ఆమె యుద్ధం మొదలెట్టేరు…!
- 152Shares
- ఆమే యుద్దాన్ని మొదలు పెట్టేరు. మతోన్మాదం ముందు నిటారుగా నిలబడ్డారు . కొన్ని రోజుల్లో రాజ్య సభ పదవీ కాలం ముగుస్తుంది అని తెలిసే ఆమె ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు అని కొందరు అవేశపరులు , అసూయ పరులు అనుకోవచ్చు. కానీ యుద్ధం ఎప్పుడు మొదలెట్టాలో తెలిసిన వారే విజేతలు. ఆమే ఒక ధిక్కారం.
ఆమె పేరు కుమారి మాయావతి. అందరూ ప్రేమగా బెహన్ జీ అని గౌరవించే నాయకురాలు. మను వాదాన్ని ధిక్కరించి ముఖ్యమంత్రి అయిన ఏకైక యెస్. సి మహిళా నాయకురాలు మాన్యశ్రీ కాన్షిరాం అనుచరులు , బాబాసాహెబ్ డా . బి ర్ అంబెడ్కర్ వారసురాలు.
బా జ పా పాలిత రాష్ట్రాలలో యెస్ సి ల మీద పెరుగుతున్న దాడులను ప్రస్తావిస్తూ రాజ్య సభలో బెహన్ జీ మాయావతి ప్రస్తావించారు. ఉత్తర్ ప్రదేశ్ లోని శారన్పూర్ లో యెస్ . సి లమీద బా జ పా మద్దత్తు దారులు చేసిన దాడిని బెహన్ జీ మాయావతి ఉదాహరణ గా చూపెడుతూ మాట్లాడుతున్న సమయంలో అధికార పక్షం నుండి అనూహ్యంగా ఆమే ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ఎదురు దాడి మొదలు పెట్టేరు. పెద్దల సభలో గౌరవ సీనియర్ సభ్యురాలు మాట్లాడే మాటలు రికార్డ్ కానీయకుండా రాద్ధాంతం చెయ్యటంతో యెస్ సి ల తరుపున మాట్లాడే ఒకే ఒక గొంతును నొక్కి పెట్టడంతో నిరసనగా ఆమె వాకౌట్ చేసి వెళ్ళిపోయేరు. ఆ తర్వాత రాజ్య సభ అధ్యక్షులు హమీద్ అన్సారీ గారిని కలిసి షెడ్యూల్ కులాల గొంతును బలవంతాన నొక్కి పెడుతున్నందుకు నిరసనగా రాజీనామా పత్రం రాసి ఇచ్చేరు.
పార్లమెంట్ గురించి డా బాబాసాహెబ్ అంబెడ్కర్ గారు మాట్లాడుతూ ” ఈ దేవాలయంలో దేవతలను ప్రవేశ పెట్టాలి అనుకున్నాను , కానీ మనకంటే ముందే దెయ్యాలు ప్రేవేసించేయి అన్నారు. ఇప్పుడు భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఎలాంటి నిరసన తెలిపే హక్కును కాల రాస్తున్నారు. అత్యంత ఉన్నత వేదిక అయిన రాజ్యసభలో మేధావులు , చట్టాలు చేసేవారు సమస్యలు మీద చర్చ చెయ్యకుండా ఎదురుదాడి కి దిగి చర్చలను పక్క దోవ పట్టిస్తున్నారు. భారత దేశంలోని ప్రతి పౌరుడి గురించి చర్చించే వేదిక కొందరికే పరిమితం చేస్తూ ప్రజాస్వామ్యం యొక్క పవిత్రతను , రాజ్యాంగాన్ని విఫలం చేసేందుకు కంకణం కట్టుకున్నారు. బెహన్ జీ మాయావతి గారికి 9 నెలలు పదవీకాలం ఉన్నా పాలకుల దుందుడుకు చర్యలను వ్యతిరేకిస్తూ రాజ్య సభ కి రాజీనామా చెయ్యటం అధికార పక్షం సిగ్గుతో తలదించుకోవాలి. రాజ్య సభ కి రాజీనామా చెయ్యటానికి దారి తీసిన పరిస్థితులు బెహన్ జీ మాటల్లో“When I tried speaking about the weaker sections today in the Rajya Sabha, I was not allowed to speak. Why? It’s a shame. If I can’t speak about our weaker sections in the House then I have no right to stay in the House. This is the reason I have decided to quit from Rajya Sabha, I am not being heard, not allowed to speak.”
ఈ దేశంలో ఆర్ ఎస్ ఎస్ హిందూ మతోన్మాదానికి, కుల వ్యవస్థను ధీటుగా ఎదుర్కోవాలంటే అది బాబాసాహెబ్ డా బి ర్ అంబేడ్కర్ వారసులు అయినా దళితులకు మాత్రమే సాధ్యం అనే నగ్న సత్యం ప్రపంచానికి మొత్తం తెలుసు.
ఆమె యుద్ధం ప్రారంభించింది. సమీకరణాలు జరుగుతున్నాయి. పోరాడేందుకు సిద్ధంగా ఉండండి.
I support you mam