ఆంధ్రాలో ఆయారం…గయారం ల ప్రబుత్వం!

షేర్ చెయ్యండి

బారత దేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఓటు హక్కు ద్వారా ప్రజలు తమకు నచ్చిన వివిధ పార్టీ నాయకులను తమ ప్రతినిధులుగా ఎన్నుకొంటారు. ఎన్నుకోబడిన సభ్యలు ఐదు సంవత్సరాలు తమకి కృతజ్ఞతా భావంతో సేవ చేస్తారు అని ప్రజల అభిప్రాయం.

ఇటీవల కాలం లో మనదేశంలో ఒక పార్టీ మీద గెలిచిన అభ్యర్థులు వివిధ కారణాలు సాకుగా చూపించి అధికార పార్టీ కండువా కప్పుకుంటున్నారు. అంటే ఒక పార్టీ మ్యానిఫెస్టో , సింబల్ , బి – ఫారం మీద గెలిచిన అబ్యర్థులు ఇంకొక పార్టీ లో చేరటం బారత రాజ్యాంగం దృష్ట్యా అనైతికం. ఇలాంటి చర్యల వలన పరిపాలనలో అవాంతరాలు ఏర్పడుతున్నాయి.

పిరాయింపు చట్టం ఏమి చెబుతుంది.

మొదటిసారిగా పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం 1979 లో పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఏర్పాటు చేసింది.1985లో రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం 52వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రంలో మొదటిసారిగా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని రూపొందించడం జరిగింది. దీనికి సంబంధించి రాజ్యాంగానికి 10వ షెడ్యూల్‌ చేర్చారు. దీనినే పార్టీ ఫిరాయింపుల చట్టం అంటారు.
ఈ చట్టం ప్రకారం పార్లమెంటు, రాష్ట్ర శాసన సభ్యులు ఈక్రింది సందర్భాలలో తమ సభ్యత్వాన్ని కోల్పోతారు.

ఎ) ఒక పార్టీ టికెట్‌ తరపున ఎంపికైన శాసన సభ్యుడు ఆ పార్టీకి స్వచ్ఛందంగా రాజీనామా చేసినప్పుడు.

బి) పార్టీ జారీ చేసిన విప్‌కు వ్యతిరేకంగా సభ్యులు గైర్హాజరైనా, అలాగే పార్టీ విప్‌కు వ్యతిరేకంగా ఓటు వేసినా సభ్యత్వాన్ని కోల్పోతారు.

సి) స్వతంత్ర అభ్యర్థులుగా శాసన సభలకు ఎన్నికైన తరువాత ఏదైనా పార్టీలో చేరితే వారి సభ్యత్వం కూడా రద్దవుతుంది.

Also read  తెలంగాణ ఎన్నికలు దళిత - బహుజనుల నవీన రాజకీయానికి నాంది కాబోతుందా!

డి) పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలలో నామినేటెడ్‌ సభ్యులు, నామినేషన్‌ కాబడిన తరువాత ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే వారి సభ్యత్వం రద్దవుతుంది. కాని నామినేటెడ్‌ సభ్యులు, నామినేట్‌ కాబడిన రోజు నుంచి ఆరు నెలల లోపల ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే వారి సభ్యత్వం రద్దు కాదు.

రాజకీయ పార్టీల పాత్ర.

ఇటీవల కాలంలో రాజకీయ పార్టీలు ఉద్దేశ్య పూర్వకంగా పిరాయింపులకు పాల్పడుతున్నాయి. అంటే రాజ్యాంగాన్ని, చట్టాలను, శాసన వ్యవస్థ ను పాలకులే వారి సొంత ప్రయోజనాల కొరకు ఉల్లంగింస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు దేశం ప్రభుత్వం ఏప్రిల్ 2 , 2017 న మంత్రి వర్గ విస్తీరణలో తమ పార్టీ కానీ నలుగురు శాశన సభ్యులకు మంత్రి పదవులు ఇవ్వటంతో బారత దేశం ఒక్కసారి గా అవాక్ అయ్యింది అని చెప్పాలి. ప్రజాస్వామ్య వాదులకు నిద్రలేకుండా చేసిన ఈ సంఘటన ప్రజలకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం , గౌరవం లేకుండా చేస్తున్నారు.

పిరాయింపులు ఎవరు అరికట్టాలి

పిరాయింపులను అరికట్టే బాధ్యత ఆయా రాష్ట్రాల శాసనసభ అధ్యక్షుడుదే. శాసన విలువలు కాపాడవల్సిన బాధ్యత శాసన సభ అధ్యక్షుడుది కాబట్టి పార్టీ పిరాయించే సభ్యుల పార్టీ అధ్యక్షుడు పిర్యాదు మేరకు ఆ సభ్యులను అనర్హత వేటు వేయాలి. న్యాయ వ్యవస్తకి కూడా అధికారం లేకుండా పిరాయింపుల చట్టం చేయబడింది. కానీ 1993లో కిహోటో హోలహాన్‌ వర్సెస్‌ జాచిల్హు కేసులో సుప్రీం కోర్టు ఈ సెక్షన్‌ను కొట్టివేసింది. సభాధ్యక్షులదే తుది నిర్ణయం కాదని, న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందని సుప్రీం కోర్టు నిర్ణయమే తుది నిర్ణయం అని తీర్పు చెప్పింది.
2007లో రాజేంద్ర సింగ్‌ వర్సెస్‌ స్వామిప్రసాద్‌ కేసులో సభాధ్యక్షుల నిర్ణయాన్ని న్యాయస్థానాలు ఏ పరిస్థితుల్లో సమీక్షించవచ్చు అనే అంశంపై సుప్రీం కోర్టు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఫిర్యాదు పై సభాధ్యక్షులు తగిన నిర్ణయాన్ని తీసుకోనప్పుడు, ఆధారాలు సాక్ష్యాలు లేకుండా పార్టీ విలీనాలను అంగీకరించినప్పుడు, 10వ షెడ్యూల్లో నిర్ణయించిన పద్ధతి ప్రకారం చర్యలు తీసుకోవడంలో విఫలమైనప్పుడు న్యాయ స్థానంలో వారి చర్యలను ప్రశ్నించవచ్చని పేర్కొంది.

Also read  నయా సూత మహర్షులు-దళిత రాజకీయ నాయకులు!

అసలు చట్టం ఏమి చెబుతుంది.

2003లో 91వ రాజ్యాంగ సవరణ ద్వారా సభ్యుల అనర్హతలకు సంబంధించి కొన్ని మార్పులు చేయడం జరిగింది.

10వ షెడ్యూల్‌లో పార్టీ ఫిరాయింపు అనర్హతలకు మినహా యింపుగా పేర్కొనబడిన ‘చీలిక’ అనే పదాన్ని తొలగించారు. అంటే ఈ సవరణ కంటె ముందు, ఒక రాజకీయ పార్టీ నుంచి 1/3 వ వంతు సభ్యులు చీలిక ద్వారా బయటికి వచ్చి స్వతంత్రంగా ఉంటే వారి సభ్యత్వం రద్దయ్యేది కాదు. ఇప్పుడు ఈ మినహాయింపు లేదు.
పార్టీ ఫిరాయింపు చట్టం క్రింద అనర్హులుగా ప్రకటించబడిన పార్లమెంటు లేదా శాసనసభ్యులను మంత్రులుగా నియమిం చబడటానికి అనర్హులు.
పార్టీ ఫిరాయింపు చట్టం క్రింద అనర్హుడిగా ప్రకటించబడిన పార్లమెంటు, రాష్ట్ర శాసనసభ్యులు ఆదాయ, లాభదాయక పదవులలో నియమించబడటానికి అనుర్హులు.

ఆంధ్ర ప్రదేశ్ లో ఏమి జరుగుతుంది.

ప్రతిపక్షం లోని వై యెస్ ర్ కాంగ్రెస్ పార్టీ నలుగురు సభ్యులను మొన్న జరిగిన మంత్రి వర్గ విస్తీర్ణలో మంత్రులు గా ప్రమాణ స్వీకారం చేయించటం అనైతికం. రాజ్యాంగ అధిపతి అయిన గవర్నర్ గారు అటు తెలంగాణ లో , ఆంధ్రలో పిరాయింపు శాసన సబ్యుల లను రాజ్యాంగ మీద ప్రమాణం చేయించటం రాజ్యాంగ ఉల్లంగించటం ప్రజాస్వామ్యని కి విరుద్ధం అంటూ ఆ పార్టీ ధర్నా చేస్తుంది. ఇందులో ప్రజాస్వామ్య వాదులు కూడా పాల్గొన్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు ఢిల్లీ లో రాష్ట్రపత్తి, ప్రధాని , మంత్రులు మరియు వివిధ జాతీయ పార్టీ నాయకులను కలిసి ఆంధ్రలో ని అధికార తే దే పా ప్రభుత్వ అనైతిక చర్యలకు మద్దత్తు కూడా గడుతున్నారు. అయితే 2014 ఎన్నికల తర్వాత నంద్యాల పార్లమెంట్ సభ్యలు SPY రెడ్డి గెలిచిన మరసిటి రోజే తే దే పా కండువా కప్పుకోవటం మనకు తెలిసిందే . ఈ పిరాయింపు మీద ఇప్పటి వరకూ చర్యలు లేకపోవడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యన్ని అపహాస్యం చెయ్యటమే. గౌరవ కోర్టు లు కూడా ప్రభుత్వం ప్రభావం తో ఆలస్యంగా తీర్పులు చెప్పటం ఉద్దేశ్య పూర్వకంగానే శాసన , న్యాయ వ్యవస్థలు రాజ్యాంగాన్ని తమకు తోచిన విధంగా మార్చుకుంటున్నాయి అని చెప్పవచ్చు. అలాగే ఇటీవల జరిగిన గోవా, మణిపూర్ లో బా జ పా ప్రభుత్వన్ని ఏర్పాటు చెయ్యటం పిరాయింపు చట్టంలోకే వస్తుంది

Also read  స్టేట్ సోషలిజం - బారత ఆర్ధిక, సామజిక, రాజకీయ ప్రజాస్వామ్యం: డా.అంబేడ్కర్ ప్రతిపాదనలు!

ఇలాంటి పరిస్థితులలో ప్రజలు తమ విజ్ఞత ప్రదర్శించి , పిరాయింపుదారులకు , పార్టీలకు తగిన బుద్ది చెప్పాల్సిన అవసరం ఉంది. సేవ్ డెమాక్రాసీ

(Visited 16 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!