ఆర్ధిక అభివృద్ధి పై కుల ప్రభావం – దళితులు!

షేర్ చెయ్యండి
  • 48
    Shares
అభివృద్ధి నీడలో కులం ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. పాలకులు సంక్షేమం పేరిట ఓట్లు దండుకునే కార్యక్రమాలు చేస్తున్నారు. దేశంలో దాదాపుగా 30 శాతం ఉన్న జనాభా అభివృద్ధి లేకుండా 69 సంవత్సరాల రాజ్యాంగ చట్టం పాలకులను ఎగతాళి చేస్తుంది.
 
Ambedkar
చిత్రం : నవభారత నిర్మాత “బాబాసాహెబ్” డా. బి ర్ అంబేడ్కర్
 
రాజ్యాంగ సభలో బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ ఉపన్యాసం 1948 నవంబర్ 4 వ తేదీన ప్రారంభం అయ్యింది. సభను ఉద్దేశించి చివరిగా బాబాసాహెబ్ డా అంబేడ్కర్ తన చూపుడువ్రేలితో హెచ్చరిస్తూ ” 1950వ సంవత్సరం జనవరి 26 వ తేదీనుండి మన భారత దేశంలో రాజకీయంగా సమానత్వం యేర్పడియున్నా సాంఘిక, ఆర్ధిక రంగాలలో అసమానతలే నెలకొనియుంటున్నది.
 
ప్రజాస్వామ్య విరుద్ధమైన ఈ అసమానత్వాలను మనమంతా ఏకమై వీలైనంత త్వరలో రూపుమాపకుంటే ఈ సాంఘిక , ఆర్ధిక అసమానతల ద్వారా బాధింపబడే ప్రజానీకంలో అసహనం ఏర్పడి వారు తిరుగుబాటు చెయ్యక తప్పదు.
 
ఒకవేళ అలాంటివే జరిగితే మనం ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి మనం నిర్మించిన ఈ ప్రజాస్వామిక వ్యవస్థ తునాతునకలైపోతుంది. 
 
నేడు భారత రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ చట్టాన్ని ఆమోదించిన రోజు. నేటికి 69 సంవత్సరాలు అవుతుంది రాజ్యాంగం అమలులోకి వచ్చి,  కానీ సాంఘిక, ఆర్ధిక రంగాల్లో భారతీయుల మధ్య ఎలాంటి సమానత్వం రాలేదు. దీనికి ప్రధాన కారణం కులవ్యవస్ట. 
 

అభివృద్ధి-కులం!

 
కుల వ్యవస్థ నిస్సందేహంగా భారత సమాజానికి అత్యంత విలక్షణమైన లక్షణం. భారతీయ సమాజాన్ని నాలుగు హైరార్కీకల్ తరగతులుగా విభజించారు.
 
అత్యధిక జనాభా ఉన్న నేటి ఎస్సి  జనాబా ను  అంటరానివారిగా చేసి  వ్యవస్థ నుండి పూర్తిగా మినహాయించబడింది. భారత దేశ వ్యాప్తంగా అంటరాని జాతులలో వేలాది కులాలు ఉన్నాయి.
 
హిందూ సామాజిక వ్యవస్థ అంతా వారి కులం కేంద్రంగా జరుగుతుంది. ఒకే కులం వ్యక్తులు మాత్రమే వివాహం చేసుకోవాలి.   గ్రామాలు కుల వ్యవస్థకు పెట్టింది పేరు.
 
గ్రామాల్లోని కుల వ్యవస్థ చాల పకడ్బందీగా ఉంటుంది. వీరు నగరాల్లో ఉన్న వారి సొంత కులాలతో సంభందాలు ఏర్పరచుకుంటారు. ఈ విధంగా సాంఘిక వ్యవస్థ కులాలు చుట్టూ తిరుగుతూ ఉంటుంది.  
 
ఏ సమాజం అయినా అభివృద్ధి చెందింది అంటే చూడాల్సింది అద్దాల మెడలు , రోడ్లు కాదంటారు బాబాసాహెబ్ డా. బి ర్ అంబేడ్కర్, ప్రజల యొక్క ఆర్ధిక, సామజిక స్థితిగతులు చూడాలి.
 
అనాది గా కుల వ్యవస్థ ఆర్ధిక శక్తిని కుల వృత్తులు ఆధారంగా నిర్మించింది. ఒక విధంగా చెప్పాలంటే ఇది దోపిడీ అని చెప్పాలి. కుల వ్యవస్థ యొక్క దురభిమానం కొన్ని కులాలు ఆర్ధికంగా ఎదిగే అవకాశం కల్పించలేకపోగా, వివక్ష చూపించారు.
 
నిచ్చెన మెట్ల కుల వ్యవస్తలో క్రింది కులాలు తక్కువ నైపుణం, సంపాదన  గల వృత్తులకే పరిమితం చేశారు. కులానికి ఒక వృత్తిని అంటగట్టి వారిని ఆ వృత్తికే పరిమితం చేశారు. దళిత – బహుజన వర్గాలను క్రింది స్థాయి వృత్తులకే పరిమితం చేశారు.
 
2011 లో జరిపిన సోషియో ఎకనమిక్స్ సర్వే లో పెత్తందారీ మరియు దళిత కులాల మధ్య విద్య , ఆర్ధిక అసమానతలు స్పష్టంగా కనిపించాయి  
 
ఎస్సి / ఎస్టీ వర్గాల్లో ఒకప్పటికంటే విద్యా , గృహ వసతుల్లో మెరుగైనప్పటికీ ఆర్ధిక వ్యత్యాసాలు మాత్రం భూస్వామ్య కులాలకు దళిత వర్గాల మధ్య ఏళ్ళ తరబడి ఒకే విధంగా ఉంది.
 
గ్రామాల్లో ఈ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి కారణం దళిత వర్గాలకు గ్రామాల్లో సంపాదనకు అవకాశం లేకపోవడం, వ్యవసాయ భూమి లేకపోవడం ప్రదాన కారణం. 
 
గ్రామాల్లో NSSO అనే సంస్థ జరిపిన సర్వే 1999-2000 లో పెత్తందారీ కులాలకు మరియు దళితుల యొక్క  కుటుంబ ఖర్చు 37 శాతం వ్యత్యాసం ఉంది.
 
ఇదే సంస్థ 2011 – 12 లో జరిపిన సర్వేలో పెద్దగా మార్పులు ఏమీ కనపడటం లేదు కేవలం ఒక్క శాతం మాత్రమే వ్యత్యాసం ఉంది. అంటే 38 శాతం. నగరాలలో ఈ తేడా దాదాపుగా 60 శతం వుంది  
 

ఆర్ధిక వ్యత్యాసాలకు కారణం!

 
రాజ్యాంగం ఆమోదించుకుని 69 సంవత్సరాలు అయినా ఈ వత్యాసాలకు కారణం దేశంలో కుల వ్యవస్థ పటిష్టంగా ఉండటమే కారణం. ప్రాంతీయ రాజకీయ పార్టీలు కుల వ్యవస్థను పెంచిపోషిస్తున్నాయి.
 
ఒక్క వుమ్మడి ఆంధ్రప్రదేశ్ ని పరిశీలన చేస్తే 1994 నుండి 2014 వరకూ పాలించిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం  దళితుల అభివృద్ధి ని గండి కొట్టడం మొదలు పెట్టింది.
 
ఆ తర్వాత ప్రభుత్వాలు ఆయననే అనుసరించారు.  ప్రైవేటీకరణ లో భాగంగా ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చెయ్యడం , వైద్యాన్ని ఆరోగ్యశ్రీ పేరుతొ కార్పొరేట్ లకు అప్పజెప్పడం ఉద్యోగాలను కాంట్రాక్ట్ కార్మికులుగా నియమించడం దళితుల ఆర్ధిక ఎదుగుదలను ప్రధానంగా అడ్డుకున్న అంశాలు. 
 
ప్రపంచీకరణ, సరళీకరణ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు కేటాయిస్తున్నారు. ప్రభుత్వ  సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు , కన్సల్టెంట్ కు కట్టబెట్టి ఉద్యోగాలలో కొత్త విధిస్తూ దళిత వర్గాల వెన్ను విరుస్తున్నారు.
 
ప్రాంతీయ పార్టీల ఆర్ధిక విధానాలు వారి యొక్క కులం నీడలోనే ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన జల యజ్ఞం మరియు తెలంగాణ లో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ , నవ్యంధ్రలో నీరు – చెట్టు లాంటి కార్యక్రమాలు పాలక కులాల ఆర్ధిక స్థితిని పెంచడానికే రూపకల్పన చేసారు. 
 
ప్రైవేట్ పారీశ్రామిక వర్గాలు , సర్వీస్ సెక్టార్ ,సాఫ్ట్వేర్ లాంటి అభివృద్ధి చెందుతున్న విభాగాలలో కులమే ప్రాధాన్యతను సంతరించుకుంది. దళిత వర్గాలను ప్రైవేట్ రంగం కేవలం దిగువ శ్రేణి ఉద్యోగాల కోసమే తీసుకోవడం జరుగుతుంది. 
 
ప్రజల మధ్య ఆర్ధిక వ్యత్యాసాలు పెరుగుతూ పోతుంటే రాజ్యాంగ చట్ట సభలో బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ చెప్పిన విధంగా తిరుగుబాటు అనివార్యం అవుతుంది. 
(Visited 136 times, 1 visits today)
Also read  దళిత మహిళా ఉపాధ్యాయురాలిపై వేధింపులు!

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!