ఇండియాలో హిట్లర్ వారసులు-విద్వేషమే అజెండా!

షేర్ చెయ్యండి
  • 87
    Shares
  • ఒకప్పుడు నన్ను, నా జీవితాన్ని, నా కలన్నింటిని కాషాయ పతాకం పాదాల చెంత వుంచినవాణ్ణి కానీ , ఇప్పుడు నేను భయంకర విలువల చీకటి ప్రపంచం నుంచి మంచితనపు మానవనీయ ప్రపంచంలోకి తిరిగి వచ్చే క్రమంలో ఉన్నాను: సుధీశీ మిన్నీ , Cellerars of the inferno పుస్తకం రచయిత. తెలుగులో ‘రాకాసి కోరలు. సుధీశ్ మిన్నీ పశ్చాత్తాపం పడిన ఒక మాజీ ఆర్ ఎస్ ఎస్ ప్రచారక్. 
 
నాగపూర్, మరాఠా ప్రాంతం. సామాజిక విప్లవానికి, మతోన్మాదానికి కేంద్ర బిందువుగా ఉన్న ఒక కేంద్రీకృత ప్రాంతం. మహాత్మా పూలే, బాబాసాహెబ్ డా బి. ర్ అంబెడ్కర్ చైతన్యం తో నిండిన ప్రాంతం. ఇక్కడే అతివాద హిందు మత సంస్థ ఆర్ ఎస్ ఎస్ తన ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసుకున్న ప్రాంతం. 
 
ఇండియాలో పెరిగిపోతున్న హిట్లర్ వారసుల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ వ్యాసం యొక్క ముఖ చిత్రం “హిట్లర్ డెన్” Hitlar’s  den. హిట్లర్ పేరుకి నాగపూర్ కి ఏమైనా సంబంధం ఉందా? ఒక బిలియర్డ్స్ ఆడుకునే చిన్న పార్లర్ కి హిట్లర్ స్వస్తిక్ సింబల్ కి ఏమైనా సంభందాలు ఉన్నాయా? ఆర్ ఎస్ ఎస్ కి స్వస్తిక్ కి , హిందువు లకు స్వస్తిక్ గుర్తుకు ఏమిటి సంబంధం. హిట్లర్ డెన్ కేవలం పేరు మాత్రమేనా ?
 
హిట్లర్, జర్మనీ నియంత, నాజీ ఫాసిస్ట్. అత్యంత కిరాతకంగా ఆరు వేల యూదులను చంపిన కిరాతకుడు. విద్వేషం అతని సూత్రం. ప్రొటెస్టెంట్ లమీద విషం చిమ్మిన వ్యక్తి.. ఆర్యుల జాతి కి సంబంధించిన వ్యక్తి వర్ణ వివక్షగల వ్యక్తి. స్వస్తిక్ హిట్లర్ గుర్తు. ఇండియాలో స్వస్తిక్ హిందువుల పవిత్రమైన గుర్తు. 
 
హిట్లర్ యొక్క ద్వేష స్వభావాన్నే  ఇండియాలో హిందువులు ఇతర మతాల మీద చూపిస్తున్నారు. హిట్లర్ ఉదా రంగు శరీరం గలవారిని ద్వేషిస్తే ఇండియా లో హిందువులు కులం పేరుతొ ద్వేషిస్తున్నారు. హత్యలు చేస్తున్నారు. 
 
Hari Om Heil Hitler,”  
ఇది సోషల్ మీడియాలో ఇండియాలోని ఆర్యులు కొందరు చేస్తున్న ప్రచారం. జీత్ ఘోష్(Jeet Ghosh ) అలియాస్ “Kemradschaft Jeet.” అనే పేస్ బుక్ ఐడి లో  “Aum, Hail Aryan, Hail Aryavart,” meaning “Hail Aryans, Hail Land of the Aryans.” తన ప్రొఫైల్ లో రాసుకున్నాడు.  అతని స్టేటస్ మొత్తం హిట్లర్ ని  “India’s Swastika God,”  పొగుడుతూ రాసిన రాతలే మనకి కనిపిస్తాయి. అతని పోస్ట్ లకు వచ్చే కామెంట్లు కూడా జై హిట్లర్ , జై శ్రీరామ్  “Jai Shree Ram, Heil Hitler” (“Hail Shree Ram, Heil Hitler”), “Nazi the great,” “Hitler was supporter of Indian Nationalist.” ఉంటాయి. యూ ట్యూబ్ లోని హిట్లర్ వీడియో లను షేర్ చేస్తూ వుంటారు. 
 
ఈ ఒక్క ఫేస్ బుక్ ఐడి నే కాదు ఇలాంటి బావాలు కలిగిన ఎన్నో ఫేస్ బుక్ ఐడి లను మనం చూడవచ్చు. అంతేకాదు వీళ్ళు ప్రపంచంలోని  కొత్త తరం జర్మనీ నాజీలతో స్నేహం చేస్తూ ఆలోచనలు పంచుకుంటున్నారు. 
 
ఫేస్ బుక్ లోనే కాదు, రిడీఫ్ డాట్ కామ్ లాంటి వెబ్సైట్స్ లలో హిట్లర్ గ్రేట్ , హిందూ జాతీయ వాదానికి హిట్లర్ నే మార్గదర్శం అంటూ రాసిన పోస్ట్ లు కనిపిస్తాయి. న్యూస్ 9x లాంటి టెలివిజన్ ఛానల్ యూట్యూబ్ అకౌంట్స్ లలో హిట్లర్ ను ఆరాధిస్తూ చేసిన కామెంట్లు ఉంటాయి. 
 
హిట్లర్ సోషల్ మీడియాలోనే ఇండియన్ హిందూ జాతీయ వాదులకు హీరో కాదు, హిట్లర్ చరిత్ర పాఠశాలలో కి కూడా ప్రవేశించింది. 
 
ప్రధాని నరేంద్ర మోడీ 2004 లో  గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 వ తరగతి సోషల్  పాఠం లో   “Hitler, the Supremo,” and “Internal Achievements of Nazism.” The section on the “Ideology of Nazism”  లాంటి పాఠాలు బోధించెరు. 
 
 2011 నుండి 2017 వరకు లో తమిళనాడు ప్రభుత్వం   glorifying Hitler, praising his “inspiring leadership,” “achievements” and how the Nazis “glorified the German state” పాఠాలుగా బోధించింది. 
 
2012 లో మహారాష్ట్రలో ఒక ఫ్రెంచ్ బాషా ను నేర్పించే స్కూల్ లో మీకు ఇష్టమైన నాయకుడు ఎవరు అంటే ఎక్కువ మంది విద్యార్థుల నుండి  హిట్లర్ అనే సమాధానం వచ్చింది. అలాగే మధురై లో హిట్లర్ ఎవరో కూడా తెలియకుండా విద్యార్థులు మేము హిట్లర్ వారసులం గా పేర్కొంటున్నారు. అంతేకాదు హిట్లర్ చరిత్ర ‘  Mein Kampf’ మేనేజ్మెంట్ విద్యార్థులకు బోధిస్తున్నారు. ప్రొఫెసర్ లు  teaching strategy lecture about how a short, depressed man in prison made a goal of taking over the world and built a strategy to achieve it. 
 
టైమ్స్ ఆఫ్ ఇండియా 2002 లో జరిపిన ఒక సర్వేలో 17% మంది హిట్లర్ లాంటి నాయకుడు భారత దేశానికి అవసరం అని తమ అభిప్రాయం వ్యక్తం చేసేరు. ప్రముఖ విశ్వ విద్యాలయంలో చదువుకున్న వారు సైతం హిట్లర్ ని ఆరాధించడం చూస్తుంటే ఒక్కింత ఆచ్చర్యపడాల్సి వస్తుంది. 
 
హిందు మతం పునాదుల మీద రాజకీయ పార్టీ స్థాపించిన శివ సేన బలధాకరే కి కూడా హిట్లర్ నే ఆదర్శవంతమైన నాయకుడు.  పూణే , ముంబయి లాంటి నగరాల్లో ఇతర రాష్ట్రాల నుండి జీవనోపాధికి, వ్యాపారాలు చేసుకోవటానికి వచ్చిన వారి మీద స్థానికత పేరుతొ విద్వేషం నింపి వారి మీద దాడులు , వారి షాప్ లు తగలబెట్టించిన చరిత్ర శివ సేన ది. 
 
హిట్లర్ డెన్ – నాగపూర్ కి, హిట్లర్ డెన్ కి సంబంధం ఉంది. హిట్లర్ భావాలే ఆదర్శంగా కల్గిన ఆర్ ఎస్ ఎస్ సంస్థ ప్రధాన కార్యాలయం అక్కడే ఉంది. అర్ ఎస్ ఎస్ గురువు వి డి సావర్కర్ మాటల్లో “There is no reason to suppose that Hitler must be a human monster because he passes off as a Nazi,” he said, addressing a Hindu gathering in 1940, మరియు  “If we Hindus in India grow stronger, in time these Muslim friends of the League type will have to play the part of German-Jews instead.” అలాగే ఆర్ ఎస్ ఎస్ ఇంకొక నాయకుడు ఎమ్.యెస్ గోల్వాల్కర్ ” “Guru of Hate” గా కీర్తిగడించన వ్యక్తి తన పుస్తకం  We, Our Nationhood Defined, 1939 లో ఈ విధంగా రాసేడు  idolized Hitler’s Nazi cultural nationalism, and wanted to create a Hindu nation by adopting Hitler’s totalitarian and fascist pattern.
 
నేడు ఇండియాలో ముస్లిమ్స్, క్రిస్టియన్స్, మరియు  దళితుల మీద తీవ్రమైన ఒత్తిడి ని ఈ నాజీ ఇండియన్ వారసులు తీసుకు వస్తున్నారు. హిందూ ధర్మం, జాతీయత పేరిట ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించి హిందూయేతర ప్రజల మీద 2014 నుండి ప్రత్యక్షంగా దాడులు చేస్తున్నారు. 
 
రోజు రోజు కీ ప్రజల్లో పేరుకు పోతున్న నైరాశ్యం , అసంతృప్తి ని మతం ద్వారా ప్రేరణ కలిగించి మీ దురదృష్టానికి దళితుల రిజర్వేషన్లు , విదేశీ క్రిస్టియన్ మతము మరియు ముస్లిం అధిక జనాభా నే కారణం అంటూ నూరిపోస్తున్నారు. ఈ వ్యాసం కి మొదటిలో ఒక మాజీ ఆర్ ఎస్ ఎస్ యొక్క మాటలు ప్రత్యేకంగా కోట్ చెయ్యటానికి కారణం నాజీ హిట్లర్ వారసుల యొక్క నిజ స్వరూపం తెలియజేయటానికే. 
 
జర్మనీ చరిత్ర చూసినా, ప్రపంచంలో నియంతలు పాలించిన దేశాల చరిత్ర చూసినా, ఫాసిజమ్ యొక్క రూపం చూసినా భారతీయులు ఇండియన్ నాజీ వారసులను తిప్పికొడతారు. లేదంటే భారత దేశం యొక్క చరిత్ర కొత్తగా రాసుకోవాలి. 
  
 
 
 
 
 
 
 
 
(Visited 218 times, 1 visits today)
Also read  Annihilation of caste - A visionary document to build modern India!

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!