డా బి ర్ అంబేడ్కర్- దళిత సాంస్కృతిక చైతన్యం జ్యోతి నిషా దృశ్య కావ్యం!

షేర్ చెయ్యండి
 • 31
  Shares
దళిత సాంస్కృతిక  చైతన్యం మొదలైంది. యుగాల నుండి వెలివేయబడ్డ జాతి నేడు తన చరిత్రను, తన సంస్కృతిని లిఖిస్తుంది. మూలవాసులను పిశాచులుగా, రాక్షులుగా, శూద్రులుగా, అంటరానివారిగా చిత్రీకరించిన బ్రాహ్మణిజం యొక్క కుట్రలను చరిత్ర సాక్షి చిత్రీకరిస్తున్నాం. 
 
సింహాలు తన చరిత్రను రాయకపోతే వేటాగాడి కుప్పిగంతులే చరిత్రగా రాసుకున్నారు. ఇప్పుడు సింహాలు డిజిటల్ మీడియా లో తమ సాంస్కృతిక వైభవాన్ని, తమ సంస్కృతి, చరిత్రను అద్భుతమైన దృశ్య కావ్యంగా చిత్రీకరిస్తున్నారు. 
 
బి ర్ అంబేడ్కర్ –  నిన్న -నేడు ; 90 నిమిషాలు గల డాక్యుమెంటరీ ఫిల్మ్  ఈ దేశంలో కులం చేత వెలివేయబడ్డ ప్రజల చైతన్యాన్ని వారి పోరాటాలను, సంస్కృతిని చూపించబోతుంది. 
 
 జ్యోతి నిషా  నిర్మించిన ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ చైతన్యాన్ని ఈ దేశ అణగారిన వర్గాలు అందిపుచ్చుకున్న విధానాన్ని తెలియజేస్తుంది. 
 
Ambedkar_documentary
Image: Dr Ambdkar_documentary -Now And Then
 
బారత జాతీయ ఉద్యమంలో బ్రాహ్మణ ఆధిపత్యం సమకాలీన కాలంలో బాబాసాహెబ్ డా అంబేడ్కర్ సాగించిన  కుల, మతాల పై పోరాటాన్ని క్లుప్తంగా చెప్పబోతోంది ఈ డాక్యుమెంటరీ ఫిలిం. 
 
ఈ డాక్యుమెంటరీ మతం, విప్లవం, స్వేచ్ఛ మరియు భారతీయ పురాణాల యొక్క ఆలోచనలు, భారత రాజకీయాల్లో మరియు కులాల పథకంపై తాకిన వాదనలను విశ్లేషిస్తుంది. 
 
యువత యొక్క వాయిస్, ప్రాతినిధ్యము, గుర్తింపు, గుర్తింపు, మహిళల అణచివేత మరియు హోదా యొక్క స్వరూపం వంటి సమస్యలలో బ్రాంట్ లోతుగా ఉంటుంది. 
 
బాబాసాహెబ్ జీవితంలో చాలా వ్యక్తిగత, కనిపించని కోణాలకు వ్యతిరేకంగా శ్రీవాస్తీలోని బుద్ధ పూర్ణిమ వేడుకలు, బాబాసాహెబ్ జన్మ వార్షికోత్సవం, దీక్షాభూమి, నాగపూర్ మరియు మహాపరినిర్వాణ దినోత్సవంలో ముంబైలోని చైత్య భూమీ వద్ద ధర్మ చక్రా పవతన్. సంవత్సర కాలంలో కాల్పులు జరిపిన ఫుటేజ్ వివిధ దళిత-బహుజన నిరసనలు, నిరసనలు, సంక్షిప్తంగా ఉండబోతున్నాయి. 
 
మరియు భారతదేశం అంతటా ప్రాముఖ్యత యొక్క సమావేశాలు. డా. అంబేడ్కర్ ఇప్పుడు మరియు తర్వాత  డాక్యుమెంటరీ  బహుజన నేపథ్యం నుండి కళాకారులు, పండితులు, హార్వర్డ్, LSE, JNU, DU, TISS, కార్యకర్తలు, విద్యార్థి నాయకులు, సంగీతకారులు మరియు చిత్ర నిర్మాతల నుండి కళాకారులు, పండితులు, ఇంటర్వ్యూలను అందిస్తుంది. 
 
దక్షణాది రాష్ట్రాల లో కొరవడిన చిత్తశుద్ధి!
బాబాసాహెబ్ డా బి ర్ అంబేడ్కర్ గారి ని సొంతం చేసుకోవడంలో కానీ లేదా అయన వారసత్వాన్ని కొనసాగించడంలో దక్షణాది రాష్ట్రాలలో చిత్తశుద్ధి కొరవైంది అని చెప్పవచ్చు. 

 
 
గత మే నెలలో జరిగిన ఎస్సి / ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం మీద జరిగిన బారత బంద్ ఇందుకు సాక్ష్యం గా నిలుస్తుంది. ఉత్తర బారత దేశంతో పోలిస్తే దక్షణాది దళితులు కాస్త పైమెట్టున ఉన్నది వాస్తవం అయినా ఫ్యూడల్ వ్యవస్థలో రోజు రోజుకి దిగజారి పోతున్న మానవత్వాన్ని దిగమ్రింగుకొని జీవిస్తున్నారు. 
 
ఏ సమాజం అయినా లేదా ఏ తెగ / జాతి అయినా వారి యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలంటే వారి యొక్క చరిత్రను, సంస్కృతిని రక్షించుకోవాలి. 
 
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఎన్నో జాతులు అంతరించి పోతున్నయి. బ్రాహ్మణులు తమ చరిత్రను, సంస్కృతినీ వేదాలు గా చెప్పుకుంటూ , పురాణాలు గా, కధలు కధలుగా చెబుతూ అదే బారత దేశ సంస్కృతిగా మార్చేసేరు. 
 
సింధు నాగరికత, హరప్పా నాగరికత ప్రపంచం మరిచిపోయే విధంగా శాసనాలు , గుడులు నిర్మించి బారత దేశాన్ని ఆర్య భూమి గా మార్చేరు. బుద్ధుడు నడియాడిన ఈ నెల నేడు అయన అడుగు జాడలు వెతుక్కునే అవస్థలో ఉంది అంటే చరిత్రను , సంస్కృతిని ఎలా నాశనం చేసేరో అర్ధం చేసుకోవచ్చు. 
 
బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ ఒక్కరే ఈ దేశం మీద జరిగిన కుట్రలను, హిందూ మతం యొక్క కుట్రలను విశదీకరించిన వ్యక్తి. సోషియాలజిస్ట్ గా , ఆంత్రోపాలజిస్ట్ గా , ఆర్ధిక వేత్తగా , సామాజిక శాస్త్రవేత్త గా , రాజకీయ, సామాన్య శాస్త్రాన్ని అవపోసన పట్టి తన వారసులకు వారి యొక్క చరిత్రను అందించిన వ్యక్తి. 
 
ఒక ఎడారి ప్రాంతంలో మోషే అనే వ్యక్తి లక్షలాది తన జాతి ప్రజలను బానిస విముక్తి కలిగించి వారి దేవుడు గా ఎలా పూజింపబడుతున్నాడో , బారత ఉప ఖండంలో ఏప్రిల్ 14, 1891 న జన్మించిన బాబాసాహెబ్ డా అంబేడ్కర్ కోట్లాది నిమ్నజాతులను బానిసల కంటే హీనంగా బ్రతుకుతున్న వారి విముక్తి ప్రదాత. 
 
ఇజ్రాయేలు ప్రజలకు  మోషే దేవుడు పంపిన వ్యక్తి అయితే, మోషే దేవుడు అయితే  బారత దేశంలోని దళితులకు బాబాసాహెబ్ డా. బి ర్ అంబేడ్కర్ ఎవరు? 
 
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా లోని దళితులు విప్లవం వైపు ఆకర్షితులై మార్క్స్ , లెనిన్ ని కీర్తిస్తూ పాడుతున్నారు, వారి సంస్కృతి ని గానం చేస్తున్నారు. మరి దళితుల చైతన్యం బాబాసాహెబ్ డా అంబేడ్కర్ వారసులుగా విప్లం బాట పట్టిన దళితులు ఎప్పుడు కీర్తిస్తారు. 
 
సమకాలీన సమాజంలో అవకాశాలను అందిపుచ్చుకోవడం దళితుల బాధ్యత, ఆవకాశాల నుండి దళితుల అస్తిత్వాన్ని నిర్మించడం దళితుల వంతు. సినిమా దర్శకుడు పా రంజిత్ కానీ డా అంబేడ్కర్ ఇప్పుడు , తర్వాత అనే డాక్యుమెంటరీ తీసిని జ్యోతి నిషా కానీ తమ అవకాశాల నుండే దళితుల సంస్కృతి ని , చరిత్రను నిర్మిస్తున్నారు. 
 
తెలంగాణ , ఆంధ్ర దళితులారా ఎన్నో ఉద్యమాలకు మూలమైనవారీగా బాబాసాహెబ్ డా అంబేడ్కర్ ని గడప గడపకూ తీసుకెళ్లాల్సిన బాధ్యత మీదే 

(Visited 190 times, 1 visits today)
Also read  స్మార్ట్ ఫోన్ వినియోగంలో అమెరికాను మించిపోతున్న ఇండియా!

2 thoughts on “డా బి ర్ అంబేడ్కర్- దళిత సాంస్కృతిక చైతన్యం జ్యోతి నిషా దృశ్య కావ్యం!

 • 31/10/2018 at 4:35 PM
  Permalink

  Hearty Congratulations For Your Efforts Toward Dr.B.R. Ambedkar ‘S Concept , Struggle ,And Future Ideology To Build Casteless BHARATH.Please Mention Your Contact No To Mail

  Reply
  • 02/11/2018 at 7:58 PM
   Permalink

   Thank you very much for your inspiring words/encouragement.

   Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!