అట్రాసిటీ చట్టం:నిర్వీర్యం చేసిన సుప్రీం కోర్టు!

షేర్ చెయ్యండి

ఎస్సి / ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం 1986 దుర్వినియోగం అవుతుంది అంటూ సుప్రీం కోర్టు సంచలన వాక్యాలు చేసింది. ఈ కేసులో ముందస్తు అరెస్ట్ చెయ్యకూడదు అని, వారం రోజుల ప్రాధమిక విచారణ తర్వాత మాత్రమె అరెస్ట్ చెయ్యాలి అని స్పష్టం చేసింది.

జస్టిస్ ఏకే గోయల్, జస్టిస్ యు యు లలిత్ లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఇచ్చిన తీర్పులో ఆదేశించింది. పాధమిక దర్యాప్తు వారం రోజుల్లో గా పూర్తీ చెయ్యాలని స్పష్టం చేసింది.

ఎస్సి / ఎస్టీ లను విమర్శించే వారు, దూషించే వారు ఈ చట్టం దుర్వినియోగం అవుతుంది అని పేర్కొనడం ఆది సుప్రీం కోర్టు అంగీకరించడం దురదృష్టకరం. చట్టాన్ని దుర్వినియోగం చేసే వారి కోసం నిజమైన బాదితుడు నిష్టపోతాడు. సుప్రీంకోర్టు తీర్పుతో అసలైన బాదితుడికి అన్యాయం జరిగే అవకాశాలు 50 % పైనే ఉంటాయి.

దళితులకు చట్ట పరంగా ఉన్నా ఒకే ఒక భరోసా , ఆయుధం. ఎస్సి / ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం 1989, తర తరాలుగా దళితులు ఎదుర్కుంటున్న సమస్యలకు ఈ చట్టం ఒక్కటే కాస్త ఊరట కలిగించింది. సో ఇప్పుడు సుప్రీం కోర్టు ఏ విశ్లేషణ ఆదారంగా ఈ పటిష్ట చట్టాన్ని నిర్వీర్యం చేసిందో ప్రజలకు చెప్పాలి.

Also read  దళిత రాజకీయ పార్టీ సాధ్యమేనా? తెలంగాణా, ఆంధ్రాలో దళితులు రాజ్యాధికారం సాధించగలరా?

తీర్పులో ముక్యమైన అంశాలు

  1. ముందస్తు అరెస్ట్ లేదు.
  2. ప్రభుత్వ ఉద్యోగి అయితే పై అధికారి అనుమతి తప్పనిసరి.
  3. 7 రోజుల విచారణ, విచారణ లో నిజం అని తెలితేనే అరెస్ట్.
  4. లేదంటే ముందస్తు బెయిల్.

ఎస్సి/ఎస్టీ అట్రాసిటీ చట్టంలో ముందస్తు బెయిల్ లేదు. కేసు ప్రాధమిక విచారణలో నిజం అని తేలితే అప్పుడు అరెస్ట్ చేయ్యాలి, దురుద్దేశ్య పూర్వకంగా కేసు నమోదు చేస్తే ముందస్తు బైయిల్ మంజూరు చెయ్యవచ్చు.

ఎస్సి /ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం 1989 యొక్క ఉద్దేశ్యం ఏంటి?

బారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ‘అంటరాని తనం’ నిషేధిస్తూ చట్టం రూపకల్పన చేయబడింది. దీని ద్వారా కులం పేరుతో షెడ్యుల్ కులాల , షెడ్యుల్ తేగల ప్రజలను బహిరంగ ప్రదేశాల్లో అడ్డుకోవడం, కులం పేరుతొ దూషించడం, పని కల్పించక పోవడం , దేవాలయ ప్రవేశంకు అనుమతి నిరాకరించడం, బలవంతాన పని చేయించడం, దాడులు చెయ్యడం , గ్రామ బహిష్కరణ చెయ్యడం తదితర కులం పేరుతొ ఆటంకం పరచకుండా, సమాజంలో సమానత్వం కోసం రూపొందించిన చట్టం. ఒక విధంగా చెప్పాలి అంటే ఈ ఎస్సి / ఎస్టీ అత్యాచార నిరోధక చట్టమే ఇప్పటి వరకూ ఉన్న రక్షణ.

ఎస్సి / ఎస్టీ అత్యాచార నోరోధక చట్టం 1989 చట్టం రూపకల్పన చేసేటపుడు ఈ చట్టం యొక్క అవశ్యకతను పార్లమెంట్ ఈ క్రింది విధంగా చెప్పింది.

Also read  భారతీయట్రైబల్ పార్టి: అస్తిత్వ ఉద్యమం నుండి రాజ్యాధికారం వైపు!

“despite various measures to improve the socioeconomic conditions of SCs & STs, they remain vulnerable. They are denied a number of civil rights; they are subjected to various offences, indignities, humiliations and harassment. They have, in several brutal incidents, been deprived of their life and property. Serious atrocities are committed against them for various historical, social and economic reasons.”

ఈ చట్టం యొక్క లక్ష్యాలు!

దళితులు మరియు ఆదివాసీలు సమాజంలో గౌరవం మరియు ఆత్మగౌరవంతో జీవించడానికి. ఆదిపత్య కులాల నుండి భయం లేదా హింస, అణిచివేత లేకుండా జీవించటానికి దళితులు మరియు ఆదివాసీలు న్యాయం అందించేందుకు ప్రబుత్వ ఉద్దేశ్యం స్పష్టంగా ఉద్గాటిస్తుంది. అంటరానితనాన్ని ఏ రూపంలో అయినా వ్యక్త పరిచిన కటిన శిక్ష అమలు పరచాలి అని నిర్ణయించింది.

సుప్రీం కోర్టు లో వచ్చిన కేసు ఏమిటి?

Case on sc/st atrocity act 1989 supreme court judgement

 

 

 

 

 

 

 

 

Also read  అంతర్జాల పోకిరీలు!

 

 

 

 

 

 

 

 

 

 

 

 

డా. సుభాష్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర , ఎఎన్ ర్ కేసులో మంగళవారం నాడు ఇద్దరు సబ్యులు గల ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది. ఎస్సి కులానికి చెందిన ఒక అధికారి తన పై అధికారుల పై ఎస్సి / ఎస్టీ అత్యాచార చట్టం క్రింద కేసు పెట్టేరు.  

ఎస్‌సీయేతర కులాలకు చెందిన ఆ అధికారులు తమ వార్షిక నివేదికలో ఆ వ్యక్తిపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసును దర్యాప్తు చేసిన పోలీసు అధికారి వారిపై చర్య తీసుకోవడం కోసం వారి ఉన్నతాధికారిని అనుమతి కోరగా, ఆయన నిరాకరించారు.

దాంతో ఆయనపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఎస్‌సీ కులానికి చెందిన ఒక వ్యక్తి గురించి నిజాయతీతో వ్యాఖ్యలు చేయడమే నేరమైతే పని చేయడం కష్టమవుతుందని ‘డిఫెన్స్’ న్యాయవాదులు వాదించారు.

ఈ తీర్పు పై ఎస్సి / ఎస్టీ రాజకీయ , ప్రజా సంఘాలు , సామాజిక కార్యకర్తలు , ఉద్యోగస్తులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

 

 

 

(Visited 500 times, 1 visits today)

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!