అర్బన్ నక్సలైట్ అనేది బిజెపి ప్రభుత్వం మీద దళితుల వ్యతిరేకతను పక్కదారి పట్టించే ఎత్తుగడలో భాగమేనా?

షేర్ చెయ్యండి
  • 12
    Shares

గత వారం అర్బన్ నక్సలైట్ లు అంటూ మహారాష్ట్ర పోలీసులు హైదరాబాద్ మరియు ఇతర నగరాల్లో మానవ హక్కుల నాయకులను, వారి కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రదాని హత్యకు నక్షలైట్లు మానవ హక్కుల కార్యకర్తలు కుట్ర పన్నుతున్నారు అంటూ మీడియా లో బా జ పా సభ్యులు ప్రచారం చేసిన తర్వాత మహారాష్ట్ర  పోలీసుల దాడి జరిగింది. 

 
CPI-M
CPI (M) tweet on urban Naxalites- Dalit Anger
 
బిజెపి ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలు దేశ వ్యాప్తంగా దళితుల మీద జరుగుతున్న దాడులకు ప్రభుత్వం మీద దళితులు వ్యక్తం చేస్తున్న తీవ్ర నిరసన, వ్యతిరేకత ను పక్కదారి పట్టించటానికి ‘అర్బన్ నక్షలైట్’ అనే నాటకం ఆడుతుందంటూ  సిపిఐ (యం ) ట్వీట్ చేసింది. 
 
సిపిఐ (యం ) చేసిన ఈ కామెంట్ ని దేశ వ్యాప్తంగా దళితుల్లో చర్చకు తెరతీసింది. అర్బన్ నక్సల్ కి దళితులకు ఏమి సంబంధం? సి పి ఐ (యం ) చేసిన ఈ వ్యాఖ్యకు దళితులను ఈ వివాదము లోకి తీసుకు వచ్చే ఆలోచన లేక దళితులను ముందు పెట్టి కమ్యూనిస్ట్ లు , మావో లు తమ పబ్బం గడుపుకోవాలి అనుకుంటున్నారా?
 
దళితులకు విప్లవ పార్టీల తో అనుబంధం ఉందా?
 
పెట్టుబడి దారీ ప్రజాస్వామ్యం బారత దేశంలో రాజకీయ పార్టీలను,  సామజిక ఉద్యమాల్లో కూడా ప్రభావితం చేసింది అనేది నగ్న సత్యం..కమ్యూనిస్ట్ లనుండి అన్నీ రాజకీయ పార్టీలు గెలుపుకోసం సిద్ధాంతాన్ని పక్కన పెట్టి చేస్తున్న కూటమి దళితుల్లో ఒక్కింత ఆచ్చర్యానికి దారి తీసింది. ఈ కాలం నుండే దళితులు వివిధ విప్లవ పార్టీలతో కమ్యూనిస్ట్ మరియు సాంప్రదాయ పార్టీలతో తమ అనుబంధాన్ని వదులుకోవడం జరుగుతూ వచ్చింది. ఈ పరిణామమే 2014 లో జరిగిన ఎన్నికల్లో మెజారిటీ దళిత ఓటర్లు బా జ పా కి మద్దత్తు పలికేరు 
 
దేశ వ్యాప్తంగా ఇప్పుడు దళితులు బాబాసాహెబ్ డా అంబేడ్కర్ ఆలోచనా విధానంలో ముందుకు వెళ్తున్నారు. రాజకీయంగా, సామాజికంగా దళితులు స్వతంత్రులుగా ఉద్యమిస్తున్నారు. 
 
2014 నుండి జరిగిన వివిధ సంఘటనలు పరిశీలిస్తే దళితులు తమ సామాజిక ఉద్యమాలకి, రాజకీయ ఉద్యమాలకి కమ్యూనిస్ట్ లతో గానీ, విప్లవ పార్టీలతో గానీ లేదా ఇతర పార్టీల మద్దత్తు లేకుండా స్వతంత్రంగా బాబాసాహెబ్ డా అంబేడ్కర్  నీలి జెండా కేంద్రంగా  చేసిన ఉద్యమాలే అని మనకి అర్ధం అవుతుంది. రోహిత్ వేముల, గుజరాత్ఉ లోని ఉనా మరియు ఆంధ్రప్రదేశ్ లోని గరగపర్రు, భీమా కోరేగాంవ్ లాంటి సంఘటనలు దళితులు సొంతంగా ఏ రాజకీయ పార్టీ మద్దత్తు లేకుండా చేసినవే. 
 
దళితులకు  విప్లవ పార్టీల తో ఉన్న అనుబంధం ఎపుడో తెగిపోయింది అని చెప్పాలి. మారోజు వీరన్న మే 17 కామ్రేడ్ దీనికి ఉదాహరణ. అగ్రవర్ణాల నాయకత్వంలో – బ్రాహ్మణ కుల నాయకత్వం లో దళితుల విముక్తి జరగదు అని దళితులు గ్రహించేరు. దళితులు ఇప్పుడు జెండాలు మోసే కార్యకర్తలు గా ఉండటానికి ఇష్టపడం లేదు. కాబట్టి సి పి ఐ (యం ) చేసిన అర్బన్ నక్సలైట్ కామెంట్ వారి రాజకీయ ఎతుగడలో భాగమే అని గ్రహించాలి. 
 
కమ్యూనిస్ట్ / విప్లవ ఉద్యమాల పట్ల దళితుల వెతిరేకతకు కారణం ఏమిటి?
 
Seetaram Yechuri
Mr.Seetaram.Yechuri carrying on his head Bonam in Hyderabad.
 
సుమారు ముప్పై సంవత్సరాల క్రితం నక్సల్బరి ఉద్యమంతో మొదలై తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధిద్దాం, దున్నే వాడిదే భూమి అనే నినాదాలకు ఆకర్షితులైన ఎందరో మొదటి తరం దళిత విద్యావంతులు అడవిబాటన పెట్టేరు. ఆనాటి భూస్వామ్య వ్యవస్థ అప్పటి పీపుల్స్ వార్ ఉద్యమాలకు బయపడినా తొంభైవ దశం కి వచ్చేసరికి నాయకత్వంలో మార్పులు జరిగి కుల వ్యవస్థకి మావో లు తీసిపోరు అనే స్థితికి వచ్చేరు. కులాన్ని నిర్ములించకుండా వర్గాన్ని నిర్ములించలేము అనే వాస్తవ స్థితిని తెలుసుకున్న దళిత విప్లవకారులు బాబాసాహెబ్ డా అంబేడ్కర్ మార్గమే దళితుల విముక్తి మార్గం అని తెలుసుకున్నారు. అరచేతిని అడ్డం పెట్టుకుని సూర్యుడిని ఆపవచ్చు ఏమో కానీ బారత దేశంలో కుల ప్రాబల్యాన్ని ఆపలేము కాబట్టి దళితుల విముక్తి అంబేడ్కర్ బాట అని గ్ర్రాహించడం జరిగింది. మావోఇజం లో కూడా కులం ఉంది అని బహిర్గతం అవడానికి ఎక్కువ రోజులు పట్టలేదు  
 
ఫ్యూడల్ కులాలు ప్రాంతీయ పార్టీలుగా అవతారం ఎత్తి రాజ్యాంగాన్ని యథేచ్ఛగా ఉల్లంగిస్తూ వ్యవస్థను తమకి అనుకూలంగా మలుచుకుంటూ కుల అస్తిత్వాలను రెచ్చగొడుతూ శాశ్వితంగా తమ కులానికే రాజయాధికారం దక్కాలి అనే ఎత్తుగడతో ఉన్నాయి. కమ్యూనిస్టు లు తమ కుల ప్రాంతీయ పార్టీలకు లోపాయికారీ మద్దత్తు ఇస్తూ దళిత వర్గాలను జెండా మోయటానికి పరిమితం చేసేరు అనే అసంతృప్తి దళితులను కమ్యూనిస్టులకు దూరం చేసింది. సంవత్సరాలు గడిచిపోతున్నా దళితుల కూలి డబ్బుకోసం మాత్రమే కమ్యూనిస్టుల ఉద్యమాలు తప్పా, దళితులను రాజ్యాధికారంగా మరియు పారిశ్రామిక వర్గాలుగా చేసే ప్రణాళికలు కమ్యూనిస్ట్ లు చెయ్యలేకపోయేరు. 
 
సిపిఐ (యం ) దళిత కార్డును ఎందుకు ఉపయోగిస్తుంది?
 
అర్బన్ నక్సలైట్ పేరుతొ బ్రాహ్మణ విప్లవ సానుభూతి పరులను లేదా మానవ హక్కుల ఉద్యమకారులను అరెస్ట్ చేసిన 24 గంటల్లోనే వారికి బెయిల్ రావడం సోషల్ మీడియాలో దళితుల మధ్య చర్చ జరిగింది. కొందరు నెలలు తరబడి జైలు జీవితం అనుభవిస్తున్న ప్రొఫెస్సర్ సాయిబాబా యొక్క స్థితిని ఉదాహరణగా చూపిస్తూ కామెంట్లు చేసేరు. విప్లవం , కమ్యూనిజం పేరు చెప్పి ఇన్నిరోజులు దళితులను మోసం చేసేరు అనే అభిప్రాయం దళిత వర్గాల్లో ఉంది. ఈ పరిస్థితి నుండి బయట పడటానికి దళిత ఎంగర్ అంటూ సి పి ఐ (యం ) ట్వీట్ చేసింది. గుజరాత్ లో దళిత వర్గాల మీద జరిగిన దాడుల పేపర్ క్లిపింగ్ ను జత చేసి ట్వీట్ చేసింది. 
 
ఎన్నికలు దగ్గర పడేకొద్దీ లాల్ – నీల్ కి దళిత వర్గాల నుండి సరైన స్పందన లేకపోయేసరికి దళిత వర్గాలను అర్బన్ నక్సలైట్ ల విషయం లో   బిజెపి మీదకు దువ్వుతుంది. సహజంగా హిందూ  మతోన్మాదానికి వ్యతిరేకంగా ఉన్న దళితులను తమ ఖాతాలో వేసుకోవాలనే సిపిఐ (యం)  ట్వీట్ చేసింది. 
 
Ambedkar_quote
Google Image: Ambedkar quote on communism
 
దళితుల ప్రయాణం అంబేడ్కర్ వైపేనా?
 
దళిత మేధావి వర్గం ఇప్పుడు తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధించాలని కోరుకోవడం లేదు. బాబాసాహెబ్ డా అంబేడ్కర్ చెప్పినట్లు ‘ఈ దేశానికి పాలకులం కాబోతున్నాం’ అని గోడల మీద రాసుకుంటున్నారు. మాన్యశ్రీ కాన్షిరాం చూపిన మార్గం లో కులాన్ని ఎలా ఆర్గనైజ్ చేసి ఎన్నికల్లో ఎలాగెలవాలో వ్యూహాలు రచిస్తున్నారు. అర్ధ శతాబ్దం క్రితం దళితుల్లో నిరక్షరాస్యత. అందుకే ఇందిరమ్మ అని తమ గుండెల్లో భద్ర పరుచుకున్నారు. ఇప్పుడు “ఓట్లు మావి – సీట్లు మీవా” అనే నినాదం ప్రతి దళితుడి గుండెల్లో మారుమ్రోగుతుంది. 
 
దళిత వర్గాల్లో అక్షరాస్యత పెరిగింది. బాబాసాహెబ్ రచనలు తెలుగులోకి లభ్యపెట్టడం వలన ఫ్యూడల్ కులాల ఎత్తుగడలు ముందే విశేషిస్తున్నారు. బాంసెఫ్ లాంటి సంస్థలు మరియు అంబేడ్కర్ సంఘాలు బాబాసాహెబ్ సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. బాబాసాహెబ్ “బోధించు – పోరాడు – సమీకరించు అనే త్రికరణ సూత్రాలు ఆధారంగా తమ కులాన్ని సమీకరిస్తున్నాయి 
 
దళితుల బుజం మీద నుండి  కామ్రేడ్లు బిజెపిని కాల్చడానికి చేసే ప్రయత్నం మానుకోవాలి.  
  
 
 
(Visited 165 times, 1 visits today)
Also read  పవర్ లెస్ దళిత మెజారిటీ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!