ఆపరేషన్ గరుడ: ఫ్యూడల్ కులాల రాజకీయ క్రీనీడ – చితికిపోతున్న బడుగు జీవులు!

షేర్ చెయ్యండి
  • 27
    Shares
 
 
  • ఆపరేషన్ గరుడ అంటూ సినీ నటుడు శివాజీ గత కొన్ని నెలలు క్రితం ఒక వీడియో ని మీడియాకు రిలీజ్ చేసేరు. 
 
  • శివాజీ విడుదల చేసిన “ఆపరేషాన్ గరుడ” సారాంశం ఏంటంటే కేంద్రంలోని బా జ పా ప్రభుత్వం మద్దత్తు తో ఆంధ్రప్రదేశ్ ని అస్థిర పరిచి అధికార తెలుగు దేశం ప్రభుత్వాన్ని దించి రాష్ట్రపతి పాలన ద్వారా కేంద్రం ఆంధ్ర ప్రదేశ్ ని తమ చెప్పు చేతల్లో పెట్టుకోవచ్చు. 
 
ఈ ఆపరేషన్ గరుడ కి ప్రదాన పాత్ర ఆంధ్ర ప్రతిపక్ష నేత వై యెస్ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ వై ఎస్ జగన్ ఎందుకు కీలకం అంటున్నాం అంటే జగన్ మీద మూడు సార్లు హత్యయత్నం జరగబోతుంది. 
 
జగన్ మీద హత్యాయత్నం  జరిగిన తర్వాత అల్లర్లు జరిగితే ఆ సాకుతో గవర్నర్ రాష్ట్రపతి పాలనకు కేంద్రానికి సిఫార్స్ చేస్తాడు. ఏపీ 
 
నటుడు శివాజీ రిలీజ్ చేసిన ఆపరేషన్ గరుడ కాలజ్ఞానం వీడియో ప్రకారం వై ఎస్ జగన్ మీద విశాఖపట్నం విమానాశ్రయం లో జగన్ మీద హత్యాయత్నం జరిగింది. 
 
ఏది ఏమైనా నటుడు శివాజీ కాలజ్ఞానం నిజం అయ్యింది.. వై ఎస్ జగన్ మీద అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే విమానాశ్రయం వి ఐ పి లు వేచి ఉండే ప్రదేశంలో ఈ హత్యాయత్నం చెయ్యడం ప్రజలను ఆచ్చర్యపరుస్తుంది. 
 
ఆపరేషన్ గరుడ యొక్క లక్ష్యం ఏంటి? 
నటుడు శివాజీ చానళ్ల నుండి రాజకీయ కామెంట్లు, ఆంధ్రకి ప్రత్యేక హోదా లాంటి అంశాల మీద కామెంట్లు చేస్తూ వార్తల్లో ఉన్న వ్యక్తి. సామాజిక పరంగా ఇతను కమ్మ కులస్తుడు కావడంతో సహజంగానే ఇతని ప్రతి యాక్షన్ తెలుగు దేశం పార్టీ కి అనుకూలంగా ఉందని ప్రజలు బావిస్తున్నారు. 
 
శివాజీ ఏ పార్టీలో సభ్యుడు కాదు. కొన్నాళ్ళు పవన్ కళ్యాణ్ కి మద్దతుగా కూడా ఉన్నాడు. కానీ గత కొంత కాలం నుండి ఆయన పూర్తిగా తెలుగు దేశం పార్టీ అబిమానిగా మాట్లాడుతున్నాడు. 
 
ఆంధ్రప్రదేశ్ లో  అనూహ్యంగా జరిగిన రాజకీయ పరిణామాలతో అధికార తెలుగు దేశం కేంద్రం లోని బిజెపి ల మధ్య పెరిగిన అంతరం వలన ముక్య మంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో ప్లేటు ఫిరాయించి కేంద్ర ప్రభుత్వం మీద బురదజల్లే కార్యక్రమం చేపట్టేరు. 
 
హోదా వద్దు- ప్యాకేజీ ముద్దు అన్న చంద్రబాబు మీద జగన్ సంకల్ప యాత్ర ద్వారా ప్రశ్నిస్తూ ప్రత్యేక హోదా మీద మాట్లాడటం, ప్రజల నుండి మద్దత్తు వస్తుండే సరికి బిజెపి- తెదేపా పొత్తు అర్ధాంతరంగా ముగిసింది. 
 
బిజెపి ఆంధ్ర ప్రదేశ్ లో తమ రాజకీయ ప్రాభల్యం కోసం వేసే ఎత్తుగడలో ప్రజల మద్దత్తు లేని చంద్ర బాబుతో తెగతెంపులు చేసుకుని స్వతంత్రంగా ఎదిగే ఆలోచనలో చంద్ర బాబు మీద దాడి ప్రారంభించింది. 
 
చంద్రబాబు మిత్రులు జన సేన – పవన్ కళ్యాణ్ , బిజెపిలు సడెన్ గా యూటర్న్ తీసుకుని ప్రత్యేక హోదా విషయంలో  చంద్రబాబు ని దోషి గా నిలబెడుతున్న పరిణామాలకు ఆపరేషన్ గరుడా అంటూ శివాజీ గరుడ రహస్యం బయటకు వచ్చింది. 
 
ఆపరేషన్ గరుడలో శివాజీ చెప్పిందే ముఖ్యమంత్రి చంద్రబాబు & కో మాటకు ముందు, మాటకు వెనకాల ఆంధ్రప్రదేశ్ ని ఏమి చేయాలనుకుంటున్నారు? ఎటువైపు తీసుకు వెళ్లాలనుకుంటున్నారు? 
 
ఆంధ్రప్రదేశ్ ని ఎటువైపు తీసుకు వెళ్లాలనుకుంటున్నారు? 
చంద్రబాబు మరియు అతని పార్టీ సహచరులు పవన్ కళ్యాణ్ ని , వై ఎస్ జగన్ ని మరియు బిజెపి పార్టీని అడిగినట్లే రాష్ట్రంలోని మెజార్టీ ప్రజలు అయిన బి సి లు , ఎస్సి, ఎస్టీ లు, మైనార్టీలు ఇతర వర్గాలు అధికార తెలుగు దేశం ప్రభుత్వాన్ని, ప్రతి పక్ష పార్టీలను అడుగుతున్నారు? 
 
రాజకీయ పార్టీలకు రాజ్యాధికారమే ముఖ్యం. అది కాదనలేని సత్యం. ప్రజల సంక్షేమం  గాలికి వదిలేసి, బాధ్యత మరిచి మీ, మీ రాజకీయ లబ్ది కోసం ప్రజల జీవితాలతో చెలగాటం ఆడతారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు? 
 
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేడు. 2018-19 బడ్జెట్ వరకు ఆంధ్ర ప్రదేశ్ రూ. 2,49,435 కోట్లు ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో అంటే 2014-15 లో ఆంధ్రప్రదేశ్ అప్పు రూ. 1,48,743. 2015-16 లో రూ.1,69,458, 2016-17 లో 2,01,314 మరియు 2017-18 లో 2,25,234 కోట్లు ఉంది. 
 
ఇన్ని వేల కోట్లు అప్పులు చేసి ప్రభుత్వం ఏమైనా ప్రగతి సాధించిందా అంటే అదికూడా ఏమీ లేదు. అన్నీ వర్గాల ప్రజల్లో ప్రభుత్వం మీద అసంతృప్తి ఉంది. 
 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మే 29 2017 లో జి ఓ నెం. 29 ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 9 వేల స్కూల్స్ ని మూసివేసింది. విద్యార్థులు చేరడంలేదనే నెపంతో 6500 ప్రాధమిక పాఠశాలలు, 2500 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ మరియు 50 హై-స్కూల్స్ 13 జిల్లాలో మూసివేసింది. 
 
ప్రజల ప్రాధమిక ఆరోగ్యాన్ని ప్రభుత్వాలు తమ బాధ్యత నుండి తప్పించి ప్రైవేట్ కి అప్పగించేయి. సాధారణ జ్వరం నుండి గుండె శస్త్ర చికిత్స వరకూ ఎన్టీర్ వైద్య సేవలు పేరుతొ తమకి కావాల్సిన హాస్పిటల్స్ కి ప్రభుత్వ డబ్బును వారి జేబుల్లో నింపుతున్నారు. 
 
ఇక జాబు కావాలంటే బాబు రావాలని నిరుద్యోగ యువత ఓట్లతో గెలిచి గత నాలుగేళ్లుగా ఒక్క ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసిన ఘనత చంద్రబాబుది. 
 
రాష్ట్రంలో నిరుద్యోగం, కరువు విలయతాండవం చేస్తున్నా రాజధాని అమరావతి గురించేతప్పా జిల్లాలో కరువు, ఉపాధి కల్పన గురించి ఏనాడు రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరగలేదు. 
 
ఇక ప్రతిపక్ష నేత తనకి గుర్తు వచ్చినప్పుడల్లా దీక్ష లు చెయ్యడం తప్పా , సైదంతికంగా ప్రభుత్వం మీద పోరాటం చెయ్యలేక పోయింది అని చెప్పాలి. 
 
చంద్రబాబు గత నాలుగేళ్ళ లో ప్రజలను బిక్షగాళ్ల గా మారిస్తే,  వై యెస్ జగన్ ఏమీ చెయ్యలేక అచేతనంగా ఉన్నాడు. 
 
లక్షల కోట్ల డబ్బు ఎవరి చేతుల్లోకి వెళ్తుంది? 
చంద్రబాబు నాయుడు నవ్యంధ్ర సియం గా  2014 లో ప్రమాణస్వీకారం చేసినప్పటి నుండి 2015 కు తన ఒక్కడి ఖర్చులు 100 కోట్లు అంటే సామాన్య జనం నోరెళ్ళబెట్టుకుని చూడాల్సిందే. 
 
కట్టుబట్టలు తో పంపించేరని ప్రజలకు చెప్పే చంద్రబాబు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాటించాల్సిన కనీస ఆర్ధిక క్రమశిక్షణ చెయ్యలేదు. 
 
ఇక తన నివాసాలకైతేనేమి, హైదరాబాద్ లో సొంత ఇల్లు నిర్మాణం పేరుతొ హోటళ్ల కి కట్టిన బిల్లులు , విజయవాడ, హైదరాబాద్ లో క్యాంప్ ఆఫిస్ ల పేరుతొ చేసిన దుబారా ఖర్చు ఇంకో 100 కోట్లు వరకూ ఉంటుంది. 
 
ఇటీవల రాష్ట్రంలో జరిగిన  ఇన్కమ్ ట్యాక్స్ మరియు అవినీతి నిరోధక శాఖ దాడుల్లో అధికార పార్టీ నాయకుల అస్తి  ఉన్నట్లు ఉండి ఏవిధంగా పెరిగిందో స్పష్టంగా బయట పడింది. 
 
గత నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు అతని కుమారుడు రాష్ట్ర మంత్రి లోకేష్ మీద రూ. 25, 000 కోట్లు అధికారాన్ని అడ్డంపెట్టుకుని సంపాదించేరని శ్రవణ్ కుమార్ అనే అడ్వాకెట్  కోర్టు లో పిల్ దాఖలు చెయ్యడం జరిగింది. 
 
పట్టిసీమ, పోలవరం కాంట్రక్టు లను అధికమొత్తానికి తన పార్టీ కాంట్రాక్టర్ లేకే అప్పగించడం జరిగింది. 
 
నీరు చెట్టు పధకం క్రింద గ్రామాల్లో తన కులం ఆర్ధికంగా అభివృద్ధి చెందటానికి దాదాపుగా దాదాపుగా ఆరు వేల కోట్లు పంచిపెట్టడం జరిగింది. 
 
ఇక చంద్రబాబు నాయుడు భాగస్వామ్య సదస్సులు పేరిట , గ్లోబల్ బిసినెస్ సమ్మిట్ ల పేరిట, మరియు అమరావతి రాజధాని నిర్మాణం పేరిట సింగపూర్, టోక్యో , లండన్ లాంటి దేశాలు స్పెషల్ విమానాల్లో తిరిగి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసేడు. 
 
దళితుల మీద దాడుల్లో రికార్డ్ స్తానం లో ఆంధ్రప్రదేశ్!
 
ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం స్వీకారం చేసిన నాటి నుండి రాష్ట్రంలో బి సి ల మీద ముక్యంగా దళితుల మీద దాడుల్లో రాష్ట్రము రికార్డ్ స్థాయిలో ఉంది. జాతీయ క్రైమ్ బ్యూరో రిపోర్టు ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ నాల్గో స్తానం లో ఉంది. 
 
దళితుల మీద దాడులు, హత్యలు చేస్తున్నా ఏమీ పట్టని ప్రతిపక్ష పార్టీ. ప్రతి పక్ష పార్టీగా దళిత వర్గాల మీద చేస్తున్న దాడి ని , వివక్షను ప్రతిపక్షం ఎండగట్టడం లో పూర్తిగా విఫలం అయ్యింది. 
 
గరగపర్రు లాంటి సంఘటనలో అక్కడకి విచ్చేసిన ప్రతిపక్ష నాయకుడు ప్రజల విశ్వాసం పొందటంలో పూర్తిగా విఫలం చెందేడు. 
 
నిత్యం దాడులు జరుగుతుంటే అండగా ఉండాల్సిన ప్రతిపక్షం కనీసం ఖండించటం కూడా మానేసిందని చెప్పాలి. 
 
 చంద్రన్న కానుక పేరుతొ ప్రజలను బిచ్చగాళ్ల మాదిరిగా చేసిన ఘనత అధికార తెలుగు దేశం పార్టీదే. వార్డు కమిటీల పేరుతొ ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేసేడు. 
 
అధికారం కోసం రాష్ట్రాన్ని రణరంగంగా మార్చిన అధికార, ప్రతిపక్ష పార్టీలు!
దురదృష్ట వశాత్తు రాష్ట్రం లో ఒకే ఒక ప్రతిపక్ష పార్టీ ఉంది. తమ శాసన సభ్యులను సంతలో పశువుల్లా కొంటున్నారని వారి మీద చర్యలు తీసుకోవాలని ప్రతి పక్షం అసెంబ్లీ ని బాయికాట్ చేసింది. 
 
మీడియా ద్వారా పాలన సాగిస్తున్న చంద్రబాబు నాయుడు, ప్రజలను మభ్యపెట్టే బాష తప్పా పని చెయ్యడంలో శూన్యం. 
 
హోదా వద్దూ, ప్యాకేజీ ముద్దు అని చెప్పిన చంద్రబాబు కనీసం రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక ప్యాకేజీ తీసుకురావడం లో విఫలం అయ్యేడు. 
 
ఆపరేషన్ గరుడ పేరిట గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో ఏదో ఒక సన్షేషన్ చేసి రాష్ట్ర ప్రజల మన్ననలు పొందే ఆలోచన లో పాలకులు ఉన్నారు. 
 
రాజ్యాంగ బద్దంగా పాలించాల్సిన ప్రభుత్వాలు తమ కులం సంక్షేమం దిశగా పాలన సాగిస్తున్నారు. ప్రభుత్వ పధకాలు కూడా వారికే అన్నా విధంగా ఉంది. 
 
రాష్ట్రంలో మెజారిటీ ఓటర్లు అయినా బి సి , ఎస్సీ , ఎస్టీల సంక్షేమం అంటే అదేదో బూతు పదంలాగా తయారుచేసేరు ఈ పాలకులు. రాష్ట్ర ఆర్ధిక అభివృద్ధి లో కీలక పాత్ర పోషిస్తున్న  బిసి , ఎస్సీ లకు కార్పొరేషన్ ద్వారా ఇచ్చే ఋణ సౌకర్యాలే సంక్షేమం అనుకుంటున్నారు. 
 
అధికార పార్టీ , ప్రతిపక్ష పార్టీల మధ్య రాష్ట్రాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి కేంద్రంలోని బా జ పా ప్రభుత్వం ఘోరికాడ నక్కలా ఎదురు చూస్తుంది. 
 
రాష్ట్రం లో జరుగుతున్న అరాచకాలకు బిజెపి పార్టీ పాత్ర కూడా ఉంది. నాలుగేళ్లు చంద్రబాబు ని సపోర్ట్ చేసి నేడు ఆ పార్టీ మీద లెక్కలేనన్ని అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. 
 
ప్రధాని మోడీ ఎన్నికల ముందు తిరుపతి లో వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసిమరీ ప్రత్యేక హోదా ఇస్తానని మోసం చెయ్యడం జరిగింది. 
 
చంద్రబాబు మరియు వై ఎస్ జగన్ ల మీద ఉన్న అవినీతి ఆరోపణల తో ఆ రెండు పార్టీలను తన గుప్పెట్లో పెట్టుకుని వారి సమిధల మీద రాజకీయ భవిషత్ నిర్మించుకునే పధకంలో బిజెపి ఉంది. 
 
నటుడు శివాజీ  ఆపరేషన్ గరుడ రహస్యం లో ప్రధాన దోషి బిజెపి నే కానీ ఆ పార్టీ ఇంతవరకూ శివాజీ మీద చర్య తీసుకోకపోవడం ఆచ్చర్య పరుస్తుంది. 
 
ఒక పార్టీ నేత , ప్రతిపక్ష నాయకుడి మీద హత్యాయత్నం జరగబోతుందని చెప్పిన శివాజీ మీద నేటికి పోలీసులు చర్యకు ఉపక్రయించక పోవడం ఇందులో ఏదో మతలబు దాగి ఉంది. 
 
ఫ్యూడల్ కులాలు మెజారిటీ ప్రజలైన బిసి , ఎస్సీ , ఎస్టీ మరియు మైనారిటీల భవిషత్ ను ఫణంగా పెట్టి వారి వారసుల రాజకీయ భవిషత్ నిర్మిస్తుంటే దళితులు , బిసి లు , మైనారిటీ లు బలిపశువులు అవుతున్నారు. 
 
రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, 71 ఏండ్ల భూర్జువా కులాల పాలనలో వారి కులాలే అభివృద్ధి చెందేయి కానీ  మిగతా వర్గాలను సంక్షేమం పేరిట ఊరిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు . 
మెజారిటీ ప్రజలు పాలనలో వాటా అడగకపోవడం, సంపదలో వాటా అడగకపోవడం భూర్జువా కులాలు చేతగాని తనమని అనుకుంటున్నాయి. 
 
ప్రతి కులాన్నీ వర్గీకరించే ప్రయత్నం చేసి, వారిచేత ఓట్లు వేయించుకునే ఎత్తుగడలో వారికి మాట ఇచ్చి మోసం చేస్తూ చంద్రబాబు పాలన సాగిస్తున్నారు. 
 
ఆపరేషన్ గరుడ అంటూ శివాజీ గరుడ రహస్యాన్ని ప్రభుత్వాలు చేధించాలి. ఫ్యూడల్ కులాలు వారి అవసరాల కోసం త్యాగం చేసే మరొక దళిత యువకుడు ఉండకూడదు. 
 
 
 
 
(Visited 278 times, 1 visits today)
Also read  రివర్స్ డేమోక్రసీ...!

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!