.Ambekdar. 


ఆదృష్టిలో గాని విప్లవ కమ్యూనిస్టుల దృష్టిలో కాని ( మార్గాలు వేరైనా ) రాజ్యాధికార సాధన కీలకాంశం అని వేరే చెప్పక్కర్లేదు. 


అయితే కులాతీత వర్గ పోరాటమైనా, ఆర్ధిక పోరాట పరిధిని అధిగమించి, దాని బైట రాజకీయ పోరాటంగా సాగుతున్నదా? లేక ఆర్ధిక వర్గ పోరాట పరిధిలోనే పరిభ్రమిస్తుందా?

Also read  Hindu communalism a disturbing liberal sensibilities!


బ్రాహ్మణిజాన్ని పెంచి పోషించి కాపాడటమే కాక హిందూ నేషనలిజం పేరిట హిందుత్వ బ్రాహ్మణిజాన్ని రాజ్యాధికార సాధనం చేసుకున్న పాలక వర్గాలను అధికారం నుండి దించకుండా దళిత బహుజన శక్తులు అధికారాన్ని అస్తగతం చేసుకోగలవా?


మే 17 కామ్రేడ్స్ దళిత బహుజనులకు వేసిన ప్రశ్న బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ ఆలోచనా విధానం మీద సామజిక, రాజకీయ పోరాటాలు చేసే ప్రతి ఒక్కరూ సమాధానం చెప్పాలి. 


స్వశక్తి పై రాజ్యాధికారం చేజిక్కించుకోకుండా ఈ కుల వ్యవస్థని కూల్చలేమని, కులాల్ని నిర్ములించలేమని చాటి చెప్పిన బాబాసాహెబ్ డా అంబేడ్కర్ కుల పోరాటం రాజకీయ పోరాటం అవునా కాదా ? 


మే 17 కామ్రేడ్స్ పై ప్రశ్నలు అదనంగా చేర్చి రెండు పందాల మధ్య సిద్ధాంత పోరాటాన్ని ఎజెండాకేక్కించారు. 

నాలుగు వర్గాల నూతన ప్రజాస్వామ్య వర్గ రాజకీయ ఐక్య సంఘటనలు లాగా, ఎస్సి, ఎస్టి, బిసి, ముస్లిం తదితర హిందూ వేతర మతాలు, స్త్రీలు, బహుజాతుల బ్రాహ్మణేతర, హిందువేతర దళిత, బహుజన, బహుముఖ సామాజిక సమూహాల రాజకీయ ఐక్య సంఘటన అవసరమా? కదా? 


హిదూత్వ బ్రాహ్మణిజం దాడికి, అణిచివేత, దోపిడీ, పీడనలకు ప్రత్యేకంగా, అదనంగా గురయ్యే ఎస్సి, ఎస్టీ, బిసి ల మత మైనారిటీల సామాజిక ప్రజాస్వామ్య శక్తుల రాజకీయ ఐక్య సంఘటన అవసరం ఉందా లేదా? 

Also read  స్టేట్ సోషలిజం - బారత ఆర్ధిక, సామజిక, రాజకీయ ప్రజాస్వామ్యం: డా.అంబేడ్కర్ ప్రతిపాదనలు!


అనే సిద్ధాంత, రాజకీయ చర్చను లేవనెత్తి ఇండియా విప్లవానికి ఇండియా విప్లవ బాటేమిటి? అనే కీలక ప్రశ్న ఎజెండాకెక్కించింది.  


మే 17 కామ్రేడ్స్ ఇండియా విప్లవం లో లేవనెత్తిన దళిత బహుజన ఎజెండా మాన్యశ్రీ కాన్షిరాం ఉత్తర భారత దేశంలో ప్రయోగించి రాజ్యాధికారం సాధించారు. 


కులానికి రెండు వైపులా పదును ఉంటుందని, ఆ దళిత బహుజన కులాల ద్వారా నే రాజ్యాధికారం సాధించ వచ్చని మాన్యశ్రీ కాన్షిరాం ఉత్తర భారత దేశంలో చేసి చూపించారు. 


ఏది ఏమైనా ఇండియా విప్లవ చరిత్రలో మే 17 ఒక చరిత్రాత్మకమైన రోజు. మావోయిజం లో ఉన్న కులతత్త్వం మీద తిరుగుబాటు చేసిన రోజు ‘మా రోజు’  మే 17 కామ్రేడ్స్ కి ప్రేరణ అంబేడ్కర్ ఆలోచనా విధానం.

(Visited 94 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!