ఆదివాసీల సంస్కృతిని దోపిడీ చేస్తున్న ఫ్యాషన్ ప్రపంచం!

షేర్ చెయ్యండి
  • 1
    Share

ప్రపంచంలో పెట్టుబడిదారి విధానం లేదా ఫ్యూడల్ వ్యవస్థ వారి అవసరాల కోసం సామాజిక దోపిడీనే కాదు, సాంస్కృతిక దోపిడీని కుడా కొనసాగిస్తుంది. బారత దేశం లోని పెట్టుబడిదారి వ్యవస్థ కుడా ఇందుకు తీసిపోలేదు. ఆదివాసీలు వివక్ష కే కాదు, నిరంతరం దోపిడీ కి గురవుతున్న సమాజం. వారి సంస్కృతీ ఎలాంటి సిగ్గుఎగ్గు లేకుండా అనుకరిస్తూ ఫ్యాషన్ పేరుతొ ర్యాంప్ షో లు నిర్వహిస్తూ కోట్లాది రూపాయిలు సొమ్ము చేసుకుంటున్నారు.

జాడే అనే బ్యూటీ మరియు ఫ్యాషన్ సంస్త ఇటీవల “ది డిసిడెంట్స్ ఆఫ్ నియాం రాజా” కలెక్షన్ పేరుతొ నిర్వహించిన ప్రదర్శన విమర్శలకు దారితీసింది.

ఒడిష లోని ఆదివాసీ తెగ డోంగ్రీ కొండ జాతి వారి వేషధారణ తో Amoh by Jade పేరుతొ ప్రదర్శన నిర్వహించింది. ఆదివాసీల గురించి ఒక్క నయా పైసా కుడా ఖర్చు చెయ్యని ఫ్యాషన్ వస్త్రాల ప్రపంచం ఇలా వారి సంస్కృతీ ని దోపిడీ చెయ్యడం సిగ్గుచేటు అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో నిర్వాహకులు సోషల్ మీడియాలో కామెంట్స్ ని తాత్కాలికంగా అపివేసేరు.

ఫ్యాషన్ రంగలో సామజిక , సాంస్కృతిక బావజలన్ని లేదా వస్త్రాదరణ ని అనుకరించడం లేదా వినియోగించడం సర్వ సాదారణం అయితే తమ అస్తిత్వాన్ని, సంస్కృతిని తమ అనుమతి లేకుండా వాడుకోవడం ఏ జాతి కుడా అంగీరించడం లేదు. జాడే సంస్త కానీ లేదా ఏ ఇతర సాంస్కృతిక వేదికలు వారి వ్యాపార మనుగడ, ఆర్ధిక లబ్దికోసం ఆదివాసీ తేగల జీవన సౌదర్యాన్ని ఉపయోగించుకుంటున్నారు కానీ వారి జీవిత అభివృద్ధి కొరకు ఎలాంటి సహాయం లేదా మేధో మద్దత్తు తెలపడం లేదు.

Also read  Dalit political empowerment in Andhra pradesh-Telanganga

డోంగ్రీ కొండ తేగల ఆదివాసీలు ఒడిష లోని నియంగిరి కొండ పరిసర ప్రాంతాలకు చెందిన వారు. వీరు కొండ దేవత నియంగిరి రాజా ని పూజిస్తారు. పకృతిని ప్రేమిస్తూ, పకృతితో మమేకమై జీవిస్తూ ఉంటారు.

ఆదివాసీల సంస్కృతిని దోచుకోవడం ఒక్క బారత దేశంలోనే కాదు ఆఫ్రికా ఖండంలో ఎప్పటి నుండో జరుగుతుంది. అక్కడ తెగలు ఇప్పుడు, ఇప్పుడు ఈ సాంస్కృతిక దోపిడీ దారులను ఎదుర్కోవడం ప్రారంభించేరు. వలస వాదులు అయిన యురోపియన్స్ ఆఫ్రికా ని సంస్కృతిని దోచుకున్నారు.

ప్రముఖ  ఆఫ్రికా సంగీత కళాకారుడు కలోనియల్ లిండా 1939లో స్వరపరిచిన గ్లోబల్ పాప క్లాసిక్ పాట Mbube ని కాపీ కొడుతూ చేసిన విడియో The lion Sleep To night పాట లిండా కోర్టు కు వెళ్ళడంతో అతనికి నష్టపరిహారం చెల్లించేరు.

ఏ కొత్త సృష్టి అయినా పాత వాటి అనుకరణ పోలి ఉంటుంది అయితే, కలోనియల్ లిండా పాట కానీ లేదా అమో –జాడే కానీ వారి సొంత క్రియేషన్ అని నిరూపించుకోవాలి. The Lion Sleep To Night అనే విడియో కాపీ రైట్ చట్టం ముందు నిలబడలేక పోవడంతో కాపీ చేసిన వారు నష్ట పరిహారం చెల్లించేరు.

ఒడిష లోని డోంగ్రీ తెగలు వేదాంత అనే మైనింగ్ కంపెనీ తో పోరాడుతున్నారు. వారు అత్యంత పవిత్రంగా పూజించే నియంగిరి కొండ ప్రాంతంలో అల్యూమినియం కోసం వేదాంత అనే మైనింగ్ సంస్త చేస్తున్న తోవ్వకాలు వారి అస్తిత్వాన్ని కనుమరుగుపరిచే అవకాసం ఉంది.

ఆదివాసీల జీవన విధానం డాక్యుమెంటరీలు గా చేసుకుని కోట్లు సంపాదిస్తున్న వారు ఏనాడు కుడా వారికి సహాయం చేసినట్లు గా అధరాలు లేవు.

Also read  పవర్ లెస్ దళిత మెజారిటీ!

సోషల్ మీడియా కేంద్రంగా, ముక్యంగా ఇంస్ట్రగ్రం లో జాడే కి సంబంధించిన ప్రొఫైల్ మీద ఆదివాసీ లీవ్స్ మేటర్ #AdivasiLivesMatter అనే హాష్ ట్యాగ్ తో జాడే కి వ్యతిరేకంగా  ఆదివాసీ ప్రజలు మరియు ఇతరుల కౌంటర్ కామెంట్ లకు సమాధానం లేకుండా పోస్ట్ కామెంట్ బాక్స్ ని డిసబుల్ చేసుకున్నారు.

బారత దేశంలో ఇప్పటివరకూ జరుగుతున్న సామజిక దోపిడీ లో బాగంగా సాంస్కృతిక దోపిడీ కుడా జరుగుతుంది. ఇక్కడ అనాది గా ఉన్న ఆదివాసీల మరియు నిమ్నజాతీయులు సాంప్రదాయాలను, సంస్కృతిని తమది గా చెప్పుకుని వీరిన అంటరానివారుగా చేసిన చరిత్ర మనకి తెలుసు.

బుద్దిస్ట్ / జైన  సంస్కృతీ ని మొత్తంగా దోచుకుని నిర్మితమైన హిందూ సంస్కృతీ వారిని చంపుతూ పండగలు చేసుకుంటున్నారు.

ఇన్నిరోజులు బారత దేశంలో జరుగుతున్న సాంస్కృతిక దోపిడీని ఆదివాసీ తెగలు మరియు షెడ్యులు కులాలు సమిష్టిగా ఎదుర్కోవాలి. బాబాసాహెబ్ డా బి ర్ అంబేడ్కర్ అన్నట్టు చరిత్ర తెలియని వారు చరిత్రను నిర్మించలేరు అనే సిద్దాంతం ప్రాతిపదికగా షెడ్యులు కులాలు , తెగలు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవాలి.        

Also read  కనిషక్ కఠారియా: సివిల్ సర్వీస్ 2018 ఫలితాలలో మొదటి ర్యాంకు సాధించిన దళిత ఇంజినీర్
(Visited 131 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!