అభివృద్ధి బూటకంలో ఎస్సి లు

షేర్ చెయ్యండి

‘సత్యాలను వాస్తవాల నుండి గ్రహించాలి’ అంటారు:మావో టు సెంగ్

బారత దేశంలో అభివృద్ధి అందులో ఎస్సిల  కోణంలో అభివృద్ధిని కుడా వాస్తవం నుండి పరిశీలన చెయ్యాలి. అసలు ప్రబుత్వాలకు దేశంలో విద్య , ఆర్ధిక , రాజకీయ, సామాజిక వివక్షకు గురికాబడిన అతి పెద్ద సమూహం ఎస్సిలు మరియు ఎస్టి లు. వీరందరి అభివృద్ధి ప్రస్తుతం ప్రబుత్వాలు చూపించే అభివృద్దితో సరి చూసుకుందాం. దీనికి ముందు గత మూడు సంవత్సరాలగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న మూడు అతి పెద్ద సంఘటనల నేపధ్యం ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకుందాం.

1. ఆగిరిపల్లి
2. గరగపర్రు
3. దేవరపల్లి

4.పెద్ద గొట్టిపాడు

5. మందని

6.అబగ్నపట్నం

ఈ సంఘటనలు వివధ కారణాలు అయివుండవచ్చు కానీ వీటి వెనకాల ఎస్సి ల  ఆర్ధిక అభివృద్దిని వారియొక్క స్వీయ నాయకత్వ చైతన్యాన్ని చూసి ఓర్చుకోలేని తనమే ఎక్కువ. ప్రతి సంఘటన కి ఒక నెపం లేదా కారణం చూపించవచ్చు. నిచ్చెన మెట్ల వ్యవస్తలో యెస్ సి ల కంటే పైన ఉన్నాము అనుకున్నావాళ్ళు యెస్ సి ల స్వతంత్ర ఆర్ధిక అభివృద్ది వలన వారి పెత్తందారి తనానికి ఇక మనుషులు దొరకరు అని గ్రామాల్లో యెస్ సి ల అభివృద్ధి నిధులను సొంత కులాలకు ఉపయోగించుకుంటారు.

ఆగిరిపల్లి లో వీరయ్య అనే యువకుడి ప్రేమ వ్యవహారం ఒక సాకు మాత్రమే , అసలు వారి మనస్సు పొరల్లో ఉంది యెస్ సి లు స్వతంత్ర రాజకీయం , ఉన్నత చదువులు , ఆర్ధిక వ్యవరాలే. అలాగే 1200 కుటుంబాలు వ్యవసాయ కూలీలుగా ఉంటూ ఒక సంఘం ఏర్పాటు చేసుకుని, వారి యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టినందుకు , వారి స్వేఛ్చ పూరిత స్వతంత్ర బావలలో జీవిస్తున్నందుకు పనులు కల్పించకుండా ఆర్ధికంగా నష్టపరచటం వెనక దాగి ఉన్న సత్యం అబివృద్ది కాకుండా పెట్టందారుల కనుసైగాల్లో ఉండాలనే. గరగపర్రు లో జరిగింది. అలాగే ౩౦ ఎకరాలు తాతలు దగ్గరనుండి సాగుచేసుకున్తుంటే ఓటు వేయలేదు అనే కారణంతో యెస్ సి ల ఆర్ధిక శక్తి అయిన పంట భూమిని అధికారం అడ్డంపెట్టుకుని స్తానిక శాసన సబ్యుడు నేతృత్వంలో భూమిని లాక్కున్నారు.

Also read  దళితులను మోసం చేస్తున్న ప్రకాశం జిల్లా వై. యెస్. ర్. సి పి!

పై మూడు సంఘటనల వెనకాల అధికార తెలుగు దేశం పార్టీ నాయకులే నాయకత్వం వహిస్తుంది అనేది మనం గుర్తు పెట్టుకోవాలి. ఈ అణిచివేత ఆంధ్ర లోనే కాదు దేశం మొత్తం ఇప్పుడు ఇదే పరిస్తితి. ఒక వైపు దేశం అభివృద్ధి చెందుతుంది అంటూ దేశంలో ప్రదాన బాగస్వామ్యం అయిన యెస్ సి ల అభివృద్దిని కాలరాస్తున్నారు.

ప్రస్తుతం ప్రబుత్వాలు చెబుతున్న అభివృద్దికి చిహ్నాలు ఈ విధంగా ఉన్నాయి.

1. కంప్యుటరీకరణ
2. పట్టణీకరణ – స్మార్ట్ సిటీ లు
3. ప్రత్యెక ఆర్ధిక మండల్లు
4. కార్పోరేట్ స్కూల్స్
5. ఎక్స్ప్రెస్ రహదారులు
6. కమ్యునికేషన్ వ్యవస్త

బారత దేశంలో ఉన్న ప్రతి కులం ఈ రంగాల్లో ఎంత శాతం అభివృద్ధి సాధించేరో దానినే అభివృద్దిగా పరిగణలోకి తీసుకుంటారు.ఇది నాణెం కి ఒకవైపు. ఇవి అంతర్జాతీయ విధి విధానాలకు అనుగుణంగా ఉంటాయి. రెండో వైపు దేశం లో మెజారిటీ జనాబా గ్రామాల్లో నివస్తున్నారు అక్కడ వ్యక్తుల అభివృద్ధి భూమి మీద ఆదారపడి ఉంటుంది. అంటే వ్యవసాయం ఆదారిత రంగాల్లో ఉంటుంది. ప్రతి ఏటా కేంద్ర రాష్ట్ర ప్రబుత్వాలు వెచ్చించే బడ్జెట్ లో పై పై రంగాల్లో యెస్ సి ల వాట లేదా వారి అభివృద్ధి వాటా ఎంత?

Also read  బహుజన రాజకీయం; నూతన వరవడిని సృష్టించబోతున్న బహుజనులు!

యావత్ బారతీయ సమాజంలో యెస్ సి లు , యెస్ .టి లే మెజారిటీ సానిటేషన్ విధానంలో ఉన్నారు. నగరాలకు వలస వచ్చిన గ్రామీణ ప్రాంత యెస్ సి లు ఎక్కువుగా కార్పోరేషన్ పరిదిలో సానిటేషన్ విబాగంలో పనిచేస్తున్నారు. నగరాలలో మురికివాడల్లో , కాలవ గట్ల వెంట నివసిస్తునారు. నేటికీ పరిశుబ్రమైన త్రాగు నీరు లేక ఎందరో డయేరియాతో , పౌష్టిక ఆహరం లేక చిన్నారులు , తల్లులు మరణిస్తున్నారు. ఈ మరణాలు ఎక్కువశాతం యెస్ సి లు మరియు యెస్ టి లలోనే జరుగుతుండటం విశేషం. ఎన్నో యెస్ సి గ్రామాల్లో రక్షిత మంచినీటి సౌకర్యాలు , వైద్యం , రహదారులు లేవు. ఇలాంటి పరిస్తితుల్లో ఉన్న కొద్దిపాటి ఆర్ధిక వనరులను లాగేసుకుంటూ రాష్ట్రం , దేశం అభివృద్ధి చెందుతుంది అనటం ఎంతవకు సబబు.

ఇక్కడ మనం గ్రహించాల్సిన వాస్తవం ఏంటంటే బారత దేశం అభివృద్దిలో ” సామాజిక న్యాయం ” లేదు అని చెప్పాలి. ఒకవేల సామాజిక న్యాయం ఉంటే ౩౦ ఎకరాల యెస్ సి లకు పట్టా ఇచ్చిన వ్యవసాయ భూమిని దేవరపల్లి ,ప్రకాశం జిల్లలో ౩౦౦ మంది పోలీసులను అడ్డంపెట్టి ఎలా లాక్కునారు ‘ నీరు – చెట్టు ‘ ఒక బూటకం కాదా ?

Also read  దళితుల ఇంటిలో భోజనం BJP రాజకీయ డ్రామా!

నేను నీతి వంతమైన పాలన అందిస్తా అని డిల్లీలో అధికారంలోకి వచ్చిన అరవింద్ కేజ్రివాల్ రూ 7,౦౦౦ కోట్ల రూపాయిల యెస్ సి ల ప్రత్యెక నిధులను ఎందుకు పక్కదారి పట్టించేడు. మేము నీతివంతులం అని చెప్పుకుని అధికారంలోకి వచ్చిన భుర్జువా కులాల నాయకులు మేడిపండు లాంటి వారే.

‘సామాజిక అభివృద్ధి కాని అభివృద్ధి ఏదీ అభివృద్ధి కాదు’ అంటారు బాబాసాహెబ్ డా బి ర్ అంబేడ్కర్.

కులాల పేరిట జరుగుతున్న ఈ అసమానతలు దృష్ట్యా ఈ దేశం ఇంకా మధ్య యుగంలోనే ఉంది అని బావించాల? ఒక్కసారి ఆలోచిద్దాం…!!

(Visited 33 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!