ఆధునిక అగ్రహారాలు!

షేర్ చెయ్యండి

కులం క్యాన్సర్ లాంటిదని బాబాసాహెబ్ డాక్టర్ అంబేడ్కర్ చెప్పి ఇప్పటికే దశాబ్దాలు గడచిపోయింది. ఆ క్యాన్సర్ పుండు ఆధునిక యుగంలో కొత్త రూపాంతరం తీసుకుంది.ఈ రాచపుండు మధ్య ప్రదేశ్ పోలీసు కానిస్టేబుల్ ఎంపిక పోటీలలో దేహదారుడ్య పరీక్షల్లో మనిషి(అభ్యర్ధి ) చాతి మీద కులం ముద్ర వేసంత వరకు వెళ్ళింది.

ఆధునిక యుగంలో కులమా! అని నోరేల్లబెట్టే అమాయకులు మన ప్రజలు. అయితే ఎస్సి, ఎస్టీ ప్రజలకు ఆధునిక కుల వివక్ష కొత్త కాదు. ఈ దేశంలో మెజారిటీ ప్రజల అచ్చర్యం వెనకాల వారి కులం దొంతరులు, దొంతరులు గా ఉందని తెలుసు. వారు వేల సంవత్సరాల మోసాన్ని ఆధునిక యుగంలో కుడా కంటిన్యూ చేస్తున్నారని తెలుసు. వారు ఒట్టి అబద్దలకోరులని వారికి బాగా తెలుసు.

మనమెక్కడో మారు మూల గ్రామంలో దళిత విద్యార్ధిని ని అవమానిచిన సంఘటన లేదా దళితులను గుడిలోకి రానీయని సంఘటన పేపర్లో చూసి ఆవేశపడుతుంటాం. కానీ శాస్త్రవేత్తలను తయారు చేసే ఐ.ఐ.టి లలో కులం రెండు గ్లాసుల విధానం లా ఇంకా విరాజిల్లుతుంది. మద్రాస్ ఐ. ఐ.టి ని ఆ రాష్ట్ర ద్రావిడ ఉద్యమకారులు “అయ్యర్ ఇనిస్త్యుట్ ఆఫ్ టెక్నాలజీ” అని పిలుస్తున్నారు అంటే ఆ ఇనిస్ట్యుట్ లో కుల వివక్ష మనకి దోహదపడుతుంది.

“ప్రాజెక్ట్ లు ఆధినిక దేవాలయాలు “బారత మొదటి ప్రదాని జవహర్ లాల్ నెహ్రు ఐ. ఐ. టి లు , ప్రాజెక్ట్ లు నిర్మించేటప్పుడు చేసిన వ్యాక్య ఇది. నెహ్రు లాంటి బ్రాహ్మణ వాది సరిగ్గానే సంబోధించేడు. ఎందుకంటె దేవాలయంలో ఉంది “కులమే” కదా!

“వర్ణ వ్యవస్థకి సైంటిఫిక్ ప్రాతిపదిక ఉందని, నేను అభిప్రాయపడుతున్నాను. ఈ వ్యవస్తకి వ్యతిరేకంగా హేతువు తిరుగుబాటు చెయ్యదు” అని గాంధీ అన్నారు.

ఆ మధ్య ఐ.ఐ.టి లలో ఒకే అప్లికేషన్ ని దళితులు, ఆదివాసీలు (ఎస్సి, ఎస్టీ) లు మరియు ఇతర వర్గాలు రెండు వేరు వేరు కవర్లలో అప్లికేషన్ పెట్టి అందజెయ్యాలని ప్రకటన ఇచ్చేరు. దళితులు, ఆదివాసీలు అయితే తెల్ల కవర్ లో అదే మిగతా కులాలు అయితే బ్రౌన్ (గోధుమ)  రంగు కవర్ లో ఇవ్వాలి. ఈ ప్రముఖ ఉన్నత శాస్త్ర, సాంకేతిక సంస్త లో దళితుల అప్లికేషన్ కి కుడా వివక్షనే!

Also read  ఆంధ్రాలో ఆయారం...గయారం ల ప్రబుత్వం!

ఒక ఎస్సి విద్యార్ధి కానీ లేదా నేటి రాజకీయ నాయకుడు కానీ ఎంత ప్రతిభ ఉన్నా, మెరిట్ లో ముందు ఉన్నా  వారి కోట అయిన 15% రిజర్వేషన్ లోనే సీటు ఇస్తారు అలాగే ఆదివాసీలకు 7.5% కోటా లోనే వారి అభ్యర్ధిత్వాన్ని పరిగణలోకి తీసుకుంటారు.

బారత దేశంలో అత్యధిక బాగం ఆధునిక శాస్త్ర, సాంకేతిక సంస్త లలో అసలు రిజర్వేషన్లు అమలు కావు. వారిని అడిగే వ్యవస్థ బారత దేశంలో లేదు. వారికి దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థ సుప్రీం కోర్టు తీర్పులు కుడా పట్టవు. వాళ్ళకున్న సంకుచితమైన వైజ్ఞానిక పరిదిలో వారు ఏర్పరుచుకున్న అభిప్రాయాలే సర్వం అని బావిస్తారు. బారత దేశంలో జనాబా ప్రాతిపదికన కాకుండా కుల ప్రాతిపదికన వివధ సంస్తల్లో తిష్ట వేసిన బ్రాహ్మణులు వారి యొక్క ద్రుష్టి లోపం ప్రగాడమైనది. వీరికి ఇప్పుడు బ్రాహ్మణ-బనియా పార్టీగా ముద్ర పడిన BJP ప్రబుత్వం మరింత అండను ఇవ్వడం వలన మనుషుల (అభ్యర్ధి) చాతి మీద కులం ముద్ర వేసే స్తితికి వెళ్ళేరు.

మధ్య ప్రదేశ్ లో పోలీసు రిక్రూట్మెంట్ లో చాతి మీద కులం ముద్రలకు పౌర సమాజం సిగ్గు పడుతుందా అంటే లేదని చెప్పాలి. హైదరాబాద్ సెంట్రల్ యునివర్సిటీ లో “వెలివాడ” ను ఖండించలేని పౌర సమాజం నేడు మధ్య ప్రదేశ సంఘటను ఖండిస్తుదంటే ఊహాజనితమే!

Also read  కులాధారిత రిజర్వేషన్లు ఇంకేనాళ్ళు?

ఒక రాష్ట్ర ముక్యమంత్రిగా వుండి ఎస్సి లలో ఎవరు పుట్టాలని కోరుకుంటారు అన్నప్పుడు ఈ ఆధునిక మనువు , అగ్రహారం, రాచ పుండు లా ఉన్న కులవ్యవస్త తీరు అద్దంపడుతుంది.

సుప్రీం కోర్టు న్యాముర్తులను నియమించే క్రమంలో ఆంధ్ర ప్రదేశ్ ముక్య మంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయం వెనక జరిగిన కుల  కుట్రను  ఇటీవల జస్టిస్ ఈశ్వరయ్య బయట పెట్టిన సంఘటన మనకి తెలిసిందే!

రాష్ట్రానికి చెందిన న్యావాదులు అమర్ నాద్ గౌడ్, అభినవ కుమార్ చావలి, గంగారావు, డి. వి సోమయాజులు, విజయ లక్ష్మి, కేశవరావులను హైకోర్ట్ న్యాయమూర్తులు గా నియమించాలంటూ సుప్రీం కోర్టు కోలీజియం కేంద్రానికి సిఫార్స్ చేసింది. ఆ ఆరుగురు న్యాయ వాదుల పై రాష్ట్ర ప్రబుత్వం అభిప్రాయాన్ని కేంద్ర న్యాయ శాఖ అడగగా, ఆంధ్ర ప్రదేశ్ ప్రబుత్వం కమ్మ సామాజిక వర్గానికి చెందిన విజయ లక్ష్మి, వెలమ సామజిక వర్గానికి చెందిన కేశవరావు లను సిఫార్స్ చేసింది. మిగతా నలుగురు న్యాముర్తులు బి సి , ఎస్సి, బ్రాహ్మణ న్యాయమూర్తులకు వ్యక్తిత్వం,  విషయ పరిజ్ఞానం లేదని, సచ్చీలురు కారంటూ మార్చి 21 , 2017 న ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కి ఉత్తరం రాసేరు. అయితే కేంద్ర దర్యాప్తు సంస్త నివేదిక ప్రకారం ఆ నలుగురు సచ్చీలురు అని ఇచ్చిన రిపోర్ట్ ఆదారంగా వారిని హైకోర్టు న్యాయమూర్తులు గా నియమించేరు.

Also read  Thousands of Maharastra farmers walk for protest ended

రాజకీయ పార్టీల దగ్గర నుండి విద్యాసంస్త లేదా ప్రైవేట్ పరిశ్రమ లేదా ఏ సంస్త అయినా తీసుకోండి అక్కడ ఒక అగ్రహారం తిష్ట వేసి ఉంటుంది. అక్కడ ఆధునిక మనువు ఉంటాడు.

ప్రస్తుత పరిస్తితుల్లో దేశంలోని వెనకబడిన వర్గాలు, దళితులు, ఆదివాసీలు ఇంకా ఎప్పుడు మేల్కొంటాయి? సామాజిక ప్రజాస్వామ్యం కోసం అన్నివర్గాల తో కూడిన వ్యవస్తల నిర్మాణం కోసం ఎవరు ఏమి చెయ్యాలి? మండల్ కమీషన్ పెర్కొనట్లు “సామాజిక వెనుకబాటుతనం పై పోరాటం అనేది ముందుగా ఓ బి సి ల మొదలవ్వలన్నది తక్షణ అవసరం” మరి దళిత వర్గాలు ఏమి చేస్తున్నాయి? దళిత వర్గాలు పోరాటం చేస్తున్నాయా?

జస్టిస్ ఈశ్వరయ్య బహిరంగ పరిచిన లేఖ పై దళిత , బి సి వర్గాల నుండి కనీస స్పందన లేకపోవడం ఈ వర్గాల చైతన్యానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. నిద్ర నటిస్తున్న దళిత మేధావులు, రాజకీయ నాయకుల అలసత్వం వలన దళితుల ఓట్ల తో ముక్య మంత్రి అయిన చంద్రబాబు దళితులకే ఎసరు పెడుతుంటే మౌనం దాలుస్తున్నారు.

దళిత సమాజం ఇలా నిద్ర నటిస్తూ ఫ్యూడల్ కుల నాయకులకు బోయలుగా ఉంటుంటే దళితుల, ఆదివాసీల చాతి మీదనే కాదు రేపు నుదిటి మీద కుడా కుల ముద్ర వేసినా అచ్చర్యపడక్కర్లేదు.

“ఓర్పుగా ఉండే మనిషి అగ్రహించవచ్చు, జాగ్రత్త” మూడు వందల యేండ్ల క్రితం ఒక ఆంగ్ల కవి జాన్ డ్రైడన్ హెచ్చరిక ను ఇక్కడ ఆధునిక మనువు, ఆధునిక అగ్రహారాలు గుర్తు తెచ్చుకోవాలి. ఈ పూర్వకాలం సూక్తిని పెడచెవిన పెడితే, అశ్రద్ధ చేస్తే దేశ బవిషత్ కి ప్రమాదకరం.

 

(Visited 121 times, 1 visits today)

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!