ఆధిపత్య సంక్షేమ సంఘమే ఆలిండియా  ఈక్వాలిటీ ఫోరం!

షేర్ చెయ్యండి
  • 30
    Shares
 
  • భారత సమాజం వ్యక్తులతో ఏర్పడింది కాదు. లెక్కలేనన్నీ కులాల గుంపులతో ఏర్పడింది. ఆకులలా జీవన విధానం వేటికవిగా ఉంటాయి. పంచుకోవడానికి వుమ్మడి అనుభూతులు ఉండవు. 
 
ఇదీ బారత దేశం ఇక్కడ కుల పరంగా ఒకరికి ఒకరు సహాయ సహకారాలు చేసుకుంటారు తప్పా. సామాజికంగా అందరూ కలిసి ఒక్కటిగా ఉండరు. కులం అనేది వ్యవస్తీకృతం అయిపొయింది. అలాంటీ వ్యవస్థ లో నుండి పుట్టిందే ఆల్ ఇండియా ఈక్వాలిటీ ఫోరం. 
 
బారత రాజ్యాంగం స్వేచ్ఛ, సమానత్వం , సౌబ్రాతత్వం అనే అంశాల ప్రాతిపదికన ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి రాజ్యాంగం కల్పించిన సమానత్వం (Equality ) కాకుండా ఈ All India equality forum సాధించేది ఏమిటి? వారి లక్ష్యం ఏమిటి? 
 
అల్ ఇండియా ఈక్వాలిటీ ఫోరం అంటే షెడ్యూల్ క్యాస్ట్ మరియు షెడ్యూల్ ట్రైబ్ ల హక్కులను నిలువరించే పని చెయ్యడమే ఈ అల్ ఇండియా ఈక్వాలిటీ ఫోరం యొక్క లక్ష్యం లాగా కనిపిస్తుంది. ఒక పక్క రాజ్యాంగం కల్పించిన సమానత్వంని అడ్డుకుంటూ రాజ్యాంగేతర శక్తి గా ఈక్వాలిటీ ఫోరం తయారు అయ్యింది. 
 
చాలా రోజుల క్రితం కె బాలగోపాల్ కడప జిల్లాలో ఏర్పాటు అయిన ‘ఓసి సంక్షేమ సంఘం’ గురించి రాసిన వ్యాసంలో ఆ సంఘం యొక్క అనైతిక కార్యకలాపాల గురించి రాసేరు. కడప జిల్లాలో మండల స్తాయిలో కమిటీలు ఏర్పాటు చేసుకుని దళితులను దబాయించి వర్ధిల్లుతున్నది, ఆ విషయం జిల్లా వెలుపల ఎవ్వరికీ తెలియదు. నిజానికి ఆ సంఘం రాస్తాయిలో ఉంది, దాని అధ్యక్షుడు మహబూబ్ నగర్ లో ఉంటాడు. దళితులు ఓ సి ల మీద ఎస్సి, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం క్రింద కేసు పెట్టినప్పుడు ఈ సంఘం ప్రతినిధులు ప్రత్యక్షం అయి సంఘటన అబద్దం అని, తప్పుడు కేసని అడ్డుకునే వాళ్ళు. ఆ మేళ్లు చేసినప్పుడు వారికి వేల రూపాయిలు విరాళాలు గా ఓసి లు ఇస్తున్నారు. దబాయించి దళితులను అడ్డుకోవడమే ఓ సి సంక్షేమ సంఘం లక్ష్యం అయితే All india equality forum కూడా ఎస్సి, ఎస్టీ ఉద్యోగులకు సుప్రీం కోర్టు తీర్పును  బట్టి ఉద్యోగాలలో  రిజర్వేషన్ ప్రకారం ప్రమోషన్ పొందే సౌకర్యం అడ్డుకోవడమే వీరి లక్ష్యం   
 
ఏ తప్పుడు పనికైనా ఏదో ఒక మిష కావాలి. ఆ మిష   ఏంటంటే ఎస్సి , ఎస్టీ లకు ప్రమోషన్లు లో రిజర్వేషన్లు ఆధారంగా ప్రమోషన్ ఇవ్వడం. దీనిని ఆధారంగా చేసుకుని ఎస్సి, ఎస్టీలకు వ్యతిరేకంగా బి సి లను, ముస్లిం లను ఎగదోసి ఈక్వాలిటీ ఫోరం అంటూ ఎస్సి ఎస్టీ ల కడుపు కొల్లగొట్టే ప్రయత్నమే ఈ ఆల్ ఇండియా ఈక్వాలిటీ ఫోరం లక్ష్యం. 
 
వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించే మండల్ కమీషన్ బిల్లు ను అడ్డుకునే ప్రయత్నం చేసిన ఓ సి సంఘాలు వివిధ రూపాలు మార్చుకుని మళ్ళీ అదే బి సి లను ఎస్సి లమీదకు ఉసిగొల్పుతున్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ముస్లిం లకు 5 % రిజర్వేషన్లు కల్పిస్తే , ముస్లింలకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లిన ఓ సి సంక్షేమ సంఘం. 
 
SC , ST ఉద్యోగుల అవకాశాలను కొల్లగొట్టటానికి ఓ సి లు వేసే ఎత్తుగడలో బి సి లు మైనారిటీ లు కూడా వారితో కలుస్తున్నారు. ఆల్ ఇండియా ఈక్వాలిటీ ఫోరం పేరుతొ 117 constitutional amendment కు వ్యతిరేకంగా కుట్ర జరుగుతుంది అందులో బాగంగా ధర్నాలు నిర్వహిస్తున్నారు. బిసి లు వారి శాఖ మంత్రిని కలిసి SC , ST ల రాజ్యాంగ హక్కులను అడ్డుకోవాలని చూస్తున్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా, రోస్టర్ విధానం పాటించకుండా SC , ST ల హక్కులను నిర్వీర్యం చేసి, రిజర్వేషన్ల విధాన్ని పూర్తిగా తొలగించే పక్రియ BJP చేస్తుంది 
 
కుల వ్యవస్థ యొక్క అవరోధాలు వివరిస్తూ డా బాబాసాహెబ్ అంబేడ్కర్ బారతీయ సమాజంలో క్రియాత్మకంగా సమైక్యత లేదు. అందరికీ ఉపయుక్తమైన దేమిటో దానికి తెలియదు 
 
ఏ సమాజ నిర్మాణమైనా చివరగా దాని లక్ష్యం ఏమిటన్న జ్ఞానం మీదే ఆదారపడి ఉంటుంది అన్నాడు ప్లేటో. 
 
మన సమాజ లక్ష్యమేమిటో మనకి తెలియకపొతే, మన సమాజానికి  ఏది మంచో మనకి తెలియకపోతే  మనం యాదృచ్ఛికత మీద, చిత్తా చాంచల్యం మీద ఆధారపడల్సి వస్తుంది. మన సమాజానికి ఏది మంచో మనకు తెలియనప్పుడు వేటినీ  ప్రోత్సహించాలో హేతుబద్దంగా నిర్ణయించలేము కుల వ్యవస్థలో కూరుకుపోయిన భారతీయ సమాజం తమ అంతిమ లక్ష్యం ఏమిటన్నదీ తేల్చి సాధించగలదా? 
 
బారత దేశం స్వాతంత్య్రం సాధించి 71 సంవత్సరాలు అయ్యింది. 1947 ఆగస్టు 14 న బ్రిటీష్ వారు మన దేశాన్ని వదిలి వెళ్ళబోతున్నప్పుడు “అనేక సంవత్సరాల క్రితం మన లక్ష్యాన్ని గుర్తించుకున్నాం. మన వాగ్ధానాన్ని నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చింది.” అని ప్రకటించారు జవహర్ లాల్ నెహ్రు. “పేదరికాన్నీ, అజ్ఞానాన్నీ, అనారోగ్యాన్నీ అసమానతల్నీ అంతమొందించవలసిన గురుతర బాధ్యత మనముందున్నది”  
 
సామర్ధ్యం అంటే వ్యక్తిగత స్వేచ్ఛ అంటాడు అరిస్టాటిల్. బారతీయ సమాజంలో దళిత , గిరిజన ప్రజలకు తమ జీవిత విధానాల్ని ఎంచుకునే అవకాశం లేని సంకుచిత పరిస్థితిని ఏ ఆల్ ఇండియా ఈక్వాలిటీ ఫోరం లాంటి కుల సంఘాలు అనాదిగా అడ్డుకుంటూ వస్తున్నారు. నేడు రాజ్యాంగ పరంగా వస్తున్న హక్కులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే వారికి సమాజం పట్ల ఏ మాత్రం బాధ్యత లేదని చెప్పాలి. అందుకే బాబాసాహెబ్ డా అంబేడ్కర్ అంటాడు   బారతీయుల ఆలోచనలు తప్పుడు విలువలతో, తప్పుడు దృకపదాలతో పక్కదారి పట్టి ఉంటాయి. ఆల్ ఇండియా ఈక్వాలిటీ ఫోరం యొక్క దృకపదం కూడా అచ్చం బాబాసాహెబ్ చెప్పినట్లుగానే ఉంది. 
(Visited 84 times, 1 visits today)
Also read  అట్రాసిటీ చట్టం:నిర్వీర్యం చేసిన సుప్రీం కోర్టు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!